సాక్షి, న్యూఢిల్లీ : రాజధానిలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద శుక్రవారం సంభవించిన పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించారు. ప్రైవేట్ క్యాబ్‌లో ఎంబసీ వద్దకు వెళ్లిన నిందితులు.. అక్కడి ఓ పూల కుండీలో బాంబు పెట్టినట్లు కనుగొన్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం వద్ద పేలుడు పదార్థాలకు ఉపయోగించే సామాగ్రి.. తీగలు, బాల్ బేరింగ్, ఇతర వస్తువులను, ఓ లేఖను కూడా గుర్తించారు. చదవండి : ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు
ఇజ్రాయెల్ రాయబారిని హెచ్చరిస్తూ లేఖ రాశారు నిందితులు. ఇరాన్ అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయం లేఖలో ప్రస్తావించారు. అందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. నిందితులు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment