ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటుచేసుకున్న పేలుడు కేసులో నలుగురు యువకులను ఎన్‌ఐఏ గురువారం అదుపులోకి తీసుకుంది. కాగా జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. హై సెక్యూరిటీ జోన్‌లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో అప్పట్లో ఎవరు గాయపడలేదు. కాగా ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment