రాయబార కార్యాలయంలోని ఆడవాళ్ల బాత్‌రూమ్‌లో స్పై కెమెరాల గుర్తింపుతో ఒక్కసారిగా కలకలం రేగింది. బ్యాంకాక్(థాయ్‌లాండ్)లోని ఆస్ట్రేలియా ఎంబసీ ఛాంబర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మేరకు శనివారం కాన్‌బెర్రా నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. ఎంబసీలో పని చేసిన మాజీ ఉద్యోగి పనే ఇదని తెలుస్తోంది. రాయల్ థాయ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. విచారిస్తున్నట్లు సమాచారం.
గతేడాది చివర్లో ఓ అధికారిణి బాత్‌రూమ్ ఫ్లోర్ మీద మెమొరీ కార్డును గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి.. థాయ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. జనవరి 6వ తేదీనే ఫిర్యాదు నమోదు అయినట్లు తెలుస్తోంది. కెమెరాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అనే విషయంపై నిర్ధారణ కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment