Historic
-
బుల్లి వాచీకి భారీ ధర
వందేళ్ల క్రితం 1,500 మందికి పైగా ప్రయాణికుల దుర్మరణానికి దారి తీసిన టైటానిక్ నౌక విషాదం అందరికీ తెలిసిందే. ఆ విపత్తు బారి నుంచి 700 మందిని కాపాడినందుకు ఆర్ఎంఎస్ కర్పతియా నౌక కెప్టెన్ ఆర్థర్ రోస్ట్రన్కు బహూకరించిన పాకెట్ వాచీ ఇది. ఈ బుల్లి బంగారు వాచీ తాజాగా వేలంలో 20 లక్షల డాలర్లు పలికింది! -
మెక్సికోలో కొత్త చరిత్ర
మెక్సికో సిటీ: మెక్సికో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్ (61) ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్ కూడా ఆమే కానున్నారు! షేన్‌బామ్‌కు ఇప్పటికే దాదాపు 60 శాతం ఓట్లు లభించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రత్యర్థులిద్దరూ నాకిప్పటికే ఫోన్ చేసి అభినందించారు. ఓటమిని అంగీకరించారు. దేశానికి తొలి అధ్యక్షురాలిని కాబోతున్నా’’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘ఇది నేను ఒంటరిగా సాధించిన విజయం కాదు. తల్లులు మొదలుకుని కూతుళ్లు, మనవరాళ్ల దాకా దేశ మహిళలందరి విజయమిది’’ అన్నారు. విపక్ష కూటమి మహిళకే అవకాశమిచి్చంది. రెండు ప్రధాన పారీ్టల నుంచీ మహిళలే తలపడటమూ మెక్సికో చరిత్రలో ఇదే తొలిసారి. విపక్ష కూటమి అభ్యర్థి సోచిల్ గాల్వెజ్కు 28 శాతం, మరో ప్రత్యర్థి జార్జ్ అల్వారిజ్ మైనేజ్‌కు 10 శాతం ఓట్లు వచి్చనట్టు ఈసీ పేర్కొంది. షేన్‌బామ్ నూతన చరిత్ర లిఖిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆంద్రెజ్ మాన్యుయెల్ లోపెజ్ అబ్రేడర్ అభినందించారు. ఆరేళ్ల పదవీకాలంలో ఆయన పలు చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల మనసు గెలుచుకున్నారు. షేన్‌బామ్ విజయంలో లోపెజ్ పాపులారిటీదే ప్రధాన పాత్ర. ఒకసారికి మించి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు మెక్సికో రాజ్యాంగం అనుమతించదు. దాంతో ఆయన రెండోసారి బరిలో దిగలేకపోయారు. 2018లో లోపెజ్ గెలిచినప్పటి మాదిరిగా ఈసారి ప్రజల్లో పెద్దగా హర్షాతిరేకాలు వ్యక్తం కాకపోవడం విశేషం. అధ్యక్ష పదవితో పాటు పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు, 128 మంది సెనేటర్లు, 500 మంది కాంగ్రెస్ ప్రతినిధులు, వేలాది మేయర్లు, స్థానిక సంస్థల ప్రతినిధి పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలపై ఆసక్తి నెలకొంది. మొత్తం 32 గవర్నర్ పదవుల్లో మెరేనా పార్టీకి 23 ఉన్నాయి. షేన్‌బామ్‌కు సవాళ్లెన్నో... షేన్‌బామ్ అక్టోబర్ 1న అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమెకు సవాళ్ల స్వాగతమే లభించనుంది. మహిళలపై హింసకు మెక్సికో ప్రపంచంలోనే పెట్టింది పేరు. ఈ సమస్యను రూపుమాపాల్సి ఉంది. సంక్షేమ పథకాలతో లోపెజ్ బాగా ఆకట్టుకున్నా అడ్డూ అదుపూ లేదని వ్యవస్థీకృత హింస, గ్యాంగ్ వార్లు, డ్రగ్ ట్రాఫికింగ్, పెట్రో ధరల పెరుగుదల తదితరాల కట్టడికి పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి ప్రజల్లో బాగా ఉంది. వీటిపై కొత్త అధ్యక్షురాలు దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. ప్రస్తుత పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే దేశాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలనూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని షేన్‌బామ్ ప్రకటించారు. ఏ తారతమ్యాలూ లేకుండా ప్రజలందరినీ ఒకేలా చూస్తానన్నారు.లా డాక్టోరా... షేన్‌బామ్ విద్యార్హతలు అన్నీ ఇన్నీ కావు. ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేవారు. అందుకే ఆమెను అభిమానులు ముద్దుగా ‘లా డాక్టోరా’ అని పిలుచుకుంటారు. పర్యావరణవేత్తగా చాలా పేరుంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఐరాస పర్యావరణ శాస్త్రవేత్తల బృందంలో షేన్‌బామ్ సభ్యురాలు. రాజధాని మెక్సికో సిటీ మేయర్‌గా చేసిన తొలి మహిళ కూడా ఆమే. షేన్‌బామ్ తాత, అమ్మమ్మ హిట్లర్ హోలోకాస్ట్ హింసాకాండను తప్పించుకోవడానికి యూరప్ నుంచి మెక్సికో వలస వచ్చారు. షేన్‌బామ్ మెక్సికో సిటీలోనే పుట్టారు. 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. -
ఫండ్స్ పెట్టుబడుల జోరు..
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు చరిత్రాత్మక గరిష్టానికి చేరాయి. మార్చితో ముగిసిన గతేడాది(2023–24) చివరి త్రైమాసికంలో లిస్టెడ్ కంపెనీలలో ఎంఎఫ్‌ల వాటా 9 శాతానికి ఎగసింది. ఇందుకు ఈ కాలంలో తరలివచి్చన రూ. 81,539 కోట్ల నికర పెట్టుబడులు దోహదపడ్డాయి. ప్రైమ్ డేటాబేస్ గ్రూప్ వివరాల ప్రకారం 2023 డిసెంబర్ చివరికల్లా ఈ వాటా 8.8 శాతంగా నమోదైంది. ఈ కాలంలో దేశీయంగా అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ అయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ వాటా 3.64 శాతం నుంచి 3.75 శాతానికి బలపడింది. ఎల్ఐసీకి 280 లిస్టెడ్ కంపెనీలలో 1 శాతానికిపైగా వాటా ఉంది. వెరసి ఎంఎఫ్‌లు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, పెన్షన్ ఫండ్స్‌తోకూడిన దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(డీఐఐలు) వాటా మొత్తంగా 15.96 శాతం నుంచి 16.05 శాతానికి మెరుగుపడింది. ఇందుకు భారీగా తరలివచి్చన రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడులు తోడ్పాటునిచ్చాయి.విదేశీ ఇన్వెస్ట్మెంట్.. 11ఏళ్ల కనిష్టం 2024 మార్చికల్లా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల వాటా 17.68 శాతానికి నీరసించింది. ఇది గత 11ఏళ్లలోనే కనిష్టంకాగా.. 2023 డిసెంబర్‌కల్లా 18.19 శాతంగా నమోదైంది. ఫలితంగా ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐలు, ఎఫ్‌పీఐల హోల్డింగ్(వాటాలు) మధ్య అంతరం చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఎఫ్‌పీఐలు డీఐఐల మధ్య వాటాల అంతరం 9.23 శాతానికి తగ్గింది. గతంలో 2015 మార్చిలో ఎఫ్‌పీఐలు, డీఐఐల మధ్య వాటాల అంతరం అత్యధికంగా 49.82 శాతంగా నమోదైంది. ఇది ఎన్ఎస్ఈలో లిస్టయిన 1,989 కంపెనీలలో 1,956 కంపెనీలను లెక్కలోకి తీసుకుని చేసిన మదింపు. -
2014 ఎన్నికలు ఎందుకు చారిత్రాత్మకం?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల పోలింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రస్తుతం దేశంలో 96.8 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారు.1951 నుంచి చూసుకుంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడం లేదా తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. అధికార పార్టీతో పాటు ఆ పార్టీ అభ్యర్థుల పనితీరు, ప్రతిపక్ష పార్టీల స్థానం, మతం, కులం మొదలైనవి ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతున్నాయి. 1951లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.2014 లోక్‌సభ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. 1984 తర్వాత ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించడం అదే తొలిసారి. ఈ ఎన్నికల్లో 66.4 శాతం ఓటింగ్ నమోదైంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ విజిటింగ్ ఫెలో మిలన్ వైష్ణవ్ నాడు ఓటింగ్ శాతం పెరగడానికి బీజేపీ సాధించిన విజయాలే కారణమన్నారు. ఈ పెరిగిన ఓటింగ్‌లో యువ ఓటర్ల పాత్ర పెరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యువ ఓటర్ల సంఖ్య పెరిగిన రాష్ట్రాల్లో బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరిగింది. -
ఈ భేటీ జీ20 కుటుంబానికి మైలురాయి.. ఎందుకంటే..
ఢిల్లీ: ఆఫ్రికన్ యూనియన్ను శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవడం G20 కుటుంబానికి ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల G20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభ సెషన్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. 55 దేశాల ఆఫ్రికన్ యూనియన్ను కూటమిలో కొత్త సభ్యుడిగా స్వాగతించారు. గ్లోబల్ సౌత్‌కు కొత్త ఆశలను కల్పిస్తున్న ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమానీకి స్వాగతం తెలిపారు. Advancing a more inclusive G20 that echoes the aspirations of the Global South! PM @narendramodi extends a heartfelt welcome to President @_AfricanUnion and the President of Comoros Azali Assoumani. Thrilled to have the African Union as a permanent member. A milestone for the… pic.twitter.com/SqwziRCwiT — PMO India (@PMOIndia) September 9, 2023 'G20లో పూర్తి సభ్యునిగా ఆఫ్రికన్ యూనియన్ ప్రవేశాన్ని స్వాగతిస్తున్నాను. ఈ సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాము. ఆఫ్రికా ఖండానికి ప్రపంచ సేవలు అందడమే కాకుండా సవాళ్లపై ఆఫ్రికా దేశాలు పోరాడేలా పరస్పర సహకారాలు అందుతాయి.' అని ట్విట్టర్ వేదికగా ఆఫ్రికన్ యూనియన్ కమీషన్ హెడ్ మౌసా ఫకీ మహమత్ అన్నారు. గత కొన్నాళ్లుగా గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యంపై భారత్ వాయిస్ వినిపిస్తోంది. జీ20 కేవలం 20 దేశాలకు సంబంధించిన విషయం కాదని, వెనకబడిన గ్లోబల్ సౌత్ కోసం పాటుపడేలా ఉండాలని ప్రధాని మోదీ గత డిసెంబర్లోనే అన్నారు. ప్రపంచ వేదికలపై విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. I welcome the @_AfricanUnion's entry into the #G20 as full member. This membership, for which we have long been advocating, will provide a propitious framework for amplifying advocacy in favor of the Continent and its effective contribution to meeting global challenges. — Moussa Faki Mahamat (@AUC_MoussaFaki) September 9, 2023 ఢిల్లీ వేదికగా నేడు జీ20 సమావేశం ప్రారంభమైంది. ప్రపంచ దేశాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభ సెషన్లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20 కూటమిలో భాగస్వామిగా చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆఫ్రికా కూటమికి ఆహ్వానం పలికారు. ఇదీ చదవండి: కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే! -
మెరుగైన రాబడులకు హైబ్రీడ్ వ్యూహం..
ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు వారెన్ బఫెట్ కావచ్చు.. హోవార్డ్ మార్క్స్ కావచ్చు.. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులు అందుకునేందుకు అధిక అవకాశాలు ఉంటాయని చెబుతారు. ఈ విషయంలో హైబ్రీడ్ ఫండ్స్‌కి మెరుగైన రికార్డు ఉంది. చౌకగా లభిస్తున్న విలువైన అసెట్స్‌ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంలో ఇవి బాగా రాణిస్తున్నాయి. రిసు్కలకు తగ్గట్లుగా హైబ్రీడ్ వ్యూహాలు మంచి రాబడులు అందించగలుగుతున్నాయి. హైబ్రీడ్ ఫండ్స్‌లో ప్రధానంగా అయిదు రకాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్ధ్యాలను బట్టి వీటిని పరిశీలించవచ్చు. అవేంటంటే.. ► కన్జర్వేటివ్ హైబ్రీడ్: ఈ ఫండ్స్ 10–25 శాతం ఈక్విటీల్లోను, మిగతా 75–90 శాతం మొత్తాన్ని డెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్నవారు, డెట్‌కు ప్రాధాన్యం ఇస్తూనే కాస్త అధిక రాబడుల కోసం ఈక్విటీల్లోనూ కొంత ఇన్వెస్ట్ చేయదల్చుకున్నవారికి ఇవి అనువైనవిగా ఉంటాయి. ► అగ్రెసివ్ హైబ్రీడ్: ఈ కేటగిరీ స్కీముల కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో, మిగతా 20–35 శాతాన్ని డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. అధిక రిస్కు సామర్ధ్యాలు ఉన్న ఇన్వెస్టర్లకు ఇవి అనువైనవి. ► బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్: ఈ ఫండ్స్‌లో అసెట్స్‌కు కేటాయింపులు డైనమిక్‌గా మారుతుంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియోలోని 0–100 శాతం మొత్తాన్ని పూర్తిగా ఈక్విటీల్లోనైనా లేదా డెట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మోస్తరు రిస్కు సామరŠాధ్యలు ఉన్నవారికి ఇవి అనువైనవి. ► మలీ్ట–అసెట్ అలొకేషన్: ఈ కేటగిరీ ఫండ్లు ఈక్విటీ, డెట్, బంగారం/వెండి, రీట్స్, ఇని్వట్స్ మొదలైన వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ అసెట్స్ అన్నీ పరస్పరం సంబంధం లేకుండా వివిధ రకాలైనవి కావడం వల్ల తగు విధమైన డైవర్సిఫికేషన్ వీలవుతుంది. రాబడులూ మెరుగ్గా ఉండగలవు. ఉదాహరణకు గతేడాది బెంచ్‌మార్క్ రాబడులు 5.8 శాతం స్థాయిలో ఉండగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మలీ్ట–అసెట్ ఫండ్ గతేడాది 16.8 శాతం రాబడులు ఇచి్చంది. ► ఈక్విటీ సేవింగ్స్: ఈ ఫండ్స్ ఈక్విటీ, తత్సంబంధ సాధనాల్లో 65 శాతం వరకు, డెట్‌లో 10 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ విభాగంలో చాలా మటుకు ఫండ్స్ డెరివేటివ్స్‌ను ఉపయోగిస్తాయి. తద్వారా రిస్కును తగ్గించడంపై దృష్టి పెడతాయి. ఇన్వెస్టర్లకు డెట్కన్నా మెరుగ్గా, ఈక్విటీ కన్నా కాస్త తక్కువగా రాబడులను అందించేందుకు ఈ తరహా ఫండ్స్ ప్రయతి్నస్తాయి. రిస్కు సామర్ధ్యాలు చాలా తక్కువగా ఉన్న వారు వీటిని పరిశీలించవచ్చు. మలీ్ట–అసెట్ విధానం పాటిస్తాయి కాబట్టి ఓపికగా ఉండే ఇన్వెస్టర్లకు రిసు్కలకు తగినట్లుగా మెరుగైన రాబడులను అందించేందుకు హైబ్రీడ్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. -
ప్రపంచలోనే అత్యంత పురాతన జైళ్లు ఇవే.. వందల ఏళ్ల కిందటే నిర్మాణం
-
కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక రాజదండం 'సెంగోల్'.. విశేషాలివే..
పార్లమెంట్ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దీన్ని నాటి బ్రిటీషర్లు నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి అందజేసినట్లు అమిత్ షా తెలిపారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం ధర్మం. రాజదండం నేపథ్యం.. బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి గుర్తుగా మన మధ్య ఏదోకటి విలువైనది ఉండాలని నాటి తొలి ప్రధాని నెహ్రుని అడిగారు. అప్పడు ఆయన సలహ కోసం నాటి గవర్నర్ రాజాజీగా పిలిచే సీ రాజగోపాలాచారిని ఆశ్రయించారు. ఆయన ఈ 'సెంగోల్‌ని' సూచించారు. చోళుల పాలనలోని సంప్రదాయాన్ని అనుసరించి 'సెంగోల్' అనే రాజదండాన్ని సూచించారు. ఇది భారతదేశానికి స్వేచ్ఛ లభించిందని సూచించగలదని, పైగా అధికార మార్పిడికి చిహ్నంగా ఉండగలదని నెహ్రుతో రాజాజి చెప్పారు. దీంతో ఈ రాజదండాన్ని ఏర్పాటు చేసే బాధ్యత రాజాజీపై పడింది. రాజదండాన్ని ఎలా రూపొందించారు ఈ రాజదండాన్ని ఏర్పాటు కష్టతర బాధ్యతను తీసుకున్న రాజాజీ తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. ఆ మఠం దీన్ని రూపొందించే బాధ్యతను స్వీకరించింది. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను తయారు చేశాడు. ఇది ఐదుడుగుల పొడువు ఉండి, పైన న్యాయానికి ప్రతిక అయిన నంది, ఎద్దు ఉంటాయి. అప్పగించిన విధానం సదరు మఠంలోని పూజారి రాజదండాన్ని మౌంట్ బాటన్‌కి అప్పగించి తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్థరాత్రి 15 నిమిషాల ముందు గంగాజలంతో అభిషేకించి, ప్రధానమంత్రి నెహ్రు వద్దకు ఊరేగింపుగా వెళ్లి ఆయనకు అప్పగించారు(అధికార మార్పిడి జరిగనట్లుగా). ప్రధాని నెహ్రు ప్రత్యేక గీతంతో ఆ రాజందండాన్ని అందుకున్నారు. కొత్త పార్లమెంట్లో సెంగోల్ స్థానం ఈ సెంగోల్ చరిత్ర ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియదని హోం మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను నేటి ఆధునికతకు జోడించే ప్రయత్నం చేశారన్నారు. కొత్త పార్లమెంట్లో 'సెంగోల్'ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ప్రధాని మోదీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని షా అన్నారు. 'సెంగోల్' ఇప్పుడు అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దాన్ని కొత్త పార్లమెంటుకి తీసుకురానున్నట్లు అమిత్ షా చెప్పుకొచ్చారు. అలాగే దయచేసి దీన్ని రాజకీయాలకు ముడిపెట్టోదని నొక్కి చెప్పారు. తాము చట్టబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నామని, ఆ చారిత్రక రాజదండం ఎల్లప్పుడూ మాకు దీనిని గుర్తు చేస్తుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. మరిచిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రత్మక రాజదండంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. (చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!) -
చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను శుక్రవారం భద్రత లోపాల దృష్ట్యా సడెన్‌గా నిలిపివేసిన సంగతి తెలిసింది. ఆ తదనంతరం శనివారం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామ జిల్లాల కట్టుదిట్టమైన భద్రత నడుమ పునః ప్రారంభమైంది. ఇక ఈ యాత్ర ముగుస్తున్న తరుణంలో రాహుల్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో రాహుల్ సోదరి ప్రియాంక వాద్రా తోపాటు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పలువురు పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ పర్యటనకు కేటాయించిన భద్రతను కాంగ్రెస్ నేతలకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అంతేగాదు గత రాత్రి నుంచే లాల్ చౌక్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేసి, వాహానాల రాకపోకలను నియంత్రించారు. ఈ యాత్ర బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత ఎంఏ రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఎస్కే స్టేడియంలో బహిరంగ ర్యాలీ నిర్వహిస్తారు. దీనికి 23 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యూకుమారి నుంచి ప్రారంభమై సుమారు 75 జిల్లాలు పర్యటించి దాదాపు 3,570 కి.మీ పాదయాత్ర చేశారు రాహుల్. #WATCH | Jammu and Kashmir: Congress MP Rahul Gandhi unfurls the national flag at Lal Chowk in Srinagar. pic.twitter.com/I4BmoMExfP — ANI (@ANI) January 29, 2023 (చదవండి: భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం) -
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ బాదుడు, మామూలుగా లేదుగా!
ఫ్రాంక్ఫర్ట్: మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75శాతం పెంచుతూ 25 మంది సభ్యుల గవర్నింగ్ కౌన్సిల్ గురువారం ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి. ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది. 19 దేశాల యూరోజోన్ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డ్ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2శాతం లక్ష్యానికి మించి, ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9శాతానికి ఎగసింది. -
యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!
Historic moment: ఉక్రెయిన్ పై పట్టు కోసం రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌ని రష్యా దాదాపు అదీనంలోకి తెచ్చుకుంది. ఒక పక్క అమెరికా శక్తిమంతమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కి సరఫరా చేస్తోంది కూడా. అయినప్పటికీ రష్యా ఏ మాత్రం 'తగ్గేదే లే' అంటూ...దాడులతో విజృంభిస్తోంది. తూర్పు డాన్బాస్ ప్రాంతంలో రెండు పారిశ్రామిక నగరాలపై రష్యా బాంబులతో తీవ్రంగా విరుచుకుపడుతోంది. దాదాపు యుద్ధం భయంకరమైన క్లైమాక్స్ చేరుకుంటుందన్న నిరుత్సహాంలో ఉన్న ఉక్రెయిన్‌కి దైర్యాన్ని నింపేలా ఈయూ దేశాలు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. భయంకరమైన యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి బాసటగా ఉంటానంటూ ఈయూ దేశాలు మద్దతిస్తూ.. అనుహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ మేరకు ఈయూ దేశాలు బ్రస్సెల్స్ సమావేశంలో ఉక్రెయిన్‌కి సభ్యత్వ హోదా కల్పించాలనే సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా కీవ్ ప్రభుత్వ దరఖాస్తును ఆమోదించాయి. అదీగాక మాల్డోవకి కూడా ఈయూ దేశాలు ఇటీవలే సభ్యుత్వ హోదాని ప్రకటించాయి. దీంతో ఒక రకరంగా ఈయూ దేశాలన్ని రష్యా ఆగడాలకు అడ్డుకట్టే వేసేలా కలిసికట్టుగా ముందుకు వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా రష్యాకి కోపం తెచ్చే అంశం. ఈయూలోకి ఉక్రెయిన్ చేరేలా అందుకు అవసరమయ్యే ప్రమాణాలను చేరుకోవడానికి ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని దౌత్యవేత్తలు అంటున్నారు. అయితే యురోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ...ఈయూలో చేరేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేయడానికి ఉక్రెయిన్, మాల్డోవా వీలైనంత వేగంగా కదులుతాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మాట్లాడుతూ..యుద్ధం భయంకరమైన క్లైమాక్స్‌కి చేరుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌కి ఊపిరి పోసేలా ఈయూ దేశాలు ఒక గొప్ప చారిత్రత్మాక నిర్ణయాన్ని తీసుకున్నాయని ప్రశంసించారు. అంతేకాదు ఉక్రెయిన్ భవిష్యత్తు ఈయూతో ముడిపడి ఉంది అని జెలెన్ స్కీ ట్విట్ చేశారు. ఏదీఏమైన ఒకరకంగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలుదువ్వి భౌగోళిక రాజకీయ పరంగా తనకు తానే తీరని నష్టాన్ని కొనితెచ్చుకుంది. (చదవండి: బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన) -
ఈ బడ్జెట్ చరిత్రాత్మకం..
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజంగా చరిత్రాత్మకమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చరిత్రలో తొలిసారి ఇలాంటి బడ్జెట్ ను చూశామంటూ అభినందనల వర్షం కురిపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి లక్ష కోట్లకు పైగా కేటాయించడం నిజంగా అభినందనీయమంటూ ప్రశంసలు కురిపించారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు. -
నాగాలతో కేంద్రం శాంతి ఒప్పందం
-
ఆ ఆలయానికి మూడొందల ఏళ్లు
ముంబయి: శరవేగంగా మార్పు చెందుతున్న నగరాల్లో ముంబయి నగరం ఎప్పుడూ ముందుటుంది. అక్కడ ఎన్నో మారుతుంటాయి. నివాసాలు, కాలనీలు చూస్తుండగానే కొత్త రూపును సంతరించుకుంటుంటాయి. అలాంటిది ఒక నిర్మాణం మాత్రం 300 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఎప్పుడు చూసినా అదే కొత్తదనంతో తాజాగా కనిపిస్తోంది. అదే ప్రభాదేవీ మందిరం. ఈ ఆలయం అంతగా చెప్పుకోదగినంత పెద్దదికాకపోయినప్పటికీ.. ఎలాంటి మార్పులకు లోనుకాకుండా.. బుధవారం నాటికి 300 సంవత్సరాలకు చేరుకుంది. ప్రభాదేవీ కాలనీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎదురుగా రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ భవనం కూడా ఉంది. ముంబయిలో ఎన్నో ప్రాంతాలు మారినట్లుగానే ప్రస్తుతం ప్రభాదేవీ మందిరం చుట్టుపక్కల నిర్మాణాలు కూడా వేగంగా మార్పు చెందుతున్నాయి. కానీ వీటన్నింటి మధ్య ఉన్న ఈ ఆలయం 300 ఏళ్లుగా అదే రూపంతో అలరారుతుండటం విశేషం. ఈ ఆలయ ట్రస్టీ మిలింద్ వాజ్కర్ ఈ విషయంపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ బుధవారం ఆలయాన్ని ప్రత్యేక పూజలకోసం ఉదయం 8గంటల నుంచి 2 గంటలవరకు తెరిచి ఉంచుతామన్నారు. -
తెలంగాణలో తొలి జాతీయ పండగ
-
భూమిలో పురాతన శివలింగం
-
షాం ఘై మిలటరీ కమాండ్ స్ట్రెక్ డ్రిల్
-
ఆహరభద్రత బిల్లు చారిత్రాత్మకం: సోనియా