ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజంగా చరిత్రాత్మకమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చరిత్రలో తొలిసారి ఇలాంటి బడ్జెట్ ను చూశామంటూ అభినందనల వర్షం కురిపించారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి లక్ష కోట్లకు పైగా కేటాయించడం నిజంగా అభినందనీయమంటూ ప్రశంసలు కురిపించారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం గడ్కరీ మీడియాతో మాట్లాడారు.