పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు! | Yanamala Rama Krishnudu gives shock to R&B officers | Sakshi
Sakshi News home page

పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు!

Jul 25 2014 10:01 AM | Updated on Aug 30 2018 4:49 PM

పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు! - Sakshi

పైసా కూడా ఇచ్చే పరిస్థితి లేదు!

కొత్త రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో ఘనంగా కేటాయింపులు చేస్తారని ఊహించిన ఆర్ అండ్ బీ అధికారులకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గట్టి షాకే ఇచ్చారు.

హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి బడ్జెట్‌లో ఘనంగా కేటాయింపులు చేస్తారని ఊహించిన ఆర్ అండ్ బీ అధికారులకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గట్టి షాకే ఇచ్చారు. ప్రస్తుతం పైసా కూడా నిధులిచ్చే పరిస్థితి లేదని, ఈ ఏడాదికి ఎలాగోలా నెట్టుకు రావాల్సిందేనని స్పష్టం చేశారు. గత తొమ్మిది నెలల నుంచి కేటాయించిన పనులన్నింటినీ నిలిపేయాలని కూడా ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి గురువారం రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్ అండ్ బీ అధికారులు ఆర్ధికమంత్రితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా గత తొమ్మిది నెలలుగా ఆర్ అండ్ బీకి రూ.1,200 కోట్ల నుంచి రూ.1,300 కోట్ల వరకు పనులు కేటాయించారని, ఇప్పటికే రూ.700-రూ.800 కోట్ల పనులకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఈ పనులు రద్దు చేస్తే కాంట్రాక్టర్లు కోర్టుకెళ్ళే అవకాశం ఉందని, పైగా అంచనాలు రెట్టింపవుతాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆర్ధికమంత్రి ముఖ్యమైన పనులకు మాత్రమే ఆమోదం తెలపాలంటూ పై పనులన్నింటినీ రద్దు చేయూలని సూచించారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులు తమ వంద రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారి వ్యవస్థ మెరుగుపరిచేందుకు రూపొందించిన ప్రణాళికలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement