Historic moment: ఉక్రెయిన్ పై పట్టు కోసం రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌ని రష్యా దాదాపు అదీనంలోకి తెచ్చుకుంది. ఒక పక్క అమెరికా శక్తిమంతమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కి సరఫరా చేస్తోంది కూడా. అయినప్పటికీ రష్యా ఏ మాత్రం 'తగ్గేదే లే' అంటూ...దాడులతో విజృంభిస్తోంది. తూర్పు డాన్బాస్ ప్రాంతంలో రెండు పారిశ్రామిక నగరాలపై రష్యా బాంబులతో తీవ్రంగా విరుచుకుపడుతోంది.
దాదాపు యుద్ధం భయంకరమైన క్లైమాక్స్ చేరుకుంటుందన్న నిరుత్సహాంలో ఉన్న ఉక్రెయిన్‌కి దైర్యాన్ని నింపేలా ఈయూ దేశాలు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. భయంకరమైన యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి బాసటగా ఉంటానంటూ ఈయూ దేశాలు మద్దతిస్తూ.. అనుహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
ఈ మేరకు ఈయూ దేశాలు బ్రస్సెల్స్ సమావేశంలో ఉక్రెయిన్‌కి సభ్యత్వ హోదా కల్పించాలనే సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా కీవ్ ప్రభుత్వ దరఖాస్తును ఆమోదించాయి. అదీగాక మాల్డోవకి కూడా ఈయూ దేశాలు ఇటీవలే సభ్యుత్వ హోదాని ప్రకటించాయి. దీంతో ఒక రకరంగా ఈయూ దేశాలన్ని రష్యా ఆగడాలకు అడ్డుకట్టే వేసేలా కలిసికట్టుగా ముందుకు వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా రష్యాకి కోపం తెచ్చే అంశం. ఈయూలోకి ఉక్రెయిన్ చేరేలా అందుకు అవసరమయ్యే ప్రమాణాలను చేరుకోవడానికి ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని దౌత్యవేత్తలు అంటున్నారు.
అయితే యురోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ...ఈయూలో చేరేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేయడానికి ఉక్రెయిన్, మాల్డోవా వీలైనంత వేగంగా కదులుతాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మాట్లాడుతూ..యుద్ధం భయంకరమైన క్లైమాక్స్‌కి చేరుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌కి ఊపిరి పోసేలా ఈయూ దేశాలు ఒక గొప్ప చారిత్రత్మాక నిర్ణయాన్ని తీసుకున్నాయని ప్రశంసించారు. అంతేకాదు ఉక్రెయిన్ భవిష్యత్తు ఈయూతో ముడిపడి ఉంది అని జెలెన్ స్కీ ట్విట్ చేశారు. ఏదీఏమైన ఒకరకంగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలుదువ్వి భౌగోళిక రాజకీయ పరంగా తనకు తానే తీరని నష్టాన్ని కొనితెచ్చుకుంది.
(చదవండి: బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన)
Comments
Please login to add a commentAdd a comment