EU
-
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలి
ఆర్థిక సంబంధాల బలోపేతానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్, యూరోపియన్ యూనియన్ (EU) వ్యూహాత్మక కార్యక్రమాలపై కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఈ సహకారం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(Technology) అభివృద్ధి చేయడం, కీలకమైన ముడి పదార్థాల(Raw Material) సరఫరాలను భద్రపరచడం, వస్తువుల సరఫరా గొలుసులను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.బ్రస్సెల్స్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ కమిషనర్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ మారోస్ సెఫ్కోవిక్ పరస్పర ఆర్థిక వృద్ధికి ఫ్రేమ్‌వర్క్‌ను వివరించారు. వాణిజ్య సరళీకరణకు, సుంకాల సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. న్యాయమైన, సమాన అవకాశాలు ఉండేలా వాణిజ్య ఎజెండాను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జూన్ 2022 నుంచి పురోగతిలో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చలను వేగవంతం చేయడం ఈ భాగస్వామ్యం కీలక అంశాలలో ఒకటిగా ఉంది. వాణిజ్యంలో దూకుడు వైఖరిని కొనసాగిస్తుండటం, కీలకమైన ఖనిజాలు, సాంకేతిక పరిజ్ఞానాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో పరోక్షంగా చైనాను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా కొన్ని ఆర్థిక వ్యవస్థలపైనే ఆధారపడటాన్ని తగ్గించాలని ఇరు పక్షాలు తెలిపాయి.ఇదీ చదవండి: వంతారాకు కొత్త అతిథులుఇండియా-ఈయూ ట్రేడ్ కౌన్సిల్2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇండియా-ఈయూ ట్రేడ్(India-EU Trade) అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సైతం ఇరు ప్రాంతాల మధ్య సులభతర వాణిజ్య పద్ధతులను సిద్ధం చేయడానికి కృషి చేస్తోంది. భారత్- ఈయూ మధ్య సహకారాన్ని పెంపొందించడం, వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, భాగస్వామ్య విలువలను పరిరక్షిస్తూ సాంకేతిక, పారిశ్రామిక నాయకత్వాన్ని పెంపొందించేందుకు ఈ కౌన్సిల్ పని చేస్తోంది. -
యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..
ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్బీ టైప్-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలుయాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ ఎస్ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. -
జార్జియా అధ్యక్షునిగా సాకర్ ఆటగాడు.. ఈయూ అంశం ఇక లేనట్లేనా?
టిబిలిసీ: జార్జియాను ఈయూ(యూరోపియన్ యూనియన్)లో కలపాలనే తీవ్ర నిరసనల నడుమ జార్జియా అధ్యక్షుడిగా మాజీ సాకర్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి)53) ఎంపికయ్యారు. 1990 ప్రాంతంలో ఇంగ్లిష్ సాకర్ టీమ్ మాంచెష్టర్ సిటీకి ప్రాతినిధ్యం వహించిన కవెలాష్విలి.. తాజాగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యా చేతిలో పావుగా మారే అధికార పార్టీ ఈయూలో జార్జియాను కలపడానికి నిరాకరిస్తుందనే తీవ్ర నిరసనల అనంతరం ఆ దేశంలో చోటు చేసుకున్న కీలక పరిణామం ఇది.అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కవెలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు. మొత్తం 300(ఎంపీలు- స్థానిక ప్రభుత్వాల ప్రతినిధులు)మంది సభ్యులకు గాను 225 మంది సభ్యులు పార్లమెంట్‌కు హాజరయ్యారు. ఈ మేరకు 224 మంది కవెలాష్విలి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి అనుకూలంగా ఓటేయడం విశేషం. దాంతో కవెలాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లయ్యింది. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎన్నికను నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఈ ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం పార్లమెంట్‌ను బహిష్కరించడం కూడా కవెలాష్విలి ఏకగీవ్రంగా ఎన్నిక కావడానికి ఒక రకంగా దోహదం చేసింది.అయితే పశ్చిమ దేశాల ఆధిపత్యంపై ఎప్పుడూ తీవ్రస్థాయిలో మండిపడే కవెలాష్విలికి రాబోయే కాలం మరింత కఠినంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు రష్యా అనుకూల శక్తులు, మరొకవైపై యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనకారుల నడుమ ఉద్రిక్త పరిస్థితులను కవెలాష్విలి ఏ విధంగా నియంత్రిస్తారో అనేది వేచి చూడాల్సిందేనని అంటున్నారు.నేను ఇక్కడే ఉన్నా.. !మాజీగా మారిన అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచివలి మాత్రం అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివర్ణించారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. తాను ఇక్కడే ఉన్నానని, మళ్లీ వస్తాననని యూరోపియన్ యూనియన్ నిరసనకారులకు అనుకూలంగా ఉన్న ఆమె అంటున్నారు.అసలు ఏం జరిగింది..?యురోపియన్ యూనియన్‌లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ఇటీవల ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి.వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది.దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. -
భారత్ చమురు ఉత్పత్తుల జోరు
న్యూఢిల్లీ: చౌక ధరలో ఆఫర్ చేస్తుండటంతో రష్యా నుంచి భారత్ చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది. దిగుమతైన చమురుతో కొంతమేర పెట్రోలియం ప్రొడక్టులను రూపొందిస్తోంది. వీటిని తిరిగి ఎగుమతి చేస్తోంది. అయితే వీటిలో మూడో వంతు ప్రొడక్టులను జీ–7 తదితర సంపన్న దేశాలకు ఎగుమతి చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా పలు యూరోపియన్ దేశాలు రష్యన్ చమురు ధరలపై పరిమితులు విధించాయి. అయితే శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఆయా దేశాలు కొనుగోలు చేసేందుకు విధానాలు అనుమతిస్తున్నాయి. వెరసి చట్టబద్ధంగా భారత్ నుంచి చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. నిజానికి రష్యా చమురు కొనుగోలుపై జీ7, ఈయూ, ఆ్రస్టేలియా ఎలాంటి ఆంక్షలనూ అమలు చేయనప్పటికీ 2022 డిసెంబర్లో బ్యారల్ ధర 60 డాలర్లకు మించి కొనుగోలు చేయకుండా పరిమితి విధించుకున్నాయి. తద్వారా రష్యాకు అధిక ఆదాయం లభించకుండా అడ్డుకునేందుకు నిర్ణయించాయి. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు జోరందుకోవడంతో రష్యా అదనపు లబ్ధి చేకూరకుండా చెక్ పెట్టేందుకు తీర్మానించాయి. అయితే ఆపై భారత్ నుంచి రష్యా చమురు ద్వారా తయారైన 6.65 బిలియన్ డాలర్ల(6.16 బిలియన్ యూరోలు) విలువైన చమురు ఉత్పత్తులు ఆయా దేశాలకు ఎగుమతి అయినట్లు ఫిన్లాండ్ సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్(సీఆర్ఈఏ) వెల్లడించింది. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీ నుంచి 5.2 బిలియన్ యూరోల ఎగుమతులున్నట్లు ఒక నివేదికలో పేర్కొంది. -
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్‌కు ఈయూ వార్నింగ్!
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారుచేసే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. యాపిల్ యాప్‌స్టోర్‌లో చేస్తున్న మార్పులు యూరోపియన్ యూనియన్ తీసుకువచ్చే నిబంధనలకు అనుగుణంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ తీసుకువస్తున్న డిజిటల్ మార్కెట్ల చట్టానికి (DMA) అనుగుణంగా యాపిల్.. సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ల ద్వారా యాపిల్ పరికరాలలో తమ అప్లికేషన్లను ఉంచడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్లలో యాప్‌స్టోర్ కాకుండా ప్రత్యామ్నాయ యాప్ స్టోర్లను అందించడానికి మార్చి ప్రారంభం నుంచి డెవలపర్లకు అవకాశం ఉంటుంది. యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రస్తుతం డెవలపర్లు 30 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ యాపిల్ ఫీజు విధానం అన్యాయంగా ఉందని, ఇదిడిజిటల్ మార్కెట్ల చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. యాపిల్ ప్రణాళికల గురించిన విచారణలకు ప్రతిస్పందిస్తూ ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్.. ‘డిజిటల్ మార్కెట్లు సజావుగా.. బహిరంగంగా పోటీకి ఇంటర్నెట్ గేట్లను డిజిటల్ మార్కెట్ల చట్టం తెరుస్తుంది. మార్పు ఇప్పటికే జరుగుతోంది. మార్చి 7 నుంచి థర్డ్ పార్టీల అభిప్రాయంతో కంపెనీల ప్రతిపాదనలను అంచనా వేస్తాం" అని రాయిటర్స్‌తో అన్నారు. కంపెనీల ప్రతిపాదిత పరిష్కారాలు చట్టానికి అనుగుణంగా లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి యూరోపియన్ యూనియన్ వెనుకాడదని బ్రెటన్ ఉద్ఘాటించారు. యాపిల్ యాప్‌స్టోర్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించకుండా డెవలపర్లకు ఎంపిక ఉన్నప్పటికీ ఒక యూజర్ అకౌంట్‌కు సంవత్సరానికి 50 యూరో సెంట్ల "కోర్ టెక్నాలజీ రుసుము" మాత్రం తప్పనిసరి. అయితే కొత్త వ్యాపార నిబంధనలను ఎంచుకున్న డెవలపర్లకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కంపెనీకి భారీ షాక్ తగిలిదింది. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీసీ) రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్బుక్ డేటాను,అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ జరిగిందని ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది. మే 25, 2018 నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్డాగ్ తెలిపింది. ఇందుకు గాను 1.2 బిలియన్ యూరోలు లేదా 130 కోట్ల డాలర్లు అంటే 10వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.(అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!) మెటా స్పందన అయితే ఈయూ నిర్ణయంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్యాయమైన , అనవసరమైన జరిమానా సహా, డీపీసీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇతర కంపెనీలకు ఇది తప్పుడు సందేశమిస్తోందని ఆరోపించింది. -
రష్యా అనుహ్య నిర్ణయం...తగ్గమని ఈయూ వేడుకోలు
ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసే షాకింగ్ నిర్ణయాన్ని రష్యా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో యూరోపియన్ యూనియన్ దయచేసి ఈ విషయంలో వెనక్కి తగ్గమంటూ వేడుకున్నాయి. ఈ మేరకు రష్యాను మధ్యవర్తిత్వ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఈయూ పిలుపునిచ్చింది. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగినప్పటి నుంచే ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయింది. ఐతే ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకోవడంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు రష్యా అనుహ్యంగా నల్లసముద్రం ఒప్పందంలో భాగస్వామ్యాన్ని నిలిపేస్తున్నట్లు నిర్ణయించడంతో ప్రపంచదేశాలు ఆందోళ చెందుతున్నాయి. ఎందుకంటే ఈ ఒప్పందం ప్రపంచ ఆహార సంక్షోభాన్ని, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఉపకరించింది. ఐతే రష్యా తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ దేశాల ఆగ్రహాన్ని రేకెత్తించే చర్య. పైగా మాస్కో ఇది తన ప్రధాన నౌకదళంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి ప్రతీకార చర్య అని చెబుతోంది. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన ధాన్యం, ఎరువులకు సంబంధించిన ప్రధాన ఎగుమతిని ప్రమాదంలో పడేస్తుందని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెట్ ట్విట్టర్ తెలిపారు. అందువల్ల రష్యాను దయచేసి ఈ విషయంలో వెనక్కితగ్గమని జోసెఫ్ కోరారు. (చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా) -
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్ చేంజర్
సాక్షి, నేషనల్ డెస్క్: క్యాన్సర్ ప్రాణాంతక రోగమని, మొదట్లోనే గుర్తించకుంటే బతకడం కష్టమని అందరికీ తెలుసు. కొన్నిసార్లు వ్యాధిని గుర్తించేలోగానే పరిస్థితి చేయి దాటిపోతుంది. కొన్నిరకాల క్యాన్సర్లను కనిపెట్టేందుకు పరీక్షలు కూడా లేవు. అయితే ఒకే ఒక రక్తపరీక్షతో చాలారకాల క్యాన్సర్లను ఇట్టే కనిపెట్టేయొచ్చంటే? హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం కదా. సరిగ్గా అలాంటి మల్టీ క్యాన్సర్ అర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) రక్తపరీక్షను సైంటిస్టులు కనిపెట్టేశారు. ఎలాంటి లక్షణాలూ కనిపించని క్యాన్సర్లను కూడా ఈ పరీక్ష ద్వారా నిర్ధారించగలగడం ఇందులో పెద్ద విశేషం. ఊపిరి పీల్చుకోదగ్గ విషయం కూడా! ఒకరకంగా ఎంసీఈడీ పరీక్షను వైద్యశాస్త్రంలో, ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణలో గేమ్ చేంజర్‌గా చెప్పొచ్చు. క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కొత్త విధానాలను కనుగొనేందుకు కృషి చేస్తున్న గ్రెయిల్ అనే హెల్త్ కేర్ సంస్థ ఈ సరికొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసింది. అధ్యయనంలో భాగంగా ఈ సంస్థ 6,662 మంది వ్యక్తులపై ఈ పరీక్ష నిర్వహించింది. వీళ్లంతా 50, అంతకన్నా ఎక్కువ వయసు వ్యక్తులే కావడం గమనార్హం. ప్యారిస్‌లో ఇటీవల జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ అంకాలజీ (ఈస్‌ఎంఓ) కాంగ్రెస్‌లో గ్రెయిల్ తమ పరిశోధన వివరాలను సమర్పించింది. ఆరువేల పై చిలుకు మందిపై పరీక్ష నిర్వహిస్తే వారిలో దాదాపు ఒక శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. వీటిలో కొన్ని ఇప్పటిదాకా పరీక్షలకు దొరకని క్యాన్సర్ రకాలు కూడా ఉండటం విశేషం. దీన్ని క్యాన్సర్ పరిశోధనలను సమూలంగా మార్చివేసే పరీక్ష విధానంగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అయిన గాలెరీ (ఎంసీఈడీ–ఈ)ని మరింతగా ఆధునీకరించి వ్యాధిని మరింత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు. గాలెరీ పరీక్ష ద్వారా పదుల సంఖ్యలో క్యాన్సర్లను గుర్తించే వీలుంది. వాటిలో లక్షణాలు కనపడని క్యాన్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఎంసీఈడీ పరీక్ష పద్ధతిలో దాదాపు రెట్టింపు స్థాయిలో క్యాన్సర్లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించే వీలుంది. గాలెరీ పరీక్ష ద్వారానే కాలేయం, చిన్న పేగు, యుటెరస్, పాంక్రియాటిక్ స్టేజ్–2, బోన్ క్యాన్సర్ వంటివాటిని లక్షణాలు లేని స్థాయిలోనే గుర్తించే వీలుంది. అయితే కొత్త పద్ధతి మరిన్ని రకాల క్యాన్సర్లను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తుంది. కొత్త పరీక్ష (ఎంసీఈడీ)లో 92 మందిలో క్యాన్సర్ లక్షణాలను గుర్తించారు. పైగా 97 శాతం కచ్చితత్వముంది. ఇలా గుర్తించిన 36 రకాల క్యాన్సర్లలో 71 శాతం క్యాన్సర్లను నిర్ధారించే అవకాశం ఇప్పటిదాకా ఉండేది కాదు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల చికిత్సా విధానంలో కూడా పెను మార్పులు రానున్నాయి. అయితే ఇది క్లినికల్‌గా ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇదీ చదవండి: శాస్త్రవేత్తలను సైతం కలవరపాటుకు గురిచేసిన విచిత్ర జీవి: వీడియో వైరల్ -
అది ఆయుధమా? నాన్సెన్స్: పుతిన్ ఫైర్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యూరప్ దేశాల తీరుపై తీవ్రంగా స్పందించారు. యూరప్‌కు వెళ్లే సహజ వాయువుల పైప్‌లైన్‌ను క్రెమ్లిన్ నిలిపివేసిందంటూ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. పసిఫిక్ తీర నగరమైన వ్లాదివోస్టోక్‌లో ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా ‘ఎనర్జీ’ని ఆయుధంగా ఉపయోగిస్తోందని వాళ్లు అంటున్నారు. నాన్సెన్స్.. అది ఆయుధమా?. విజ్ఞప్తులకు తగ్గట్లుగా సహజ వాయువులను మేం సరఫరా చేస్తూ వస్తున్నాం. పైగా మేమేం ఆంక్షలను విధించే వాళ్లం కాదూ.. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం అందించే రకం అంటూ పరోక్షంగా అమెరికాకూ చురకలు అంటించారాయన. రష్యా చమురు దిగ్గజం గాజ్ప్రోమ్ శుక్రవారం సహజవాయువు పైప్‌లైన్‌ను ఆపేసింది. అయితే మెయింటెనెన్స్ కోసమే దానిని బంద్ చేసినట్లు తర్వాత స్పష్టత ఇచ్చింది గాజ్ప్రోమ్. అయినా కూడా.. యూరప్ దేశాలు చమురును నిలిపివేశాయంటూ రష్యాపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయన్న కారణంతో యూరోపియన్ దేశాలకు మధ్యమధ్యలో గ్యాస్ సరఫరాను తగ్గిండమో.. నిలిపివేయడమో చేస్తూ వస్తోంది రష్యా. అయితే ఈయూ మాత్రం.. చమురు వంకతో రష్యా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి చుట్టూ గిరగరా తిరుగుతూ.. -
యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!
Historic moment: ఉక్రెయిన్ పై పట్టు కోసం రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌ని రష్యా దాదాపు అదీనంలోకి తెచ్చుకుంది. ఒక పక్క అమెరికా శక్తిమంతమైన ఆయుధాలను ఉక్రెయిన్‌కి సరఫరా చేస్తోంది కూడా. అయినప్పటికీ రష్యా ఏ మాత్రం 'తగ్గేదే లే' అంటూ...దాడులతో విజృంభిస్తోంది. తూర్పు డాన్బాస్ ప్రాంతంలో రెండు పారిశ్రామిక నగరాలపై రష్యా బాంబులతో తీవ్రంగా విరుచుకుపడుతోంది. దాదాపు యుద్ధం భయంకరమైన క్లైమాక్స్ చేరుకుంటుందన్న నిరుత్సహాంలో ఉన్న ఉక్రెయిన్‌కి దైర్యాన్ని నింపేలా ఈయూ దేశాలు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. భయంకరమైన యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి బాసటగా ఉంటానంటూ ఈయూ దేశాలు మద్దతిస్తూ.. అనుహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ మేరకు ఈయూ దేశాలు బ్రస్సెల్స్ సమావేశంలో ఉక్రెయిన్‌కి సభ్యత్వ హోదా కల్పించాలనే సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా కీవ్ ప్రభుత్వ దరఖాస్తును ఆమోదించాయి. అదీగాక మాల్డోవకి కూడా ఈయూ దేశాలు ఇటీవలే సభ్యుత్వ హోదాని ప్రకటించాయి. దీంతో ఒక రకరంగా ఈయూ దేశాలన్ని రష్యా ఆగడాలకు అడ్డుకట్టే వేసేలా కలిసికట్టుగా ముందుకు వెళ్లున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా రష్యాకి కోపం తెచ్చే అంశం. ఈయూలోకి ఉక్రెయిన్ చేరేలా అందుకు అవసరమయ్యే ప్రమాణాలను చేరుకోవడానికి ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని దౌత్యవేత్తలు అంటున్నారు. అయితే యురోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ...ఈయూలో చేరేందుకు అవసరమైన సంస్కరణలను అమలు చేయడానికి ఉక్రెయిన్, మాల్డోవా వీలైనంత వేగంగా కదులుతాయని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మాట్లాడుతూ..యుద్ధం భయంకరమైన క్లైమాక్స్‌కి చేరుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్‌కి ఊపిరి పోసేలా ఈయూ దేశాలు ఒక గొప్ప చారిత్రత్మాక నిర్ణయాన్ని తీసుకున్నాయని ప్రశంసించారు. అంతేకాదు ఉక్రెయిన్ భవిష్యత్తు ఈయూతో ముడిపడి ఉంది అని జెలెన్ స్కీ ట్విట్ చేశారు. ఏదీఏమైన ఒకరకంగా రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి కాలుదువ్వి భౌగోళిక రాజకీయ పరంగా తనకు తానే తీరని నష్టాన్ని కొనితెచ్చుకుంది. (చదవండి: బైడెన్‌కు ఎదురుదెబ్బ.. తీవ్ర నిరాశ చెందానంటూ ప్రకటన) -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్‌లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్‌కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్‌కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్‌లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్‌కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్‌కు అందజేసింది. -
సెక్యూరిటీ చీఫ్‌ని తొలగించిన జెలెన్ స్కీ!
ఉక్రెయిన్ పై నిరవధిక దాడులతో రెచ్చిపోతున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని తూర్పు నగరాలపై విధ్వంసం సృష్టించాయి. దీంతో దెబ్బతిన్న ఖార్కివ్ ప్రాంతాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. ఆ ప్రాంతంలో నగరాన్ని పూర్తి స్థాయిలో రక్షించేందుకు ప్రయత్నించని ఒక సెక్యూరిటీ చీఫ్‌ని కూడా తొలగించారు. ఖార్కివ్‌లోని పరిసరా ప్రాంతాలన్ని చాలా వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయని జెలెన్ స్కీ అన్నారు. అదీగాక రష్య కైవ్‌ని స్వాధీనం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఖార్కివ్ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు డోన్బాస్ ప్రాంతం నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని తూర్పువైపు దాడులను రష్యా మరింత తీవ్రతరం చేసింది. ఐతే జెలెన్ స్కీ మాత్రం చివరి వరకు మా దేశాన్ని రక్షించుకుంటామని పునరుద్ఘాటించటం విశేషం. అంతేకాదు ఖార్కివ్ ప్రాంతంలోని మూడో వంతు రష్యా అధినంలో ఉంది. పైగా రష్యా దళాల బాంబుల వర్షంతో విరుచుకుపడటంతో అక్కడ పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. వేలాదిమంది పౌరులు చనిపోవడమే కాకుండా ఆ ప్రాంతాలకు వెళ్లడం కూడా కష్టతరంగా ఉందని స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ ఆయుధ డిపోలనే లక్ష్యంగా చేసుకుని రష్యా బలగాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని క్రెయిన్వాసులు తాగు నీరు లేక, ఆహారం కొనగోలు చేసేందుకు డబ్బులు లేక అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు. దీంతో జెలెన్స్కీ ధ్వంసమైన ప్రాంతాలను పునర్మించే దిశగా స్థానిక అధికారులతో ప్రణాళికా చర్చలు జరిపారు. మరోవైపు రష్యా ఎగుమతులపై ఆంక్షలు పెంచేలా ఒత్తిడి చేసేందుకు ఈయూ నాయకులతో శిఖరాగ్ర సమావేశమయ్యారు. అంతేకాదు హంగేరి, క్రోయోషియా వంటి దేశాలు రష్యా నుంచి దిగుమతి చేసుకునే భూగర్భ ఆధారిత పైప్ లైన్ చమురు పైనే ఆధారపడి ఉంది. దీంతో ఈయూ శిఖారాగ్ర సమావేశంలో పైప్‌లైన్ ద్వారా సరఫరా అయ్యే చమురు పై కాకుండా ట్యాంకర్ల ద్వారా చమురు సరఫరా చేసే ప్రతిపాదనను తీసుకొచ్చారు. (చదవండి: పుతిన్ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా) -
కష్టకాలంలో ఉక్రెయిన్‌కు భారీ సాయం, కానీ ఓ షరతు!
యుద్ధకాలంలో ఉక్రెయిన్‌కు భారీ ఆర్థిక సాయం ప్రకటన వెలువడింది. కానీ, ఈ సాయాన్ని షరతుల మేరకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈయూ. ఈ మేరకు ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌కి తొమ్మిది బిలియన్ యూరోల(రూ. 73 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్‌కి రుణ రూపంలో ఈ సాయాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తదనంతరం ఈయూ సాయంతో ఉక్రెయిన్ను పునర్నిర్మించడం పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారామె. ఉక్రెయిన్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఈయూ వ్యూత్మక నాయకత్వం వహించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మిగతా దేశాలు కూడా ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈయూ నిబంధనలకు లోబడే ఈ సాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం అనేది.. గత కొన్నిసంవత్సరాలుగా రక్షణ కోసం కేటాయిస్తున్న తక్కువ వ్యయం పై దృష్టి కేంద్రీకరించేలా చేసిందన్నారు. ఆయుధాల ఉత్పత్తి, జాయింట్ ప్రొక్యూర్మెంట్ను మరింత మెరుగ్గా సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు యూరప్ కంపెనీలను ఆ మార్గంలో పయనించేలా ఆర్థిక పన్ను ప్రోత్సాహాకాలను అందిస్తామని చెప్పారు. ఇది ఈయూ స్వతంత్ర శక్తి సామర్థ్యాలను బలపరుస్తుందన్నారు. అలాగే ఇంధన సరఫరాలపై రష్యా పై ఆధారపడకుండా చౌకగా, వేగవంతంగా ఇంధనాన్ని పోందే దిశగా అడుగులు వేస్తోంది. అదీగాక ఇప్పటికే ఈయూ యూరోపియన్లను థర్మోస్టాట్లను తగ్గించాలని, లైట్లను ఆపివేయాలని, ప్రజారవాణ వినియోగించమని సూచించింది కూడా. (చదవండి: ‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్) -
3 దేశాలు 3 రోజులు.. మోదీ యూరప్ టూర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది తొలిసారి విదేశీ పర్యటనకు యూరప్ వెళుతున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తారు. యూరప్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అక్కడ పర్యటిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన అన్నారు. ‘‘యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది. శాంతి, శ్రేయస్సులను కాంక్షించే భారత్ వంటి దేశాలకు ఈయూ దేశాలే భాగస్వామ్య పక్షాలు’’ అన్నారు. సోమవారం మోదీ జర్మనీకి చేరుకుని చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమవుతారు. 3, 4 తేదీల్లో డెన్మార్క్ పర్యటిస్తారు. ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ వెళ్లి అధ్యక్షుడు మాక్రాన్‌తో ముచ్చటిస్తారు. పర్యటనలో మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ప్రవాస భారతీయులతో కూడా భేటీ అవుతానని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను గట్టిగా వ్యతిరేకిస్తూ యూరప్ దేశాలన్నీ ఏకమైన వేళ భారత్ తటస్థ వైఖరి నేపథ్యంలో ఈ పర్యటన ఆయనకు సవాలేనంటున్నారు. ప్రధానంగా ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో బంధాల బలోపేతమే మోదీ ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఈ అంశాలపైనా మోదీ విస్తృతంగా చర్చించనున్నారు. -
రష్యా మెలిక.. ‘ఇది దారుణం.. అస్సలు బాలేదు’
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులని పశ్చిమ దేశాలు తప్పుబట్టింది. ఈ దాడులను ఆపాలని ఎంత చెప్పినా ఫలితం లేకపోడంతో పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే తానేమి తక్కువ కాదని రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగానే పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు ఉండాలని లేదంటే సరఫరా చేయబోమని రష్యా మెలికపెట్టింది. తాజాగా ఈ నిబంధనల ప్రకారం.. రూబెల్స్లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. కాగా యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు సరఫరా చేసేది రష్యానే. ప్రస్తుతం ఈ నిర్ణయంతో ఆ దేశాల మార్కెట్లో హోల్‌సేల్ గ్యాస్ ధర 20% పెరిగింది. ఇది గత సంవత్సరం క్రితం కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈ చర్యను ఖండించారు. ఆమె దీనిపై స్పందిస్తూ.. యూరోప్‌లోని వినియోగదారులకు గ్యాస్ డెలివరీని నిలిపివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. రష్యా చేస్తోంది బ్లాక్‌మెయిలింగ్ అని దుయ్యబట్టారు. తాము అన్ని సభ్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నామని, గ్యాస్ సమస్యను తీర్చేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని అది యూరప్ వెలుపల ఉన్న దేశాలతో చర్చలు జరుపుతోందని ఆమె తెలిపారు. చదవండి: Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్ టీచర్.. మహిళా సుసైడ్ బాంబర్ గురించి షాకింగ్ విషయాలు -
మోదీతో ఈయూ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్–ఇండియా ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ అంగీకారం తెలిపారు. భారత్‌లో పర్యటిస్తున్న ఉర్సులా సోమవారం మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, భద్రత వంటి అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకొనేందుకు ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని వారు నిర్ణయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కూడా ఉర్సులా భేటీ అయ్యారు. భారత్, ఈయూ సంబంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తర్వాత రైసినా డైలాగ్ కార్యక్రమంలో ఉర్సులా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వ్యూహాత్మక వైఫల్యంగా మారుతుందన్నారు. -
పుతిన్ కూతుళ్లే లక్ష్యంగా..
ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యల పేరిట నరమేధానికి పాల్పడుతున్నాడంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చాలా దేశాలు నిందిస్తున్నాయి. బుచా నరమేధం వెలుగులోకి వచ్చాక ఆ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరోవైపు మొదటి నుంచి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ప్రధాని పుతిన్ కూతుళ్లను లక్ష్యంగా చేసుకుని కఠిన ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ అనుకుంటోంది. పుతిన్ కూతుళ్లు కాటెరీనా, మరియాలపై విధించబోయే ఆంక్షల జాబితాను సిద్ధం చేసింది యూరోపియన్ యూనియన్. ప్రత్యేకంగా పుతిన్ దృష్టికి వెళ్లేలా ఈ ఆంక్షలు ఉండబోతున్నాయని ఈయూ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈయూ దేశాల ప్రభుత్వాలు వీటికి అధికారిక ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. పుతిన్ ఇద్దరు కూతుళ్లతోపాటు రష్యా రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పుతిన్ కుటుంబ సభ్యులకూ ఈ ఆంక్షలు వర్తింపజేయాలని అనుకుంటున్నాయి. రక్షణ రంగంలో పాటు నాలుగు బ్యాంకులపైనా, బొగ్గు ఉత్పత్తులపైనా కొత్త ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్ మాత్రం అలాంటి ఆంక్షల ప్రతిపాదనేది తమ దృష్టికి రాలేదని అంటోంది. ఇప్పటికే పుతిన్ దగ్గరి వాళ్లపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పుతిన్ కూతుళ్లు ప్రస్తుతం రహస్య జీవనంలో ఉన్నారు. రకరకాల పేర్లు మార్చుకుని.. ప్రాంతాలు మారుతూ జీవిస్తున్నారు. అయితే అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మాత్రం ఏనాడూ వాళ్ల పేర్లను, ఐడెంటిటీని రివీల్ చేయలేదు. అలాగే యుక్త వయసులో వాళ్లు ఎలా ఉన్నారనే ఫొటోలు ఎక్కడా లేవు. ఈ తరుణంలో ఆంక్షల విధింపు, అన్వయింపజేయడంపై ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2015లో పుతిన్ తన కూతుళ్ల గురించి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన కూతుళ్లు గ్రాడ్యుయేట్లు అని, బోలెడు భాషలు మాట్లాడగలరని మాత్రమే చెప్పాడు. పుతిన్ పెద్ద కూతురు మరియా వోరోన్త్సోవా.. హెల్త్ కేర్‌కు సంబంధించిన పెట్టుబడుల కంపెనీ నోమోన్కోకి సహ భాగస్వామిగా ఉంది. అలాగే చిన్న కూతురు కాటెరీనా టిఖోనోవా.. మాస్కోలోని అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ఇనిస్టిట్యూట్‌ను నడిపిస్తోందన్నది మాస్కో మీడియా వర్గాలు ఆ మధ్య ఫొటోలతో సహా కథనాలు ప్రచురించాయి. చదవండి: పుతిన్ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? -
కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..!
రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం యూరప్దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యూరప్ ఎక్సేఛేంజ్‌లు నేల చూపులు చూస్తున్నాయి. ఇప్పుడిదే భారత్‌కు కలిసొచ్చింది. భారత స్టాక్ మార్కెట్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. టాప్-5 క్లబ్‌లోకి..! రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంతో భారత మార్కెట్‌కు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. యూరప్ దేశాల మార్కెట్స్ తీవ్రంగా పతనమవ్వడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో తొలిసారిగా భారత్ టాప్-5 క్లబ్‌లోకి చేరింది. తాజాగా భారత్ మార్కెట్ క్యాప్ 3.21 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని రికార్డులను క్రియేట్ చేసింది. యూకే మార్కెట్ క్యాప్ 3.19 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా భారత మార్కెట్లు నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్ క్యాప్ ఐదో స్థానంలోకి చేరుకుంది. అమెరికా నంబర్ 1..! మార్కెట్ క్యాప్ విషయంలో నంబర్ 1 స్థానంలో అమెరికా(47.32 ట్రిలియన్ డాలర్లు)నే కొనసాగుతుంది. రెండో స్థానంలో చైనా(11.52 ట్రిలియన్ డాలర్లు)తో, మూడో స్థానంలో జపాన్(6.00 ట్రిలియన్ డాలర్లు)తో, నాలుగో స్థానంలో హాంగ్ కాంగ్ మార్కెట్లు (5.55 ట్రిలియన్ డాలర్ల)తో కొనసాగుతున్నాయి. పడిలేచిన కెరటంలా..! 2022 ప్రారంభంలో భారత మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో మార్కెట్లు బేర్ మంటూ నేల చూపులు చూశాయి. మార్కెట్ క్యాప్‌లో 7.4 శాతం పడిపోయినప్పటికీ, తిరిగి మార్కెట్స్ పుంజుకున్నాయి. మార్కెట్ క్యాప్ విషయంలో రెండు స్థానాలు ఎగబాకింది. భారత మార్కెట్స్ సౌదీ అరేబియా (3.18 ట్రిలియన్ డాలర్లు),కెనడా (3.18 ట్రిలియన్ డాలర్ల) కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్‌ను కల్గి ఉన్నాయి. టాప్ -5 స్థానంలో ఉండే జర్మనీ మార్కెట్లు పదో స్థానానికి పడిపోయాయి. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడికి చిక్కులు..! -
రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు.. ప్రధానంగా ఆ దేశాల్లోనే..
EU Says Cases Of Omicron BA.2: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో మళ్లీ కోవిడ్-19 సబ్‌వేరియంట్ అయిన ఒమిక్రాన్ BA.2 కేసులు యూరోపియన్ యూనియన్(ఈయూ) అంతటా పెరుగుతున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) తెలిపింది. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాల్లో కోవిడ్-19 కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. దీంతో భారత ప్రభుత్వం తమ పౌరులను సురక్షితంగా ఉండమని హెచ్చరించడమే కాక మాస్కలు ధరించడం మానేయవద్దని ఆదేశించింది. చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియాలో డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లకు సంబంధిందచిన కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదికలో పేర్కొంది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడమే కాక హెచ్చరికలు జారీ చేసింది. ఐదు ఆసియా దేశాల్లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు: చైనా: చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అన్ని దేశాల కంటే చైనా కఠినమైన కరోనా ఆంక్షలను విధించింది. పైగా జిరో కోవిడ్ టోలరెన్స్‌ని లక్ష్యంగా ప్రజలపై కఠినమైన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ చైనా అమలు చేసిన ఆంక్షలన్ని విఫలమయ్యేలా కేసులు రికార్డు స్థాయలో నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో లేని విధంగా కేసులు నమోదవ్వడమే కాక మరణాలు కూడా మొదలయ్యాయి. చైనాలో అనేక నగరాలు నిర్బంధంలోనే ఉన్నాయి. సింగపూర్: సింగపూర్‌లో శనివారం తాజాగా 10,244 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య దాదాపు 1,007,158కి చేరుకుంది. ప్రస్తుతం 1,130 బాధితులు ఆసుపత్రులో చికిత్స పొందుతుండగా, 27 బాధితులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉన్నారు. మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య సుమారు 1,194కు చేరుకుందని ఆ దేవ హెల్త్ డిపార్టుమెంట్ తెలిపింది. హాంకాంగ్: హాంకాంగ్‌లో శనివారం ఒక్క రోజులో దాదాపు 16,597 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను అదుపు చేసే దిశలో హాంకాంగ్ కట్టుదిట్టమైన చర్యలను అమలు చేస్తోంది. దక్షిణ కొరియా: కొత్త కోవిడ్ -19 కేసులు శనివారం 4 లక్షల కంటే తక్కువగా నమోదైయ్యాయి. ప్రస్తుతం దాదాపు 381,454 కొత్త కోవిడ్-19 కేసులు అందులో విదేశాల నుంచి వచ్చిన 63 మందితో సహా సుమారు 9,038,938కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ(కెడిసిఎ) పేర్కొంది. తాజా గణంకాల ప్రకారం ఆల్-టైమ్ గరిష్ట స్థాయి సుమారు 621,328 నుంచి గణనీయంగా తగ్గింది, అయితే కేసుల ఆకస్మిక పెరుగుదల మునుపటి రోజు కంటే అనుహ్యంగా 70 వేల కేసులు పెరుగుదలను సూచిస్తోంది. మరణించిన వారి సంఖ్య 12,101కి చేరుకుంది. మరణాల రేటు 0.13 శాతంగా ఉంది. మయన్మార్: కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ BA.2 చెందిన 31 కేసులు నమోదైయ్యాయని మయన్మార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 15న పరీక్షించిన 31 మంది కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లలో BA.2 కేసులు గుర్తించినట్లు పేర్కొంది. 2020 ప్రారంభంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ దేశంలో సుమారు 608,384 కేసుల మరణాల దాదాపు 19,420 నమోదయ్యాయని నివేదిక తెలిపింది. (చదవండి: చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత) -
మళ్లీ ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ చర్చలు... ఈసారి ఈయూ నాయకుల ఎంట్రీ
Talks between Ukraine and Russia resumed: ఉక్రెయిన్ పై రష్యా పోరు సాగిస్తూనే ఉంది. వైమానికి క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌ని రూపు రేకలు తుడుచు పెట్టుకు పోయేలా రష్యా దురాక్రమణకు యత్నిస్తోంది. ఆ దిశగా ఒక్కోక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ పౌరులు, ఆసుపత్రుల పైన నిర్థాక్షిణ్యంగా దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కాల్పలు విరమణ, బలగాలు వెనక్కు మళ్లించే దిశగా రష్యా ఉక్రెయిన్ల మధ్య మళ్లీ చర్చలు పునః ప్రారంభమయ్యాయని ఉక్రెయిన్ ప్రతినిధి మైఖైలో పోడోల్యాక్ చెప్పారు. అంతేకాదు మూడు యూరోపియన్ యూనియన్ దేశాల నాయకులు ఉన్నత అధికారులను కలవడానికి కైవ్‌కు వెళ్తున్నారు. దీంతో కాల్పులు విరమణ నిమిత్తం ఉక్రెయిన్ రాజధానిలో 36 గంటల కర్ఫ్యూ విధించిందని తెలిపారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం యూరోపియన్ యూనియన్ నిస్సందేహమైన మద్దతును వ్యక్తపరచడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం అని చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ట్విట్టర్లో తెలిపారు. ఈ పర్యటనలో స్లోవేనియాకు చెందిన జానెజ్ జాన్సా, పోలాండ్‌కు చెందిన మాటెస్జ్ మోరావికీ, పోలాండ్ యొక్క వాస్తవాధీన నాయకుడైన జరోస్లావ్ కాజిన్స్కీతో కలిసి ఉక్రెయిన్ పర్యటనకు వచ్చారు. ఈ భీకరమైన యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన శరణార్థుల సంక్షోభాన్ని సృష్టించి, వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమన దాడి నేటికి 20 రోజుకి చేరుకుంది. (చదవండి: యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?) -
యుద్ధానికి రష్యా గుడ్ బై చెప్పనుందా?.. అదే కారణమా?
Russia Forced To Stop War Due To Lck of Resource: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆయుధాల కొరత ఏర్పడనుందా?, రష్యాకు యుద్ధం చేసే సామర్ధ్యం తగ్గిపోయిందా? అంటే దానికి సమాధానం చెప్పడం కష్టమే. ఎలాగైనా ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న రష్యా.. అంత త్వరగా యుద్ధాన్ని ముగిస్తుందని ప్రస్తుతం ఎవరూ అనుకోకపోయినా, ఏమైనా బలమైన కారణాలు ఉంటే మాత్రం యుద్ధాన్ని ఆపాల్సిన పరిస్థితి రష్యాకు తప్పదనే విశ్లేషణలు కూడా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇదే విషయాన్ని ఐరోపా మాజీ యూఎస్ కమాండిగ్ లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ స్పష్టం చేశాడు. ఈ మేరకు రష్యాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడు. రష్యన్లు త్వరలోనే వనరుల కొరత కారణంగా ఉక్రెయిన్ పై దాడిని ఆపే స్థితికి చేరుకోనుందని వెల్లడించారు. అంతేగాదు రష్యా బలగాలకు వనరుల కొరత తీవ్రంగా ఏర్పడునుందని నిపుణులు కూడా చెబుతున్నారని అన్నారు. లెఫ్టినెంట్ జనరల్ బెన్ హోడ్జెస్ మాట్లాడుతూ.. రష్యన్లు యావోరివ్లోని కర్ట్ వోల్కర్ శిక్షణా కేంద్రమైన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) మాజీ రాయబారిని వెంబడించడమే కాక ఉక్రెయిన్‌కి పోలాండ్ నుంచి యుద్ధ సామాగ్రిని తరలించే సరిహద్దుల వద్ద రష్యన్లు గస్తీ కాసారని అన్నారు. అయితే నాటో భూభాగాలకు సమీపంలో జరిగిన దాడిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. పైగా రష్యన్లు వనరుల కొరత కారణంగా దాడిని ఆపాల్సిన పరాకాష్టకు చేరుకున్నారని స్పష్టం చేశారు. రష్యాలో సుమారు 10 రోజుల్లో మానవ శక్తి, మందుగుండు సామాగ్రి కొరత ఏర్పడనుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు గానూ మాస్కోను శిక్షించేందుకు 27 దేశాల కూటమి కొత్త ఆంక్షలను ఆమోదించినట్లు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. అంతేగాక ఈయూ ప్రెసిడెన్సీని కలిగి ఉన్న ఫ్రాన్స్, కూటమి "మా అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించి, ఉక్రెయిన్‌పై దురాక్రమణలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని, అలాగే రష్యన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలకు సంబంధించిన ప్యాకేజీని ఆమోదించింది" అని తెలిపింది". మొత్తంగా ఈయూ నియంత్రణ చర్యలు ఇప్పుడు సుమారు 862 మంది వ్యక్తలకు, 53 సంస్థలకు వర్తించనున్నాయి. (చదవండి: యుద్ధం వేళ ఆ మాత్రలకు ఎందుకంత డిమాండ్?) -
రష్యా దెబ్బకు ఆ దేశాలు ఉక్కిరిబిక్కిరి..! రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్...!
ప్రపంచ దేశాలను రష్యా-ఉక్రెయిన్ యుద్దం కలవరపెడుతోంది. ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతుంది. యూరప్ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేయడంలో రష్యా ముందుస్థానంలో ఉంది. యూరప్ దేశాల్లో రష్యా సుమారు 27 శాతం దిగుమతి వాటాలను కల్గి ఉంది. ఇప్పుడదే యూరప్ దేశాలకు పీడకలలాగా తయారైంది. ఐతే యూరప్‌దేశాలు ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కలిసి రానుంది. యూరప్‌కు సరఫరా..! ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉక్రెయిన్ సంక్షోభం మధ్య డీజిల్ కొరతతో సతమతమవుతున్న యూరప్‌కు సరఫరా చేయడానికి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. యూరప్‌లో డీజిల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి...రిలయన్స్ తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాగా ఈ విషయంపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు. ఇప్పటికే యూరప్‌కు రిలయన్స్ ఇంధనాన్ని పంపుతుండగా..రాబోయే నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని రిలయన్స్‌కు చెందిన రెండు రిఫైనరీల నుంచి రోజుకు 1.36 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌ను ప్రాసెస్ చేయగలదు. ఇప్పడు యూరప్ దేశాల్లో డీజిల్‌ను సరఫరా చేసేందుకు రిలయన్స్ సమయాత్తమయ్యింది. భారీ లాభం..! రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యూరప్ దేశాలకు డీజిల్ కొరతను తీర్చనుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ లాభం చేకూరనున్నట్లు తెలుస్తోంది. క్రూడ్ ఫీడ్‌స్టాక్ నిష్పత్తి , దిగుబడి మార్పుల పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ సౌలభ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ రిఫైనింగ్ ఉత్పత్తిలో 80 శాతం ఎగుమతి చేస్తుందని దక్షిణాసియా చమురు అధిపతి సెంథిల్ కుమరన్ అన్నారు. అంతేకాకుండా బలమైన మార్జిన్ సమయాల్లో రిలయన్స్‌కు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంధన కొరత..! ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత యూరప్‌లో ఇంధనం విపరీతంగా పెరగడంతో కొన్ని ఆసియా రిఫైనర్లు డీజిల్‌ను ఆయా యూరప్దేశాలకు సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇది కాస్త రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి రానుంది. జామ్‌నగర్‌లోని క్రూడ్ రిఫైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకదానిని ఈ నెల నుంచి మూడు వారాల పాటు మూసివేయాలని రిలయన్స్ ప్లాన్ చేయగా..ఈ నిర్ణయాన్ని రిలయన్స్ వెనక్కితీసుకుంది. ఇప్పుడు అది సెప్టెంబర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. చదవండి: అప్పుడెమో 900 మంది..ఇప్పుడు ఏకంగా 3వేల ఉద్యోగులకు ఉస్టింగ్..! -
ఈయూలో చేరడానికి మాల్దోవా, జార్జియా సిద్ధం!
మిన్స్క్ (బెలారస్): యూరోపియన్ యూనియన్‌లో చేరడానికి మాల్దోవా, జార్జియా కూడా సిద్ధంగా ఉన్నాయని ఈయూ అధికారి ఒకరు వెల్లడించారు. కూటమిలో చేరుతామని అవి కూడా త్వరలో కోరుతాయని ఆశిస్తున్నామన్నారు. తూర్పు యూరప్ దేశాలైన ఈ రెండు ఇప్పటికే ఈయూ నిర్వహించే కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నాయి. అయితే ఆ రెండు దేశాలు సభ్యత్వం కోరడం మాత్రం అతి పెద్ద పరిణామమని వ్యాఖ్యానించారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లో 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈయూలో చేరడానికి ఎవరైనా దరఖాస్తు కోరితే ఆ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా జరపాల్సిన కొన్ని లాంఛనాలు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. (చదవండి: యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా దాడి.. పేలిందంటే చెర్నోబిల్ కంటే పెనువిషాదం!) -
Russia-Ukraine War.. బెలారస్‌కు బిగ్ షాక్
EU Sanctions On Belarus: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, రష్యా దాడులకు ప్రత్యక్షంగా బెలారస్ సపోర్టు అందించిన విషయం తెలిసిందే. బెలారస్ నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చోరబడ్డాయి. ఈ నేపథ్యంలో బెలారస్ ఊహించని షాక్ తలిగింది. (ఇది చదవండి: భారత్ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రష్యా..) ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధేంచేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, బెలారస్‌పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్ చేసింది. (ఇది చదవండి: ఆగని మారణహోమం: ‘రష్యాను చావుదెబ్బకొట్టాం.. ఏకంగా 6వేల మందిని..’) మరోవైపు ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మొదటిసారిగా బెలరాస్ వేదికగా శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో రెండు దేశాలు వారి డిమాండ్స్పైనే దృష్టి సారించడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో రెండు దేశాలు ప్రతినిధులు బుధవారం మరోసారి చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. -
చారిత్రక ఘట్టం: ఈయూ సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
President Volodymyr Zelenskyy Signed The Application: గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికివారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఆ తదుపరి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో వెంటనే సభ్యత్వం ఇవ్వాలని అభ్యర్థించిన సంగతి కూడా తెలిసిందే. ఈ మేరకు జెలెన్స్కీ యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై సంతకం కూడా చేశారు. ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్, ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ ఛైర్మన్ రుస్లాన్ స్టెఫాన్చుక్ సమక్షంలో ఈ దరఖాస్తు పై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ .."ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం" అని ట్యాగ్‌ని జోడించి మరీ పోస్ట్ చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడినందుకు గానూ రష్యాని ప్రపంచ దేశాలు దౌత్య పరంగా ఆర్థిక పరమైన విషయంలో ఏకాకిని చేసింది. అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాల జాబితాలో చేరాయి. President @ZelenskyyUa has signed application for the membership of #Ukraine in the European Union. This is a historic moment! pic.twitter.com/rmzdgIwArc — Verkhovna Rada of Ukraine (@ua_parliament) February 28, 2022 (చదవండి: రష్యా బలగాలు విఫలం?..అందుకే బెలారస్ దిగనుందా?) -
రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు ఐదో రోజు కొనసాగుతున్నాయి. మరోవైపు బెలారస్‌లోని ఫ్యాఫిట్ వేదికగా ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇరు వర్గాలు పలు డిమాండ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. యూరోపియన్ యూనియన్ ఎదుట కీలక ప్రతిపాదనను ఉంచారు. సోమవారం జెలెన్ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈయూ కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. దీంతో రష్యాపై దాడులను తీవ్రతరం చేసేందుకు ఉక్రెయిన్‌కు ఊహించని మద్దుతు తోడైంది. -
రక్షణకు 113 బిలియన్ డాలర్లు కేటాయించిన జర్మనీ
బెర్లిన్/బ్రసెల్స్: రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్లు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ప్రకటించారు. దేశ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రక్షణపై పెట్టుబడులను మరింతగా పెంచాల్సిన అవసరముందని ఆదివారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చెప్పారు. తాజా ప్రకటనతో రక్షణపై పెట్టుబడులు దేశ జీడీపీలో 2 శాతాన్ని మించాయి. ఉక్రెయిన్‌కు సాయంగా 500 స్టింగర్ మిసైళ్లు, 1,000 యాంటీ ట్యాంక్ వెపన్స్, ఇతర ఆయుధాలు, సామగ్రిని పంపుతున్నట్టు శనివారం రాత్రి జర్మనీ ప్రకటించడం తెలిసిందే. రష్యాపై ఉక్రెయిన్ దాడి యూరప్‌లో రక్షణ విధానాలను తిరగ రాస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జర్మనీ తాజా నిర్ణయమే ఇందుకు నిదర్శనమంటున్నారు. రక్షణపై సరైన మొత్తంలో నిధులు వెచ్చించడం లేదంటూ అమెరికా, నాటో దేశాలు కొంతకాలంగా జర్మనీని విమర్శిస్తూ వస్తున్నాయి. -
బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు. (చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..) -
ఉక్రెయిన్‌పై వార్.. పుతిన్‌కు ఊహించని షాక్
Russia-Ukraine: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యూరోపియన్ యూనియన్(ఈయూ) ఆంక్షలు విధించింది. పుతిన్, రష్యా విదేశాంగశాఖ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు పుతిన్ సిద్దంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్స్క్కు రష్యా ఓ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొంది. European Union agrees to freeze European assets linked to Russian President Vladimir Putin and Foreign Minister Lavrov over Ukraine invasion, reports AFP — ANI (@ANI) February 25, 2022 -
ప్రవాస భారతీయుల కోసం ఈయూ వర్చువల్ మీటింగ్
యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలలోని భారత సంతతి ప్రవాసులతో 2022 ఫిబ్రవరి 23న వర్చువల్ రీజనల్ కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ వర్చువల్ సమావేశం ఉంటుంది. 'ఇండియన్ డయాస్పోరా డివిడెండ్ ఇన్ ది యూరోపియన్ యూనియన్' (యూరోపియన్ యూనియన్ దేశాలలో భారత సంతతి ప్రవాసుల భాగస్వామ్యం) అనే శీర్షికన జరిగే ఈ సమావేశంలో.. జగదీశ్వర రావు మద్దుకూరి (పోలాండ్), చిత్రా స్టెర్న్ (పోర్చుగల్), డాక్టర్ శచి గురుమాయుమ్ (స్విట్జర్లాండ్), డాక్టర్ మాలిని రంగనాథన్ (ఫ్రాన్స్), ప్రొఫెసర్ అనిల్ దావే (ఇటలీ), డా. లోకేష్ జోషి (ఐర్లాండ్), ప్రొఫెసర్ గుల్షన్ సచ్ దేవా (ఇండియా) పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని https://primetime.bluejeans.com/a2m/live-event/vevvsksk వర్చువల్ సమావేశంలో భాగస్వాములు కావొచ్చు. -
ఉక్రెయిన్ ఉద్రిక్తత.. భారతీయులకు అలర్ట్
Alert For Indians In Ukraine: ఉక్రెయిన్‌కు రష్యా ముప్పు పెరిగిపోతుండడంతో.. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించి.. రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యం, ప్రతిగా నాటో బలగాల మోహరింపుతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రాజధాని కియెవ్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచన చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులను కోరింది. ‘‘భారత పౌరులతో వేగంగా సమన్వయం కావాలన్న ఉద్దేశంతో భారత రాయబార కార్యాలయం ఉంది. కాబట్టి, పౌరులు ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఫామ్‌ను నింపండి. ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్షన్‌తో భారత్‌కి వెళ్లిపోయిన విద్యార్థులు మాత్రం ఈ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు.. అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఎంబసీ. మరింత అప్డేట్స్ కోసం ఎంబసీ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో కావాలని, ఏవైనా సాయం కావాలంటే సోషల్ మీడియాలోనూ సంప్రదించవచ్చని సూచించింది. ఒకవైపు రష్యా ఆక్రమణ కోసం ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్‌తో పాటు అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూనే తమకు అలాంటి ఉద్దేశం లేదంటూ రష్యా బుకాయిస్తోంది. అసలు కథ.. సుమారు మూడు దశాబ్ధాల కిందట రష్యా నుంచి విడిపోయింది ఉక్రెయిన్. అటుపై కొన్నేళ్లకు(2014లో) యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని భావించింది. కానీ, అది కుదర్లేదు. పైగా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లడంతో రష్యా ఆగ్రహంతో ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండతో రష్యాపై వ్యతిరేకత కారణంగా పాశ్చాత్య దేశాల ఉక్రెయిన్ ఆకర్షితురాలైంది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని, నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు మంచి సంబంధాలున్నాయని చెబుతూ.. నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అందుకే సరిహద్దులో సైన్యం మోహరింపు ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని.. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లు చేస్తోంది. కానీ, అగ్రరాజ్యం అందుకు అంగీకరించడం లేదు. చదవండి: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?! -
ఈయూ దేశాలకు వెళ్లేవారికి ముందస్తు అవగాహన.. త్వరలో అందుబాటులోకి..
ఇండియా నుంచి యూరప్‌కి విద్యా, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం వెళ్లే వారికి ఉపయోగపడేలా ప్రీ డిపార్చర్ ఓరిమెంటేషన్ కలిగిన పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తామని ఇండియా-ఈయూ ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అధికారి సీతా శర్మ తెలిపారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఢిల్లీ కార్యాలయంలో సీతా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) చైర్మన్ ముళ్ళపూడి వెంకట అమ్రీత్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఇండియా ఉపాధ్యక్షులు కరకాల క్రిష్ణారెడ్డి, ప్రముఖ గాయని కౌసల్య, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, సౌత్ ఆఫ్రికా ఎన్నారై వెన్నపురెడ్డి లక్ష్మణ్ రెడ్డిలతో సమావేశమయ్యారు. అందరితో మాట్లాడి ఈ సందర్భంగా సీతా శర్మ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్ళేవారికి ఉపయోగపడే ముందస్తు ప్రయాణ అవగాహన (ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్) సమాచారం కలిగిన పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు అమెరికా తదితర దేశాల నుంచి సెలవుపై వచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వివిధ సంఘాల ప్రతినిధులతో కూడా కలువనున్నట్లు ఆమె వివరించారు. ఇండియా- ఈయూ ఒప్పందం భారత దేశం నుండి యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు విద్య, ఉద్యోగం, వ్యాపారానికి వెళ్ళేవారి కోసం అవగాహనతో పాటు తగిన సౌకర్యాలు కల్పించడానికి ఇండియా-ఈయూ కామన్ ఎజెండా ఆన్ మైగ్రేషన్ అండ్ మోబిలిటీ అనే ఒప్పందం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ (ఐసీఎం), ఆస్ట్రేలియా కేంద్రంగా పందొమ్మిది దేశాలలో పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పాలసీ డెవలప్మెంట్ (ఐసీఎంపీడీ) 187 సభ్యదేశాలు కలిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) కలిసి ఇండియా-ఈయూ ప్రాజెక్టులో సహకార ఒప్పందం కుదుర్చుకొని కలిసి పనిచేస్తున్నాయి. సభ్య దేశాలు యూరోపియన్ యూనియన్ - ఈయూ (షెంజెన్ కంట్రీస్)లో సభ్య దేశాలుగా ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఇస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రోమానియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ మొత్తం 27 దేశాలు ఉన్నాయి. చదవండి: కనీస వేతనం, విదేశీ భవన్.. ఇంకా మరెన్నో.. -
కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక
వాహింగ్టన్: గత యేడాది మారణహోమం సృష్టించిన కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ శర వేగంతో వ్యాప్తి చెందే అవకాశం ఉందని యూఎస్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. అమెరికాలోని మొత్తం కరోనా కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 3 శాతం ఉన్నాయని ఈ సందర్భంగా సీడీసీ డైరెక్టర్ రోచెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు. యూఎస్ దేశ వ్యాప్తంగా 96 శాతం మెజార్టీ కేసులన్నీ డెల్లా ఫ్లస్కు చెందినవి కాగా, 3 కంటే ఎక్కువ శాతం కేసులు ఒమిక్రాన్‌కు చెందినవని ఆయన తెలిపారు. 75 దేశాల్లోని 36 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, కేవలం రెండు రోజుల వ్యవధిలో కొత్త వేరియంట్ కేసులు రెట్టంపయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా యూఎస్ నేషనల్ జినోమిక్ సీక్వెన్సింగ్ అనాలిసిస్ డేటాను సీడీజీ విడుదల చేసింది. వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ విజృంభణ కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కోవిడ్ డెల్టా ప్లస్‌ను డామినెట్ చేసే ఆధిపత్య జాతిగా పురోగమిస్తుందని యూఎస్ సీడీసీ నివేదించింది. మరోవైపు ఈయూ/ఈఈఏ దేశాల్లో 2022 మొదటి రెండు నెలల్లో ఒమిక్రాన్ వీఓసీ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, పండుగ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా యూరోపియన్ హెల్త్ కమిషనర్ స్టెల్లా కిరియాకిడ్స్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. చదవండి: ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్! #WATCH | US Centers for Disease Control and Prevention (CDC) Director Rochelle Walensky said, "...Early data suggest that Omicron is more transmissible than Delta, with a doubling time of about two days." pic.twitter.com/RbbLoaQ3Nk — ANI (@ANI) December 15, 2021 -
హే!... రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!
Children Pfizer Covid Vaccine: యూరోపియన్ యూనియన్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీలైన బయో ఎన్‌టెక్/ఫైజర్లు మరో రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుందని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. ఈ మేరకు ఆమె కరోనా మహమ్మారి సమస్య గురించి జర్మన్-యుఎస్ జాయింట్ వెంచర్‌తో మాట్లాడానని పైగా వారు తమ పరిశోధనలు మరింత వేగవంతం చేస్తున్నారని చెప్పారు. (చదవండి: ఆ తప్పుడు ఆరోపణే ఆమెను కోట్లాధికారిని చేసింది!!) అంతేకాదు ఆమె ఈయూలోని పిల్లలకు డిసెంబర్ 13 నాటికల్లా ఫైజర్ వ్యాక్సిన్లు అందుబాటులో వస్తాయని అన్నారు. అయితే సౌతాఫ్రికాలోని బోట్స్వానాలో గురించిన ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్‌తో హడలిపోతూ భయం గుప్పెట్లో బతుకుతున్న ప్రపంచదేశాలన్నించి ఈ విషయం కాస్త ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట! -
తల్లిదండ్రుల మీద బతికేటోళ్లకు బంపరాఫర్
తల్లిదండ్రులకు పిల్లలు భారమా?.. ఓ వయసుకి వచ్చేసరికి పిల్లలు తమ కాళ్ల మీద తాము బతకాలని ప్రతీ తల్లీతండ్రి కొరుకుంటారు. కానీ, ఆ వయసు దాటిన తర్వాత కూడా గడపదాటకుండా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతుంటారు కొందరు. కారణాలు ఏవైనా.. ఈ కల్చర్‌ను తగ్గించేందుకు నాలుగున్నర కోట్లకు పైగా జనాభా ఉన్న స్పెయిన్ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా.. దూరంగా బతికే పిల్లలకు నెలకు 250 పౌండ్లు ప్రభుత్వమే చెల్లించనున్నట్లు ప్రకటించింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాన్షెజ్(49) స్వయంగా జాతిని ఉద్దేశించి మంగళవారం ఈ ప్రకటన చేశారు. 18 నుంచి 35 ఏళ్ల వయసులోపు పిల్లలు.. పేరెంట్స్‌కు దూరంగా, విడిగా ఉంటే నెలకు 250 పౌండ్లు(290 డాలర్లు.. మన కరెన్సీలో 21 వేల రూపాయలకు పైనే) ఇస్తామని ప్రకటించారాయన. అయితే ఇందుకు కొన్ని కండిషన్ కూడా పెట్టారు. కేవలం దూరంగా ఉండడం మాత్రమే కాదు.. ఏదైనా పని చేసుకుంటూ ఉంటేనే ఈ అమౌంట్ ఇస్తారట. అందులో ఏడాదికి 23 వేల పౌండ్లు సంపాదిస్తేనే.. ఈ బంపరాఫర్ వర్తిస్తుందని ప్రకటించారాయన. పైగా ప్రభుత్వం ఇచ్చే ఆ 250 పౌండ్లను అద్దె కోసమే ఖర్చు చేయాలని, అదీ రెండేళ్లపాటు ఇవ్వనున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్‌లో గత కొన్నేళ్లుగా నిరక్షరాస్యత, నిరుద్యోగం రేటు పెరిగిపోతోంది. ఉద్యోగాలు లేక బద్ధకంగా మారిపోతోంది యువత. దీంతో 30 పడిలో పడ్డా కూడా ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి బతుకుతున్నారు. విశేషం ఏంటంటే.. సంపాదించే స్తోమత ఉన్నవాళ్లు సైతం అద్దెను తప్పించుకునేందుకు తమ భార్యాపిల్లలతో తల్లిదండ్రుల ఇళ్లలోకి చేరిపోతున్నారు. మరోవైపు కరోనా ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్లు సైతం అద్దెను మిగిల్చుకునేందుకు ఇలా తల్లిదండ్రుల పంచన చేరుతున్నారు. సొంత ఇళ్ల కొనుగోళ్ల సంగతి సరేసరి. ఈ కారణాలతో ‘ఇళ్ల మార్కెట్’ సైతం దారుణంగా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక్క స్పెయిన్లోనేకాదు.. ఇటలీ, గ్రీస్ ఇలా దాదాపు ఈయూ దేశాల్లో ఇలాంటి సినారియోనే కనిపిస్తోంది. అందుకే స్పెయిన్ ప్రధాని పెడ్రో ‘హౌజింగ్ ప్లాన్’ రూపొందించి.. ఇలా ఆఫర్ల ద్వారా ఆకట్టుకుని హౌజ్ మార్కెటింగ్ ఆదాయం పెంచుకునేందుకు, యువతకు పట్టిన బద్ధకాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: పోర్న్ వీడియోలు.. న్యాయం చేయమంటే ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి? -
35వేల కోట్ల జరిమానా సరే! యాపిల్ సంగతేంది?
ఏమాత్రం కనికరం లేకుండా భారీ జరిమానా విధించిన యూరోపియన్ యూనియన్ నియంత్రణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది గూగుల్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా గూగుల్ అవకతవకలకు పాల్పడిందంటూ 2018లో ఈయూ యాంటీట్రస్ట్ రెగ్యులేటర్, 5 బిలియన్ల డాలర్ల( సుమారు 35 వేల కోట్లకుపైగా) జరిమానా విధించింది. అయితే మూడేళ్ల తర్వాత ఈ నష్టపరిహారంపై దాఖలైన పిటిషన్‌పై వాదప్రతివాదనలు సోమవారం యూరోపియన్ యూనియన్ ఉన్నత న్యాయస్థానంలో మొదలయ్యాయి. మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విచారణ.. ఐదురోజులపాటు జరగనుంది. అయితే ఈ ఆరోపణలపై గూగుల్ గట్టిగానే ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ మార్కెట్‌తో పాటు యాపిల్ మార్కెట్ కూడా నడుస్తోందని, అలాంటప్పుడు దానిని ఎలా విస్మరిస్తున్నారని గూగుల్, ఈయూ కమిషన్‌ను ఎదురుప్రశ్నించినట్లు సమాచారం. ►2011 నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెటింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ విపరీతమైన లాభాలు వెనకేసుందని, ఈ క్రమంలో యూజర్ల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిందన్న ఆరోపణలపై ది యూరోపియన్ కమిషన్ గూగుల్‌కు 2018లో భారీ జరిమానా విధించింది. కానీ, తాము నైతిక విలువలు పాటించామని, యూజర్లకు, డివైజ్ మేకర్లకు ఎలాంటి నష్టం చేయకుండానే యాప్ మార్కెట్లో టాప్ పొజిషన్‌కు చేరామని గూగుల్ వెల్లడించింది. ►అయితే గూగుల్ నిజాయితీపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈయూ రెగ్యులేటర్ అథారిటీలు.. యాపిల్ విషయంలో మాత్రం కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నాయని గూగుల్ తరపు న్యాయవాది మెరెడిథ్ పిక్‌ఫోర్డ్ ఆరోపించారు. ప్లేస్టోర్, యాప్ మార్కెటింగ్‌లోనే కాదు.. ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పోలిస్తే అన్ని వ్యవహారాల్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్న యాపిల్‌ను అలా ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. చదవండి: దెబ్బకు దిగొచ్చిన గూగుల్.. సంచలన నిర్ణయం ►దీనిపై ఈయూ కమిషన్ తరపు లాయర్ నికోలస్ ఖాన్ స్పందించారు. ఈ వ్యవహారంలో యాపిల్‌ను లాగడం సరికాదన్నారు. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే యాపిల్ మార్కెట్ తక్కువ ఉందని స్పష్టం చేశాడు. గూగుల్ సెర్చ్ మొదలు, యాప్ స్టోర్.. ఇలా ప్రతీది బలవంతపు ఒప్పందాల ద్వారా చేయించింది గూగుల్ మాత్రమేనని ఖాన్ కోర్టులో వాదనలు వినిపించారు. ►ఇదిలా ఉంటే జర్మన్ ఫోన్ మేకర్ గిగాసెట్ కమ్యూనికేషన్స్ మాత్రం.. గూగుల్‌ను వెనకేసుకొస్తోంది. కమిషన్ నిర్ణయం వల్ల వ్యాపారంపై తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. మరోవైపు ఫెయిర్‌సెర్చ్ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఇక ఈయూ కమిషన్.. ఇప్పటిదాకా రకరకాల ఫిర్యాదుల ఆధారంగా మొత్తం ఎనిమిది బిలియన్ల యూరోలను ఫైన్ల రూపంలో గూగుల్‌పై విధించింది. చదవండి: గూగుల్‌క్రోమ్ వాడుతున్నారా? అయితే ఈ జాగ్రత్త మీకోసమే -
భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం!
యాప్ మార్కెటింగ్ కమిషన్ వ్యవహారంలో భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. నిన్నగాక మొన్న దక్షిణ కొరియా ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్, యాపిల్ కమిషన్ కక్కుర్తికి దెబ్బేసిన విషయం తెలిసిందే. అయితే యాప్ డెవలపర్స్ నుంచి బలవంతపు కమిషన్ వసూళ్ల ద్వారా పోటీదారులను దారుణంగా దెబ్బ తీస్తోందనే ఆరోపణలపై యాపిల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాజస్తాన్‌కు చెందిన ‘టుగెదర్ వీ ఫైట్ సొసైటీ’ అనే ఎన్జీవో సీసీఐలో ఫిర్యాదు చేసింది. యాప్ మార్కెట్లో మధ్యవర్తిగా ఉండడం ద్వారా కస్టమర్లకు, డెవలపర్లకు మధ్య సమన్వయాన్ని యాపిల్ కంపెనీ దెబ్బతీస్తోందని ఫిర్యాదులో పేర్కొంది ఆ సంస్థ. అంతేకాదు ఇతరులకు పోటీలో అవకాశం లేకుండా పోతోందని తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీసీఐలో దాఖలైన ఫిర్యాదుపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. ఇక ఈయూలోనూ యాపిల్ దాదాపు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది. ఇక కిందటి ఏడాది కొన్నిస్టార్టప్స్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. గూగుల్‌పై సీసీఐ విచారణ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ ప్లేస్టోర్ల ద్వారా యాప్ పేమెంట్స్ ఛార్జీలు 30 శాతం వసూలు చేస్తున్న గూగుల్, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాల తీరు.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. అయితే వీటి యాప్ మార్కెటింగ్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ప్రయత్నాలకు దక్షిణ కొరియా బీజం వేయగా.. ఇప్పుడు మరికొన్ని దేశాలు ఆ బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీఐ విధులు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి. చదవండి: గూగుల్, యాపిల్‌కు భారీ దెబ్బ! క్లిక్ చేయండి: వాట్సాప్‌కు షాక్ -
ఆమెకు పతకం మాత్రమే.. కానీ 34వేల జనాభాగల దేశానికి మాత్రం..
ఎక్కడ విశ్వక్రీడలు జరిగినా... కొద్దో గొప్పో వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం ద్వారా ఓ చిన్ని దేశం సంగతులు తెలిసొచ్చాయి. ఆ పతకాన్ని అలెజాండ్రా పెరిలి షూటింగ్లో గురి పెడితే ఆమె దేశం సాన్ మరినో గురించి మనకందరికీ ఇలా తెలిసొచ్చింది. టోక్యో: ఐరోపాకు చెందిన సాన్ మరినో దేశం గురువారం రాత్రి ఒలింపిక్స్ పుటలకెక్కింది. జనాభా పరంగా పతకం గెలిచిన అతి చిన్న దేశంగా ఘనత వహించింది. ఎన్నో ఏళ్ల నుంచి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నా... సాన్ మరినోని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసింది మాత్రం 33 ఏళ్ల అలెజాండ్రా పెరిలినే! ఈ మహిళా షూటర్ సాధించిన కాంస్యమే ఆ దేశానికి ఇప్పుడు బంగారంతో సమానం. మహిళల ట్రాప్ ఈవెంట్లో పెరిలి మూడో స్థానంలో నిలిచింది. ఈ వెటరన్ షూటర్ ఒలింపిక్స్‌లో ఆడటం ఇదేం తొలిసారి కాదు. లండన్–2012 ఒలింపిక్స్ నుంచే పతకంపై గురి పెడుతూ వచ్చింది. అక్కడ త్రుటిలో పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత రియో ఒలింపిక్స్ (2016)లోనూ పాల్గొన్నప్పటికీ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగింది. అంత మాత్రాన తన పనైపోయిందని, మూడు పదుల వయసు దాటిందని ఇక చాలనుకోలేదు. కఠోరంగా ప్రాక్టీస్ చేసి టోక్యోలో కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో పెరిలి 29 పాయింట్లు స్కోరు చేసింది. ఈ ఈవెంట్లో స్లొవేకియా అమ్మాయి స్టెఫెస్కొవా (43 పాయింట్లు) బంగారం గెలిస్తే... కైల్ బ్రౌనింగ్ (అమెరికా–42 పాయింట్లు) రజతం నెగ్గింది. జనాభా 34 వేలు మాత్రమే... సాన్ మరినో ఓ యూరోపియన్ యూనియన్ దేశం. సాన్ మరినో చుట్టూ ఇటలీ ఉంటుంది. జనాభా కేవలం 34 వేలు మాత్రమే! మన రాష్ట్రంలోని పట్టణాల్లో నివసించే జనం కంటే తక్కువే కదా! కానీ ఒలింపిక్స్‌కు కొత్తేం కాదు. 60 ఏళ్ల క్రితం నుంచే రోమ్ ఒలింపిక్స్ (1960) నుంచి విశ్వక్రీడలు ఆడటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఓ పతకంపై గురిపెట్టింది. పతకం సాధించిన అతి తక్కువ జనాభా గల దేశంగా రికార్డులకెక్కింది. కేవలం మూణ్నాలుగు క్రీడాంశాల్లో పాల్గొనే సాన్ మరినో ఒలింపిక్ కమిటీ ఆశలన్నీ షూటర్లపైనే! పెరిలి కంటే ముందు ఒలింపిక్స్‌లో సాన్ మరినో దేశం అత్యుత్తమ ప్రదర్శన ఐదో స్థానం. అది కూడా షూటింగ్‌లోనే! లాస్ ఏంజిల్స్ (1984)లో ఫ్రాన్సెసొ నని పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. దీన్ని లండన్‌లో పెరిలి నాలుగో స్థానంతో సవరించింది. షూటింగ్‌తో పాటు రెజ్లింగ్, స్విమ్మింగ్, జూడో ఈవెంట్లలో సాన్ మరినో క్రీడాకారులు పాల్గొంటారు. ఫైనల్లో ఐదో షూటర్ నిష్క్రమించగానే నేను గట్టిగా మనసులో అనుకున్న... మరోసారి నాలుగో స్థానంలో నిలవొద్దని! చివరిదాకా ఏకాగ్రతతో గురిపెట్టాను. తుదకు పోడియంలో నిలిచాను. నాకు, నా దేశానికి ఇదే తొలి పతకం. మా చిన్న దేశానికి ఇదే పెద్ద గర్వకారణం. బహుశా మా వాళ్లంతా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారేమో. –పెరిలి -
కొవిషీల్డ్ వ్యాక్సిన్ విషయంలో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్‌కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!. ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్లు, మెడిసిన్స్కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది. For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser — EU Medicines Agency (@EMA_News) July 15, 2021 ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది. దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
Covishield: ఈయూ పాస్‌పోర్ట్‌లో కోవిషీల్డ్‌ను చేర్చేలా చూడండి!
న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ ‘కోవిడ్ 19 వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్’లో కోవిషీల్డ్ టీకాను కూడా చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. కోవిషీల్డ్‌ను అందులో చేర్చనట్లయితే ఆయా దేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, వ్యాపారులు సమస్యలను ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, ఆ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఇప్పటి వరకు 4 టీకాలకు మాత్రమే యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం లభించింది. అవి ఫైజర్/బయోఎన్‌టెక్, మోడెర్నా, వాక్స్‌జెర్విరియా(ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్), జాన్సన్. ఈ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే ఈయూ దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఉంటుంది. భారత్‌లో ఎక్కువమంది తీసుకున్న కోవిషీల్డ్‌ను ఈయూ వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్‌లో చేర్చనట్లయితే, అనేక విపరిణామాలుంటాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు రాసిన లేఖలో ఎస్ఐఐ సీఈఓ ఆధర్ పూనావాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్‌లో 30 కోట్లమంది కోవిషీల్డ్ తీసుకున్నారని, మొత్తంగా 50% భారత జనాభా ఈ టీకానే తీసుకునే అవకాశముందని తెలిపారు. ఇక్కడ చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ Prashant Bhushan: వ్యాక్సిన్ వ్యతిరేక ట్వీట్లు.. షాకిచ్చిన ట్విటర్ -
100 కోట్ల టీకా డోసులిద్దాం
కార్బిస్‌బే: కరోనా మహమ్మారిపై ఉమ్మడి పోరాటం, సంపూర్ణ వ్యాక్సినేషనే లక్ష్యంగా గ్రూప్ ఆఫ్ సెవెన్(జీ7) దేశాల మూడు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆతిథ్య దేశం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్బిస్‌బే రిసార్టులో ఏర్పాటు వేదిక నుంచి యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రపంచదేశాల అధినేతలకు అభివాదం చేసి, సదస్సుకు శ్రీకారం చుట్టారు. కరోనాపై కలిసి పోరాడుదామని పిలుపునిస్తూ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచంపై కోవిడ్–19 వైరస్ దాడి మొదలయ్యాక ఇదే మొదటి జీ7 సదస్సు. యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ పాల్గొంటున్నాయి. మళ్లీ మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం (బిల్డింగ్ బ్యాక్ బెట్టర్ ఫ్రమ్ కోవిడ్–19) అన్న నినాదంతో జరుగుతున్న జీ7 సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా అతిథి దేశాలుగా భాగస్వాములవుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. జీ7 సదస్సులో మొదటిరోజు దేశాల అధినేతలు ఉల్లాసంగా కనిపించారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టీకా డోసులను ప్రపంచ దేశాలకు అందజేయాలని, మహమ్మారి వల్ల నష్టపోయిన దేశాలకు చేయూతనందించాలని ఈ సంపన్న దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. 10 కోట్ల డోసులిస్తాం: బోరిస్ జాన్సన్ తమ వద్ద అవసరానికి మించి ఉన్న 10 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఏడాదిలోగా ప్రపంచ దేశాలకు ఉదారంగా అందజేస్తామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. జీ7 సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన.. కరోనా మహమ్మారిని అంతం చేసే యజ్ఞంలో పాలు పంచుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 10 కోట్ల టీకా డోసులను ఇతర దేశాలకు ఇస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ఆక్స్ఫర్డ్ వర్సిటీ–ఆస్ట్రాజెనెకాకు నిధులు సమకూర్చామని గుర్తుచేశారు. లాభార్జనను పక్కనపెట్టామని, తమ కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు ఇప్పటిదాకా 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందాయని వెల్లడించారు. జీ7 సదస్సులో పాల్గొంటున్న దేశాల అధినేతలు సైతం ఇలాంటి దాతృత్వాన్నే ప్రదర్శిస్తారని ఆశిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. 50 కోట్ల టీకా డోసులు అందజేస్తాం సదస్సులోఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు 50 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందజేస్తామని ప్రకటించారు. బహుళ జాతి కార్పొరేట్ సంస్థలపై కనీసం 15 శాతం పన్ను విధించాలన్న ప్రతిపాదన జీ7 సదస్సులో చర్చకు వచ్చింది. ఈ మేరకు దీనిపై ఆయా దేశాల ఆర్థిక మంత్రుల మధ్య వారం క్రితం ఒక ఒప్పందం కుదిరింది. కాలుష్యం, వాతావరణ మార్పుల అంశం కూడా జీ7 సదస్సు అజెండాలో ఉంది. కాగా, సదస్సు జరుగుతున్న కార్బిస్‌బే రిసార్టు ఎదుట వందలాది మంది వాతావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు గుమికూడారు. వాతావరణ మార్పులను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు.సెయింట్ ఇవీస్లో జరిగిన ర్యాలీలో 500 మంది పాల్గొన్నారు. నిరసనకారులు ఆకుపచ్చ, నీలి రంగు దుస్తులు ధరించారు. హామీలతో తుంగలో తొక్కుతున్న జీ7, మాటలే తప్ప చేతల్లేవ్ అని రాసి ఉన్న జెండాలను ప్రదర్శించారు. -
బ్రిటన్ ప్రధాని భారత పర్యటన ఖరారు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ చివరి వారంలో భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తరువాత బోరిస్ చేస్తోన్న మొదటి అంతర్జాతీయ పర్యటన ఇది. యూకే అవసరాలను మెరుగుపర్చడం కోసం ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో ముఖ్య అతిథిగా బోరిస్ పాల్గొనాల్సి ఉండగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు అధికంగా నమోదుకావడంతో తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. దాంతో ఇరు దేశాల మధ్య జరగాల్సిన వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుత పర్యటనతో ఈ చర్చలు కొలిక్కిరానున్నాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతం వైపు దృష్టి సారించనున్నట్లు జాన్సన్ ప్రభుత్వం తెలిపింది.ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రపంచంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా ప్రాతినిధ్యం వహించనుంది. బ్రెగ్జిట్ అనంతరం, నెలకొన్న పరిస్థితులు, వాణిజ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి 11 దేశాల కూటమిలో సభ్యత్వం కోరుతూ, గత నెలలో బ్రిటన్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ కోసం సమగ్ర మరియు ప్రగతిశీల ఒప్పందంలో (సిపిటిపిపి) చేరాలని ఇండియాకు అధికారికంగా అభ్యర్థన చేసింది.(చదవండి: రష్యాను అధిగమించిన భారత్..!) -
జీతం పెరిగింది.. ఎవరికి ఎంత?
స్త్రీ పురుష ఉద్యోగుల జీతాలు, వేతనాల్లో అసమానతలను తొలగించాలని ఇ.యు. తన పరిధిలోని దేశాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఫలిస్తే.. తక్కిన దేశాలూ ఆచరిస్తే.. స్త్రీ పురుషులు ఇక ఈక్వల్ ఈక్వల్. సమాన పనికి సమాన వేతనం. లిస్ట్ ఇవ్వండి జెండర్ ‘పే గ్యాప్’ను తొలగించే చర్యలలో భాగంగా.. 27 సభ్య దేశాల్లోని కంపెనీలు తమ సిబ్బందిలో ఎవరికి ఎంత జీతం ఇస్తున్నాయో తక్షణం బహిర్గత పరచాలని ‘ఐరోపా సమాఖ్య’ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్లెయన్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంస్థలు తమ సిబ్బందికి గోప్యంగా, విడివిడిగా జీతాలు పెంచుకుంటూపోతున్న కారణంగానే సమానమైన పనికి కూడా స్త్రీలకు తక్కువ ప్రతిఫలం లభిస్తోందని ఆమె గుర్తించడం.. ఈ ఏడాది ‘ఉమెన్స్ డే’ కి తమకు లభించిన బోనస్ అని ఆ దేశాలలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పని. ఒకే విధమైన పని గంటలు. కానీ వేతనం ఒకటే కాదు. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ! ప్రపంచమంతటా ఇంతే. ఏళ్లుగా ఇంతే. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో చెప్పలేం. స్త్రీ పురుషుల వేతనాల్లో హెచ్చు తగ్గుల్ని లేకుండా చేయడానికైతే శతాబ్దాలు అక్కర్లేదు. దశాబ్దాలూ అక్కర్లేదు. కొంత టైమ్ ఇచ్చి, ఆ టైమ్ లోపు ‘ఈక్వల్ పే’ ఉండాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే చాలు.. వేతనాల్లో, జీతాల్లో అసమానత్వాలు, అంతరాలు సమసిపోతాయి. మరి ప్రభుత్వాలు చెయ్యకనేనా నేటికీ మహిళా ఉద్యోగులు, మహిళా శ్రామికులు పురుషులకన్నా తక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు! శ్రమదోపిడికి గురవుతున్నారు! కాదు. కంపెనీలే స్త్రీ పురుష వివక్ష ను పాటిస్తున్నాయి. ‘మీరు చెప్పినట్లే ఈక్వల్ ఈక్వల్‌గా ఇస్తున్నాం’ అని పైపై లెక్కలు చూపిస్తున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే విధమైన పనిని, ఒకే పనిగంటల్లో చేస్తే వారిద్దరికీ ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తున్నామని చెబుతున్నాయి. చెప్పడం వరకే. చేస్తున్నది వేరే. పురుషులకు ఎక్కువ. స్త్రీలకు తక్కువ! అలా ఎలా చేయగలుగుతున్నాయంటే.. గోప్యత. రహస్యం! నిజంగా ఎంతిస్తున్నదీ కంపెనీలు బయటపెట్టడం లేదు. ఇక ఇలాక్కాదని చెప్పి, ప్రతి ఉద్యోగికీ మీరెంత జీతం ఇస్తున్నదీ పేర్లతో సహా బహిర్గతం చేయండి అని ఐరోపా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ ‘యూరోపియన్ యూనియన్’ (ఇ.యు) కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్లెయన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కాస్త ముందు ఆమె ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం యాదృచ్ఛికమే అవొచ్చు కానీ ఇ.యు. పరిధిలోని 27 దేశాల మహిళా ఉద్యోగులు దీనినొక ఉమెన్స్ డే బోనస్‌గా భావిస్తున్నారు. ∙∙∙ నిజమే. వేతనాల్లో వివక్షతో కూడిన వ్యత్యాసం తగ్గాలంటే.. అసలు ఎవరికి ఎంత వేతనం ఇస్తున్నదీ ముందు తెలియాలి. అందుకే ఆ లిస్ట్‌ను బహిర్గతం చెయ్యమని వాన్ డెర్లియన్ ఆదేశించారు. ఇ.యు. దేశాలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉంటాయనే పేరుంది. అయితే అక్కడ కూడా వేతనాలలో మిగతా దేశాలలో ఉన్నట్లే మహిళలపై వివక్ష ఉంది! ఇ.యు. 1957లో ఏర్పడింది. అప్పట్నుంచీ ‘పే గ్యాప్’ ను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. కావడం లేదు. జీతాలు, వేతనాలు, పని వేళలు, పెన్షన్లు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటా సంస్థల యాజమాన్యాలు ఈ గ్యాప్‌ను పాటిస్తూనే ఉన్నాయి. గత 30–40 ఏళ్లలో ఇ.యు. ఎంతగానో పాటు పాడితే తగ్గిన వేతన అంతరం 30 శాతం మాత్రమే. ఇది నూరు శాతం అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో! అయితే వాన్ డెర్లెయన్ అంతవరకు ఆగదలచుకోలేదు. ఏడాది క్రితం కమిషన్ అధ్యక్షురాలిగా వచ్చిన నాటి నుంచీ ఐరోపా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ క్రమంలో బుధవారం జారీ చేసినవే.. ప్రతి కంపెనీ తమ పే లిస్ట్‌ను బయటపెట్టి తీరాలన్న ఆదేశాలు. అప్పుడు ఎవరికి ఎంతిస్తున్నదీ తెలుస్తుంది. స్త్రీలకు ఎంత వస్తున్నదీ బయటపడుతుంది. ఆ ప్రకారం కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. చర్యల భయం ఉంటే కంపెనీలూ వాటికై అవి వేతన అంతరాలను తొలగించేందుకు ముందుకు వస్తాయి. ∙∙∙ ఆదేశాలతోపాటు కొన్ని ప్రతిపాదనలకు ఆదేశ రూపం ఇచ్చేందుకు కూడా కమిషన్ సభ్యులను సోమవారం సమావేశ పరచబోతున్నారు వాన్ డెర్లెయన్! కంపెనీలు ఇకపై ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించే ముందు కానీ, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గానీ వారి పూర్వపు వేతనాన్ని (మునుపటి కంపెనీలో వాళ్లకు వస్తున్న వేతనం) అడగకూడదు. ఫలాన పోస్టుకు ఇంత జీతం అని ప్రకటించాక ఆ తర్వాత పురుషుడు అని పెంచడం గానీ, స్త్రీ అని తగ్గించడం కానీ చేయకూడదు. ఉద్యోగానికే జీతం తప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీతం కాదు అన్నట్లు ఉండాలి. మహిళలైతే తాము చేరబోయే సంస్థలో స్త్రీ పురుషుల జీతాలలో వ్యత్యాసం ఏ మేరకైనా ఉందా అని ముందే ఆ సంస్థ యాజమాన్యాన్ని అడిగే హక్కు కలిగి ఉండాలి. కనీసం 250 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ తమ జీతాల్లోన్ని జెండర్ వ్యత్యాసం గురించి విధిగా తమ మహిళా అభ్యర్థులకు తెలియపరచాలి. ఇప్పటికే పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తాము ఎంతకాలంగా తక్కువ జీతాన్ని పొందుతున్నారో, ఆ తగ్గిన మొత్తాన్ని అడగవచ్చు. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుంచి యాజమాన్యాలు తొలగించకూడదు. ఇవీ.. ఆ ప్రతిపాదనలు. కంపెనీలతోపాటు, కోవిడ్ కూడా మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు, ఆఖరికి ఉపాధిని కూడా లేకుండా చేసింది. ఆ పరిహారాన్ని కూడా కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు వాన్ డెర్లెయన్ మరొక ఆదేశ పత్రం ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ.. -
ఈయూకు ఆశాభంగం
భారత్–యూరప్ యూనియన్(ఈయూ)ల మధ్య ఆన్లైన్ శిఖరాగ్ర సమావేశం బుధవారం ముగిసింది. ఇది వాస్తవానికి ఏటా జరగాలి. కానీ వాణిజ్యం, పెట్టుబడులు వగైరా అంశాల్లో ఇరు పక్షాల మధ్యా ఏకాభిప్రాయం కొరవడటంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ శిఖరాగ్ర సమా వేశం జరిగింది. సమావేశానికి ముందు పౌర అణు ఇంధన సహకార ఒప్పందంపై సంతకా లయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడుల్లో సమతూకం సాధించాలని, వాణిజ్య అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే అందరూ అనుకున్నట్టు ఈసారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ప్రస్తావన రాలేదు. దానిపై తదుపరి చర్చలు ఎప్పుడుం టాయన్న అంశంలోనూ స్పష్టత లేదు. వాణిజ్య రంగంలో ఈయూ మనకు అతి పెద్ద భాగస్వామి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) అంశంలోనూ ఈయూదే పైచేయి. మన దేశంలో ఆ ఎఫ్‌డీఐలు 9,100 కోట్ల డాలర్ల పైమాటే. అయితే ఈయూ దేశాల విదేశీ వాణిజ్యంలో భారత్ వాటా 2 శాతం మాత్రమే. దీన్నింకా పెంచాలన్నది తమ ఉద్దేశమని ఈయూ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ ప్రకటించారు. భారత్–ఈయూ దేశాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే వున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ ఆత్మరక్షణ విధానాలు అవలంబిస్తూ భారీగా టారిఫ్‌లు విధిస్తోందని ఈయూ అభ్యంతరం చెబుతోంది. 2013లో చివరిసారి ఇరుపక్షాల మధ్యా చర్చలు జరిగినప్పుడు అంగీ కరించిన అంశాలపై మన దేశం ఆ తర్వాత వెనక్కి తగ్గిందన్నది ఈయూ ఆరోపణ. తాము ఉత్పత్తి చేసే కార్లు, మద్యం వగైరాలపై విధించిన భారీ టారిఫ్‌లు సమ్మతం కాదని ఈయూ అప్పట్లో వాదించింది. సేవల రంగాన్ని కూడా ఒప్పందంలో చేర్చాలని, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వీసాలు మంజూరును పెంచాలని మన దేశం కోరింది. అలాగే మన ఆహారోత్పత్తులు, ముఖ్యంగా చేపలు, పాడి ఉత్పత్తులకు ఈయూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నిబంధనల్ని సరళం చేయాలని కోరింది. ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2016లో మన దేశం ఈయూలోని 22 దేశాలతో అంతక్రితం కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను రద్దుచేసింది. ఈ చర్యతో ఈయూ సభ్య దేశాలకు అపనమ్మకం ఏర్పడిందని, కనుక సమగ్ర ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కుదరాలని తాజా సమావేశం సందర్భంగా ఈయూ ప్రతిపాదించింది. ఆ మాదిరి ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసిన పక్షంలో తీసుకునే చర్యలే ఈ ప్రతిపాదన సారాంశం. అయితే అందుకు మన దేశం సిద్ధపడలేదు. దీనికి బదుల పరస్పరం ఆసక్తిగల రంగాల్లో అంగీకారం కుదుర్చుకుని, వాటికి పరిమితమై వాణిజ్యాన్ని కొనసాగిం చవచ్చునని సూచించింది. ఇందువల్ల రెండు పక్షాలకూ పెద్దగా ఉపయోగం ఉండదని ఈయూ భావన. అయితే ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడుల ఒప్పందంపై భారత్–ఈయూల మధ్య మరిన్ని చర్చలు జరగాలని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాలని తాజా శిఖరాగ్ర చర్చల్లో నిర్ణయించారు. ఈయూతో ఎఫ్‌టీఏ కుదర్చుకోవడంపై మన దేశంలో వివిధ వర్గాలు మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకతతో వున్నాయి. నిరుడు నవంబర్‌లో మన దేశం చైనాకు పెద్దగా మేలు చేకూర్చే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సీఈపీ) చర్చల నుంచి బయటకు రావాలని నిర్ణయింది. ఆర్సీఈపీ వల్ల మన సరుకులను అమ్ముకోవడానికి అవకాశాలు ముమ్మరమవుతాయని కొందరు నిపుణులు చెప్పినా, ఆరోగ్య, వ్యవసాయ, పాడిపరిశ్రమ, తయారీ రంగాలను తీవ్రంగా నష్టపరిచే ఆ ఒప్పందం జోలికి వెళ్లవద్దని అనేకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్సీఈపీ నుంచి బయటి కొచ్చినట్టే ఎఫ్‌టీఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని భిన్న వర్గాలు కోరుతున్నాయి. లేనట్ట యితే మేకిన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందంటున్నాయి. ఇంతక్రితం ఆర్సీఈపీ నుంచి బయటి కొచ్చినా, ఇప్పుడు ఎఫ్‌టీఏ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అదంతా ఆత్మరక్షణ విధా నాల పర్యవసానమేనని ఈయూ అంటుండగా మన దేశం కొట్టిపారేసింది. వాణిజ్య ఒప్పందం ఏదైనా పరస్పర ప్రయోజనాలు ముడిపడి వుండాలి తప్ప, ఒకరికి భారీయెత్తున మేలు చేకూర్చేలా, మరొకరు నష్టపోయేలా వుండరాదన్నదే ఆ అభ్యంతరాల్లోని ఆంతర్యమని మన దేశం చెప్పింది. ఇది పూర్తిగా సహేతుకం. 2013లో భారత్–ఈయూల మధ్య ఎఫ్‌టీఏపై రహస్య చర్చలు జరిగాయి. అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ఎఫ్‌టీఏ నిబంధనలు కొన్నింటిని బయటపెట్టాయి. అవి అమల్లోకి వస్తే ప్రజారోగ్య రంగంపై దారుణమైన ప్రభావం పడుతుందని అప్పట్లో ఆక్స్‌ఫాం వంటి సంస్థలు హెచ్చరించాయి. ఈయూ సభ్యదేశాల్లోని ఫార్మా రంగ సంస్థల ప్రయోజనాలను కాపాడ టానికే ఆ నిబంధనలు పొందుపరిచినట్టు కనబడుతుంది. ఎఫ్‌టీఏపై సంతకాలైతే మన దేశంలో ప్రాణావసరమైన జెనరిక్ మందుల ఉత్పత్తి నిలిచిపోతుంది. వాటి బదులు విదేశాల్లో తయారైన ఖరీదైన మందులే దిక్కవుతాయి. హెచ్ఐవీ వంటి వ్యాధుల నియంత్రణకు వాడే ఔషధాల్లో 80 శాతం మన దేశంలో తయారవుతాయి. అవి వర్ధమాన దేశాల నిరుపేదలకు అందుబాటు ధరల్లో వుంటున్నాయి. కానీ మేధోహక్కుల పేరిట వాటిని అందకుండా చేయడమే ఎఫ్‌టీఏ లక్ష్యం. ఈ అంశాల సంగతలా వుంచి మొన్న ఏప్రిల్‌లో మొబైల్ ఫోన్లు, ఇతర విడిభాగాలు, హెడ్ సెట్లు, కెమెరాలు వగైరాలపై మన దేశం అదనంగా 7.5 శాతం నుంచి 20శాతం వరకూ టారిఫ్‌లు పెంచ డంపై ఇటీవలే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)కు ఈయూ ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలపై అది అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో జరిగిన భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం చెప్పుకోదగ్గ పురో గతి సాధించకపోవడంలో వింతేమీ లేదు. ఏ ఒప్పందమైనా మన అభివృద్ధికి తోడ్పడాలి. మన ప్రయోజనాలు నెరవేర్చాలి. వాటికి గండికొట్టేలా వుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే ఉత్తమం. -
వాళ్లు చంద్రుడి నుంచి కాదు.. అక్కడి నుంచే వస్తారు
బ్రెజిల్: జమ్మూ కశ్మీర్‌పై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని యూరోపియన్ పార్లమెంట్ కొనియాడింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, తామెప్పుడూ వారికి అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన యూరోపియన్ పార్లమెంట్ ప్లీనరీ సమావేశంలో సభ్యులు రిస్జార్డ్ జార్నెక్కి, ఫుల్వియో మార్టుసిఎల్లో ఉగ్రవాదంపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. భారత్‌లోకి ఉద్రవాదులు సరిహద్దు దేశం నుంచే ప్రవేశిస్తున్నారని, చంద్రుడి మీద నుంచి కాదని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు. సమావేశంలో వారు మాట్లాడుతూ..‘ప్రపంచంలో భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. కశ్మీర్లో గతకొంత కాలంగా ఉగ్రవాదులు పాల్పడుతున్న ఆకృత్యాలను తాము చూస్తూనే ఉన్నాం. వారంతా భారత్ సరిహద్దు దేశం (పాక్) నుంచే ప్రవేశిస్తున్నారు. చంద్రుడి నుంచి కాదు. ఉగ్రవాదాన్ని అణచివేసే అంశంలో తామెప్పుడూ భారత్‌కు అండగా నిలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్‌కు అనుకూలంగా ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాకిస్తాన్ అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ అంతర్జాతీయ వేదికలపై అవేవీ చెల్లుబాటుకాలేదు. తాజాగా భారత్‌కు మద్దతుగా యూరోపియన్ యూనియన్ కూడా నిలిచింది. -
మరోసారి గర్జించిన గ్రెటా థన్‌బెర్గ్
వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్ యువకెరటం గ్రెటా థన్‌బెర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు పిలుపునిచ్చారు. అటవీ నిర్మూలన, జంతువుల నాశనం, మహాసముద్రాల ఆమ్లీకరణ లాంటి వాటితో మనషి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పిల్లలు, మనవలు భవిష్యత్తుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ గ్రెటా కన్నీంటి పర్యంత మయ్యారు. మన ఇల్లు కూలిపోతోంది..సమయం లేదు..అమూల్యమైన సమయం వృధా అయిపోతోంది.. ఇకనైనా ప్రతీ వ్యక్తి స్పందించాలంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. బ్రెగ్జిట్‌పై మూడు అత్యవసర సదస్సులు నిర్వహించిన బ్రిటన్ పర్యావరణానికి పొంచి వున్న ముప్పుపై మాత్రం ఎలాంటి స్పందన చూపించ లేదని విమర్శించారు. రాజకీయ నాయకులు పర్యావరణం తప్ప అన్నీ మాట్లాడతారు. వారికి మాతో (పర్యావరణంకోసం ఉద్యమిస్తున్న బాలలు) మాట్లాటడం ఇష్టం ఉండదు..నో ప్రాబ్లమ్..మాకు కూడా వారితో మాట్లాడాలని లేదు. ఓటు హక్కులేని మా మాటలు విశ్వసించకండి..కానీ సైంటిస్టులు, సైన్సు చెపుతున్న మాటల్ని అయినా నమ్మండి. సమయం మించిపోతోంది. ఇకనైనా మేల్కోండి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోండి..లేదంటే అంతా శూన్యమే అంటూ నేతలకు చురకలంటించారు. వాతావరణ మార్పుల పరిణామాలను నిర్లక్ష్యం చేయొద్దంటూ కోరారు. మీ ఇల్లు కాలిపోతోంటే..ఎంత ఆందోళన చెందుతారో అలాంటి ఆందోళన, భయం ఇపుడు పర్యావరణం పట్ల ప్రపంచ నేతలకు ఉండాలని కోరారు. అలాగే కేథడ్రాల్ నోట్రడామ్ చర్చి అగ్ని ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె యుద్ధ ప్రాతిపదికన దాని పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పర్యావరణ రక్షణకు కూడా "కేథడ్రాల్-థింకింగ్" ఇపుడు అవసరమని గ్రెటా పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి గ్రెటా థన్‌బెర్గ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టులో స్వీడిష్ పార్లమెంట్ ఎదుట జరిపిన సోలో నిరసనతో థన్‌బెర్గ్ ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అంతేకాదు ఆమె స్ఫూర్తితోనే ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలలో ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ప్రతీ శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున యువత ఉద్యమిస్తోంది. What a privilege to meet the formidable Greta Thunberg. I gave her first look at the @GUENGL Climate manifesto and then we had a quick chat about who has the best trains. Surprise Surprise it's not Ireland! #ClimateEmergency pic.twitter.com/ftIRWTy7mq — Lynn Boylan MEP (@LNBDublin) April 16, 2019 .@GretaThunberg gives a shout out to the right wing @EPPGroup @ALDEgroup @ecrgroup! "I have read that some parties do not want me standing here because they so desperately do not want to talk about climate breakdown." 👏👏👏👏 pic.twitter.com/9IXY9gLttc — The Left in the European Parliament (@GUENGL) April 16, 2019 -
బ్రిటన్ను వణికిస్తున్న ‘బ్రెగ్జిట్’
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయం శరాఘాతమవుతుం దని, ‘ముందు నుయ్యి... వెనక గొయ్యి’ చందంగా మారుతుందని బ్రిటన్‌కు ఆలస్యంగా అర్ధ మైంది. మూడేళ్లనాడు ఈయూ నుంచి బయటకు రావాల్సిందేనని ఒక రెఫరెండంలో బ్రిటన్ పౌరులు తేల్చి చెప్పిన నాటినుంచి ఆ దేశాన్ని కష్టాలు వెన్నాడుతున్నాయి. మరో అయిదు రోజుల్లో నిష్క్రమించక తప్పని ఈ స్థితిలో కూడా ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో ప్రధాని థెరిస్సా మే పడ్డారు. రెండేళ్లపాటు ఆమె ఈయూ పెద్దలతో బ్రెగ్జిట్‌పై చర్చలు సాగించారు. నిరుడు నవంబర్‌లో ముసాయిదాఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. తీరా దాన్ని ఆమోదించడం కోసం పార్లమెంటులో ప్రవేశపెడితే విపక్ష లేబర్ పార్టీ నుంచి మాత్రమే కాదు...స్వపక్షమైన కన్సర్వేటివ్ పార్టీ నుంచి, ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్ పార్టీ డీయూపీ నుంచి కూడా దానిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పర్యవసానంగా ఆ ముసాయిదా ఒప్పందం పార్లమెంటులో ఒకసారి కాదు... మూడుసార్లు వీగిపోయింది. జనవరి 15న తొలిసారి ఒప్పందాన్ని పార్లమెంటు కాదన్నాక, థెరిస్సా మే మరోసారి ఈయూ పెద్దల్ని కలిశారు. ఒప్పం దంలో మరికొన్ని మార్పులకు వారిని అంగీకరింపజేశారు. అయినప్పటికీ మార్చిలో రెండు సార్లు(12, 29 తేదీల్లో) కూడా ముసాయిదా ఒప్పందానికి పార్లమెంటులో చుక్కెదురైంది. ఈయూ భాగస్వామ్యాన్ని వదులుకుంటున్నందువల్ల అందుకు పరిహారంగా బ్రిటన్ 3,900 కోట్ల పౌండ్లు చెల్లించాలని ముసాయిదా నిర్దేశిస్తోంది. దీంతోపాటు బ్రిటన్‌లో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లాండ్‌లో ప్రస్తుతానికి ఈయూ నిబంధనలే వర్తించాలని అది కోరుతోంది. ప్రధానంగా ఈ రెండు అంశాలనూ అటు లేబర్ పార్టీ, ఇటు కన్సర్వేటివ్ పార్టీలోని అత్యధికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. 2016 జనవరిలో బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరిగినప్పుడు బ్రిటన్‌లోని ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ ఈయూ నుంచి వైదొలగాలని ఓటేస్తే... ఉత్తర ఐర్లాండ్ పౌరులు మాత్రం ఈయూకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఈ కారణంవల్లే ఆ ప్రాంతంలో సరుకు రవాణాకు చెక్‌పోస్టులు పెట్టరాదని ఈయూ స్పష్టం చేస్తోంది. ఇది బ్రిటన్‌లో అత్యధికులకు రుచించడం లేదు. ఈ ఏర్పాటు తాత్కాలికమేనని చెబుతున్నా... బ్రిటన్‌లో భాగమైన ప్రాంతాన్ని స్వల్పకాలానికైతే మాత్రం ఈయూ పరిధికి తీసు కెళ్లడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏమైతేనేం, ఇప్పుడు ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అటు పార్లమెంటును ఒప్పించి ముసాయిదా ఒప్పందాన్ని ఆమోదించమని కోర డమా... ఇటు ఈయూకు నచ్చజెప్పి ఈ నెల 12న ముగుస్తున్న గడువును మరికొంతకాలం పొడిగిం చమని ప్రాథేయపడటమా అన్నది థెరిస్సా మే ముందున్న ప్రశ్నలు. జూన్ 30 వరకూ గడువు పొడిగించమని యూరప్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు ఆమె లేఖ రాశారు. ఈ గడువును వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగించడానికి ఈయూ కూడా సిద్ధంగానే ఉంది. కానీ అందుకోసం బ్రిటన్ వచ్చే నెలలో జరగబోయే ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో పాల్గొనవలసి వస్తుంది. ఎటూ విడిపోదల్చుకున్నప్పుడు ఈ ఎన్నికలు వృథా అని కన్సర్వేటివ్లలో అత్యధికులు వాదిస్తున్నారు. అందుకే ఆమె జూన్ 30 గడువు సరిపోతుందని కోరారు. కానీ ఈసారి ఈయూ అందుకు సిద్ధపడేలా లేదు. సమస్య మీ దగ్గరుంటే పరిష్కారం కోసం మాపై ఒత్తిడి తెస్తారేమిటన్న ఈయూ సారథుల ప్రశ్న సహేతుకమైనది. వచ్చే బుధవారం జరగబోయే ఈయూ సమావేశంలో థెరిస్సా వినతికి సానుకూలత వ్యక్తం కాకపోవచ్చు. బ్రెగ్జిట్ ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని థెరిస్సా అనుకుని ఉండరు. విపక్ష లేబర్ పార్టీ నాయకుడు కోర్బిన్‌తో ఆమె బుధవారం సమావేశం కాబోతున్నారు. అది సానుకూల ఫలితం ఇస్తుందన్న గ్యారెంటీ లేదు. లేబర్ పార్టీలో కోర్బిన్ వ్యతిరేకులు అదును కోసం కాచుక్కూర్చుని ఉన్నారు. పార్లమెంటులో ముసాయిదా ఒప్పందాన్ని గట్టెక్కిస్తానని థెరిస్సాకు ఆయన మాటిచ్చిన మరుక్షణం ఆ పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం ఉంది. ఆ అవగాహనపై రిఫరెండమైనా నిర్వహిం చాలి లేక ప్రస్తుత పార్లమెంటును రద్దుచేసి ఎన్నికలకు సిద్ధపడాలన్నది వారి డిమాండు. సంక్షోభం తలెత్తినప్పుడు దాని మూలాలు ఎక్కడున్నాయో, అందుకు గల కారణాలేమిటో చిత్తశుద్ధితో తెలుసు కుంటే పరిష్కారం సులభమవుతుంది. కానీ ఆ పని ఎవరూ చేయలేకపోయారు. రోగం ఒకటైతే మందు మరొకటి ఇచ్చినట్టు ఈయూ నుంచి వెలుపలకి రావడమే పరిష్కారమని మితవాదులు ప్రచారం చేయడం, అందుకు ప్రధాన పార్టీలు రెండూ అనాలోచితంగా మద్దతు పలకడంతో సమస్య జటిలంగా మారింది. బ్రిటన్ పదే పదే బ్రెగ్జిట్ గడువు పొడిగించమని కోరడం, అందుకు ఈయూ సిద్ధపడటం సభ్య దేశాలకు రుచించడం లేదు. ముఖ్యంగా ఫ్రాన్స్ ఈ విషయంలో పట్టుదలగా ఉంది. బ్రెగ్జిట్‌ను పొడిగించుకుంటూపోతే అటు బ్రిటన్, ఇటు ఈయూ అనిశ్చితిలో పడ తాయని అది హెచ్చరిస్తోంది. ఇందులో నిజం లేకపోలేదు. ఈయూ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే అనుసరించవలసిన విధివిధానాలేమిటో నిర్దేశిస్తున్న 50వ అధికరణ పర్యవసానాలేమిటో వాస్త వంగా ఎవరికీ తెలియదు. ఇంతవరకూ ఎవరూ సంస్థను విడిచిపెట్టకపోవడమే ఇందుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు బలపడుతున్న దశలో బ్రిటన్‌లో యూకే ఇండిపెండెంట్స్ పార్టీ(యూకే ఐపీ) ఈయూ నుంచి బయటకు రావాలన్న నినాదం అందుకుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదే పరిష్కారమని అది మొదలెట్టిన ఉద్యమం ఊపం దుకోవడం చూసి తాము సైతం దానికి వ్యతిరేకం కాదని అప్పటి లేబర్ పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. అది దేశాన్ని ఈ దుస్థితికి నెడుతుందని అప్పట్లో వారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఏదేమైనా బ్రిటన్ సంక్షోభం నాలుగురోజుల్లో ఒక కొలిక్కి వస్తుందా లేక ఎప్పటిలా మరో వాయిదాలోకి జారుకుంటుందా అన్నది చూడాలి. -
బ్రెగ్జిట్ బిల్లుకు రెడ్ సిగ్నల్
లండన్: బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరెసా మేకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆధునిక బ్రిటన్ చరిత్రలో ఇటువంటి అపజయం ఏ ప్రధానికీ ఎదురుకాలేదు. రెండేళ్లు చర్చలు జరిపి యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఆమె కుదుర్చుకున్న బ్రెగ్జిట్ (ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం) ఒప్పందం బిల్లును బ్రిటన్ పార్లమెంటు భారీ ఆధిక్యంతో తిరస్కరించింది. థెరిసా మే కుదుర్చుకొచ్చిన ఒప్పందంపై సొంతపార్టీ ఎంపీల్లో కూడా తొలి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండటం తెలిసిందే. ఈ కారణంగా ఇటీవలే ఆమె సొంతపార్టీలోనే అవిశ్వాస తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ఒప్పందంపై మంగళవారం బ్రిటన్ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా 202 మంది ఈ ఒప్పందాన్ని సమర్థించగా, 432 మంది వ్యతిరేకించారు. అంటే బ్రెగ్జిట్ ఒప్పందం బిల్లు 230 ఓట్ల తేడాతో ఓడిపోయింది. వంద మందికి పైగా సొంత పార్టీ ఎంపీలే థెరెసా కుదిర్చిన ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటేశారు. పార్టీ ్టలోని అవిశ్వాస పరీక్షనే అతి కష్టం మీద గట్టెక్కిన థెరెసా మేకి తాజాగా పార్లమెంటులో మరో కఠిన పరీక్ష ఎదురైంది. ఓటింగ్‌లో బ్రెగ్జిట్ ఒప్పందం ఓడిన వెంటనే ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ ఆమెపై హాజ్ ఆఫ్ కామన్స్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటలకు దీనిపై ఓటింగ్ జరగనుంది. బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఆమె సొంత పార్టీ ఎంపీలు కూడా తిరస్కరించినప్పటికీ ప్రతిపక్ష లేబర్ పార్టీ దృక్పథాన్ని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అవిశ్వాసంలో మే గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బ్రిటన్ మీడియా అంచనా వేస్తోంది. తర్వాత ఏం జరుగుతుంది? బ్రిటన్ పార్లమెంటు నిబంధనల ప్రకారం ఏదైనా బిల్లు తిరస్కరణకు గురైతే మళ్లీ మూడు పార్లమెంటు పనిదినాల్లోగా ప్రత్యామ్నాయ బిల్లును సభలో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంటుంది. ఆ బిల్లుకు కూడా ఆమోదం లభించని పక్షంలో మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసేందుకు ప్రధానికి మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లు పార్లమెంటులో తిరస్కరణకు గురవడంతో దీనిపై తదుపరి చర్చలు జరిపి తగు మార్పులు చేసేందుకు మే బుధవారం బ్రస్సెల్స్ వెళ్తారని ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఒప్పందంలో మళ్లీ మార్పులు చేసేందుకు ఈయూ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురవడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో వారిని ఒప్పించి, కొన్ని రాయితీలు పొంది, మళ్లీ కొత్త బ్రెగ్జిట్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మేకి సవాలే. ఒకవేళ ఆమె గట్టిగా ప్రయత్నించి కొత్త ఒప్పందం చేసుకొచ్చినా దానిపై మళ్లీ పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుంది. దీనిని కూడా పార్లమెంటు తిరస్కరిస్తే మేకి మరో మూడు వారాల సమయం లభిస్తుంది. బ్రెగ్జిట్ బిల్లును పార్లమెంటు ఎప్పటికీ ఆమోదించకపోతే ఇక ఏ ఒప్పందమూ లేకుండానే ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాల్సి ఉంటుంది. ఇంకో రెండు నెలలే మిగిలింది.. బ్రెగ్జిట్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కానుంది. 21 నెలల పాటు ఇది సాగుతుంది. ఆ కాలంలో ఈయూ–బ్రిటన్ల మధ్య వాణిజ్య, పౌర సంబంధాలు ఎలా ఉండాలో తెలిపేదే ఈ బ్రెగ్జిట్ ఒప్పందం. ఈ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు థెరెసా మే రెండేళ్లపాటు ఈయూ నేతలతో చర్చలు జరిపారు. మార్చి 29తో బ్రెగ్జిట్ ప్రారంభం కావాల్సి ఉండటంతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుని దాన్ని ఆమోదింపజేసుకునేందుకు బ్రిటన్‌కు దాదాపు ఇంకో రెండు నెలల సమయమే మిగిలి ఉంది. కానీ తర్వాత ఏం చేయాలో ఇప్పటికీ బ్రిటన్ నిర్ణయించుకోలేదు. తాను అవిశ్వాసంలో గెలిస్తే ప్రత్యామ్నాయ ప్రణాళికను వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెడతానని మే వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆమె మాట్లాడుతూ ‘సభ మాట్లాడింది. ప్రభుత్వం ఆలకించింది. ఏం చేయాలో నిర్ణయించేందుకు అన్ని పార్టీలతోనూ చర్చలు జరుపుతాం. ఎంపీలు తమకు ఏం వద్దో చెప్పారు. కానీ వారికి ఏం కావాలో ఎవరూ చెప్పలేదు. ఈ ఓటింగ్‌తో అది మనకు తెలియదు’అని అన్నారు. ‘అన్ని పార్టీల ఎంపీలను నేను కోరేది ఒక్కటే. బ్రిటిష్ ప్రజల మాట వినండి. ఈ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు. అందుకోసం మా ప్రభుత్వానికి సహకరించండి’అని ఆమె అభ్యర్థించారు. ఇంకా సమయం ఉంది: మెర్కెల్ బెర్లిన్: బ్రెగ్జిట్‌పై చర్చలు జరిపేందుకు ఇంకా సమయం ఉందని జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్ అన్నారు. ‘మనకు ఇంకా సమయం ఉంది అయితే బ్రిటిష్ ప్రధాని ఏ ప్రతిపాదన తెస్తారోనని మేం ఎదురుచూస్తున్నాం. ఒప్పందాన్ని బ్రిటిష్ దిగువసభ తిరస్కరించడం పట్ల నేను మిక్కిలి చింతిస్తున్నాను. నష్టాన్ని మేం పరిమితంగా ఉంచాలనుకుంటున్నాం. అందుకే ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లాలనుకున్నాం. కానీ పద్ధతి లేకుండా అస్తవ్యస్తంగా చేసేందుకు మేం సిద్ధమే. ఇలా అయితే బాగా ఎక్కువ నష్టం జరుగుతుంది’అని ఆమె ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ఓటు కోసం కాన్పు వాయిదా గర్భంతో ఉన్న ఓ మహిళా ఎంపీ బ్రెగ్జిట్ బిల్లుపై ఓటు వేసేందుకు తన కాన్పును వాయిదా వేసుకున్నారు. ఆమె బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రహ్మాన్‌కు మనవరాలు, ఈమె ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకు దగ్గరి బంధువు. ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఎన్నికైన టులిప్ సిద్దిఖీ అనే మహిళా ఎంపీ ప్రస్తుతం రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఫిబ్రవరి 4న సిద్దిఖీకి కాన్పు చేయాలని వైద్యులు అనుకున్నారు. అయితే మధుమేహం రావడంతో గత మంగళవారమే కాన్పు చేయాల ని నిర్ణయించారు. ఓటు వేసేందుకు వెళ్లాలని ఆమె చెప్ప డంతో అందుకు వైద్యులు అనుమతించి, కాన్పును గురువారానికి మార్చారు. ఓడిపోతే మళ్లీ ఎన్నికలేనా? బ్రిటన్ ప్రధాని థెరెసాపై ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మొదలు కానుంది. బ్రిటన్ పార్లమెంటులో అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుండటం గత 26 ఏళ్లలో ఇదే ప్రథమం. బ్రెగ్జిట్ బిల్లు విషయంలో ఓడిపోయినా ఈ పరీక్షలో మే నెగ్గుతారనే అంచనాలున్నాయి. ఒకవేళ ఆమె ఓడిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. స్థిర పదవీకాల పార్లమెంటు చట్టం–2011 ప్రకారం అవిశ్వాసంలో ఓడిపోతే అధికార పార్టీకి రెండు వారాల సమయం లభిస్తుంది. అప్పట్లోపు ప్రభుత్వం మళ్లీ మెజారిటీ సంపాదించుకుని, విశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ప్రధాన విపక్షమైన లేబర్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తుంది. తగిన బలం సంపాదిస్తే అధికారం వస్తుంది. లేదంటే దిగువ సభ రద్దయ్యి మళ్లీ ఎన్నికలు వస్తాయి. బ్రిటన్‌లో చివరిసారిగా ఇలా 1979లో అవిశ్వాసంలో ప్రభుత్వం ఓడిపోయి ఎన్నికలు వచ్చాయి. వ్యతిరేకత ఎందుకు? ఒప్పందంలోని కొన్ని అంశాలు ఈయూకి అనుకూలంగాను, వివాదాస్పదంగాను ఉన్నాయని ఈ డీల్‌ను విమర్శిస్తున్నవారు చెబుతున్నారు. యూరోపియన్ యూనియన్ నియమాలకు కట్టుబడేలా చేయడం ద్వారా ఈ ఒప్పందం దేశాన్ని ఈయూపై ఆధారపడే స్థితికి నెడుతుందని వారు వాదిస్తున్నారు. కాబట్టి ఒప్పందంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈయూ నుంచి కొన్ని రాయితీలు పొందేందుకు థెరిసా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒప్పందంలో మార్పులు అంగీకరించబోమని ఈయూ నేతలు ప్రకటించారు. మరోవైపు, బ్రిటన్‌లోని ఈయూ అనుకూల రాజకీయవేత్తలు ఐరోపాతో మరింత దగ్గర ఆర్థిక సంబంధాలుండాలని కోరుతున్నారు. ఈయూలో వుండటం వల్ల సామాజిక భద్రతా హక్కులకు ముప్పు వుండబోదనే అభిప్రాయం వినవస్తోంది. బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరాదని ఈ ఒప్పందంలో పేర్కొనడం కూడా వివాదాస్పదమైంది. థెరిసాపై విమర్శల వెల్లువ ఒప్పందంపై అటు థెరిసా కేబినెట్లోనూ, ఇటు దేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలను ఒక్క తాటిపైకి తీసుకురావడానికి బదులు వారి మధ్య చీలికల్ని ఆమె ఇంకాస్త పెద్దవి చేశారని బ్రిటన్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె తన పక్షంతోనే చర్చించడం, భిన్నాభిప్రాయాలు గలవారితో చర్చలు జరపకపోవడం వల్ల పరిస్థితి మరింత గడ్డుగా మారిందంటున్నారు. ఈయూకు వ్యతిరేకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇరు శిబిరాల మధ్య దూరాన్ని పెంచాయని, ఈయూలో ఏ ఒక్కరితోనూ ఆమె స్నేహాన్ని పెంపొందించుకోలేకపోయారని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయవేత్తగా ఆమె ఇరుకు ఆలోచనా ధోరణి, కఠిన వైఖరి దేశానికి చెరుపు చేస్తోందంటున్నారు. ఆర్థిక మాంద్యం తప్పదు ఒప్పందం లేకుండా ఈయూ నుంచి విడిపోయినట్టయితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి ఓ శతాబ్ది కాలం వెనక్కి వెళుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రిటన్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండా ఈయూ నుంచి బయటకు వస్తే – ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాలకు అనుగుణంగా వాణిజ్యం చేయాల్సివుంటుంది. ఒప్పందం కుదరకపోతే బ్రిటన్‌కు మంచిదేనని, ఆ విధంగా ఈయూ నియమాల నుంచి విముక్తి లభించినట్టవుతుందని, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలవుతుందని మరికొందరి వాదన. ఒప్పందం లేకుంటే నష్టమే.. ఒప్పందం లేకుండా, ఎలాంటి పరివర్తనా వ్యవధి లేకుండా (మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమించాల్సివుంది. తర్వాత 21 మాసాల పరివర్తనా కాలం మొదలవుతుంది) బ్రిటన్ నిష్క్రమించడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై, ప్రత్యేకించి ఐర్లాండ్ (ఈయూ)లోని పలు రంగాలపై తీవ్ర ఒత్తిడి పడే ప్రమాదముంది. తమ దేశంలో ఆహారానికి, మందులకు తీవ్ర కొరత ఏర్పడుతుందని ఐర్లాండ్ ఆందోళన చెందుతోంది. ఈయూకి బ్రిటన్ చేసే ఎగుమతుల్లో ఐర్లాండ్ వాటా 12.4 శాతం. పెట్రోలియం, మందుల కోసం ఐర్లాండ్ భారీ ఎత్తున యూకేపై ఆధారపడుతోంది. ఒప్పందంలోని ముఖ్యాంశాలు 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ – యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ఈ కాలంలో ఈయూ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు యూకే కట్టుబడి వుండాలి. యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఈసీజే) పరిధిలోనే కొనసాగాలి. అవసరమనుకుంటే, జాయింట్ కమిటీ 2020 జూలె ఒకటిలోగా పరివర్తనా కాలాన్ని పొడిగించవచ్చు. ఎంతకాలం పొడిగిస్తారనే విషయమై స్పష్టత లేదు. ఆర్థిక లావాదేవీలు పరిష్కరించుకోవడంలో భాగంగా.. విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5,100 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాల్సివుంటుంది. పలువురు రాజకీయ వేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో బాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
బ్రిటన్‌కు అగ్ని పరీక్ష!
యూరప్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ నిష్క్రమించాల్సిన గడువు ముంచుకొస్తుండగా ఆ దేశ ప్రధాని థెరిస్సా మే ఈయూతో కుదుర్చుకొచ్చిన ముసాయిదా ఒప్పందం వీగిపోయింది. బ్రిటన్ దిగువ సభ కామన్స్‌లో మంగళవారం దానికి చుక్కెదురైంది. ఆ ప్రతిపాదనకు అనుకూ లంగా కేవలం 202 ఓట్లు మాత్రమే లభించగా, 432మంది వ్యతిరేకించారు. దేశ ప్రధాని ప్రతిపాద నకు ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీనికి కొనసాగిం పుగా ఆమె ప్రభుత్వంపై విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది. అందులో సైతం థెరిస్సా ఓడితే ఆమె ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకొనేందుకు గడువు తేదీ మార్చి 29. అంటే... ఇక కేవలం 72 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆలోగా ఈయూతో అది ఒప్పందానికి రాలేకపోతే బ్రిటన్ తెగదెంపులు పూర్తయినట్టే భావిస్తారు. సంస్థనుంచి బయటికొచ్చాక అనుసరించాల్సిన విధి విధానాలపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఈ ప్రక్రియ ముగిసిపోతే బ్రిటన్ను అది తీవ్ర సంక్షోభంలో పడేస్తుంది. దాని పర్యవసానంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ పరిణామాలు పెను విపత్తుకు దారి తీస్తాయి. ఆహారం, మందులు వగైరాల కొరతతో మొదలుపెట్టి విమాన రాకపోకలు స్తంభించిపోవ డంతోసహా ఎన్నో సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత దేశంలో బద్దలయ్యే అశాంతిని అదుపు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారమవుతుంది. అయితే ఇదంతా సజావుగా పూర్త వుతుందని, సమస్యలేమీ ఎదురుకావన్న భావనతోనే మార్కెట్లున్నాయి. అందుకే బ్రిటన్‌లోని తాజా పరిణామాల ప్రభావం వాటిపై పెద్దగా పడలేదు. థెరిస్సా మే గత కొన్ని నెలలుగా ఈయూ బాధ్యులతో బ్రెగ్జిట్‌పై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. వాటి పర్యవసానంగా గత నవంబర్‌లో ముసాయిదా ఒప్పందం ఖరారైంది. దీనికి కన్సర్వేటివ్ పార్టీలోనేకాక, తమకు మద్దతునిస్తున్న ఉత్తర ఐర్లాండ్ పార్టీ డీయూపీనుంచి సైతం అసమ్మతి స్వరాలు వినిపించాయి. రోజులు గడుస్తున్నకొద్దీ అవి పెరిగాయి. అటు విపక్ష లేబర్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ(ఎస్ఎన్పీ)లు సరేసరి. ఆ ముసాయిదా ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి. ఈ స్థితిలో డిసెంబర్లో జరగాల్సిన ఓటింగ్‌ను ఆమె వాయిదా వేశారు. ఆ తర్వాత మరిన్ని రాయితీలివ్వాలని ఈయూను ప్రాధేయపడ్డారు. కానీ ఆ సంస్థను నడిపిస్తున్న జర్మనీ ఏంజెలా మెర్కల్ అందుకు సిద్ధంగా లేరు. అందుకే యూరొపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జుంకర్, యూరొపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌లు అందుకు తిరస్కరించారు. ఇదే బ్రిటన్ పౌరులను కలవరపరిచింది. 2016 జూన్‌లో బ్రెగ్జిట్‌పై రిఫరెండం జరిగినప్పుడు అత్యధి కులు స్వాగతించిన విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రస్తుత వ్యతిరేకత తీవ్రతేమిటో అర్థమవుతుంది. అప్పట్లో 51.9 శాతంమంది రిఫరెండానికి అనుకూలత వ్యక్తం చేశారు. 48.1 శాతంమంది ఈయూ లోనే కొనసాగాలని కోరారు. రెండున్నరేళ్లు గడిచేసరికల్లా బ్రెగ్జిట్ అనుకూలురు, దాని వ్యతిరేకులు కూడా ఒకే దోవకొచ్చారు. ఫలితంగా ముసాయిదాకు కేవలం 20 శాతంమంది మాత్రమే అనుకూల మని సర్వేలు తేల్చిచెప్పాయి. ఒప్పందం మరీ కఠినంగా ఉండరాదని అనేకులు ఆశించారు. కానీ దానికి భిన్నంగా జరగడమేకాక ముసాయిదా బ్రిటన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశాన్ని ఇది శాశ్వతంగా అప్రజాస్వామిక ఈయూకు బానిసను చేస్తుందన్నది వారి విశ్లేషణ. ఈ ముసాయిదా ఒప్పందం ఖరారైతే ఈయూ ఆమోదం లేకుండా అమెరికాతో సహా ఏ దేశంతోనూ భవిష్యత్తులో బ్రిటన్ వాణిజ్య ఒప్పందాలకు రావడం సాధ్యపడ దని వారంటున్నారు. తమనుంచి దూరమైతే ఎలాంటి దుర్గతి పడుతుందో సంస్థలోని ఇతర సభ్య దేశాలకు చూపడమే ఈయూ అధినేతల ఆంతర్యంగా కనబడుతున్నదన్న విమర్శలున్నాయి. అందుకే థెరిస్సా మే తీరును నిరసిస్తూ ఈమధ్యకాలంలో పలువురు మంత్రులు, డిప్యూటీలు ఆమె ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బ్రెగ్జిట్ చర్చల్లో మొదటినుంచీ కీలకపాత్ర పోషిస్తున్న డొమినిక్ రాబ్ కూడా వారిలో ఉన్నారు. ఒక దేశం సంస్థలో సభ్యత్వం తీసుకున్ననాటికి ఎలా ఉందో, విడిపోయాక కూడా అలా కొనసాగుతామంటే ఈయూ పెద్దలకు అభ్యంతరం ఎందుకుండాలి? సంస్థ ఆలంబనతో అన్నివి ధాలా ఎదిగాక మధ్యలో విడిచిపోతానంటే ఈయూ సంకటస్థితిలో పడుతుందన్నది జర్మన్ కార్పొ రేట్ల వాదన. అయితే యూరప్‌పై తమ ఆర్థిక పెత్తనాన్ని కొనసాగించడానికే జర్మన్లు ఇలాంటి అర్ధర హిత వాదనలు చేస్తున్నారని బ్రిటన్ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే అటు బ్రిటన్‌కు మాత్రమే కాదు...ఇటు ఈయూ దేశాలకూ బోలెడు సమస్యలు ఎదురవుతాయి. ఈయూ సభ్యదేశాల పౌరులు ఇన్నాళ్లూ యూరప్లోఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఉపాధి వెదుక్కోవచ్చు. కానీ ఏ ఒప్పందమూ లేకుండా బ్రిటన్ విడిపోయే పరిస్థితి ఏర్పడితే వేరే దేశాల్లో ఉండే బ్రిటన్ పౌరులు అక్కడ నివసించేందుకు పర్మిట్లకు దరఖాస్తు చేయాలి. ఫిన్లాండ్లో ఉన్న 5,000మంది బ్రిటన్ పౌరులకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అలాగే బ్రిటన్‌లో ఉండే వేరే దేశాల పౌరులు సైతం ఆ పనే చేయాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి బ్రిటన్‌కు వైన్ ఎగుమతులు... బ్రిటన్నుంచి ఫ్రాన్స్‌కు మద్యం ఎగుమతులు నిలిచిపోతాయి. ఆ రెండు దేశాలూ ఆర్థిక సంక్షో భంలో పడతాయి. ఏదేమైనా బ్రిటన్ పరిస్థితి ‘ముందు నుయ్యి–వెనక గొయ్యి’ అన్నట్టుంది. పాత ముసాయిదాలో మార్పులు కావాలని బ్రిటన్ సంప్రదిస్తే కొత్త ఒప్పందానికి ఆమోదం పొందుతా మన్న ముందస్తు హామీ ఇచ్చే షరతు విధిస్తామని ఈయూ బాధ్యులు అంటున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యానికి’ అధిపతిగా ఉన్న బ్రిటన్‌కు ఈ బ్రెగ్జిట్ వ్యవహారం అగ్నిపరీక్షగా మారింది. దీన్నుంచి అది గౌరవంగా ఎలా బయటపడగలదో మున్ముందు చూడాలి. -
మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య
రూస్ : ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో యూరోప్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బల్గేరియన్ మహిళా జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా దారుణంగా హత్యకు గురయ్యారు. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను దుండగులు అతికిరాతంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన రూస్ పట్టణంలో చోటుచేసుకుంది. మారినోవా బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్లో పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం యూరోపియన్ యూనియన్ నుంచి బల్గేరియాకు విడుదలైన నిధుల్లో అవినీతిని వెలికితీసి ఒక్కసారిగా ఐరోపాను ఉలిక్కిపడేటట్టు చేశారు మారినోవా. ప్రస్తుతం మారినోవా ‘డిటెక్టర్’ అనే పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో దుండగలు మారినోవాను అమానవీయరీతిలో దారుణంగా హత్య చేశారు. తమ పైశాచికత్వంతో ఆమెకు నరకం చూపిన కిరాతకులు, పాశవికంగా అత్యాచారం చేసి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ సైకియాట్రిక్ సెంటర్‌కు సమీపంలో పడేశారు. అయితే మారినోవా మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కానీ మారినోవా మృతదేహం సైకియాట్రిక్ సెంటర్ వద్ద పడి ఉండటంతో అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడోసారి. మారినోవా హత్య విషయం తెలిసిన బల్గేరియా ప్రజలు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హంతకులను పట్టుకోవాలని ఐరోపా సమాఖ్యతో పాటు జర్మనీ కూడా బల్గేరియాను కోరాయి. -
ఏపీఎస్ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ గెలుపు
-
ట్రేడ్ వార్: అమెరికాకు మరో గట్టి షాక్
లండన్: ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్ అందోళన రేపుతున్న అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం అమెరికా టాక్స్ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే భారతదేశం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన యూరోపియన్ యూనియన్ ఇపుడు అన్నంత పనీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 3.2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్ సన్ బైక్స్, కాన్‌బెర్రీ, పీనట్ బటర్‌లాంటి అమెరికా ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్ మెషీన్లు తదితర ఎంపిక చేసిన కొన్ని అంశాలపై 50శాతంకాదా టాక్స్‌ను పెంచింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ గురువారం రాత్రి ఐరిష్ పార్లమెంటులో మాట్లాడుతూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా, చరిత్రకువిరుద్ధగా పోతోందని వాఖ్యానించారు. అమెరికా యుఎస్ సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందున్నారు. అటు భారత్ అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
బ్రెగ్జిట్.. 2020 డిసెంబర్ 31
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై బుధవారం మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. -
‘బ్రెగ్జిట్ తర్వాత’పై బ్రిటన్, ఈయూ ఒప్పందం
బ్రస్సెల్స్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక ఈయూ, బ్రిటన్ మధ్య సంబంధాలపై చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. బ్రిటన్ ప్రధాని థెరెసా బ్రస్సెల్స్‌లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడ్ జంకర్‌తో చర్చలు జరిపారు. బ్రిటన్ అధీనంలో ఉన్న ఉత్తర ఐర్లాండ్, ఈయూలో భాగమైన ఐర్లాండ్ల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన బిల్లు, పౌరుల హక్కులు తదితరాలపై ఒప్పందానికి వచ్చారు. కాగా, భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈయూ అధ్యక్షుడు డొనాల్డ్ అన్నారు. బ్రిటన్, ఈయూ వాణిజ్యానికి సంబంధించిన చర్చలను ప్రారంభించాల్సిందిగా సభ్య దేశాలను కోరనున్నారు. -
బ్రెగ్జిట్: మరో కీలక అడుగు
బ్రసల్స్: యురోపియన్ యూనియన్‌తో బ్రేకప్ చెప్పే ప్రక్రియలో బ్రిటన్ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా జరిగిన బ్రెగ్జిట్ చర్చలు ఫలప్రదమైనట్లు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్ తెలిపారు. ఈ మేరకు చర్చల తొలి దశలో భాగంగా 15పేజీల ఒప్పందంపై జీన్ క్లాడ్, థెరెసా మే సంతకాలు చేశారు. యురోపియన్ యూనియన్ ఒప్పందాలకు బ్రిటన్ అంగీకరించడంతో బ్రెగ్జిట్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా బ్రిటన్ కన్జర్వేటివ్‌లు, యురోపియన్ కమిషన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అధికారికంగా ఆ తెగతెంపుల కోసం ప్రస్తుతం ఈయూతో బ్రిటన్ చర్చలు నిర్వహించింది. దాని కోసం ఈయూ కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులకు బ్రిటన్ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే... బ్రసల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐర్లాండ్‌తో ఉన్న బోర్డర్ సమస్యపై కీలకమైన ఒప్పందం కుదరడం వల్ల బ్రెగ్జిట్ చీలిక మరో దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్‌తో బోర్డర్ సమస్య ఇక ఉండదని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈయూ పౌరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.. తద్వారా 2019లో బ్రెక్సిట్‌కు వీలుగా వచ్చే ఏడాది ప్రారంభంలో మరోసారి చర్చలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందు(బ్రెక్సిట్)కు వీలుగా జరుగుతున్న వెల్లడికావడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. -
ఆ దేశాలకు వీసాలు రెట్టింపు..
లండన్: బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టెక్నాలజీ, కళలు, సృజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్ టాలెంట్) ఉండే విదేశీయులకు టైర్–1 రూట్ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది. ‘మనం ఈయూ నుంచి విడిపోతున్న సందర్భంగా బ్రిటన్ వ్యాపారాలకు అనుకూలంగా ఉందని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్‌లో వేగంగా దూసుకెళ్తున్న టెక్నాలజీ రంగం అభివృద్ధికి, సాంకేతికత ఫలాలు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలందరికీ అందడానికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తుంది’ అని ప్రధాని థెరెసా మే తెలిపారు. -
గూగుల్‌కు రికార్డ్ స్థాయిలో భారీ జరిమానా
బ్రస్సెల్స్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో పెనాల్టీ విధించింది. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహిణ అనంతరం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ ఆ సంస్థకి ఏకంగా 2.4 బిలియన్ యూరోల (2.72 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్ తమ సెర్చింజన్లో చూపించిన ఆన్లైన్ షాపింగ్ సర్వీస్ సంస్థల పేర్లు ఇతర సంస్థలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని తేల్చింది. గూగుల్ సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లనే ప్రమోట్ చేసి.. ప్రత్యర్థి కంపెనీల డీమోట్ చేసిందన్న ఆరోపణలు గూగుల్‌పై ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ యాంటీట్రస్ట్ విభాగం.. గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17,590 కోట్లు) జరిమానా విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లకు ఫేవర్ చేయడాన్ని నిలిపేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వచ్చే టర్నోవర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామని కూడా హెచ్చరించింది. ఏడేళ్లుగా దీనిపై విచారణ చేస్తున్న కమిషన్ ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చేసింది చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. గూగుల్ చట్ట విరుద్ధమైన చర్య వల్ల యురోపియన్ యూనియన్ కన్జూమర్లు సరైన ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కోల్పోయారని కమిషన్ స్పష్టంచేసింది. అలాగే తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్లుగా గూగుల్‌పై పదుల సంఖ్యలో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈయూలో యాంటీట్రస్ట్ కేసులో అతిపెద్ద జరిమానాను ఎదుర్కొన్న కంపెనీగా గూగుల్ నిలిచింది. 2009లో అమెరికా చిప్ మేకర్ ఇంటెల్ కు 1.06 బిలియన్ యూరోల జరిమానా విధించింది. -
ప్రభుత్వ వైఖరిపై ఆర్టీసీ కార్మికుల ఆందోళన
అమరావతి: ఆర్టీసీ యాజమాన్యం ఆవలంభిస్తున్న నిర్లక్ష్యనికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టనున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 14 న రాష్ర్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మిక సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను, సిబ్బందిని కుదిస్తున్నందుకు నిరసనగా మొత్తం 13 జిల్లాల్లోని 128 డిపోలు, వర్కుషాపుల వద్ద ఆందోళనలు చేస్తామని ఈయూ పేర్కొంది. యాజమాన్యం సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ ట్రస్టులకు బకాయి డబ్బులను వెంటనే చెల్లించాలని కోరింది. పెండింగ్ రుణాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. -
పారిస్ ఒప్పందంపై చైనా డీల్ ఓకే..!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
-
యూరోపియన్ యూనియన్‌కు బై!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి (బ్రెగ్జిట్) కౌంట్‌డౌన్ సిద్ధమయింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెగ్జిట్ నుంచి వెళ్లిపోయే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఈయూ బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు అందజేశారు. ఈ రెండేళ్లలో 27 సభ్యదేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. ఈయూ దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులూ ఉంటాయని మే భరోసా ఇచ్చారు. 2016లో నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు బ్రెగ్జిట్‌కు ఓటు వేయడం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ప్రధాని పార్లమెంటులోనూ అధికారికంగా ప్రకటన చేశారు. -
మార్కెట్ నుంచి తప్పుకోవడమే
బ్రెగ్జిట్‌పై బ్రిటన్ ప్రధాని ∙ప్రపంచ దేశాలతో కొత్త ఒప్పందాలకు చర్చలు లండన్: బ్రెగ్జిట్ అంటే ఒక్క యూరోపియన్ యూనియన్ (ఈయూ) మార్కెట్ నుంచి తప్పుకోవడం మాత్రమేనని, భారత్ వంటి దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతున్నామని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. ఈయూ మార్కెట్ నుంచి రెండేళ్లలో విడతల వారీగా నిష్క్రమిస్తామని తెలిపారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకోవడం(బ్రెగ్జిట్)పై ఆమె మంగళవారమిక్కడ అధికారులు, విదేశీ ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. బ్రెగ్జిట్‌కు సంబంధించిన తుది ఒప్పందంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈయూతో పూర్తిగా సంబంధాలు తెంపుకునే ఉద్దేశం తనకు లేదన్న ఆమె బ్రెగ్జిట్ కోసం 12 సూత్రాల కార్యాచరణను ప్రకటించారు. ‘ఈయూకు మంచి పొరుగు దేశంగా ఉండాలనుకుంటున్నాం. అయితే బ్రిటన్ను శిక్షించే ఒప్పందం కావాలని కొందరంటున్నారు. అదే జరిగితే ఈయూ దేశాలకు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. మేం చైనా, బ్రెజిల్ వంటి ప్రపంచ దేశాలన్నిటితో వ్యాపారం చేయాలనుకుంటున్నాం. భారత్, న్యూజి లాండ్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించాం’ అని చెప్పారు. వలసలపై నియంత్రణ,బ్రిటన్‌లోని ఈయూ పౌరులకు, ఈయూలోని బ్రిటన్ పౌరులకు హక్కులు, ఈయూతో పన్ను రహిత ఒప్పం దంలాంటివి మే ప్రతిపాదనల్లో ఉన్నాయి. -
ఈయూ సభ్యులకు థెరిస్సా గట్టి వార్నింగ్
బ్రిటిన్ ప్రధాని థెరిస్సా మే, యూరోపియన్ యూనియన్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీచేశారు. బ్రిటన్ నిష్క్రమణ సందర్భంగా తమ దేశాన్ని పనికిమాలిన ఒప్పందంలోకి నెట్టాలని చూస్తే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. బ్రిటన్‌కు పనికిమాలిన ఒప్పందం కంటే, ఎలాంటి డీల్ లేకపోవడమే మంచిదని తెలిపారు. డైవర్స్ చర్చల ప్రారంభం కాబోతున్న తరుణంలో మొదటిసారి తమ దగ్గరున్న ప్రణాళికలను థెరిస్సా మే మీడియాకు వివరించారు. బ్రెగ్జిట్ ప్లాన్స్‌లో థెరిస్సా చెప్పిన కీలక విషయాలు: యూరోపియన్ సింగిల్ మార్కెట్ నుంచి యూకే వైదొలగుతుంది. అయితే అగ్రిమెంట్లో ఉన్న వెసులుబాటు ప్రకారం గూడ్స్ అండ్ సర్వీసుల్లో బ్రిటన్, ఈయూ సభ్య దేశాలకు మధ్య ఉచిత వాణిజ్యం చేసుకునే అవకాశముంటుంది. ఇది బ్రిటన్ కంపెనీలకు యూరోపియన్ మార్కెట్లో ఉచిత వాణిజ్యం చేసుకునేందుకు అవసరమైనంత స్వేచ్ఛను ఇస్తుంది. ఈయూ బడ్జెట్లో యూకే పాలుపంచుకోదు. సింగిల్ మార్కెట్లో తాము సభ్యులం కాకపోవడంతో బడ్జెట్లో కూడా తాము ఎలాంటి మొత్తాన్ని వెచ్చిచం. పాక్షిక, అసోసియేట్ సభ్యత్వాన్ని తాము కోరడం లేదని థెరిస్సా చెప్పారు. సగం లోపల, సగం బయటం ఉండటం తమకు ఇష్టం లేదు. యూరోపియన్ యూనియన్ నుంచి పూర్తిగా తాము బయటికి వచ్చేస్తాం. స్వతంత్రంగా, స్వీయపాలనతో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటాం. బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చే ముందు యూకే పార్లమెంట్ ఫైనల్ డీల్‌పై ఓటింగ్ నిర్వహిస్తోంది. అయితే ఒకవేళ పార్లమెంట్ బ్రెగ్జిట్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఓటింగ్ నమోదైతే, పరిస్థితి ఏమిటన్నది థెరిస్సా వివరించలేదు. ఆ సమయంలో బ్రెగ్జిట్ ప్రక్రియకు వ్యతిరేకంగా వెళ్లడం కూడా కష్టం. -
యూకే వీసా పాలసీలో మార్పులు
లండన్: పెరిగిపోతున్న వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం వీసా పాలసీలో మార్పులు చేసింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందని దేశాల పౌరులకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూకే సర్కారు తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన ఐటీ రంగ నిఫుణులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. యునెటైడ్ కింగ్డమ్ హోం ఆఫీస్ ప్రకటించిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్సఫర్(ఐసీటీ) కేటగిరీ కింద నవంబర్ 24 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వార్షిక వేతనం 30,000 పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకూ ఇది 20,800 పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌లోని భారత ఐటీ కంపెనీలు ఈ ఐసీటీ కేటగిరీనే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, సుమారు 90 శాతం మంది భారత ఐటీ నిఫుణులు ఐసీటీ కిందే వీసా పొందారని యూకే మైగ్రేషన్ అడ్వయికమిటీ(ఎంఏసీ) ఇటీవల వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే మూడు రోజుల పర్యటనకు ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో వీసా మార్పుల ప్రకటన రావడం గమనార్హం. టైర్ 2 వీసా జారీకి సంబంధించి ఎంఏసీ సూచనల మేరకు మార్చిలో రెండు దశల మార్పులను యూకే ప్రభుత్వం ప్రారంభించింది. టైర్ 2 ఐసీటీతో పాటు ఇతర విభాగాల్లో కూడా వేతన పరిమితిని పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. టైర్ 2(జనరల్) ఉద్యోగులకు కొన్ని మినహాయింపులతో 25,000 పౌండ్లు వేతనం ఉండాలని నిర్దేశించారు. ఇక ట్రైనీలుగా వచ్చే టైర్ 2(ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 23,000 పౌండ్లుగా నిర్ణరుుంచారు. దీంతోపాటు ఒక్కో కంపెనీ ఏటా 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు. టైర్ 4 కేటగిరీలోనూ పలు మార్పులు చేశారు. -
మోసపూరిత వైఖరిని మార్చుకోవాలి
కడప అర్బన్ : ఎపీఎస్ ఆర్టీసీలో మోసపూరితమైన చర్యలతో యాజమాన్యం కార్మికులను ఇప్పటికీ వేధిస్తోందని, వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా సంస్థను ఇబ్బందుల పాల్జేస్తున్నారనీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజనల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట సామూహిక రిలే దీక్షలను చేపట్టారు. వైఎస్సార్ జిల్లా కడప రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం మొండివైఖరిలో మార్పు రావాలన్నారు. కార్మికులను బుద్ధిపుట్టినట్లు బదిలీలు చేయడం, డీఎంలు నియంతల్లాగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆత్మీయ పిలుపు పేరుతో కార్మికులను మీటింగ్‌లకు పిలువడం, మరింత పనిభారాన్ని పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆర్టీసీ కార్మికులతో ఇప్పటికే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. కంప్యూటర్ల ముందు కూర్చొనే అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపే కండక్టర్, డ్రైవర్లను అరగంట, గంట ముందే వచ్చారని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రతి కండక్టర్, డ్రైవరు గంట, రెండు గంటలు అదనంగా పనిచేస్తున్నారన్నారు. కార్మికులను ఇంకా ఏదైనా ఇబ్బందిపెడితే అధికారుల జట్టు పట్టుకునే కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదన్నారు. ప్రజా రవాణా సంస్థ అని ఎన్నో దశాబ్దాలుగా నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా వినిపించుకునే పరిస్థితుల్లో యాజమాన్యం, అధికారులు లేరన్నారు. ప్రైవేటు సంస్థలతో ఈ సంస్థను పోల్చుకుని తప్పుడు ఆలోచనలతో ప్రభుత్వం ముందు మెహర్బానీ కోసం లేనిపోని ఆలోచనలు చేస్తే ఉద్యమం తప్పదన్నారు. రీజినల్ మేనేజర్లు చాలా కష్టపడి పోతున్నామని పేరుకే చెబుతున్నారన్నారు. బహిరంగ చర్చకు వచ్చి వాస్తవ పరిస్థితిని ఎండీకి, ప్రభుత్వానికి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కార్మికులకు పెరిగిన వేతనాల స్థాయి, ఆర్టీసీ కార్మికునికి ఎందుకు పెరగలేదన్నారు. ఆర్టీసీ సంస్థకు నష్టమనే పదం వర్తించదన్నారు. ఆస్తులను, బస్సులను తాకట్టు పెట్టి సంస్థను నడుపుతున్నామని కల్లిబొల్లి మాటలు చెప్పడం సరికాదన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. గూడ్స్ ట్రాన్స్‌పోర్టు విషయాన్ని ఈయూ రెండు దశాబ్దాలుగా చెబుతూనే ఉందన్నారు. అయినా యాజమాన్యం పెడచెవిటిన పెట్టిందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య, రీజినల్ అధ్యక్ష, కార్యదర్శులు రామిరెడ్డి, నాగముని, కడప డిపో సెక్రటరీ ఏఆర్ మూర్తి పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఈయూ నిరసన దీక్ష
రాజమహేంద్రవరం సిటీ : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోలకు చెందిన యూనియ¯ŒS కార్మికులు సుమారు 100 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ¯ŒS.సోమరాజు డిమాండ్ చేశారు.10 నెలలుగా కార్మికుల సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మిగిలిన కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్ల పోస్టులు క్రమబద్ధీకరించాలని, మెడికల్ అ¯ŒSఫిట్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో 60 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈయూపై అమెరికా సీరియస్
పన్ను ఎగవేతల నేపథ్యంలో అమెరికా కంపెనీలపై యూరోపియన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తమ కంపెనీలపై ఈయూ తీసుకుంటున్న చర్యలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ మండిపడుతోంది. అమెరికా కంపెనీలకు భారీగా నష్టపరిహారాలను వేయడానికి ఈయూ ప్లాన్ చేస్తుందని వెల్లడిస్తోంది. అయితే ఎలాంటి పక్షపాతం లేకుండానే ఈ చర్యలు చేపడుతున్నట్టు యూరోపియన్ కమిషన్ చెబుతోంది. యూరోప్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసిన అమెరికా కంపెనీలకు జారీచేసిన టాక్స్ డీల్స్‌పై ఈయూ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. యాపిల్‌తోపాటు, అమెజాన్, స్టార్‌బక్స్ వంటి కంపెనీలను యూరోపియన్ కమిషన్ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణల్లో టెక్ దిగ్గజం యాపిల్ మల్టీ బిలియన్ పౌండ్ బిల్లును పెనాల్టీగా ఎదుర్కోబోతుంది. వచ్చే నెలలో యాపిల్‌పై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఈయూ భావిస్తోంది. ఐర్లాండ్‌లో యాపిల్ తన కార్యాలయ స్థాపించుకోవడానికి ప్రత్యేక పన్ను ప్రయోజనాలను ఉన్నాయో లేదో ప్రస్తుతం విచారిస్తున్నామని, ఇతర కంపెనీలకు మాత్రం ఇలాంటి అవకాశమే లేదని ఈయూ ఎగ్జిక్యూటివ్ బాడీ పేర్కొంటోంది. ఇతర కంపెనీలు పన్ను ఎగొట్టి ఈయూ దేశాల నిబంధనలను అతిక్రమిస్తున్నాయని కమిషన్ సీరియస్ అవుతోంది. యాపిల్ కంపెనీతో ఐర్లాండ్‌కు ఎలాంటి స్పెషల్ టాక్స్ రేట్ డీల్ లేదని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. ఈయూ చట్టాలను యూరప్‌లో ఆపరేట్ చేసే అన్ని కంపెనీలకు సమానంగా వర్తించేలా చేస్తున్నామని కమిషన్ పేర్కొంది. అయితే అమెరికా కంపెనీలకు భారీగా నష్టపరిహారాలను జారీచేయడానికి బ్రూస్లీ(యూరోపియన్ యూనియన్ తాత్కాలిక రాజధాని) కావాలనే భిన్నమైన ప్రమాణాలను ఎంచుకుంటుందని అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. ఈయూ చర్యలపై డిపార్ట్మెంట్ విమర్శలు గుప్పిస్తోంది. -
ఇక స్కాటెగ్జిట్...?
బ్రెగ్జిట్ ప్రకంపనలు సద్దుమణగడం ప్రారంభం కాకముందే బ్రిటన్ పలు విధాలుగా రాజకీయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. పర్యవసానాలు బ్రిటన్ సరిహద్దులను దాటి, ఐరోపా ఖండం అంతటికీ వ్యాపిస్తాయేమోననే ఆందో ళన సైతం వ్యక్తమౌతోంది. ఈయూ సభ్యత్వంపై మరోమారు ప్రజాభిప్రాయసేక రణ జరపాలనే ఒత్తిడి పెరుగుతుండగా, స్కాట్లాండ్ ప్రథమ మంత్రి నికోలా స్టర్జన్ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుతూ మరోమారు ప్రజాభిప్రాయసేకరణ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రకటించారు. స్కాటెగ్జిట్కు అనుకూలంగా స్కాట్లు మొగ్గుతున్నారు. ఈయూ నుంచి బ్రిటన్ తప్పుకున్నా స్కాట్లాండ్ మాత్రం కొనసాగడానికి తగు ఏర్పాట్లు చేయాలనే తన వాదనను అది లగ్జెంబర్గ్‌లో జరిగిన ఈయూ కౌన్సిల్ సమావేశానికి విన్నవించింది. బ్రిటన్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉన్న స్కాట్లాండ్కు విడిగా ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగించడం సాధ్యం కాదనే చెప్పాలి. ఇంగ్లిష్ వారి ఆధిపత్యం పట్ల స్కాటిష్ ప్రజలకున్న అసం తృప్తికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ జాతీయ ఆకాంక్షల ఆధారంగానే స్టర్జన్ నేతృ త్వంలోని స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీ బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని చాలా కాలంగా డిమాండు చేస్తోంది. 2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణలో 55 శాతం బ్రిటన్‌లో భాగంగా ఉండాలని కోరుకున్నారు. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం అంటే ఈయూలో సభ్యత్వాన్ని కోల్పోవడమనే వాదన ఆనాడు ఐక్యతావాదుల ప్రధాన అస్త్రం అయింది. బ్రిటన్ పౌరులుగా కంటే ఈయూ పౌరులుగా తమ అస్తిత్వానికి ఎక్కువ విలువనిచ్చే స్కాట్లు ఈయూ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందనే ఐక్యతావాదుల వైపు మొగ్గు చూపారు. అలాగే బ్రెగ్జిట్ ఓటింగ్‌లో కూడా ఈయూ సభ్యత్వానికి అనుకూలంగా వారు 62 శాతం మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే స్టర్జన్ ఏది ఏమైనా స్కాట్లాండ్ ఈయూలో సభ్యత్వాన్ని కొనసాగిస్తుందని, స్వాతంత్య్రం కోసం మరోమారు ప్రజాభిప్రాయసేకరణకు వెళ తామని ప్రకటిస్తున్నారు. ఈయూ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్‌తో సైతం చర్చిస్తున్నారు. 2014 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో ఈయూ మౌనం వహించింది. బ్రెగ్జిట్ తదుపరి కూడా అది అదే వైఖరిని అనుసరిస్తుందా అని చెప్పలేం. కానీ జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మర్కెల్ ముఖ్య మిత్రపక్షానికి చెందిన సీనియర్ సెనేటర్ గుంథర్ క్రిచ్బామ్ ‘‘బ్రిటన్ నిష్ర్కమించినా ఈయూ సభ్యత్వం 28గానే ఉంటుంది. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం కొత్తగా ప్రజాభిప్రాయసేకరణను కోరుతుంది, అది ఎలాగూ నెగ్గుతుంది’’ అని చేసిన వ్యాఖ్యలు బ్రెగ్జిట్ తదుపరి కొందరు ఈయూ ప్రముఖుల ఆలోచనా సరళిలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఇదిలా ఉండగా బ్రిటన్‌లోని మరో స్వయంప్రతిపత్తి ప్రాంతం ఉత్తర ఐర్లాండ్‌లో సైతం బ్రిటన్ నుంచి విడిపోయి, ఐర్లాండ్‌లో ఐక్యం కావాలనే డిమాండు ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ ఓటింగ్ లో స్కాట్లలాగే ఐరిష్ ప్రజలు కూడా ఈయూ సభ్యత్వానికి వ్యతిరేకంగా ఎక్కువగా ఓటు చేశారు. స్కాట్లలాగే, ఐరిష్ ప్రజలకు కూడా బ్రిటన్‌తో ఉన్న వైషమ్యాలు చారిత్రకమైనవి. ఉత్తర ఐర్లాండ్‌లోని ఐఆర్ఏ తిరుగుబాటు 1997కుగానీ సద్దుమణగ లేదు. 2014లో స్కాట్లాండ్ స్వాతంత్య్రం ప్రజాభిప్రాయం తమ వంటి దేశాలలో వేర్పాటువాద ఉద్యమాలను ప్రోత్సహిస్తుందని స్పెయిన్ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్రెగ్జిట్ తదుపరి స్పెయిన్‌లోని కెటలోనియా స్వాతంత్య్రం డిమాండు ఊపందుకుంటోంది. గత ఏడాది కెటలోనియన్ పార్టీలు నిర్వహించిన అనధికారిక ప్రజాభిప్రాయసేకరణలో 80 శాతం కెటలోనియన్లు స్వాతంత్య్రం కోరారు. స్పెయిన్ నుంచి విడిపోయినా సంపన్న వంతమైన కెటలోనియాను ఈయూ వదులుకోదని స్వాతంత్య్రవాదులవాదన. గ్రీస్, పోర్చుగల్, ఇటలీలలాగే స్పెయిన్ కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. 21 శాతం నిరుద్యోగంతో దారీతెన్నూ లేని స్థితిలో ఉంది. పైగా 1975లో ఫ్రాంకో మరణానంతర పరిస్థితికి మించిన తీవ్ర రాజకీయ ప్రతిష్టంభనలో కొట్టుమిట్టాడుతోంది. స్పానియార్డులు ఈ నెల 26న జరిగిన ఎన్నికల్లో కూడా గత డిసెంబర్లోలాగే ఏ పార్టీకి మెజారిటీ రాని పరిస్థితిని పునరావృతం చేశారు. ఏకైక ప్రధాన పార్టీగా తిరిగి అవతరించిన పాప్యులర్ పార్టీ నేత ప్రధాని మరియానో రజాయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ పరిస్థితుల్లో కెటలోనియన్ స్వాతంత్య్రం డిమాండు తిరిగి తెరపైకి వస్తోంది. బ్రెగ్జిట్, కెటలోనియన్లలోనే కాదు, దూరంగా ఉన్న కెనడాలోని క్యుబెక్ జాతి స్వాతంత్య్ర కాంక్షలకు సైతం కొత్త ఊపిరు లూదుతోంది. ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత యూరప్ నిర్మాణమనే ఈయూ మౌలిక లక్ష్యానికి బ్రెగ్జిట్ పర్యవసానంగా విషమిస్తున్న జాతి వైరుధ్యాలు సవాలుగా నిలుస్తున్నాయి. జాతీయవాదం, జాత్యహకారవాదం, గుడ్డి ముస్లిం వ్యతిరేకత, వల సదార్లపట్ల వ్యతిరేకత వంటి ధోరణులు బలపడుతుండటం దేశాలకు, జాతులకు అతీతంగా యూరప్‌ను ఆర్థికంగా, రాజకీయంగా ఐక్యం చేయాలనే దాని ఆకాంక్షకు అపవా దంగా నిలుస్తున్నాయి. బ్రెగ్జిట్ ఫలితాల తదుపరి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, జర్మనీ తదితర దేశాల్లోని పచ్చి మితవాద పార్టీలు ఈయూ నుంచి నిష్ర్కమణకు ప్రజాభిప్రాయ సేకరణలు జరపాలని కోరడం ప్రారంభిం చాయి. ఫ్రెగ్జిట్ (ఫ్రాన్స్), నెగ్జిట్ (నెదర్లాండ్స్) వంటి పిలుపులు వెల్లువెత్తుతు న్నాయి. ఇవన్నీ నేడు బలహీన ధోరణులే అయినా ఈయూ ఆర్థిక విధానాలను, అది ప్రజలపై అమలు చేసిన, చేస్తున్న కఠోరమైన పొదుపు చర్యలు, సంక్షేమ వ్యయాల కోతల పర్యవసానాలుగా ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా తలెత్తుతున్న సామాజిక అసంతృప్తికి యూరప్‌కు వలస వచ్చేవారు బలిపశువులు అవుతుండటం విషాదకరం. 2011-12లలోని ఈయూ సంక్షోభం పరిష్కారం కాకపోవడమే స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి జాత్యహంకార, విచ్ఛిన్నకర, విధ్వంసకర ధోరణుల వరకు అన్ని అవాంఛనీయ ధోరణులకు ఊపిరులు పోస్తోంది. ‘చారిత్రక శత్రువులు ఎలా సన్నిహిత భాగస్వాములు కాగలరో ఈయూ నిరూపించి చూపించింది’ అని నోబెల్ కమిటీ 2012లో ఈయూకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తూ పేర్కొంది. నేటి పరిణామాలు ఆ మాటలను అపహాస్యం చేస్తున్నట్టుండమే వైచిత్రి. ఐరాపా సంయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలనే ఈయూ వ్యవస్థాపకుడు జీన్ మన్నెన్ కల నిజమౌతున్నదా? కరిగిపోనున్నదా? -
బ్రెగ్జిట్‌పై బ్రెసెల్స్‌లో రచ్చరచ్చ
- 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?' అని బ్రెగ్జిట్ ఉద్యమ నేత నెగెల్కు ఈసీ అధ్యక్షుడి ప్రశ్న - పార్లమెంట్‌లోనే ఈయూపై విమర్శలు కురిపించిన నెగెల్ - విడిపోయినా కలిసే సాగుదామంటూ ప్రధాని కామెరూన్ వేడుకోలు - ఈయూలో బ్రిటన్ జాతీయ జెండా తొలిగింపు.. ప్రధాని బృందం రాకకు ముందే మళ్లీ ఏర్పాటు బ్రెసెల్స్: పరస్పర దూషణలు, విమర్శలతో బ్రెగ్జిట్ పై యురోపియన్ పార్లమెంట్ లో జరిగిన చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. రెఫరెండం ద్వారా యురోపియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో 751 మంది సభ్యుల యురోపియన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాలకు బ్రిటన్ ప్రతినిధులుగా(మొత్తం 73 మంది ప్రతినిధులుంటారు) ప్రధాని డేవిడ్ కామెరూన్, యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) నేత నెగెల్ ఫరాగ్, మరి కొందరు నేతలు హాజరయ్యారు. ఈయూ సభ్యదేశంగా బ్రెసెల్స్ లోని ఈయూ పార్లమెంట్ భవనంలో బ్రిటన్ జాతీయ జెండా తప్పక ఉండాలి. కానీ బ్రెగ్జిట్ నిర్ణయం దృష్ట్యా అధికారులు ఆ జెండాను తొలిగించారు. అయితే బ్రిటన్ నేతలు రావడానికి కొద్ది నిమిషాల ముందే మళ్లీ బ్రిటన్ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ చర్య ద్వారా ఈయూ నేతలు బ్రిటన్ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నామని చెప్పకనే చెప్పారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జేన్ క్లాడ్ జంకర్, యూకేఐపీ నేత నెగెల్ ను తిట్టిపోశారు. బ్రెగ్జిట్ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న నెగెల్ ను.. 'విడిపోవాలనుకున్నవాడివి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?'అని జేన్ క్లాడ్ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జేన్ ను ఆయన సహచరులు లోపలికి తీసుకెళ్లడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నెగెల్ కు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ మార్టిన్ షుల్ట్జ్. ప్రసంగం మొదట్లో ఈయూకు ధన్యవాదాలు తెలిపిన నెగెల్.. తర్వాత విమర్శలు గుప్పించారు. జేన్ క్లాడ్ తనను అవమానించిన తీరును సభలో వివరించారు. దానికి స్పీకర్.. జేన్ ను గట్టిగా మందలించారు. కాగా, సెషన్ పూర్తయిన తర్వాత నెగెల్, జేన్ లు ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం విశేషం. అడకత్తెరలో కామెరూన్ రెఫరెండం నిర్వహించి బ్రెగ్జిట్, ఊహించని ఫలితాన్ని చవిచూసిన ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెసెల్స్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒవైపు ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియను కొనసాగిస్తూనే భవిష్యత్ అవసరాల దృష్యా ఈయూ నేతల మెప్పుకోసం పాకులాడినట్లు కనిపించారు. పలువురు ఈయూ కీలక నేతలు కామెరూన్ రెఫరెండం నిర్వహించడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈయూ నుంచి బయటికి వచ్చినప్పటికీ సత్పంబంధాలు కొనసాగేలా కృషిచేస్తానని చెప్పారు. -
వీలైనంత త్వరగా వెళ్లిపోండి!
బ్రిటన్‌కు ఈయూ వ్యవస్థాపక దేశాల సూచన నిబంధనల సరళతరానికి ఓకే ఉన్నతవర్గాలపై కోపమే రెఫరెండం ఫలితమన్న నిపుణులు లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితంతో.. బ్రిటన్ వీలైనంత త్వరగా కూటమి నుంచి వెళ్లిపోవాలని ఈయూ వ్యవస్థాపక దేశాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యవస్థాపక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, లగ్జెంబర్గ్, ఇటలీ, నెదర్లాండ్స్ దేశాల విదేశాంగ మంత్రులు బెర్లిన్‌లో శనివారం సమావేశమయ్యారు. బ్రిటన్ కొత్త ప్రధాని వీలైనంత త్వరగా బాధ్యతలు తీసుకుని.. మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ఫ్రాన్స్ సూచించింది. కూటమినుంచి తప్పుకునేందుకున్న సంక్లిష్ట విధానాలను వీలైనంత సరళతరం చేసి.. తొందరగా బ్రిటన్ వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవటంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ వివాదంపై ఎక్కువ సమయం కేటాయించకుండా.. ఈయూను మరింత ఉజ్వలంగా మార్చే ప్రయత్నాలపై దృష్టిసారించాలని నిర్ణయించారు. కామెరాన్ వీలైనంత త్వరగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. కాగా, తాజా ఫలితంతో ఈయూలో యూకే కమిషనర్ రాజీనామా చేశారు. ఉన్నత వర్గంపై కోపానికి ఫలితమిది బ్రెగ్జిట్ రెఫరెండం ఫలితం.. బ్రిటన్‌లో పేద, ఉన్నత వర్గాల మధ్య స్పష్టమైన విభజన రేఖను సూచిస్తోందని.. రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక ఫలాలు పేదలవరకు చేరకపోవటం, కాందిశీకుల సమస్య కారణంగానే మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్‌కే మొగ్గు చూపారన్నారు. యూకే భౌగోళిక పరిస్థితులతో అమెరికాకున్న పోలికల కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూల ఫలితం ఉండొచ్చని మరికొందరి వాదన. ‘మరోసారి రెఫరెండం’ డిమాండ్ కాగా, మరోసారి బ్రెగ్జిట్ రెఫరెండం పెట్టాలనే డిమాండ్ లండన్ పరిసరాల్లో ఊపందుకుంది. దీనికి మద్దతుగా పదిలక్షల మంది సంతకాలు చేశారు. ‘మొత్తం రెఫరెండం ఓటింగ్ 75 శాతానికన్నా తక్కువగా ఉండటం.. అందులో 60 శాతానికికన్నా తక్కువగా ఉండటం వల్ల కొత్తగా రెఫరెండం నిర్వహించాలన్న నిబంధనను బ్రిటన్ ప్రభుత్వం అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు. -
అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం
అవలోకనం షార్లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం. జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ. ఒక విధంగా చెప్పాలంటే జర్మన్ తెగలు తమ జీన్లతో యూరప్‌ను శాశ్వతంగానే ఐక్యం చేసేసాయి. యూరోపియన్ యూనియన్ను ఏర్పాటు చేయడమనే పథకం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఎన్నడో పురాతన చారిత్రక కాలం నుంచీ సాగుతున్న ఈ బృహత్ పథకంలోని తాజా ఘట్టం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమించడం. గ్రీకులు తమకు ఉత్తర పొరుగున ఉన్న యూరోపియన్ల గురించి ఏమంత ఘనంగా ఆలోచించలేదు. వారి భాషలు ‘బార్-బార్’మని ధ్వనించేవిగా ఉంటా యని వారిని బర్బరులు అని పిలిచేవారు. మాసిడోనియాకు చెందిన జగజ్జేత అలెగ్జాండర్‌కు సైతం యూరప్ పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందుకే అతడు గ్రీసును జయించడం కోసం దక్షిణానికి మర లి, అటునుంచి ఆసియాకు వచ్చాడు. కొద్దికాలంపాటూ ఈజిప్ట్‌కు దారిమళ్లిన తదుపరి పర్షియా (ఇరాన్)ను, మధ్య ఆసియాలో చాలా భాగాన్ని, అఫ్ఘానిస్థాన్‌ను జయించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తను చేసిన అన్ని యుద్ధాలలోకీ అతి క్లిష్టమైన పంజాబ్ యుద్ధం తదుపరి ... వెనక్కు మళ్లక గత్యంతరం లేని స్థితిలో తిరుగు ప్రయాణంలో 33 ఏళ్ల వయస్సులో ఇరాన్లో మరణించాడు. మూడు శతాబ్దాల తర్వాత యూరప్‌ను ఒకే అధికార ఛత్రం కిందకు తేవడానికి గణనీయమైన కృషి చేసిన ఏకైక వ్యక్తి జూలియస్ సీజర్. క్రీస్తు జననానికి ముందు సీజర్ ఇటాలియన్ సేనలను ఫ్రాన్స్, జర్మనీలపైకి నడిపాడు, అక్కడి అనాగరిక తెగలను దారికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇటాలియన్లను సీజర్ ఇంగ్లండుకు కూడా పట్టుకొచ్చాడు. నేడు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన అంతర్జాతీయ నగరం లండన్‌కు సైతం వారిని ఆనాడే తీసుకొచ్చాడు. ఆ కాలంలో యూరప్‌ను రోమ్ నుంచి పాలించేవారు. సీజర్ వారసుడు అగస్తస్ క్రీస్తు శకం 9లో జర్మనీలోని ట్యుటొబెర్గ్ అటవీ ప్రాంతంలో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఉత్తర దిశగా రోమన్ విస్తరణను నిలిపివేశాడు. యూరప్‌లోని పట్టణ, నాగరిక జనాభా అంతా ఆ కాలంలో ఆ ఖండపు దక్షిణ భాగంలోనే ఉండేది. నేడు ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఉత్తర భాగంగా ఉన్న ప్రాంతం కోసం అప్పట్లో యుద్ధం చేయడం వ్యర్థమైన అటవీ ప్రాంతంగా ఉండేది. రోమన్ సేనలు ఇక అప్పటి నుంచి తూర్పు దిశకు కదంతొక్కి జెరూసలెం, సిరియాల దిశగా సాగాయి. రోమన్లు తమ సామ్రాజ్యానికి కాన్స్టాంటినోపుల్ను (టర్కీలోని నేటి ఇస్తాంబుల్) కొత్త రాజధానిగా చేసు కున్నారు. లిపిలేని, ప్రధానంగా నిరక్షరాస్యులైన జర్మన్ తెగలవారు 5వ శతాబ్దినాటికి రోమ్ను చాలా వరకు దెబ్బతీశారు. దీంతో చీకటి యుగాలుగా పిలిచే కాలం వచ్చింది. యూరప్‌లో రాయడం, చదవడం క్షీణించిపోయాయి. ఈజిప్ట్‌ను ముస్లింలు జయించడం కూడా అందుకు కొంతవరకు కారణం. ఈజిప్ట్‌ను కోల్పోవ డంతో ఆనాడు అందుబాటులో ఉన్న ఏకైక కాగితం పాపిరస్ ఎగుమతులు నిలిచి పోయాయి, పుస్తకాలు రాయడానికి, సులువుగా ప్రతులను తయారుచేయడానికి అడ్డుకట్ట పడింది. క్రైస్తవం రూపంలో యూరప్‌ను ఐక్యం చేయాల్సిన నూతన అవసరం ఏర్పడింది. అదే సమయంలో అరబ్బులు స్పెయిన్‌ను ఆక్రమించారు. అది నేటి సిరియా శరణార్థుల భయ వ్యాధిలాగా అరబ్బుల భయాన్ని రేకెత్తించి ఆ పరి ణామాన్ని త్వరితం చేసింది. రోమ్‌లోని పోప్ జర్మన్ ఆదివాసి తెగ నాయకుడైన చార్లెస్‌కు మొట్టమొదటి పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి కిరీటాన్ని తొడిగాడు. షార్లమేన్అనే ఆయన చారిత్రక నామధే యానికి అర్థం అతి గొప్పవాడైన చార్లెస్ (చార్లెస్ ద గ్రేట్) అని. ఆ తదుపరి శతాబ్దాలలో యూరప్‌లో ఫ్యూడలిజం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత పెద్ద రాచరిక రాజ్యాలు అవతరించాయి. శక్తిమంతులైన రాజులు, ప్రత్యేకించి ఫ్రాన్స్, ఇంగ్లండ్ రాజులు యూరప్‌ను విభజించి, పాలించారు. ఈ కాలంలోని ఐక్య యూరప్‌ను పరిపాలించిన చిట్టచివరి వ్యక్తి షార్లమేన్ ముని మనవడు చార్లెస్ ద ఫ్యాట్. ఈ కాలం గడచినాక రోమ్‌లోని చర్చి సైనిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. జెరూసలెంను తిరిగి జయించడం కోసం సాగించిన క్రూసేడ్లనే విఫల యుద్ధాలకు యూరప్‌లోని రాజులు తమ రాజ్యాలను విడిచిపోయేలా చేయగలిగింది. మొదట జర్మనీలో, ఆ తదుపరి ఇంగ్లండ్‌లో తలెత్తిన ప్రొటెస్టేంటిజం యూరప్‌లోని బలహీనమైన మత బంధాలను చీలికలకు గురిచేసింది. తూర్పున ముస్లింల అధికారం పెంపొందుతుండటంతో చర్చి ప్రాబల్యం క్షీణించింది. యూరప్‌లో వచ్చిన విజ్ఞానశాస్త్ర విప్లవం ఆ ఖండానికి రోమ్ కాలం నాటి అధిపత్యాన్ని తిరిగి కట్టబెట్టింది. నెపోలియన్, వెయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా యూరప్‌ను మళ్లీ కొద్ది కాలంపాటూ ఐక్యం చేయడానికి సైనిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడింది. 1940ల మొదట్లో హిట్లర్ తిరిగి యూరప్‌ను సైనికంగా ఐక్యం చేశాడు. అతడు అక్రమించని ప్రాంతాలు (ఇటలీ వంటివి) ఆ తర్వాత ఆక్రమణకు గురి కావడమో లేదా అతనితో చేయికలపడమో చేశాయి. బ్రిటిష్ ద్వీపాలు మాత్రమే హిట్లర్ ఆధిపత్యానికి బయట ఉండేవి. రెండవ ప్రవంచ యుద్ధం ముగిసిపోవడం, రష్యా ప్రబల శక్తిగా పెంపొం దడం కూడా యూరప్‌ను సైనికంగా ఐక్యం చేశాయి. బ్రసెల్స్ కేంద్రంగా నాటో ఏర్పడినా దాని నిజమైన అధికారం అమెరికా చేతుల్లో ఉంటుంది. ఈ సహకారం యూరోపియన్ యూనియన్‌కు విస్తరించింది. దానికి కూడా బ్రసెల్స్ కేంద్రం (షార్లమేన్ పేరుపెట్టిన భవనంలో ఉంది). 25 ఏళ్ల క్రితం జరిగిన జర్మనీ ఏకీకరణ తర్వాత ఈయూ నిజ అధికార కేంద్రం బెర్లిన్‌కు మారింది. షార్లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం, జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే బ్రిటన్ నిష్ర్కమణ. ఒక ఆసక్తికర అంశంతో దీన్ని ముగిద్దాం. ఫ్రాన్స్ అనే పదానికి మూలం ఫ్రాంక్‌లు అనే ఒక జర్మన్ తెగ. ఫ్రాంక్‌లు ఆ ప్రాంతాన్ని జయించి, అక్కడ తమ జనాభాను విస్తరింపజేశారు, నేటి ‘ఫ్రెంచివారి’లో కలగలిసిపోయారు. అదే తెగ జర్మన్ నగరం ఫ్రాంక్ఫర్ట్ పేరుగానూ మారింది. ఇంగ్లండ్ అనే పదానికి అర్థం ల్యాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవ తల గడ్డ). అది ఒక ఉత్తర జర్మన్ తెగ. ఉత్తర ఇటలీని లొంబర్డీగా పిలుస్తారు. అది మరో జర్మన్ తెగ. ఈ అర్థంలో చూస్తే జర్మన్లు తమ జీన్లతో యూరప్‌ను శాశ్వతంగానే ఐక్యం చేసేశారు. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
బ్రెగ్జిట్ బాంబు!
అందరూ భయపడిందే నిజమైంది. బ్రెగ్జిట్ బాంబు పేలింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి నిష్ర్కమణే తమ అభీష్టమని 51.9 శాతంమంది బ్రిటన్ పౌరులు తేల్చిచెప్పారు. ఈయూలోనే కొనసాగాలని భావించినవారు 48.1 శాతం మాత్రమే ఉన్నారని శుక్రవారం వెల్లడైన రెఫరెండం ఫలితాలు తేల్చి చెప్పాయి. రెఫరెండం హడావుడి మొదలైన నాలుగు నెలలనాడు బ్రెగ్జిట్ అనుకూల వాదుల కంటే ఎంతో ముందున్న యధాతథవాదులు రోజులు గడుస్తున్నకొద్దీ బలహీనపడుతున్న వైనాన్ని వరస సర్వేలు వెల్లడిస్తూనే ఉన్నాయి. చిట్టచివరి దశలో సేకరించిన సర్వేల్లో యధాతథవాదులు 51 శాతంగా ఉన్నారు. ప్రత్యర్థుల బలం 49 శాతం మాత్రమే. అయితే ఇది పోలింగ్ రోజున తిరగబడవచ్చునని కూడా సర్వేలు జోస్యం చెప్పాయి. ముఖ్యంగా ఓటింగ్ శాతం తగ్గిన పక్షంలో విడిపోదామనేవారి గెలుపే ఖాయమన్నాయి. అయితే ఓటింగ్ ముమ్మరంగా జరిగినా అంతిమ విజయం బ్రెగ్జిట్వాదులకే దక్కింది. ఫలితాలు వెలువడ్డ కాసేపటికే ప్రధాని డేవిడ్ కామెరాన్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బ్రిటన్... ఆ దేశంతోపాటు పాశ్చాత్య దేశాలూ, అటుపై మొత్తం ప్రపంచ దేశాలూ ఎదుర్కొనబోయే అనేకానేక ఉత్పాతాలతో పోలిస్తే కామెరాన్ రాజీనామా ఓ చిన్న కుదుపు మాత్రమే. చూడటానికిది ఈయూలో ఉండటమా, బయటికి రావడమా అన్న అంశంపై జరిగిన హోరాహోరీ పోరుగా మాత్రమే కనబడుతున్నా... సారాంశంలో అంతకు మించిన వైరుధ్యాలు ఎన్నో ఇందులో దాగున్నాయి. అవి రాగలకాలంలో బ్రిటన్‌లో ఎలాంటి విపత్తులను సృష్టించగలవో ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేరు. ఆ వైరు ద్యాలతో పాలకులు వ్యవహరించే తీరుతెన్నులు వాటిని నిర్ణయిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్ ఖండ దేశాలను ఏకం చేయడానికి సుదీర్ఘకాలం సాగిన చర్చోపచర్చలు 1958లో యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ (ఈఈసీ)కి జన్మనిస్తే ఆ తర్వాత అది ఈయూగా రూపుదిద్దుకోవడం 1973లో సాధ్యపడింది. ఉచ్ఛస్థితిలో ఉన్న 60వ దశకంలో ఈఈసీ సభ్యత్వ విస్తరణను ఫ్రాన్స్ గట్టిగా వ్యతిరేకిస్తే అనంతరకాలంలో అందుకు భిన్నమైన వాదనలకు బలం చేకూరింది. యూరప్ ఖండంలోని చిన్నా చితకా దేశాలను కూడా కలుపుకుంటేనే తిరుగులేని శక్తిగా ఎదగగలమన్న అభిప్రాయానిది పైచేయి అయింది. 90వ దశకం మొదట్లో తూర్పు యూరప్ దేశాల్లో సోషలిస్టు రాజ్యాల పతనం దీనికి తోడైంది. పర్యవసానంగా ఈయూలో కొత్త దేశాలు చేరుతూ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మితవాదులు, ఛాందసవాదులు ఇటీవలి సంవత్సరాల్లో బలపడుతున్న జాడలు కనబడుతూనే ఉన్నాయి. అమెరికాలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో నేషనల్ ఫ్రంట్ నాయకురాలు లీ పెన్, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడం నాయకుడు గిర్ట్ వైల్డర్స్, ఇటలీలో నార్తర్న్ లీగ్ నేత మేటియో సాల్విని వంటి మితవాదులు జాతీయవాదాన్ని నూరిపోస్తున్నారు. మన దేశం, మన ఉద్యోగాలు, మన జాతి అనే నినాదాలిస్తున్నారు. ఇప్పుడు యూరప్‌కు గుదిబండగా మారిన శరణార్థుల సమస్య, అక్కడక్కడ చోటుచేసుకుంటున్న ఉగ్రవాద ఘటనలు ఇందుకు మూల కారణాలని వస్తున్న విశ్లేషణల్లో అర్ధ సత్యం మాత్రమే ఉంది. అవి తక్షణ కారణం అయితే కావొచ్చుగానీ అంతకుమించి దశాబ్దాలుగా అమలవుతున్న ప్రపంచీకరణ విధానాల్లో ఇందుకు సంబంధించిన బీజాలున్నాయి. ప్రపంచీకరణ తళుకుబెళుకులు చూసి మూర్ఛిల్లి దాన్ని పెట్టుబడి దారీ విధాన విజయంగా అభివర్ణించినవారు ఆ విధానాలు పెంచుతూ పోతున్న అసమానతలను విస్మరించారు. అన్ని దేశాల్లోనూ స్వల్ప సంఖ్యాకులైన కార్పొరేట్ దిగ్గజాల చేతుల్లో సంపదంతా కేంద్రీకృతమవుతున్నదన్న వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నించారు. కింది వర్గాల బాగోగుల్ని, సంక్షేమాన్ని పట్టించుకోని విధానాలు అసంతృప్తికీ... చివరకు తిరుగుబాటుకు దారితీస్తాయని గ్రహించలేకపోయారు. పాశ్చాత్య దేశాల్లో చాలాచోట్ల కార్మికుల వేతనాలు 2008 తర్వాత స్తంభించి పోయాయని, ఉపాధి కల్పన అంతంతమాత్రమేనని గుర్తిస్తే ప్రపంచీకరణ సామాన్య పౌరుల జీవితాలను ఎంతగా దిగజార్చిందో అర్ధమవుతుంది. అమె రికాలో బెర్నీ శాండర్స్ వంటివారు సంక్షేమ పథకాలను ప్రతిపాదించి, సహజ వనరులపై కార్పొరేట్ దిగ్గజాల ఆధిపత్యాన్ని తొలగించడమే సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమని సూచించారు. ఇందుకు భిన్నంగా మితవాదులు దేశ సరిహద్దుల్ని మూసేయడం, ముస్లింలను వెళ్లగొట్టడం, జాతి ఔన్నత్యాన్ని పునరుద్ధరించడం అన్ని సమస్యలకూ పరిష్కారమార్గాలుగా చెబుతు న్నారు. ఉగ్రవాద భూతాన్ని చూపి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ప్రస్తుత రెఫరెండంలో ఇంగ్లండ్, వేల్స్లు రెండూ బ్రెగ్జిట్ వైపు బలంగా నిల బడ్డాయి. ఈయూ నుంచి వైదొలగాలన్న వాదనకు ఇంగ్లండ్‌లో 53.2 శాతంమంది అంగీకరిస్తే...వేల్స్లో 51.7 శాతంమంది మద్దతుగా నిలిచారు. అందుకు భిన్నంగా స్కాట్లాండ్లో 62శాతంమంది, నార్తర్న్ ఐర్లాండ్‌లో 55.7 శాతంమంది ఈయూలో ఉండటానికే మొగ్గు చూపారు. నిరాదరణకు గురైన వర్గాలు, శ్వేతజాతీయులు అధికంగా ఉండే ఇంగ్లండ్ ప్రాంతంలో బ్రెగ్జిట్‌కు అనుకూలత వ్యక్తం కావడంలో వింతేమీ లేదు. వేల్స్‌లోనూ అదే స్థితి. ఈయూలో కొనసాగడానికి మొగ్గుచూపిన స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో సైతం కార్మికవర్గ ప్రాబల్యం ఉన్న చోట్ల బ్రెగ్జిట్‌కు అనుకూలత రావడం కింది వర్గాల్లో వర్తమాన స్థితిపై ఉన్న అసంతృప్తిని వెల్లడిస్తుంది. ఈయూలో కొనసాగడమే సురక్షితమని లేబర్ పార్టీ అగ్రనేతలంతా కలిసికట్టుగా ప్రకటించినా ఈ వర్గాలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. సమస్యలపట్ల సూత్రబద్ధ వైఖరిని ప్రదర్శించడం కాక అధికారమే పరమావధిగా స్వరం మార్చడం వల్ల అంతిమంగా నష్టపోక తప్పదని ప్రధాని కామెరాన్ ఈపాటికి గ్రహించి ఉంటారు. నిరుడు జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో రెఫరెండం ప్రతిపాదన తెచ్చిందీ, ఈయూనుంచి వైదొలగడానికి అనుకూలమని చెప్పిందీ ఆయనే. ఇది ఎలాగూ అయ్యేది కాదనుకుని ఆయన ఈ హామీ ఇచ్చారు. తీరా ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి స్వరం మార్చారు. మొత్తానికి రెఫరెండం ఉదారవాద పక్షాలకు ఒక హెచ్చరిక. పౌరుల్లో ఇప్పుడు నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే చర్యలు చేపట్టకపోతే అది అంతి మంగా బ్రిటన్ విచ్ఛిన్నానికి దారితీయొచ్చునని ఫలితాలు చాటిచెబుతున్నాయి. -
బ్రెగ్జిట్ పై ప్రజా నిర్ణయాన్నిగౌరవిస్తాంః ఒబామా
వాషింగ్టన్ః యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అన్నారు. బ్రెగ్జిట్ పై స్పందించిన ఒబామా.. ఈ పరిస్థితుల్లో అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. బ్రిటన్ తో ఎప్పట్లాగే సంబంధాలు కొనసాగిస్తామని వివరించారు. బ్రిటన్ ప్రజలు తమ గళాన్ని వినిపించారని, వారి నిర్ణయాన్ని తాము తప్పక గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ తో బ్రిటన్ విడిపోయినా, ఆ రెండింటితో అమెరికా సంబంధాలు విడివిడిగా కొనసాగుతాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు పెట్టిన ఓటింగ్ లో ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మద్దతు పలకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ ఈయూతో విడిపోవడం ఖాయమైంది. -
బ్రిటన్‌కు వెన్న పూస్తూనే వాతలు
బెర్లిన్: వెన్నపూస్తూ వాతలు పెట్టిన చందంగా.. బ్రెగ్జిట్ బాధాకరం అంటూనే పాత ఒప్పందాల విషయంలో బ్రిటన్‌కు హెచ్చరికలు జారీచేశారు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారయిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆమె.. బ్రెగ్జిట్ ఫలితం ఈయూనే కాక యావత్ యూరప్ ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని అన్నారు. (చదవండి: బ్రిటన్ లో అల్లకల్లోలం ఖాయం) శుక్రవారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన మోర్కెల్ బ్రెగ్జిట్ అనంతర పరిణామాలపై మాట్లాడుతూ నిన్నటివరకు ఈయూతో చేసుకున్న అన్ని ఒప్పందాలను సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. 'విడిపోయే ప్రక్రియ పూర్తయ్యే చివరి నిమిషం దాకా బ్రిటన్ తన వాగ్ధానాలు నిరవేర్చాల్సిన అవసరం ఉంది' అని మోర్కెల్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈయూ నేతలు, సభ్యదేశాధినేతలు బ్రిటన్ కు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం మనమున్నది గందరగోళ ప్రపంచమని, శాంతిసమాధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా.. 'ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటిషర్ల నిర్ణయం బాధాకరం. అది ఐరోపా సమాజ ఐక్యతను విచ్ఛినం చేసింది. యూరప్ దేశాలు వేటికవే భిన్నత్వాన్ని కలిగిఉన్నాయో, ఈయూ అంతకంటే భిన్నమైనది. రెండో ప్రపంచ యుద్ధానంతరం తోడ్పాటును అందించుకునేందుకే ఈయూ ఏర్పాటయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం కూటమిలోని సభ్యదేశాలే ఈయూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఈయూ మనుగడ సాధించగలదన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అందరితో చర్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే సోమవారం యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీలతో భేటీ అవుతున్నా' అని ఏంజిలా పేర్కొన్నారు. -
ఈయూకు మరో షాక్ ?
స్టాక్‌హోమ్: బ్రెగ్జిట్ ఓటుతో యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి విడిపోయిన బ్రిటన్.. ఆ దిశగా ఆలోచనలు చేస్తోన్న ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తోంది. ఈయూలో మూడో అతి పెద్ద దేశం స్విడన్ కూడా స్వెగ్జిట్(స్విడన్+ఎగ్జిట్) నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. గురు, శుక్రవారాల్లో ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఓటింగ్ లో స్విడిష్ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకే మొగ్గుచూపారు. నిజానికి నిన్నమొన్నటి వరకు కూడా స్విడన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న భావన లేకుండేది. ఎప్పుడైతే కల్లోలిత మధ్య ఆసియా దేశాల నుంచి శరణార్థులు రాక పెరిగిందో.. అప్పటి నుంచి వారి మనోభావాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈయూ నంచి విడిపోతే తప్ప శరణార్థి సమస్యలను పరిష్కారం దొరకదనే అభిప్రాయానికి వస్తోన్నారు స్విడిష్ లు. బ్రిగ్జిట్ విషయంలో బ్రిటిషర్లు చెబుతున్న కారణాన్నే స్విడిష్ లు కూడా వల్లెవేస్తున్నారు. అది.. తమ దేశాలపై 'బ్రెసిల్స్ పెత్తనం'. స్విడన్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు స్టాక్ హోమ్ (స్విడన్ రాజధాని)లో కాకుండా బ్రెసిల్స్ నుంచి వెలువడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఈయూలో ఉండటం వల్ల నష్టమేతప్ప లాభం లేదని, ఈయూలో ఉన్నందుకే శరణార్థుల బాధ్యతలను బలవంతంగా తలకెత్తుకోవాల్సి వస్తోందని ఓటింగ్ లో పాల్గొన్న స్విడిష్ లు అంటున్నారు. టీఎన్ఎస్ సిఫో సంస్థ శుక్రవారం నిర్వహించిన పోలింగ్ లో 36 శాతం మంది స్విడిష్ లు ఈయూ నుంచి వైదొలకేందుకు ఓటు వేయగా, 32 శాతం మంది ఈయూలో కొనసాగేందుకు మద్దతు పలికారు. మిగిలిన 32 శాతం మంది ఏమీ తెలియదని చెప్పారు. బ్రిటన్ లో ఈయూ నుంచి వైదొలగాలన్న వాదన ఊపందుకోవడంలో రాజకీయ పక్షాలు కీలక పాత్ర పోశించాయి. అదే స్విడన్ లో ఈ ఉద్యమంలోకి ఇంకా రాజకీయ శక్తులు ప్రవేశించలేదు. ఒకవేళ ప్రవేశిస్తేగనుక సెగ్జిట్ నిర్ణయానికి విపరీతమైన మద్దతు లభించే అవకాశం ఉంది. స్విడన్ కాకుండా ఈయూ సభ్యులైన బల్గేరియా, హంగరీ, రొమేనియా, పోలండ్, గ్రీస్, ఆస్ట్రియా వంటి దేశాలు శరణార్థి సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. -
పేద దేశాల వలసలే కొంప ముంచాయి
లండన్: ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ యూరప్ కూటమి నుంచి బ్రిటన్ తప్పుకోవడమే ఉత్తమమని బ్రిటన్ వాసులు తీర్పు ఇవ్వడం స్థానికత వాదానికి బలం చేకూర్చింది. యూరప్ కూటమికి చెందిన పేద దేశాల నుంచి పెరిగిన ప్రజల వలసల కారణంగా తమ ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయని భావించిన శ్వేత జాతీయులు విడిపోవడానికే ఓటు వేశారు. ‘మా ఉద్యోగాలు, మా స్థలం, మా ఆర్థిక వ్యవస్థ మాకే కావాలి’ అన్న డిమాండ్‌కే స్థానికులు, ముఖ్యంగా శ్వేతజాతి కార్మికులు పట్టం గట్టారు. ‘ఇది మాకు స్వాతంత్య్రం వచ్చిన రోజు, ప్రజలకు నిజమైన విముక్తి రోజు’ అంటూ అటు బ్రిటన్ ప్రతిపక్ష పార్టీలు, శ్వేతజాతీయులు అభివర్ణించారంటే వలసల పట్ల వారికున్న వ్యతరేకత ఎంతో స్పష్టమవుతోంది. ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఒకటి, రెండు మినహాయింపులు మినహా వలసప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. స్థానికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఓటు వేశారు. యూరప్ యూనియన్ నుంచి విడిపోవాల్సిందేనంటూ ఇంగ్లండ్‌లో 73శాతం, వేల్స్లో 72 శాతం మంది తీర్పు చెప్పారు. కలిసే ఉండాలంటూ స్కాట్లాండ్ లాంటి దేశాలు 67 శాతం మంది ఓట్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. 1975లోనూ, ఇప్పుడు కూడా ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగానే అక్కడి మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. బ్రిటన్‌లో విద్యతోపాటు, నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలు ఉచితం అవడం వల్ల యూరప్‌కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు,మూడు ఏళ్లుగా భారీగా పెరిగాయి. దీనికి తోడి ఆర్థిక సంస్కరణల పేరిట ప్రధాన మంత్రి కేమరాన్ నిరుద్యోగ భృతిని, పిల్లల పెంపక భృతిని బాగా తగ్గించడంతో స్థానికుల్లో ఆగ్రహం పెరిగింది. దానికి తోడు సిరియా నుంచి వలసలు భారీగా పెరగడం కూడా వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. ఇక టర్కీలాంటి దేశాలను యూరోపియన్ కూటమిలో చేర్చుకోవాలనే ప్రతిపాదన ముందుకు రావడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. బ్రిటన్‌లో నిరుద్యోగికి భృతి కల్పించడంతోపాటు అనువైన నివాసం, పిల్లలుంటే వారి పోషణ భారాన్ని కూడా భరించడం బ్రిటన్ ప్రభుత్వం బాధ్యత. ఇప్పటికీ ఈ దేశంలో ఉద్యోగం, సద్యోగం లేకుండా ప్రభుత్వ భృతి కోసం పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇలాంటి భృతులను వ్యతిరేకిస్తున్న పన్ను చెల్లింపుదారులు వలసలను మరింత పెద్ద సమస్యగా భావించారు. యూరోపియన్ కూటిమిలో ఉంటే వ్యాపారవేత్తలకు లాభంగానీ, పన్ను చెల్లించే తమలాంటి వారికి కాదని శ్వేతజాతి కార్మికులు భావిస్తూ వచ్చారు. అలా ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాన మంత్రి కేమరాన్పై ఒత్తిడి పెరిగింది. యూరోపియన్ కూటమి నుంచి విడిపోవాలంటూ 2014 సంవత్సరంలో ఈ ఒత్తిడి మరింత తీవ్రమైంది. 2015లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించినట్లయితే తప్పకుండా రిఫరెండమ్ పెట్టి నిర్ణయం తీసుకుంటానని అప్పుడు కేమరాన్ హామీ ఇచ్చారు. ఎవరూ ఉహించని విధంగా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీకి భారీ విజయం దక్కడంతో ఆయన ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆయనకు కూటమి నుంచి విడిపోవడం ఇష్టం లేదు. అందుకని కలిసి ఉండేందుకే ప్రచారం చేసి ఇప్పుడు పదవీ త్యాగానికి సిద్దపడ్డారు.