ఆర్టీసీ ఈయూ నిరసన దీక్ష
Published Fri, Oct 28 2016 9:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
రాజమహేంద్రవరం సిటీ :
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోలకు చెందిన యూనియ¯ŒS కార్మికులు సుమారు 100 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ¯ŒS.సోమరాజు డిమాండ్ చేశారు.10 నెలలుగా కార్మికుల సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మిగిలిన కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్ల పోస్టులు క్రమబద్ధీకరించాలని, మెడికల్ అ¯ŒSఫిట్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో 60 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement