nirasana
-
ఉరితాళ్లతో జీపీ కార్మికుల నిరసన !
కుమరం భీం: రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రారంభించిన సమ్మె సోమవారం 12వ రోజుకు చేరింది. దీక్షా శిబిరంలో కార్మికులు తలకు ఉరితాళ్లతో వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 11వ పీఆర్సీ, జీవో నం.60ని వెంటనే అమలు చేయాలని సంఘం నాయకులు శ్రీకాంత్, లోకేష్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, శంకర్, రాజు, సమ్మయ్య, శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు. -
ఆస్తుల విక్రయాన్ని సులభతరం చేయాలి
బేస్తవారిపేట: ప్రభుత్వం అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను విక్రయించడానికి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసి ఆస్తుల విక్రయాన్ని సులభతరం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఎజెంట్ వేల్ఫేర్ అసోషియోషన్ కంభం బ్రాంచ్ అధ్యక్షుడు బీ.బాలిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు ఎజెంట్లు, ఖాతాదారులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన రూ. 3,965 కోట్లను ప్రభుత్వం అడ్వాన్సుగా బాధితుల పిల్లల చదువులకు, వైద్య, వివాహ అవసరాలకు తక్షణమే చెల్లించాలని, కంపెనీ ఫౌండర్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరున, కంపెనీ బినామీలుగా ఉన్న ఆస్తులన్నీంటిని తక్షణమే అటాచ్మెంట్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇన్ఛార్జీ తహశీల్దార్ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కొండా రఘునాధరెడ్డి, పెరుమారెడ్డి శివారెడ్డి, అగ్రిగోల్డ్ ఎజెంట్లు, బాధితులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ కంభం : అగ్రిగోల్డ్‌లో నష్టపోయిన బాధితులందరికి వెంటనే న్యాయం చేయాలని సీపీఐ నియోజకవర్గ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కందులాపురం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ జితేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం అనంతరం ప్రభుత్వం అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్మును జమచేసుకొని మిగిలిన మొత్తాన్ని ఇచ్చిన వాగ్దానాల మేరకు బాధితులకు చెల్లించాలని, అవ్వా శీతారామరావుతో పాటు అరెస్టు కాకుండా బయట ఉన్న డైరక్టర్లను అరెస్టు చేయాలని, డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కార్యక్రమంలో కంభం బ్రాంచి అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు. -
మెటల్ కాలుష్యంపై రైతుల కన్నెర
వాహనాలను నిలిపివేసిన వైనం అండగా నిలిచిన వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ శ్రీపూర్ణచంద్రప్రసాద్ 17లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక రౌతులపూడి(ప్రత్తిపాడు): గుమ్మరేగులశివారు అనంతారంలోని దిలీప్ గుల్డ్ఖా¯ŒS ప్రైవేటు లిమిటెడ్ నుంచి, నల్లరాయి మెటల్‌ను తరలింపుతో నష్టపోతున్నామంటూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అండగా నిలిచారు. ఈ నెల 17 లోగా నివారణ చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. అప్పటివరకూ ఎలాంటి వాహనాలను నడపడానికి వీల్లేదన్నారు. రహదారి మధ్యలో గ్రామస్తులు రాళ్లు పేర్చి ఆందోళనకు దిగారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల పాటు లారీలను నిలిపివేశారు. దీంతో యాజమాన్య ప్రతినిధులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో చర్చించారు. సమస్యను పరిష్కరించే వరకూ వాహనాలను నిలిపివేయాలని యాజమాన్య ప్రతినిధులకు వారు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా శ్రీపూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామశివారులోని పత్తి,కూరగాయలు, వరి,వంటి పంట పొలాలు, మామిడి, జీడిమామిడి వంటి పండ్ల తోటలు పండించే సుమారు రెండు వందల ఎకరాలు కాలుష్యానికి గురై తీవ్రంగా నష్టపోతున్నా, పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. స్టో¯ŒS క్రషర్ నిర్వాహకులు, నల్లరాయిని తరలించే కాంట్రాక్టర్లు రైతాంగాన్ని, దెబ్బతింటున్న రోడ్లను పట్టించుకోలేదని విమర్శించారు. పంట పొలాలు, తోటలు కాలుష్యానికి దెబ్బతింటున్నాయని, ధూళి దుమ్ము రేగకుండా పటిష్టమైన రహదారి నిర్మించాలని, అప్పటివరకూ నీటితో రోడ్డును తడపాలని ఎన్నిసార్లు కోరినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. తొలుత ఆయన కాలుష్యానికి దెబ్బతింటున్న మామిడి చెట్లు, తోటలను పరిశీలించారు. ఆయన వెంట మండల వైఎస్సార్ సీపీ నాయకుడు జిగిరెడ్డి శ్రీను, మానివెల్తి వెంకటరమణ, మండల యువ నాయకుడు సోమరౌతు భాస్కర్, మాదాసు దొంగబాబు, మాదాసు రాంబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు. -
శిరోముండనం కేసును త్వరగా తేల్చాలి
దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీల డిమాండ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా, నిరసన ప్రదర్శన కాకినాడ సిటీ : దళితుల శిరోముండనం కేసును త్వరగా తేల్చాలని దళిత సంఘాలు, వామపక్ష, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసుకు గురువారంతో 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కాకినాడలో నిరసన ప్రదర్శన చేసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక బాలాజీచెరువు సెంటర్ నుంచి జెడ్పీసెంటర్ మీదుగా ఇంద్రపాలెం లాకులు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించి రాస్తారోకో చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యే త్రిమూర్తులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు కొమ్ముకాస్తున్న సీఎం చంద్రబాబు వైఖరి నశించాలంటూ నినదించారు. నాయకులు మాట్లాడుతూ 1996లో వెంకటాయపాలెం దళితులను కొట్టి శిరోముండనం ఘటన నేటికీ మచ్చగా మిగిలే ఉందన్నారు. జిల్లా యంత్రాంగం సీఎం ఆదేశాలతో కేసు విచారణ జాప్యం అయ్యేందుకు సహకరిస్తోందని ఆరోపించారు. ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ, యునైటెడ్ ఎస్సీ, ఎస్టీ ఫోరం నగర అధ్యక్ష, కార్యదర్శులు గుడాల కృష్ణ, టి.నూకరాజు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్, జిల్లా అధ్యక్షులు తాడి బాబ్జీ, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, బహుజన యునైటెడ్ ఫ్రంట్ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, డీసీఎఫ్, సీపీఐ(ఎంఎల్) లిబరేష¯ŒS, పీడీఎస్‌యూ, వెల్ఫేర్ పార్టీ, వ్యవసాయ సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు స్థానిక బాలాజీ చెరువుసెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కేసులో పీపీని ప్రభుత్వం తొలగించడాన్ని నిరసించారు. న్యూడెమోక్రసి నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఎం.దుర్గాప్రసాద్, ప్రదీప్, వి.రామన్న పాల్గొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం వెంకటాయపాలెం (రామచంద్రపురం రూరల్) : శిరోముండనం ఘటన జరిగి గురువారం నాటికి 20 ఏళ్లు పూర్తయినా బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో బాధితులు చల్లపూడి పట్టాభిరామయ్య, కోటి చినరాజులు గురువారం వెంకటాయపాలెంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 64 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే ఆమరణ దీక్షకు కూర్చున్నామన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్, హైకోర్టు న్యాయవాది కొప్పిశెట్టి వీరభద్రరావు, అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జనుపెల్లి సత్తిబాబు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి పాటి శివప్రసాద్, దళిత ఐక్య పోరాట వేదిక కన్వీనర్ వెంటపల్లి భీమశంకరం తదితరులు వారికి మద్దతు పలికారు. -
ఆర్టీసీ ఈయూ నిరసన దీక్ష
రాజమహేంద్రవరం సిటీ : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. జిల్లాలోని 9 డిపోలకు చెందిన యూనియ¯ŒS కార్మికులు సుమారు 100 మంది ఈ దీక్షలో కూర్చున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ¯ŒS.సోమరాజు డిమాండ్ చేశారు.10 నెలలుగా కార్మికుల సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మిగిలిన కాంట్రాక్ట్ డ్రైవర్, కండక్టర్ల పోస్టులు క్రమబద్ధీకరించాలని, మెడికల్ అ¯ŒSఫిట్ అయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమైక్యాంధ్ర ఉద్యమంలో 60 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సిస్మిక్ సర్వే అడ్డుకున్న మత్స్యకారులు
30 బోట్లలో వెళ్లి ఓడను చుట్టుముట్టి నిరసన కరవాక (మామిడికుదురు): ఓఎన్జీసీ కరవాక సముద్ర జలాల్లో చేపట్టిన సిస్మిక్ సర్వేతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ మత్య్సకారులు సోమవారం తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. కరవాక, గోగన్నమఠం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది మత్స్యకారులు 30 బోట్లలో సముద్ర జలాల్లోకి వెళ్లి సిస్మిక్ సర్వే చేస్తున్న ఓడ వద్ద నిరసన తెలిపారు. సర్వేకు వినియోగిస్తున్న ఓడల వల్ల వేటకు ఉపయోగించే లక్షల రూపాయలు విలువైన వలలు పాడైపోతున్నాయని, సముద్రపు చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. తమ ఆవేదనను ఓఎన్జీసీ అధికారులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉపాధికి ఆటంకంగా మారిన సర్వేను తక్షణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓడపైకి ఎక్కి ఓఎన్జీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కరవాక, గోగన్నమఠం సర్పంచ్‌లు సిర్రా శ్రీనివాస్, లంకే శ్రీనివాస్, మత్స్యకార సంఘాల నాయకులు రేకాడి శ్రీరామ్మూర్తి, పెసంగి భైరవస్వామి, కొల్లు లక్ష్మణరావు, రేకాడి చంద్రశేఖర్, ఓలేటి దుర్గారావు, కర్రి వీరన్న, రేకాడి సుబ్బారావు, కొల్లు రాంబాబు, రేకాడి ఆదినారాయణ, భర్రే కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణాలొద్దు.. విచారణకు సిద్ధం కండి
ఎమ్మెల్యే పెందుర్తికి జక్కంపూడి ప్రతి సవాల్ ఫరిజల్లిపేట (రాజానగరం) : అవినీతి ఆరోపణలను నిరూపించేందుకు గుడిలో ప్రమాణాలు కాదు, ధైర్యం ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌కు ప్రతి సవాల్ చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే పెందుర్తి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి, ఇసుక మాఫియాను ఏనాడు ప్రోత్సహించలేదని, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తన తల్లిపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మీరూ సిద్ధమా? అంటూ సవాల్ చేయడంపై రాజా ప్రతిస్పందించారు. ప్రమాణాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని, చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. అందుకు గవర్నర్‌ను, సీఎంను కలిసేందుకు తాను కూడా వస్తానని చెప్పారు. ముగ్గళ్ల, కాటవరం, వంగలపూడి, సింగవరం ర్యాంపుల్లో ఎక్కడెక్కడ, ఎవరి వద్ద ఎంత తీసుకున్నారనేది ప్రజలందరికీ తెలుసని రాజా పేర్కొన్నారు. కాటవరం ర్యాంపులో శనివారం రాత్రి రూ.10 లక్షలు తీసుకుని, కార్యకర్తలకు ఆదివారం భోజనాలు పెట్టిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. సీతానగరం మండలంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా సుమారు రూ.ఆరు కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా జాలిముడి వద్ద దుర్గ అనే పేద మహిళ మరణిస్తే, ఇంతవరకు ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదని చెప్పారు. చెవిలో పువ్వు, ముక్కున వేలుతో నిరసన సీఎం చంద్రబాబు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ రాజాతో పాటు పార్టీ నేతలు చెవిలో పూలు పెట్టుకుని, ముక్కున వేలు పెట్టి ఫరిజల్లిపేటలో నిరసన ప్రదర్శన చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వెంకటేష్ తగిన సమాధానం చెప్పలేక, నల్లబ్యాడ్జీలతో నిరసన అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అలాగే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా, న్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉండమట్ల రాజబాబు, పార్టీ మండల కన్వీనర్ మండారపు వీర్రాజు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు పేపకాయల విష్ణుమూర్తి, అనదాస సాయిరామ్, అడబాల చినబాబు, నాతిపాము సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకే స్టే ఈదరాడ (మామిడికుదురు) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో రాజా మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఓటుకు నోటు కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ, బరితెగింపు ధోరణిలో టీడీపీ ప్రభుత్వ విధానం ఉందని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన అని, అదే బాటలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని రాజోలు కో–ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లి డేవిడ్, తోరం సూర్యభాస్కర్, జక్కంపూడి వాసు, రావి ఆంజనేయులు, విస్సా నాగేశ్వరరావు, అడబాల బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.