- వాహనాలను నిలిపివేసిన వైనం
- అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ శ్రీపూర్ణచంద్రప్రసాద్
- 17లోగా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక
మెటల్ కాలుష్యంపై రైతుల కన్నెర
Published Fri, Jan 13 2017 11:06 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
రౌతులపూడి(ప్రత్తిపాడు):
గుమ్మరేగులశివారు అనంతారంలోని దిలీప్ గుల్డ్‌ఖా¯ŒS ప్రైవేటు లిమిటెడ్ నుంచి, నల్లరాయి మెటల్‌ను తరలింపుతో నష్టపోతున్నామంటూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అండగా నిలిచారు. ఈ నెల 17 లోగా నివారణ చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. అప్పటివరకూ ఎలాంటి వాహనాలను నడపడానికి వీల్లేదన్నారు. రహదారి మధ్యలో గ్రామస్తులు రాళ్లు పేర్చి ఆందోళనకు దిగారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం రెండు గంటల పాటు లారీలను నిలిపివేశారు. దీంతో యాజమాన్య ప్రతినిధులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులతో చర్చించారు.
సమస్యను పరిష్కరించే వరకూ వాహనాలను నిలిపివేయాలని యాజమాన్య ప్రతినిధులకు వారు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా శ్రీపూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ గ్రామశివారులోని పత్తి,కూరగాయలు, వరి,వంటి పంట పొలాలు, మామిడి, జీడిమామిడి వంటి పండ్ల తోటలు పండించే సుమారు రెండు వందల ఎకరాలు కాలుష్యానికి గురై తీవ్రంగా నష్టపోతున్నా, పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. స్టో¯ŒS క్రషర్ నిర్వాహకులు, నల్లరాయిని తరలించే కాంట్రాక్టర్లు రైతాంగాన్ని, దెబ్బతింటున్న రోడ్లను పట్టించుకోలేదని విమర్శించారు. పంట పొలాలు, తోటలు కాలుష్యానికి దెబ్బతింటున్నాయని, ధూళి దుమ్ము రేగకుండా పటిష్టమైన రహదారి నిర్మించాలని, అప్పటివరకూ నీటితో రోడ్డును తడపాలని ఎన్నిసార్లు కోరినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. తొలుత ఆయన కాలుష్యానికి దెబ్బతింటున్న మామిడి చెట్లు, తోటలను పరిశీలించారు. ఆయన వెంట మండల వైఎస్సార్ సీపీ నాయకుడు జిగిరెడ్డి శ్రీను, మానివెల్తి వెంకటరమణ, మండల యువ నాయకుడు సోమరౌతు భాస్కర్, మాదాసు దొంగబాబు, మాదాసు రాంబాబు, పలువురు రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement