- పంటల భూముల జోలికొస్తే ఊరుకోరు
- టెక్స్‌టైల్ పార్కు డీపీఆర్‌ను అధికారులు వెల్లడించాలి
- కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి
రైతులపై ప్రయోగాలు చేస్తే తిరగబడతరు
Published Mon, Oct 3 2016 1:13 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
గీసుకొండ/సంగెం
ఏ ప్రభుత్వమైనా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రయోగాలు చేస్తే వారు తిరగబడతారని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముద్దసాని కోదండరెడ్డి అన్నా రు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో పంటలు పండే సారవంతమైన భూముల జోలికి వస్తే రైతులు ఊరుకోరని హెచ్చరించారు.
ఆది వారం ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద టెక్స్‌టైల్ పార్కు కోసం తమ పంట భూములను ఇవ్వబోమంటూ 26 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతుల దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను చిన్న చూపు చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామంటున్న అధికారులు దాని పూర్తి ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్), ఆ పార్కు వల్ల ఎందరికీ మేలు జరుగుతుందో విషయాలను వెల్లడించకుండా భూ సర్వే, సేకరణలు చేయడం చట్ట విరుద్దమైందన్నారు. బాధిత రైతుల పక్షాన తాము ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి ఇనుగాల వెంకట్రాం రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరు కాగా కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు బండా ప్రకాశ్, కొండేటి కొమురారెడ్డి, సూరం రంగారెడ్డి, డోలె చిన్ని, వీసం ఓనారెడ్డి, బండారి కట్టయ్య, కుమారస్వామి, ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, భూ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నర్సింగరావు, రవీందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు. కోదండరెడ్డి గీసుకొండ, సంగెం మండలాల్లో భూ సేకరణ చేస్తున్న పలు గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు.
సంగెం మండలంలోని కృష్ణానగర్, చింతపల్లి, కుంటపల్లి తదితర గ్రామాల్లో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట అధ్యక్షుడు కోదంరెడ్డి ఆది వారం పర్యటించి టెక్స్‌టైల్ పార్క్ కోసం ప్రభుత్వం తీసుకోనున్న భూములను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని బీడుభూములను తీసుకోవాలన్నారు. హై కో ర్టు, సుప్రీంకోర్టులు రద్దు చేసిన జీఓలు 123, 45, 190ల ప్రకారం భూసేకరణ చేయడంలో అంతర్యంఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పరకాల ఇన్ చార్జి వెంకట్రామ్‌రె డ్డి, రాష్ట్ర నాయకులు బండా ప్రకాశ్ నాయకు లు రవీందర్‌గౌడ్, కోటేశ్వర్ పాల్గొన్నారు.
Advertisement