కంభంలో ర్యాలీ చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు
బేస్తవారిపేట: ప్రభుత్వం అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులను విక్రయించడానికి అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేసి ఆస్తుల విక్రయాన్ని సులభతరం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఎజెంట్ వేల్ఫేర్ అసోషియోషన్ కంభం బ్రాంచ్ అధ్యక్షుడు బీ.బాలిరెడ్డి, సీపీఐ నియోజకవర్గ నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు ఎజెంట్‌లు, ఖాతాదారులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన రూ. 3,965 కోట్లను ప్రభుత్వం అడ్వాన్సుగా బాధితుల పిల్లల చదువులకు, వైద్య, వివాహ అవసరాలకు తక్షణమే చెల్లించాలని, కంపెనీ ఫౌండర్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరున, కంపెనీ బినామీలుగా ఉన్న ఆస్తులన్నీంటిని తక్షణమే అటాచ్‌మెంట్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఇన్‌ఛార్జీ తహశీల్దార్ నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కొండా రఘునాధరెడ్డి, పెరుమారెడ్డి శివారెడ్డి, అగ్రిగోల్డ్ ఎజెంట్‌లు, బాధితులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల ర్యాలీ
కంభం : అగ్రిగోల్డ్‌లో నష్టపోయిన బాధితులందరికి వెంటనే న్యాయం చేయాలని సీపీఐ నియోజకవర్గ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కందులాపురం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహశీల్దార్ జితేంద్రకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయం అనంతరం ప్రభుత్వం అడ్వాన్సుగా ఇచ్చిన సొమ్మును జమచేసుకొని మిగిలిన మొత్తాన్ని ఇచ్చిన వాగ్దానాల మేరకు బాధితులకు చెల్లించాలని, అవ్వా శీతారామరావుతో పాటు అరెస్టు కాకుండా బయట ఉన్న డైరక్టర్లను అరెస్టు చేయాలని, డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కార్యక్రమంలో కంభం బ్రాంచి అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజంట్లు, కస్టమర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment