అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం | britain exits from EU with brexit voting | Sakshi
Sakshi News home page

అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం

Published Sun, Jun 26 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం

అతి పురాతనం ఐరోపా ఐక్యతా ప్రస్థానం

అవలోకనం
షార్‌లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం. జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ. ఒక విధంగా చెప్పాలంటే జర్మన్ తెగలు తమ జీన్లతో యూరప్‌ను శాశ్వతంగానే ఐక్యం చేసేసాయి.
 
యూరోపియన్ యూనియన్‌ను ఏర్పాటు చేయడమనే పథకం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది. ఎన్నడో పురాతన చారిత్రక కాలం నుంచీ సాగుతున్న ఈ బృహత్ పథకంలోని తాజా ఘట్టం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమించడం.  

గ్రీకులు తమకు ఉత్తర పొరుగున ఉన్న యూరోపియన్‌ల గురించి ఏమంత ఘనంగా ఆలోచించలేదు. వారి భాషలు ‘బార్-బార్’మని ధ్వనించేవిగా ఉంటా యని వారిని బర్బరులు అని పిలిచేవారు. మాసిడోనియాకు చెందిన జగజ్జేత అలెగ్జాండర్‌కు సైతం యూరప్ పట్ల ఆసక్తి ఉండేది కాదు. అందుకే అతడు గ్రీసును జయించడం కోసం దక్షిణానికి మర లి, అటునుంచి ఆసియాకు వచ్చాడు. కొద్దికాలంపాటూ ఈజిప్ట్‌కు దారిమళ్లిన తదుపరి పర్షియా (ఇరాన్)ను, మధ్య ఆసియాలో చాలా భాగాన్ని, అఫ్ఘానిస్థాన్‌ను జయించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ తను చేసిన అన్ని యుద్ధాలలోకీ అతి క్లిష్టమైన పంజాబ్ యుద్ధం తదుపరి ... వెనక్కు మళ్లక గత్యంతరం లేని స్థితిలో తిరుగు ప్రయాణంలో 33 ఏళ్ల వయస్సులో ఇరాన్‌లో మరణించాడు.

మూడు శతాబ్దాల తర్వాత యూరప్‌ను ఒకే అధికార ఛత్రం కిందకు తేవడానికి గణనీయమైన కృషి చేసిన ఏకైక వ్యక్తి జూలియస్ సీజర్. క్రీస్తు జననానికి ముందు సీజర్ ఇటాలియన్ సేనలను ఫ్రాన్స్, జర్మనీలపైకి నడిపాడు, అక్కడి అనాగరిక తెగలను దారికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇటాలియన్లను సీజర్ ఇంగ్లండుకు కూడా పట్టుకొచ్చాడు. నేడు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు చేసిన అంతర్జాతీయ నగరం లండన్‌కు సైతం వారిని ఆనాడే తీసుకొచ్చాడు. ఆ కాలంలో యూరప్‌ను రోమ్ నుంచి పాలించేవారు.

సీజర్ వారసుడు అగస్తస్ క్రీస్తు శకం 9లో జర్మనీలోని ట్యుటొబెర్గ్ అటవీ ప్రాంతంలో  ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఉత్తర దిశగా రోమన్ విస్తరణను నిలిపివేశాడు. యూరప్‌లోని పట్టణ, నాగరిక జనాభా అంతా ఆ కాలంలో ఆ ఖండపు దక్షిణ భాగంలోనే  ఉండేది. నేడు ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఉత్తర భాగంగా ఉన్న ప్రాంతం కోసం అప్పట్లో  యుద్ధం చేయడం వ్యర్థమైన అటవీ ప్రాంతంగా ఉండేది. రోమన్ సేనలు ఇక అప్పటి నుంచి తూర్పు దిశకు కదంతొక్కి జెరూసలెం, సిరియాల దిశగా సాగాయి. రోమన్లు తమ సామ్రాజ్యానికి కాన్‌స్టాంటినోపుల్‌ను (టర్కీలోని నేటి ఇస్తాంబుల్) కొత్త రాజధానిగా చేసు కున్నారు.

లిపిలేని, ప్రధానంగా నిరక్షరాస్యులైన జర్మన్ తెగలవారు 5వ శతాబ్దినాటికి రోమ్‌ను చాలా వరకు దెబ్బతీశారు. దీంతో చీకటి యుగాలుగా పిలిచే కాలం వచ్చింది. యూరప్‌లో రాయడం, చదవడం క్షీణించిపోయాయి. ఈజిప్ట్‌ను ముస్లింలు జయించడం కూడా అందుకు కొంతవరకు కారణం. ఈజిప్ట్‌ను కోల్పోవ డంతో ఆనాడు అందుబాటులో ఉన్న ఏకైక కాగితం పాపిరస్ ఎగుమతులు నిలిచి పోయాయి, పుస్తకాలు రాయడానికి, సులువుగా ప్రతులను తయారుచేయడానికి అడ్డుకట్ట పడింది. క్రైస్తవం రూపంలో యూరప్‌ను ఐక్యం చేయాల్సిన నూతన అవసరం ఏర్పడింది. అదే సమయంలో అరబ్బులు స్పెయిన్‌ను ఆక్రమించారు. అది నేటి సిరియా శరణార్థుల భయ వ్యాధిలాగా అరబ్బుల భయాన్ని రేకెత్తించి ఆ పరి ణామాన్ని త్వరితం చేసింది.

రోమ్‌లోని పోప్ జర్మన్ ఆదివాసి తెగ నాయకుడైన చార్లెస్‌కు మొట్టమొదటి పవిత్ర రోమన్ సామ్రాజ్య చక్రవర్తి కిరీటాన్ని తొడిగాడు. షార్‌లమేన్‌అనే ఆయన చారిత్రక నామధే యానికి అర్థం అతి గొప్పవాడైన చార్లెస్ (చార్లెస్ ద గ్రేట్) అని. ఆ తదుపరి శతాబ్దాలలో యూరప్‌లో ఫ్యూడలిజం అభివృద్ధి చెందింది. ఆ తర్వాత పెద్ద రాచరిక రాజ్యాలు అవతరించాయి. శక్తిమంతులైన రాజులు, ప్రత్యేకించి ఫ్రాన్స్, ఇంగ్లండ్ రాజులు యూరప్‌ను విభజించి, పాలించారు. ఈ కాలంలోని ఐక్య యూరప్‌ను పరిపాలించిన చిట్టచివరి వ్యక్తి షార్‌లమేన్  ముని మనవడు చార్లెస్ ద ఫ్యాట్.

ఈ కాలం గడచినాక రోమ్‌లోని చర్చి సైనిక, రాజకీయ శక్తిగా ఎదిగింది. జెరూసలెంను తిరిగి జయించడం కోసం సాగించిన క్రూసేడ్లనే విఫల యుద్ధాలకు యూరప్‌లోని రాజులు తమ  రాజ్యాలను విడిచిపోయేలా చేయగలిగింది. మొదట జర్మనీలో, ఆ తదుపరి ఇంగ్లండ్‌లో తలెత్తిన ప్రొటెస్టేంటిజం యూరప్‌లోని బలహీనమైన మత బంధాలను చీలికలకు గురిచేసింది. తూర్పున ముస్లింల అధికారం పెంపొందుతుండటంతో చర్చి ప్రాబల్యం క్షీణించింది. యూరప్‌లో వచ్చిన విజ్ఞానశాస్త్ర విప్లవం ఆ ఖండానికి రోమ్ కాలం నాటి అధిపత్యాన్ని తిరిగి కట్టబెట్టింది.

నెపోలియన్, వెయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా యూరప్‌ను మళ్లీ కొద్ది కాలంపాటూ ఐక్యం చేయడానికి సైనిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడింది. 1940ల మొదట్లో హిట్లర్ తిరిగి యూరప్‌ను సైనికంగా ఐక్యం చేశాడు. అతడు అక్రమించని ప్రాంతాలు (ఇటలీ వంటివి) ఆ తర్వాత ఆక్రమణకు గురి కావడమో లేదా అతనితో చేయికలపడమో చేశాయి. బ్రిటిష్ ద్వీపాలు మాత్రమే హిట్లర్ ఆధిపత్యానికి బయట ఉండేవి.

రెండవ ప్రవంచ యుద్ధం ముగిసిపోవడం, రష్యా ప్రబల శక్తిగా పెంపొం దడం కూడా యూరప్‌ను సైనికంగా ఐక్యం చేశాయి. బ్రసెల్స్ కేంద్రంగా నాటో ఏర్పడినా దాని నిజమైన అధికారం అమెరికా చేతుల్లో ఉంటుంది. ఈ సహకారం యూరోపియన్ యూనియన్‌కు విస్తరించింది. దానికి కూడా బ్రసెల్స్ కేంద్రం (షార్‌లమేన్ పేరుపెట్టిన భవనంలో ఉంది). 25 ఏళ్ల క్రితం జరిగిన జర్మనీ ఏకీకరణ తర్వాత ఈయూ నిజ అధికార కేంద్రం బెర్లిన్‌కు మారింది.

షార్‌లమేన్ నుంచి యూరోపియన్ యూనియన్ వరకు ఐక్య యూరప్ అనే ఈ బృహత్ పథకం, నిరంతరం రూపొందుతూ, తిరిగి మళ్లీ రూపొందుతూ వచ్చింది. అందుకు కారణాలు రకరకాలు... సైనిక విస్తరణ, మతం, వ్యాపారం, జాతీయ సరిహద్దులు చాలా చాలా సార్లే మారాయి, అలాగే భాషలు కూడా. ఈ సుదీర్ఘ చారిత్రక క్రమంలోని తాజా ఘట్టమే బ్రిటన్ నిష్ర్కమణ.

ఒక ఆసక్తికర అంశంతో దీన్ని ముగిద్దాం. ఫ్రాన్స్ అనే పదానికి మూలం ఫ్రాంక్‌లు అనే ఒక జర్మన్ తెగ. ఫ్రాంక్‌లు ఆ ప్రాంతాన్ని జయించి, అక్కడ తమ జనాభాను విస్తరింపజేశారు, నేటి ‘ఫ్రెంచివారి’లో కలగలిసిపోయారు. అదే తెగ జర్మన్ నగరం ఫ్రాంక్‌ఫర్ట్ పేరుగానూ మారింది. ఇంగ్లండ్ అనే పదానికి అర్థం ల్యాండ్ ఆఫ్ ఏంజెల్స్ (దేవ తల గడ్డ). అది ఒక ఉత్తర జర్మన్ తెగ. ఉత్తర ఇటలీని లొంబర్డీగా పిలుస్తారు. అది మరో జర్మన్ తెగ. ఈ అర్థంలో చూస్తే జర్మన్లు తమ జీన్లతో యూరప్‌ను శాశ్వతంగానే ఐక్యం చేసేశారు.


ఆకార్ పటేల్
 వ్యాసకర్త కాలమిస్టు, రచయిత  aakar.patel@icloud.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement