లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే బ్రెగ్జిట్ ప్రక్రియకు 2020, డిసెంబర్ 31ను తుది గడువుగా నిర్ణయించారు. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ పేర్కొంది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై బుధవారం మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్ అమలు సమయంలో యూరోపియన్ యూనియన్ వర్తక చట్టాల్ని బ్రిటన్ పాటించాలని, అలాగే కస్టమ్స్ నిబంధనలు, ఒకే మార్కెట్ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment