బ్రసల్స్: యురోపియన్ యూనియన్‌తో బ్రేకప్ చెప్పే ప్రక్రియలో బ్రిటన్ మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా జరిగిన బ్రెగ్జిట్ చర్చలు ఫలప్రదమైనట్లు యురోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ జీన్ క్లాడ్ జంకర్ తెలిపారు. ఈ మేరకు చర్చల తొలి దశలో భాగంగా 15పేజీల ఒప్పందంపై జీన్ క్లాడ్, థెరెసా మే సంతకాలు చేశారు. యురోపియన్ యూనియన్ ఒప్పందాలకు బ్రిటన్ అంగీకరించడంతో బ్రెగ్జిట్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా బ్రిటన్ కన్జర్వేటివ్‌లు, యురోపియన్ కమిషన్ నేతల మధ్య చర్చలు జరిగాయి. అధికారికంగా ఆ తెగతెంపుల కోసం ప్రస్తుతం ఈయూతో బ్రిటన్ చర్చలు నిర్వహించింది. దాని కోసం ఈయూ కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులకు బ్రిటన్ తాజాగా అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రిటన్ ప్రధాని థెరిసా మే... బ్రసల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐర్లాండ్‌తో ఉన్న బోర్డర్ సమస్యపై కీలకమైన ఒప్పందం కుదరడం వల్ల బ్రెగ్జిట్ చీలిక మరో దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఐర్లాండ్‌తో బోర్డర్ సమస్య ఇక ఉండదని బ్రిటన్ ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు. బ్రిటన్‌లో నివసిస్తున్న ఈయూ పౌరులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు.. తద్వారా 2019లో బ్రెక్సిట్‌కు వీలుగా వచ్చే ఏడాది ప్రారంభంలో మరోసారి చర్చలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందు(బ్రెక్సిట్)కు వీలుగా జరుగుతున్న వెల్లడికావడంతో యూరప్ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment