యూరోపియన్ యూనియన్‌కు బై!
లండన్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి (బ్రెగ్జిట్) కౌంట్‌డౌన్ సిద్ధమయింది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే బుధవారం సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెగ్జిట్ నుంచి వెళ్లిపోయే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్ ప్రకటించింది.
ఈయూ బ్రిటన్ రాయబారి సర్ టిమ్ బారో ఉత్తర్వు ప్రతిని లాంఛనంగా యూరోపియన్ మండలి అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్‌కు అందజేశారు. ఈ రెండేళ్లలో 27 సభ్యదేశాలతో వాణిజ్య, ఇతర ఒప్పందాలను బ్రిటన్ తెగదెంపులు చేసుకుంటుంది. ఈయూ దేశాల పౌరులు బ్రిటన్‌లో నివసించేందుకు అన్ని హక్కులూ ఉంటాయని మే భరోసా ఇచ్చారు. 2016లో నిర్వహించిన రెఫరెండంలో అత్యధికులు బ్రెగ్జిట్‌కు ఓటు వేయడం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ప్రధాని పార్లమెంటులోనూ అధికారికంగా ప్రకటన చేశారు.