మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యూరప్ దేశాల తీరుపై తీవ్రంగా స్పందించారు. యూరప్‌కు వెళ్లే సహజ వాయువుల పైప్‌లైన్‌ను క్రెమ్లిన్ నిలిపివేసిందంటూ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు.
పసిఫిక్ తీర నగరమైన వ్లాదివోస్టోక్‌లో ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా ‘ఎనర్జీ’ని ఆయుధంగా ఉపయోగిస్తోందని వాళ్లు అంటున్నారు. నాన్‌సెన్స్.. అది ఆయుధమా?. విజ్ఞప్తులకు తగ్గట్లుగా సహజ వాయువులను మేం సరఫరా చేస్తూ వస్తున్నాం. పైగా మేమేం ఆంక్షలను విధించే వాళ్లం కాదూ.. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం అందించే రకం అంటూ పరోక్షంగా అమెరికాకూ చురకలు అంటించారాయన.
రష్యా చమురు దిగ్గజం గాజ్‌ప్రోమ్ శుక్రవారం సహజవాయువు పైప్‌లైన్‌ను ఆపేసింది. అయితే మెయింటెనెన్స్ కోసమే దానిని బంద్ చేసినట్లు తర్వాత స్పష్టత ఇచ్చింది గాజ్‌ప్రోమ్. అయినా కూడా.. యూరప్ దేశాలు చమురును నిలిపివేశాయంటూ రష్యాపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయన్న కారణంతో యూరోపియన్ దేశాలకు మధ్యమధ్యలో గ్యాస్ సరఫరాను తగ్గిండమో.. నిలిపివేయడమో చేస్తూ వస్తోంది రష్యా. అయితే ఈయూ మాత్రం.. చమురు వంకతో రష్యా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి: అధ్యక్షుడి చుట్టూ గిరగరా తిరుగుతూ..
Comments
Please login to add a commentAdd a comment