halted
-
ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం బంద్!
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండో-బంగ్లాదేశ్ వాణిజ్యం సోమవారం మధ్యాహ్నం నిలిచిపోయింది. ఆ దేశంలో హింసాత్మక నిరసనల ఫలితంగా అధ్యక్షురాలు షేక్ హసీనా రాజీనామా చేశారు.దేశంలో అత్యవసర సేవలు మినహా మూడు రోజుల వాణిజ్య సెలవును ప్రకటిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ కస్టమ్స్ నుంచి తమ ల్యాండ్ పోర్ట్‌లలో క్లియరెన్స్ లేకపోవడంతో, అన్ని ల్యాండ్ పోర్ట్‌లలో ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగాల్ ఎగుమతిదారుల సమన్వయ కమిటీ కార్యదర్శి ఉజ్జల్ సాహా తెలిపారు.గత రెండు రోజులుగా బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల కారణంగా వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. హసీనా సోమవారం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినట్లు పలు వార్తా కథనాలు తెలిపాయి. సోమవారం ఉదయం కొంత మేర వాణిజ్య కార్యకలాపాలు జరిగినా అధ్యక్షురాలి రాజీనామా, దేశం నుంచి నిష్క్రమణ వార్తల తర్వాత ఆగిపోయిందని బెనాపోల్ సి&ఎఫ్ స్టాఫ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాజేదుర్ రెహ్మాన్ చెప్పారు.బెనాపోల్ పశ్చిమ బెంగాల్‌లోని పెట్రాపోల్ సరిహద్దులో బంగ్లాదేశ్ వైపు ఉంది. రాష్ట్రంలోని కొన్ని ఇతర ల్యాండ్ పోర్ట్‌లలో అత్యధికంగా ద్వైపాక్షిక వాణిజ్యానికి కారణమయ్యే అతిపెద్ద ల్యాండ్ పోర్ట్ అయిన పెట్రాపోల్ కూడా ప్రభావితమైందని వ్యాపార వర్గాలు తెలిపాయి. -
ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు
ప్యారిస్: ఫ్రాన్స్ నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఇందులో ఆశ్రయం కోరుతూ ఆరుగురు మైనర్లు ధరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల నిర్బంధాన్ని మరో ఎనిమిది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసుపై నేడు విచారణ కొనసాగనుంది. మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రాన్స్‌లో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్ లోని భారత్ ఎంబసీ.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సిస్ లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరింది. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం నికరాగ్వాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని వాట్రి విమానాశ్రయానికి చేరుకోగానే ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం వచ్చిన కారణంతో విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. "ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతిక నిలిపివేత సమయంలో దుబాయ్ నుండి నికరాగ్వాకు బయలుదేరిన విమానాన్ని నిలిపివేశారు. ఇందులో దాదాపు 303 మంది భారతీయ మూలాలు కలిగినవారే ఉన్నారు. విమానం నిలిపివేత గురించి ఫ్రెంచ్ అధికారులు మాకు సమాచారం అందించారు. పరిస్థితిని పరిశీస్తున్నాం" అని భారత ఎంబసీ అధికారులు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక వసతి గృహాలకు తరలించారు. ఒక్కొక్కరిని అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల నుంచే నిజానిజాలను కనుక్కునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదీ చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
మరాఠా రిజర్వేషన్ల ఆందోళనలు.. జాతీయ రహదారుల దిగ్బంధం
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ నిరసనకారులు రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించారు. రైల్వే ట్రాకులు, జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. నేడు ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు నిరసనకారులు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు షోలాపూర్‌లో రైలు పట్టాలను దిగ్బంధించారు. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. నిరసనకారులు రైలు పట్టాలపై టైర్లు తగులబెట్టారు. అటు.. జల్నా జిల్లాలో జరిగిన నిరసనల్లో కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారని పోలీసులు మంగళవారం తెలిపారు. రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జల్నాలో జరిగిన మరో ఘటనలో షెల్గావ్ గ్రామంలోని రైల్వే గేట్ వద్ద మరాఠా వర్గానికి చెందిన కొందరు యువకులు రైళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఆందోళనకారులు రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయులు రాజీనామా -
అది ఆయుధమా? నాన్సెన్స్: పుతిన్ ఫైర్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యూరప్ దేశాల తీరుపై తీవ్రంగా స్పందించారు. యూరప్‌కు వెళ్లే సహజ వాయువుల పైప్‌లైన్‌ను క్రెమ్లిన్ నిలిపివేసిందంటూ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. పసిఫిక్ తీర నగరమైన వ్లాదివోస్టోక్‌లో ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా ‘ఎనర్జీ’ని ఆయుధంగా ఉపయోగిస్తోందని వాళ్లు అంటున్నారు. నాన్సెన్స్.. అది ఆయుధమా?. విజ్ఞప్తులకు తగ్గట్లుగా సహజ వాయువులను మేం సరఫరా చేస్తూ వస్తున్నాం. పైగా మేమేం ఆంక్షలను విధించే వాళ్లం కాదూ.. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం అందించే రకం అంటూ పరోక్షంగా అమెరికాకూ చురకలు అంటించారాయన. రష్యా చమురు దిగ్గజం గాజ్ప్రోమ్ శుక్రవారం సహజవాయువు పైప్‌లైన్‌ను ఆపేసింది. అయితే మెయింటెనెన్స్ కోసమే దానిని బంద్ చేసినట్లు తర్వాత స్పష్టత ఇచ్చింది గాజ్ప్రోమ్. అయినా కూడా.. యూరప్ దేశాలు చమురును నిలిపివేశాయంటూ రష్యాపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయన్న కారణంతో యూరోపియన్ దేశాలకు మధ్యమధ్యలో గ్యాస్ సరఫరాను తగ్గిండమో.. నిలిపివేయడమో చేస్తూ వస్తోంది రష్యా. అయితే ఈయూ మాత్రం.. చమురు వంకతో రష్యా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి చుట్టూ గిరగరా తిరుగుతూ.. -
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో సేవలకు అంతరాయం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్‌లైన్ మెట్రో రూట్లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
క్రిభ్కో పనుల అడ్డగింత
వెంకటాచలం: సర్వేపల్లి పంచాయతీ ముత్యాలగుంట క్రిభ్కో నిర్మాణ పనులను స్థానికులు బుధవారం అడ్డుకున్నారు. గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మా అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తూ మాపై కేసులు పెడతారా అంటూ మహిళలు మండిపడ్డారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేనివారికి, ఇతర అవసరాలకు కొంత స్థలం వదిలి ప్రహరీ నిర్మించుకోవాలని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోలేదన్నారు. ప్రహరీ నిర్మాణ పనులు జరక్కుండా అడ్డంగా కూర్చున్నారు. మహిళా పోలీసుల చేత మహిళలను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. వారు ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. సీఐ శ్రీనివాసరెడ్డి ఫోన్లో ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లుతో చర్చించారు. క్రిభ్కో ప్రతిని«ధులతో మాట్లాడి ఇళ్ల స్థలాలకు స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడతామని ఆర్డీవో చెప్పడంతో ఆందోళన విరమించారు. -
క్రిభ్కో పనులు అడ్డగింత
కంపెనీ ప్రతినిధులతో పనబాక కృష్ణయ్య చర్చలు వెంకటాచలం: మండలంలోని ముత్యాలగుంటలో జరుగుతున్న క్రిభ్కో నిర్మాణ పనులను గ్రామస్తులు శనివారం ఉదయం అడ్డుకున్నారు. నివాసాల సమీపంలో క్రిభ్కో ప్రహరీ నిర్మించవద్దని గత వారం రోజులుగా గ్రామస్తులు పనులను అడ్డుకోవడంతో శుక్రవారం పోలీసు బందోబస్తుతో పనులు ప్రారంభించారు. అడ్డుకుంటే కేసులు నమోదు చేయిస్తామని భయపెట్టడంతో స్థానికులు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శనివారం ఉదయం ముత్యాలగుంటకు వచ్చి మహిళలతో పనులను అడ్డుకుని నిలిపి వేయించారు. ఆయన క్రిభ్కో ప్రతినిధులతో మాట్లాడారు. 288 ఎకరాల్లో క్రిభ్కో పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటూ గ్రామస్తులు అడిగిన కొద్దిమేర స్థలాన్ని వదులు కోలేరా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో గ్రామ అవసరాల కోసం స్థలాన్ని వదలకుండా మొత్తం భూమిని రెవెన్యూ అధికారులు క్రిభ్‌కోకు కేటాయించడం సరికాదన్నారు. ఈ సమస్యను తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. క్రిభ్కో ప్రతినిధులు తాత్కాలికంగా పనులు నిలపివేయాలని సూచించారు. కొందరికి పరిహారం ఇవ్వకుండానే పనులు చేస్తున్నారని వాపోయారు. ఆయన వెంట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సీతారాంబాబు, సేవాదళ్ అధ్యక్షుడు శివప్రసాద్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆర్వీ రమణయ్య, వెంకటాచలం మండల అధ్యక్షుడు నక్కా ఈశ్వరయ్య పాల్గొన్నారు. -
వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ పెళ్లి నాలుగోసారీ ఆగిపోయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. పెళ్లి కొడుకు డ్రెస్‌లో తను దిగిన ఫోటోతో పాటు ఈ వారంలో నా నాలుగో పెళ్లి కూడా ఆగిపోయింది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పెళ్లిళ్లన్నినిజంగా కాదులెండి... సినిమాలోనే.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల్లో కూడా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందంటూ చమత్కరించాడు. తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు ఓ పక్కా ఫార్మాట్ ఉంది. హీరో పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి సెట్ అవ్వటం, ఆ పెళ్లి పీటల మీద వరకు వచ్చాక, హీరో వీరోచితంగా పోరాడి ఆ పెళ్లి ఆపేసి హీరోయిన్ను దక్కించుకోవటం తెలుగు సినిమాల్లో కామన్‌గా కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి రోల్స్ వరుసగా చేస్తున్న వెన్నెల కిశోర్ వరుసగా పెళ్లిళ్లు చెడగొట్టేసుకుంటున్నాడు. అలా ఈ వారం తాను నటించిన నాలుగు పెళ్లి సీన్లను గుర్తు చేసుకుంటూ అభిమానులకు ఫన్నీ ట్రీట్ ఇచ్చాడు. Wedding season in movies too i guess..my fourth wedding this week and all were halted..#weddingcrashers pic.twitter.com/RCFy3COprq — vennela kishore (@vennelakishore) January 20, 2016 -
ఇంజన్లో పొగలు..ఆగిన రైలు
చిత్తూరు: ఇంజన్లో తలెత్తిన సమస్యకారణంగా పొగలు రావడంతో శేషాద్రి ఎక్స్ ప్రెస్‌ని కుప్పంలో నిలిపేశారు. తొలుత కుప్పం మండలం ఆవులనత్తం వద్ద శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. అలాగే రైలును కుప్పం వరకు డ్రైవర్ తీసుకెళ్లాడు. ఆదే ఇంజన్‌తో ముందుకు వెళ్లడం ప్రమాదమని భావించిన అధికారులు మరో ఇంజన్ కోసం వేచి చూస్తున్నారు. -
'జన్మభూమి' కార్యక్రమాన్ని బహిష్కరించిన గ్రామస్తులు
విజయనగరం (జీఎంవలస) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బసగంగి గ్రామంలో ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. చింతలబెలగాం గ్రామంలో తమకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ వారు ఆదివారం జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.