వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.! | star comedian vennela kishore fourth wedding halted | Sakshi
Sakshi News home page

వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.!

Published Thu, Jan 21 2016 1:58 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.!

వెన్నెల కిశోర్ పెళ్లి మళ్లీ ఆగిపోయింది.!

టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ పెళ్లి నాలుగోసారీ ఆగిపోయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించాడు. పెళ్లి కొడుకు డ్రెస్లో తను దిగిన ఫోటోతో పాటు ఈ వారంలో నా నాలుగో పెళ్లి కూడా ఆగిపోయింది అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పెళ్లిళ్లన్నినిజంగా కాదులెండి... సినిమాలోనే.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల్లో కూడా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందంటూ చమత్కరించాడు.

తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాకు ఓ పక్కా ఫార్మాట్ ఉంది. హీరో పెళ్లి చేసుకోవాలి అనుకునే అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి సెట్ అవ్వటం, ఆ పెళ్లి పీటల మీద వరకు వచ్చాక, హీరో వీరోచితంగా పోరాడి ఆ పెళ్లి ఆపేసి హీరోయిన్ను దక్కించుకోవటం తెలుగు సినిమాల్లో కామన్గా కనిపిస్తోంది. ఇప్పుడు అలాంటి రోల్స్ వరుసగా చేస్తున్న వెన్నెల కిశోర్ వరుసగా పెళ్లిళ్లు చెడగొట్టేసుకుంటున్నాడు. అలా ఈ వారం తాను నటించిన నాలుగు పెళ్లి సీన్లను గుర్తు చేసుకుంటూ అభిమానులకు ఫన్నీ ట్రీట్ ఇచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement