క్రిభ్‌కో పనుల అడ్డగింత
క్రిభ్‌కో పనుల అడ్డగింత
Published Thu, Sep 8 2016 1:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
వెంకటాచలం:
సర్వేపల్లి పంచాయతీ ముత్యాలగుంట క్రిభ్‌కో నిర్మాణ పనులను స్థానికులు బుధవారం అడ్డుకున్నారు. గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మా అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తూ మాపై కేసులు పెడతారా అంటూ మహిళలు మండిపడ్డారు. గ్రామంలో ఇళ్ల స్థలాలు లేనివారికి, ఇతర అవసరాలకు కొంత స్థలం వదిలి ప్రహరీ నిర్మించుకోవాలని అధికారులకు తెలియజేస్తే పట్టించుకోలేదన్నారు. ప్రహరీ నిర్మాణ పనులు జరక్కుండా అడ్డంగా కూర్చున్నారు. మహిళా పోలీసుల చేత మహిళలను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. వారు ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. సీఐ శ్రీనివాసరెడ్డి ఫోన్‌లో ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లుతో చర్చించారు. క్రిభ్‌కో ప్రతిని«ధులతో మాట్లాడి ఇళ్ల స్థలాలకు స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడతామని ఆర్డీవో చెప్పడంతో ఆందోళన విరమించారు.
Advertisement