Natural gas pipeline
-
అది ఆయుధమా? నాన్సెన్స్: పుతిన్ ఫైర్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యూరప్ దేశాల తీరుపై తీవ్రంగా స్పందించారు. యూరప్‌కు వెళ్లే సహజ వాయువుల పైప్‌లైన్‌ను క్రెమ్లిన్ నిలిపివేసిందంటూ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. పసిఫిక్ తీర నగరమైన వ్లాదివోస్టోక్‌లో ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. రష్యా ‘ఎనర్జీ’ని ఆయుధంగా ఉపయోగిస్తోందని వాళ్లు అంటున్నారు. నాన్సెన్స్.. అది ఆయుధమా?. విజ్ఞప్తులకు తగ్గట్లుగా సహజ వాయువులను మేం సరఫరా చేస్తూ వస్తున్నాం. పైగా మేమేం ఆంక్షలను విధించే వాళ్లం కాదూ.. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం అందించే రకం అంటూ పరోక్షంగా అమెరికాకూ చురకలు అంటించారాయన. రష్యా చమురు దిగ్గజం గాజ్ప్రోమ్ శుక్రవారం సహజవాయువు పైప్‌లైన్‌ను ఆపేసింది. అయితే మెయింటెనెన్స్ కోసమే దానిని బంద్ చేసినట్లు తర్వాత స్పష్టత ఇచ్చింది గాజ్ప్రోమ్. అయినా కూడా.. యూరప్ దేశాలు చమురును నిలిపివేశాయంటూ రష్యాపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయన్న కారణంతో యూరోపియన్ దేశాలకు మధ్యమధ్యలో గ్యాస్ సరఫరాను తగ్గిండమో.. నిలిపివేయడమో చేస్తూ వస్తోంది రష్యా. అయితే ఈయూ మాత్రం.. చమురు వంకతో రష్యా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి చుట్టూ గిరగరా తిరుగుతూ.. -
టారిఫ్‌ల సవరణ: గ్యాస్ షేర్లు రయ్రయ్
ముంబై, సాక్షి: గ్యాస్ రవాణా టారిఫ్‌లకు సంబంధించి పెట్రోలియం, సహజవాయు నియంత్రణ సంస్థ(పీఎన్జీఆర్బీ) తాజాగా సవరణలు ప్రకటించింది. యూనిఫైడ్ గ్యాస్ ప్రసార టారిఫ్‌లను సరళీకరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రెండు జోన్ల స్ట్రక్చర్ ఆధారంగా గ్యాస్ లభ్యత, దూరాలకు అనుగుణంగా సవరణలు చేపట్టింది. తద్వారా దూరప్రాంత వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. గ్యాస్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెరుగుతాయని తెలియజేశాయి. జాతీయ గ్రిడ్‌కు అనుసంధానమైన సుమారు 12 పైప్లైన్లకు సంబంధించి యూనిఫైడ్ టారిఫ్‌ల సరళీకరణకు పీఎన్జీఆర్బీ తెరతీసినట్లు వివరించాయి. దీంతో గ్యాస్ పంపిణీ కంపెనీల కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కంపెనీల షేర్లన్నీ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (మార్కెట్లు వీక్- షుగర్ షేర్లు స్వీట్) యమస్పీడ్.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో గుజరాత్ స్టేట్ పెట్రోనెట్(జీఎస్పీఎల్), అదానీ గ్యాస్, మహానగర్ గ్యాస్, గుజరాత్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్ కౌంటర్లు ఆటుపోట్ల మార్కెట్లోనూ సందడి చేస్తున్నాయి. తొలుత రూ. 228ను అధిగమించిన జీఎస్పీఎల్ షేరు ప్రస్తుతం 9.25 శాతం ఎగసి రూ. 225 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఇంద్రప్రస్థ గ్యాస్ 13 శాతం దూసుకెళ్లి రూ. 505 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515కు చేరింది. ఇక తొలుత రూ. 1,058కు చేరిన మహానగర్ గ్యాస్ 12.4 శాతం జంప్‌చేసి రూ. 1,044 వద్ద కదులుతోంది. అదానీ గ్యాస్ తొలుత 9 శాతం వృద్ధితో రూ. 345కు చేరింది. ప్రస్తుతం 4.3 శాతం లాభంతో రూ. 330 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా గుజరాత్ గ్యాస్ 5 శాతం బలపడి రూ. 360 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో దాదాపు 20 శాతం పురోగమించి రూ. 412ను దాటేసింది. కాగా.. గెయిల్ షేరు 1 శాతం లాభంతో రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107కు చేరింది. -
మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం
- కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల డిమాండ్ తాడేపల్లిగూడెం : సహజ వాయువు పైపులైన్ పేలుడు ఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో పేలుడు ప్రాంతాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన చూశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రదాన్‌ను మంత్రి కోరారు . మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారంతోపాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చమురు, సహజవాయువులను వెలికితీసే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతూ స్థానిక ప్రజలు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారని, అయితే ప్రయోజనాలు మాత్రం ఇతర రాష్ట్రాలకు చేకూరుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒఎన్జీసీ కేటాయించే కేంద్రీయ అభివృద్ధి నిధులను కచ్చితంగా స్థానికంగానే ఖర్చు చేయాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రదాన్ సానుకూలంగా స్పందించారన్నారు. నగరం గ్రామ పరిధిలో మూడు వేల మందికి ఉదయం, రాత్రి దేవాదాయశాఖ తరపున మంత్రి మాణిక్యాలరావు భోజనాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి మాణిక్యాలరావును అభినందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు మంత్రితోపాటు ఉన్నారు. -
గ్యాస్ తుస్....
గ్రేటర్ హైదరాబాద్‌లో పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) తుస్సుమంది. ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నేచురల్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా నేరుగా వంటింటికే సరఫరా చేయాలన్న లక్ష్యంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) ప్రారంభించిన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’ పూర్తిగా అభాసుపాలైంది. బీజీఎల్ ఆదిలో చేసిన హడావుడి ఆచరణలో లేకుండా పోవడంతో.. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ కారు చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలు అడియాసలయ్యాయి. 2014 ఏప్రిల్ నాటికి హైదరాబాద్‌లో లక్ష కుటుంబాలకు పీఎన్జీ అందించాలన్నది బీజీఎల్ తొలిదశ లక్ష్యం కాగా.. ఇప్పటికి కేవలం 440 కుటుంబాలకే అదిపరిమితమైంది. పైప్‌లైన్ పనుల విస్తరణ 32 కిలోమీటర్లు దాటక పోగా, కనెక్షన్లు అందించిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా మోతాదుకు మించడం లేదు. సాక్షి, సిటీబ్యూరో : ఇంటింటికీ గ్యాస్ అందించాలనే మహత్తర ఆశయం నీరుగారిపోయింది. చౌకగా గ్యాస్ ముంగిట్లోకి వస్తుందనుకున్న సీటీజనుల ఆశలు అడియాసలైపోయాయి. నగరంలో ఇంటింటీకి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ గ్యాస్ (సీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్)’ సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఆదిలో చురుగ్గా పనులు సాగినా ఆ తర్వాత ఆగిపోయాయి. బీజీఎల్ లక్ష్యాలివీ... హైదరాబాద్‌లో ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ఏర్పాటు ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చే సేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టు సిద్ధమైనట్లు బీజేఎల్ తన అధికారిక నివేదికలో స్పష్టం చేసింది. సుమారు రూ.3,166 కోట్లతో 20 ఏళ్లలో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలన్నది తమ ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. పరిమితంగా పైప్‌లైన్ వంటగ్యాస్ నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలుత శామీర్‌పేట మదర్స్టేషన్కు సమీపంలోని నల్సార్ వర్శిటీ క్యాంపస్‌లోగల 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు అందించింది. ఆ తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చింది. వాస్తవంగా మేడ్చల్‌లో సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి అప్పటి సీఎం ద్వారా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కార్యక్రమం వాయిదా పడటంతో కొన్ని కనెక్షన్లను అందించి చేతులు దులుపుకొంది. ఆ తర్వాత కొత్త కనెక్షన్ల జోలికే వెళ్లలేదు. నగరవాసుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ పైప్‌లైన్ గ్యాస్ కలగానే మిగిలిపోయింది. అడుగు దాటని పనులు ప్రారంభం నుంచీ పైప్‌లైన్ పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గతేడాది వరకు శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 32 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయి. ఏడాది కాలంగా పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు. మరోవైపు సుచిత్ర, కొంపల్లి, జీడిమెట,్ల బంజారాహిల్స్ మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. కాగా, పైప్‌లైన్ గ్యాస్ పనులపై ఏప్రిల్ తర్వాతే నిర్ణయం తీసుకొంటామని బీజీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. సీఎన్జీ కూడా అంతంతే.. మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ పురోగతి లేకుండా పోయింది. శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా లే దు. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85వేల ఆటోలు, 7,500 బస్సులు, 20వేలకు పైగా ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా వేసి మరీ సరఫరాకు బీజీఎల్ సిద్దమైంది. ప్రాజెక్టు తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు సంబంధించిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా.. ప్రసుతం 110 బస్సులకే పరిమితం చేసింది. మిగిలిన బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. ప్రైవేటు వాహనాల కోసం 12 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ గ్యాస్ సరఫరా కావడం లేదు.