మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం | Compensation of Rs 25 lakh to the family of the deceased | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం

Published Sat, Jun 28 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం

మృతుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం

- కుటుంబానికో ఉద్యోగం ఇవ్వాలి
- దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల డిమాండ్
తాడేపల్లిగూడెం :
సహజ వాయువు పైపులైన్ పేలుడు ఘటనలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా నగరంలో పేలుడు ప్రాంతాన్ని శుక్రవారం సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన చూశారు.

బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రదాన్‌ను మంత్రి కోరారు . మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారంతోపాటు ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చమురు, సహజవాయువులను వెలికితీసే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరుగుతూ స్థానిక ప్రజలు తీవ్ర కష్ట నష్టాలకు గురవుతున్నారని, అయితే ప్రయోజనాలు మాత్రం ఇతర రాష్ట్రాలకు చేకూరుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒఎన్‌జీసీ కేటాయించే కేంద్రీయ అభివృద్ధి నిధులను కచ్చితంగా స్థానికంగానే ఖర్చు చేయాలని కోరారు.

ఉద్యోగ నియామకాల్లో 50 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి ప్రదాన్ సానుకూలంగా స్పందించారన్నారు. నగరం గ్రామ పరిధిలో మూడు వేల మందికి ఉదయం, రాత్రి దేవాదాయశాఖ తరపున  మంత్రి మాణిక్యాలరావు భోజనాలు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు మంత్రి మాణిక్యాలరావును అభినందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.హరిబాబు తదితరులు మంత్రితోపాటు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement