న్యూఢిల్లీ: గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈయూ అప్రూవల్‌కి కొంత టైం పట్టొచ్చని సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటించడం, కొవిషీల్డ్‌కు ఈయూలోని కొన్ని దేశాలు పరిమితులతో అనుమతించడంతో ఈ విషయం చల్లబడింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కొవిషీల్డ్ ఆథరైజేషన్ కోసం సీరమ్ ఇండియా అసలు ఈయూ మెడికల్ బాడీకి రిక్వెస్ట్ అప్లికేషన్ పంపలేదని తేలింది!.
ఈ మేరకు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్‌ల తయారీదారులు ఫార్మాలిటీకి ఒక మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ పంపాల్సి ఉంటుందని, కానీ, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌కు సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్లికేషన్ మాకు అందలేద’ని స్పష్టం చేసింది. అలాగే ఈయూ దేశాల వ్యాక్సిన్‌లు, మెడిసిన్స్‌కు సంబంధించి మాత్రమే అంతిమ నిర్ణయాలు తమ చేతుల్లో ఉంటాయని ఈఎంఏ స్పష్టం చేసింది.
For the #COVID19vaccine Covishield to be evaluated for use in the EU, the developer needs to submit a formal marketing authorisation application to EMA, which to date has not been received. #EMAPresser
— EU Medicines Agency (@EMA_News) July 15, 2021
ఇదిలా ఉంటే ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ మొదటి నుంచి డిజిటల్కొవిడ్ సర్టిఫికెట్(గ్రీన్ పాస్) ఇవ్వడంలేదు. తయారీలో స్వల్ఫ తేడాల వల్ల వ్యాక్సిన్ తుది ఫలితం వేరుగా ఉంటుందని, కాబట్టి, తమ అనుమతులు తప్పనిసరని ఈయూ ఇదివరకే స్పష్టం చేసింది. ఆ అనుమతుల కోసమే సీరం ఇండియా ఒక అప్లికేషన్ పంపాల్సి ఉండగా.. ఇంతవరకు పంపలేదని ఇప్పుడు తెలిసింది.
దీంతో ఆయా దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులు(కొవిషీల్డ్ తీసుకున్నవాళ్లు) కఠిన క్వారంటైన్ ప్రొటోకాల్స్‌ను పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈయూలోని కొన్ని దేశాలు అనుమతించకపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆల్రెడీ అప్లికేషన్ పంపామని ప్రకటించిన సీరమ్ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment