Serum Institute Of India
-
సినిమాల్లోకి ‘సీరమ్’!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌తో చిరపరిచితమైన వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సినిమాల నిర్మాణంలోకి ప్రవేశిస్తోంది. కంపెనీ సీఈవో అదార్ పూనావాలా ఏర్పాటు చేసిన సిరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 1,000 కోట్లు వెచ్చించనుంది. ధర్మ ప్రొడక్షన్స్, ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్లలో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సిరీన్ ప్రొడక్షన్స్ వెల్లడించింది. దీంతో ధర్మలో 50 శాతం వాటాను సిరీన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకోనుంది. మిగిలిన 50 శాతం వాటాతోపాటు యాజమాన్యాన్ని కరణ్ జోహార్ కలిగి ఉంటారని సిరీన్ స్పష్టం చేసింది. వెరసి పూనావాలా పెట్టుబడులు ధర్మ విలువను రూ. 2,000 కోట్లుగా నిర్ధారించాయి. ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ధర్మ, సిరీన్ సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటైనట్లు సిరీన్ పేర్కొంది. సినిమాల నిర్మాణంలో ధర్మకున్న నైపుణ్యం, అదార్ పూనావాలాకున్న వనరులు ఇందుకు తోడ్పాటునివ్వగలవని అభిప్రాయపడింది. ధర్మ మరింత పురోభివృద్ధిని సాధిస్తుందని, మరింత ఎత్తుకు ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తాజా పెట్టుబడులపై స్పందిస్తూ పూనావాలా పేర్కొన్నారు. భవిష్యత్ దృక్పథ వ్యూహాలు, నైపుణ్యంతోకూడిన సినిమాల నిర్మాణాల సక్రమ కలయికను తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నదని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు. బాధ్యతలు ఇలా: కంపెనీ నూతన ఏర్పాటులో భాగంగా ధర్మకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కరణ్ జోహార్ సృజనాత్మక కార్యక్రమాలను రూపొందిస్తారు. సీఈవోగా అపూర్వ మెహతా వ్యూహాత్మక మార్గదర్శకుడిగా కరణ్‌తో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు. కంటెంట్ నిర్మాణం, పంపిణీ, ఆధునిక టెక్నాలజీలను ఏకీకృతం చేయడం, ప్రొడక్షన్ విధానాలను మెరుగుపరచడం, ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం తదితర కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు సిరీన్ వివరించింది. దేశీయంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజా డీల్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదర్ పూనావాలా' ఇటీవల 'ఫెరారీ పురోసాంగ్యూ' కొనుగోలు చేశారు. దీని ధర దాదాపు రూ. 10.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అదర్ పూనావాలా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం.. ఇది ఇండియాలో కొనుగోలు చేసింది కాదని తెలుస్తోంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు నీరో డేటోనా షేడ్‌లో ఉండటం గమనించవచ్చు. ఎల్లో కలర్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు బ్లాక్-అవుట్ ఎక్ట్సీరియర్ పొందుతుంది. ఇంటీరియర్ కూడా ఇదే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కలయికతో ఉండటం చూడవచ్చు.అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి.. 725 పీఎస్ పవర్, 716 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ధర పరంగా ఫెరారీ కారు దాని ప్రత్యర్థుల కంటే ఎక్కువ.అదార్ పూనావాలా గ్యారేజిలో ఫెరారీ పురోసాంగ్యూ మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్, ఫెరారీ 488 పిస్టా సూపర్‌కార్, బెంట్లీ బెంటెగా EWB, పోర్స్చే కయెన్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్600, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ మొదలైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by Automobili Ardent India (@automobiliardent) -
ఆస్ట్రాజెనెకాకు మరో షాక్, ఈ వాక్సీన్‌తోనే బిడ్డను కోల్పోయా ఓ తండ్రి కోర్టుకు
కోవిడ్ వ్యాక్సీన్‌ను తయారు చేసిన ప్రముఖ ఫార్మా కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ఒక యువతి తల్లిదండ్రులు సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)పై దావా వేశారు. బ్రిటన్‌కి చెందిన ఫార్మా దిగ్గజంపై పిటీషన్ దాఖలు చేశారు.ఇటీవల ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా తమ వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డ కట్టడం, తక్కువ ప్లేట్ లెట్ కౌంట్‌కి సంబంధించి అరుదైన దుష్ప్రభావాల ఆరోపణలు, వీటిని ఆస్ట్రాజెన్‌కా కూడా అంగీకరించిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. కారుణ్య పుట్టిన రోజు మే 1. మా తొలి వివాహ వార్షికోత్సవ గిప్ట్ నా పాప. ఇపుడు అందనంతదూరంలో- వేణుగోపాల్ తమ 20 ఏళ్ల కుమార్తె కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తర్వాత జూలై 2021లో మరణించిందని తండ్రి వేణుగోపాలన్ గోవిందన్ ఎక్స్‌లో ఆరోపించారు. డేటా సైన్స్ స్టూడెంట్ కారుణ్య టీకా తీసుకున్న ఒక నెల తర్వాత అనారోగ్యానికి గురైంది. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత ఆమె మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమెటరీ సిండ్రోమ్ కారణంగా మరణించింది. వ్యాక్సిన్ తీసుకున్న 8 రోజుల తర్వా ఆమె తీవ్రమైన సంస్యల బారినపడిందని, నెల తర్వాత మరణించిందని తండ్రి వేణుగోపాల్ గోవిందన్ ఆరోపించరాఉ. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు.అలాగే ఇంత నష్టం జరిగిన తరువాత ఆస్ట్రాజెన్‌కా తప్పు ఒప్పుకోవడంపై వేణుగోపాలన్ మండి పడ్డారు. రక్తం గడ్డకట్టడం వల్ల సంభవించే మరణాలపై 15 యూరోపియన్ దేశాలు వ్యాక్సీన్ వినియోగాన్ని పరిమితం చేసిన తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ సరఫరాని నిలిపేయాల్సి ఉండాల్సిందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు న్యాయం కోసం వివిధ న్యాయస్థానాల్లో పోరాడుతున్నప్పటికీ విచారణకు నోచుకోవడం లేదని తన పోస్టులో పేర్కొన్నారు. 8 మంది బాధిత కుటుంబాల తరుపున తమ భావాలను ప్రతిధ్వనిస్తున్నామని వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయినందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అదార్ పూనావాలా వారి పాపాలకు సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. అలాగే వ్యాక్సిన్‌ని వినియోగంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వ అధికారులను కూడా ఆయన నిందించారు. ఈ మేరకు వేణుగోపాలన్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై సీరం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.Thanks to @Teensthack for this article. 🙏I missed to tell Teena that today (May 1st) is Karunya's birthday and she was the first wedding anniversary gift to me and my wife from the heavens. 😭Perhaps due to editorial/space constraints few core points I gave missed to make… pic.twitter.com/bjJjHOc1aM— Venugopalan Govindan (@gvenugopalan) May 1, 2024 2021లో తమ కుమార్తె రితైక(18)ను కోల్పోయిన రచనా గంగూ కుమార్తె మరణంపై విచారణ జరిపేందుకు మెడికల్ బోర్డును నియమించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలులు చేశారు. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో క్లాస్ యాక్షన్ దావాను ఎదుర్కొంటోంది.కాగా వ్యాక్సిన్ వల్ల థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్‌తో సహా మరణాలు మరియు తీవ్రమైన గాయాలు సంభవించాయని ఆరోపిస్తూ క్లాస్-యాక్షన్ దావా నుండి చట్టపరమైన చర్యను ఎదుర్కొంటోంది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారతదేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ‘కోవిషీల్డ్’ పేరుతో తయారు చేసి, విక్రయించిన సంగతి తెలిసిందే. -
మలేరియా వ్యాక్సిన్ తయారీపై ‘సీరమ్’ దృష్టి!
ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(పూణె) మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ తర్వాత తమ సంస్థ మలేరియా వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించిందని తెలిపారు. మలేరియా వ్యాక్సిన్ తయారు చేసేందుకు కంపెనీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకుందని అదార్ పూనావాలా తెలిపారు. సంస్థకు పది కోట్ల డోసుల మలేరియా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా దీనిని మరింత పెంచవచ్చన్నారు. మలేరియా వ్యాక్సిన్ తయారీలో టెక్నాలజీ బదిలీ ఒప్పందంతో పాటు వ్యాక్సిన్ల ఎగుమతిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాక్సిన్ తయారీపై కూడా దృష్టిపెట్టామన్నారు. ఏటా లక్షల మంది డెంగ్యూ, మలేరియా బారిన పడుతున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ గతంలో కరోనా నివారణకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారుచేసింది. ఇప్పుడు దీనికి డిమాండ్ తగ్గడంతో తక్కువ స్థాయిలో యాంటీ కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. -
బెజోస్ ప్రియురాలితో నటాషా పూనావాలా స్టెప్పులు; ఫోటోలు, వీడియో వైరల్
ప్రముఖ వ్యాక్సిన్ మేకర్ సీరంసీఈవో అదార్ పూనావాలా భార్య, సీరంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాషాపూనావాలా మరోసారి ఒక అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసారు. ప్రముఖ గాయని సల్మా హాయక్ సహ-అధ్యక్షురాలిగా ఉన్న కెరింగ్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవానికి హాజరైనఅతిథులలో ఫ్యాషన్ మొగల్ నటాషా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ షియాపరెల్లి గౌనులో నటాషా తనదైన ఫ్యాషన్ స్టయిల్లో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్, సల్మాతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించి వీడియోను, ఫోటోలను నటాషా పూనావాలా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరితోపాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకు ఫోటోలు, వీడియోలను, సల్మా హాయక్ , లారెన్ శాంచెజ్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 12న అమెరికాలో మాన్హాటన్లో సల్మా హాయక్ ఇచ్చిన కేరింగ్ ఫర్ ఉమెన్ డిన్నర్ ఈవెంట్లో పలువురుమహిళా ప్రముఖులు స్పెషల్ గెస్ట్‌లు విచ్చేశారు. ముఖ్యంగా నటి ఓప్రా విన్ఫ్రే తన ప్రసంగంతో ఆకట్టుకుంది. ఇంకా మలాలా, నికోల్ కిడ్మాన్, కిమ్ కర్దాషియాన్, ఒలివియా వైల్డ్ లారెన్ శాంటో డొమింగో, ఎల్సా కాలిన్స్, జూలియా గార్నర్, లియోనార్డో డికాప్రియో, కింబాల్ మస్క్, క్రిస్టియానా మస్క్, డెరెక్ బ్లాస్బర్గ్ లాంటి వారున్నారు. 'కేరింగ్ ఫర్ ఉమెన్' విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా లింగ-ఆధారిత హింసను ఎదుర్కోవడానికి ,మహిళలు ,పిల్లలపై హింకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా ఉందని పేర్కొంది. View this post on Instagram A post shared by Lauren Sanchez (@laurenwsanchez) View this post on Instagram A post shared by Salma Hayek Pinault (@salmahayek) View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) -
మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: తగిన డిమాండ్ లేకపోవడం, కోవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్ కోవిడ్ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్ బూస్టర్ డోసులు అందుబాటులో ఉన్నాయి. వయోజనులు కచ్చితంగా బూస్టర్ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్ ఉత్పత్తిని సీరమ్ సంస్థ 2021 డిసెంబర్లో నిలిపేసింది. -
హైదరాబాద్: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్ సైరస్ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు. ఆదివారం వర్చువల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి సీవోఈ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ రాజధానిగా పరిగణించబడే హైదరాబాద్ నగరానికి అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీవోఈని నెలకొల్పుతుండటాన్ని ఆయన స్వాగతించారు. ఐఐపీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణ, మహమ్మారి ముప్పులను అంచనా వేయడానికి, నివారించడానికి, తగ్గించడానికి సీవోఈ సహాయపడుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం. నాగప్పన్ పాల్గొన్నారు. -
కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా
పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్ మేకర సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్లో పేర్కొన్నారు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా. The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA. — Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022 కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్‌నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. ఇదీ చదవండి: కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..
ముంబై: ‘‘కోవిషీల్డ్ టీకా సైడ్ ఎఫెక్ట్స్ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్ దిలీప్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు ఆగిపోతున్న వ్యాక్సిన్ల ఉత్పత్తి
కరోనా విషయంలో పరస్పర విరుద్ధమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఓ వైపు కేసులు పెరుగుతుంటే మరో వైపు వ్యాక్సిన్లు అమ్ముడుపోక ఫార్మా కంపెనీలు లబోదిబోమంటున్నాయి. తమ దగ్గర నిల్వ ఉన్న స్టాకును ఉచితంగా అయినా ఇచ్చేందుకు సై అంటున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు మార్కెట్లో డిమాండ్ లేనందున తమ ఫ్యాక్టరీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పూనేలో ఉన్న తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే 20 కోట్ల కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం నిల్వ ఉన్న డోసులు 2021 డిసెంబరులో తయారు చేసినవిగా తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్లు ఉత్పత్తి నుంచి 9 నెలల పాటు వాడుకునే వీలుంది. డిసెంబరు స్టాకే ఇంకా క్లియర్ కాకపోవడంతో కొత్తగా తయారీ వృధా అనే అంచనాలతో సీరమ్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఎవరైనా అడిగితే ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని కూడా చెబుతోంది. గత డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ప్రపంచ దేశాలు అలెర్ట్ అయ్యాయి. విమాన సర్వీసులు రద్దు చేశాయి. కరోనా ఆంక్షలు విధించాయి. అయితే ఒమిక్రాన్‌తో ముప్పు తక్కుగా ఉండటంతో 2022 ఫిబ్రవరి నుంచి క్రమంగా ఆంక్షలు తొలగించాయి. దీంతో సాధారణ జీవితం మొదలైంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో ఏప్రిల్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మళ్లీ మాస్క్ తప్పనిసరంటూ ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయ తాండవం చేసింది. లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. ఆ వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తమై వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశాయి. వ్యాక్సిన్ మిత్ర పేరుతో విదేశాలకు ఎగుమతి చేస్తున వ్యాక్సిన్లపై నిషేధం విధించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉంటే అన్నింటినీ ఇండియాలోనే ఉపయోగించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం 2021 డిసెంబరులో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూడటంతో మరోసారి బూస్టర్ డోసును కూడా అందించారు. ఆ తర్వాత ప్రైవేటు సెక్టారులో కూడా వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఆంక్షలన్నీ తొలగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో కరోనా వ్యాక్లిన్లకు డిమాండ్ లేదు. దీంతో ఒక్కో కంపెనీ ఉత్పత్తి నిలిపేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే యూఎస్‌కి ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ ఈ ప్రటకన చేయగా తాజాగా ఇండియన్ ఫార్మా కంపెనీ సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైతం ఇదే తరహా నిర్ణయం వెలువరించింది. చదవండి👉🏾 జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం ! -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్‌ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్‌ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్‌కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ?
కరోనా తీవ్రత తగ్గి జనజీవతం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.అయితే ఇప్పటికీ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోలేదు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో 18 ఏళ్లు పైబడి ఇప్పటికే రెండు డోసులు పూర్తి చేసుకున్నవారు బూస్టర్ డోసు వేసుకోవడం మంచిందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తరుణంలో బూస్టర్ డోస్‌ను ఓపెన్ మార్కెట్లో అందిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. దేశంలోనే తొలి కరోనా టీకా కోవిషీల్డ్‌ని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసింది. మొదటి రెండు డోసులు దాదాపుగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది. కాగా బూస్టర్ డోసును ప్రభుత్వ ఆధ్వర్యంతో ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం అందించింది. కాగా ఇప్పుడు బూస్టర్ డోసును ఓపెన్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో బయట మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోసుకు రూ. 600లుగా సీరమ్ నిర్ణయించింది. దీనికి స్థానిక పన్నులు అదనం అని సీరమ్ స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా కొనుగోలుకు రూ. 600 ధర వర్తిస్తుందని, ఆస్పత్రులకు తక్కువ ధరకే సరఫరా చేస్తామని కూడా తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2022 ఏప్రిల్ 10 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌వర్కర్లు 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును ప్రభుత్వం ఉచితంగా అందివ్వనుంది. #LargestVaccineDrive Precaution/ booster Dose to be now available to all 18+ population group from 10th April, 2022, at Private Vaccination Centres.https://t.co/f0QDul20gz#CovidVaccine #IndiaFightsCorona @narendramodi @mansukhmandviya @blsanthosh @saudansinghbjp pic.twitter.com/dinGOwC4aq — Tajinder Singh Sran (@TajinderSTS) April 8, 2022 చదవండి: గుడ్ న్యూస్: బహిరంగ మార్కెట్లో విక్రయానికి 2 వ్యాక్సిన్లకు అనుమతి -
కోవోవ్యాక్స్‌కు అనుమతివ్వండి
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ని కోరింది. కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి వాడొచ్చంటూ డిసెంబర్ 28వ తేదీన డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా పూర్తి డోసులు తీసుకుని కనీసం మూడు నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసుగా కోవోవ్యాక్స్‌ను ఇచ్చేందుకు ఫేజ్–3 ట్రయల్స్ జరుపుతామంటూ ఎస్ఐఐ దరఖాస్తు చేసుకుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)లో ప్రభుత్వ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఆదివారం చెప్పారు. -
కోవోవ్యాక్స్, మొల్న్యుపిరావర్ అత్యవసర వాడుకకు సిఫార్సు
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టే ప్రక్రియలో సీరమ్ సంస్థ తయారీ కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు అనుమతించవచ్చని సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అదేవిధంగా కరోనా చికిత్సలో మొల్న్యుపిరావర్ మాత్రల ఉత్పత్తి, అత్యవసర వినియోగ అనుమతికి కూడా పచ్చజెండా ఊపింది. కోవోవ్యాక్స్పై నిపుణుల కమిటీ రెండుమార్లు పరిశీలన జరిపి చివరకు కొన్ని పరిస్థితుల్లో అత్యవసరంగా వాడేందుకు అనుమతించవచ్చని సిఫార్సు చేసింది. ఇప్పటికే ఈ టీకా ఎమర్జన్సీ వాడుకకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించింది. కరోనా సోకిన వయోజనుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోయి, రిస్కు పెరిగిన సందర్భాల్లో మొల్న్యుపిరావర్ను వినియోగించవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఈ ఔషధాన్ని డా. రెడ్డీస్ సహా పలు కంపెనీ కన్సార్టియం ఉత్పత్తి చేస్తోంది. ఐదు రోజుల కన్నా ఎక్కువ రోజులు దీన్ని వాడకూడదని, గర్భిణీలకు ఇవ్వకూడదని కమిటీ సిఫార్సు చేసింది. -
కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ ఓకే
న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కోవోవాక్స్ టీకాను అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ నుంచి సీరమ్ లైసెన్సులు పొంది దీన్ని రూపొందిస్తోంది. సంస్థ నిర్ణయం కరోనాపై పోరులో మరో మైలురాయిగా సీరమ్ సీఈఓ అధార్ పూనావాలా అభివర్ణించారు. వచ్చే ఆరు నెలల్లో దీనిని విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల అధార్ చెప్పారు. ప్రస్తుతం ఇది ట్రయిల్స్ దశలో ఉంది. ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని కంపెనీ తెలిపింది. కొత్త టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసినట్లు సీరమ్ గత నెలలో వెల్లడించింది. నోవావాక్స్ రూపొందించిన NVX& CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లకు భిన్న సాంకేతికతతో నోవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. డీజీసీఐ తనిఖీల ఫలితాల ఆధారంగా నోవోవాక్స్ వాడేందుకు అత్యవసర అనుమతినిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే భారత్‌లో దీని అత్యవసర వినియోగానికి డీజీసీఐ నుంచి అనుమతులురావాల్సిఉంది. ప్రస్తుతం 18ఏళ్లు పైబడినవారికే భారత్‌లో కరోనా టీకాలు ఇస్తున్నారు . -
కోవిషీల్డ్ బూస్టర్ కోసం సీరమ్ దరఖాస్తు
న్యూఢిల్లీ: కోవిషీల్డ్ కరోనా టీకాను బూస్టర్ డోసుగానూ అనుమతించాలని కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసుకుంది. రెండు డోస్‌లతోపాటు మూడో(బూస్టర్) డోస్‌గానూ పంపిణీ చేసేంత స్థాయిలో భారత్‌లో టీకా నిల్వలు ఉన్నాయని కోవిషీల్డ్ తయారీసంస్థ సీరమ్ ఆ దరఖాస్తులో పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ భయాలు భారత్‌లోనూ కమ్ముకుంటున్న ఈ తరుణంలో బూస్టర్ డోస్‌కు దేశంలో డిమాండ్ పెరిగిందని సీరమ్ వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థకు చెందిన కోవిడ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌కు వైద్య, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ఇప్పటికే బూస్టర్ డోస్‌గా ఆమోదించిందని డీసీజీఐకు పంపిన దరఖాస్తులో సీరమ్ ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. -
కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి అనుమతులివ్వండి
న్యూఢిల్లీ: భారత్‌తో పాటు పలు దేశాల్లో 100 కోట్లకు పైగా డోసుల పంపిణీ జరిగినందువల్ల కోవిషీల్డ్‌కు పూర్తిస్థాయి వ్యాపార అనుమతి మంజూరు చేయాలని తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఇండియా (సీఐఐ) డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. భారత్‌లో వినియోగిస్తున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్లకు అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఇదివరకే సమర్పించామని, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కోవిషీల్డ్ టీకాల పంపిణీ జరిగిందని, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని, వ్యాక్సిన్ సమర్థతకు ఇదే నిదర్శనమని సీరమ్ పేర్కొంది. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
బ్రిటన్‌కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను రూపొందించింది. దీన్ని భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్‌లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్‌తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్‌కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్‌ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్‌తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్‌తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
కాక్టైల్ వ్యాక్సిన్ సరైంది కాదు
పుణె: ఒక వ్యక్తికి రెండు వేర్వేరు కంపెనీల కోవిడ్–19 వ్యాక్సిన్లు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుని అందుకున్న సందర్భంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల అవసరం లేదని అన్నారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యాక్సిన్లను మిశ్రమంపై ప్రయోగాలకు అనుమతులు ఇచ్చిన అంశంపై ఆయన మాట్లాడుతూ ‘‘ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చాక మెరుగైన ఫలితాలు రాకపోతే సీరమ్, ఇతర కంపెనీ వ్యాక్సినే మంచిది కాదని అనే అవకాశం ఉంది. అదే విధంగా ఆ కంపెనీ కూడా సీరమ్‌ని నిందించే అవకాశం ఉంటుంది’’అని అన్నారు. రెండు వ్యాక్సిన్ల మిశ్రమాల ఫలితాలపై సరైన డేటా కూడా లేదని పూనావాలా గుర్తు చేశారు. రెడ్ టేపిజం బాగా తగ్గింది కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ టేపిజం, లైసెన్స్ రాజ్ బాగా తగ్గిపోయాయని పూనావాలా కొనియాడారు. అంతకు ముందు పారిశ్రామిక రంగం ఎన్నో గడ్డు రోజుల్ని ఎదుర్కొందని చెప్పారు. అధికారుల నుంచి వేధింపులు, అనుమతులు లభించడంలో జాప్యం వంటి వాటితో పారిశ్రామికవేత్తలు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నారని అన్నారు. గతంలో బ్యూరోక్రాట్లు, ఔషధ నియంత్రణ అధికారుల కాళ్ల మీద పడినంత పని అయ్యేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన మార్కెట్లోకి రావడమే దీనికి నిదర్శనమని పూనావాలా చెప్పారు. -
భారత్‌లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్‌ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్‌లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్‌జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్‌లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్‌ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ విద్యార్థులకు సీరం సీఈవో ఊరట
న్యూఢిల్లీ: విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు రూ.10 కోట్ల ఆర్థికసాయం చేయనున్నట్లు వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, సంస్థ అధిపతి అదార్ పూనావాలా గురువారం ప్రకటించారు. ఇక్కడి నుంచి వెళ్లే భారతీయ విద్యార్థులు కొన్ని దేశాల్లో అక్కడికెళ్లాక క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితులున్నాయి. క్వారంటైన్లో భాగంగా వసతి, భోజనం తదితర ఖర్చులు విద్యార్థులే భరించాలి. వీరికి ఆర్థికసాయం చేసే నిమిత్తం రూ.10 కోట్లు కేటాయించినట్లు పూనావాలా చెప్పారు. ఆర్థికసాయం కోరే విద్యార్థులు ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పూనావాలా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. భారత్‌లో కోవిషీల్డ్ కోవిడ్ టీకా తీసుకున్న విద్యార్థులు తమ దేశంలో క్వారంటైన్లో ఉండాల్సిన పనిలేదని 16 యూరోపియన్ దేశాలు జూలైలో ప్రకటించాయి. కానీ, ఇంకొన్ని దేశాలు క్వారంటైన్ కాలం పూర్తయ్యాకే దేశ భూభాగంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థికసాయానికి పూనావాలా ముందుకొచ్చారు. -
కోవిషీల్డ్ రూ.205.. కోవాగ్జిన్ రూ.215..
న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్‌లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి. కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు.