
సాక్షి, ముంబై: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో టీకా కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి దారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగా మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తాజాగా ప్రైవేటు మార్కెట్లో కోవిషీల్డ్ టీకా ధరలను సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ఒక్కో డోస్ ధర 400 రూపాయలు, ప్రైవేట్ ఆస్పత్రులకు ఇచ్చే ఒక్కో డోస్ ధర రూ.600గా నిర్ణయించింది. నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది. కేంద్రానికి కోవిషీల్డ్ ఒక్కో డోసును 150 రూపాయలకు సీరమ్ సంస్థ అందిస్తోంది.
కాగా వచ్చే రెండు నెలల్లో టీకా ఉత్పత్తిని మరింత పెంచి కొరతను అధఙగమిస్తామని సీరమ్ సంస్థ పేర్కొంది. 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్‌లోనూ అందుబాటులోకి తచ్చెందుకు ప్రయత్నిస్టున్నట్లు వెల్లడించింది. కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కి భారత్ బయోటెక్ ఇస్తోంది. కోవిషీల్డ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక్కో డోసుకు రూ.250 భారం పడుతుంది. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1431, మోడర్నా వ్యాక్సిన్ రూ.2348-2715, సినోవాక్ వ్యాక్సిన్ ఒక్కో డోసు రూ.1027, జాన్సన్ అండ్ జాన్సన్ రూ.734గా ఉంది.
చదవండి: రెమ్‌డెసివిర్ కావాలంటే ఈ నంబర్‌కు వాట్సాప్ చేయండి
IMPORTANT ANNOUNCEMENT pic.twitter.com/bTsMs8AKth
— SerumInstituteIndia (@SerumInstIndia) April 21, 2021
Comments
Please login to add a commentAdd a comment