![Serum may launch Novavax vaccine in India by September: CEO Adar Poonawalla - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/16/Adar%20Poonawalla.jpg.webp?itok=8Kb7Zhtu)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అతి త్వరలోనే మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే విషయంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ 'నోవావాక్స్' క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదార్ పూనావల్లా తెలిపారు. అంతేకాదు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాలని యోచిస్తున్నట్టు కూడా వెల్లడించారు.
నోవావాక్స్ టీకా ఒక మాదిరి నుంచి తత్రీవమైన వైరస్ బాధితుల్లో 100 శాతం రక్షణనిస్తోందని, సగటున నోవావాక్స్ వ్యాక్సిన్ 90 శాతం సమర్ధవంతమైందని పూనావల్లా వెల్లడించారు. అయితే ,గ్లోబల్ ట్రయల్స్ డేటా ఆధారంగా తాము లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.నవంబర్ నాటికి ఇది అందుబాటులోకి రానుందని భావిస్తున్నామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం పొందితే కంపెనీ సెప్టెంబరు నాటికి నోవావాక్స్ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని చెప్పారు. అలాగే పిల్లలకు టీకా అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్ ను జూలైలో ప్రారంభించాలని యోచిస్తున్నామనీ దీనిపై త్వరలోనే డ్రగ్ రెగ్యులేటరీ అనుమతినికోరనున్నామని పూనవల్లా తెలిపారు.
కాగా నోవావాక్స్ అన్ని రకాల వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేస్తుందని కలుసుకుంది, నోవావాక్స్ ఇటీవల (జూన్ 14న) ప్రకటనలో తెలిపింది. అమెరికా, మెక్సికోలోని 119 సైట్లలో 29,960 మందిపై ట్రయల్స్ చేసినట్టు పేర్కొంది. నోవావాక్స్ టీకాలను సులువుగా నిల్వ చేయవచ్చు. రవాణా కూడా ఈజీగా ఉంటుందని నోవావాక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టాన్లీ సీ ఎర్క్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
చదవండి: ట్విటర్‌కు మరోషాక్, కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment