100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల లిస్టులో చోటు
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది.
58 ఏళ్ల క్రితం టెక్స్‌టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment