వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్‌: అక్టోబరు నాటికి.. | Vaccination drive may start in Jan; expect normal life by Oct: Adar Poonawalla | Sakshi
Sakshi News home page

వచ్చే జనవరిలోనే వ్యాక్సిన్‌: అక్టోబరు నాటికి..

Published Sat, Dec 12 2020 1:03 PM | Last Updated on Sat, Dec 12 2020 2:11 PM

Vaccination drive may start in Jan; expect normal life by Oct: Adar Poonawalla - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చేస్తున్న తరుణంలో మరోసారి సీరం కరోనా మహమ్మారి నివారణకు సంబంధించి కీలక అంశాన్ని వెల్లడించింది. ఈ నెలాఖరులోనే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అత్యవసర లైసెన్స్ పొందవచ్చనే ఆశాభావాన్ని సీరం సీఈఓ అదార్‌ పూనావాలా వ్యక్తం చేశారు. ఆమోదం తర్వాత, వచ్చే నెలలోగా భారతదేశంలో టీకా పంపిణీ ప్రారంభించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. (వ్యాక్సిన్‌ : సీరం పూనావాలా అరుదైన ఘనత)

అత్యవసర వినియోగానికి రెగ్యులేటర్ల  అనుమతి, ఆ తరువాత దేశంలో టీకా డ్రైవ్ 2021, జనవరి నాటికి ప్రారంభమవుతుందన్నారు. అలాగే 2021, అక్టోబర్ నాటికి చాలామందికి టీకాలు వేయడం పూర‍్తవు తుందని,  దీంతో మామూలు పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ఆ తర్వాత  ప్రజలంతా సాధారణ జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు.  ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో పూనవాలా ఈ వ్యాఖ‍్యలు చేశారు. తొలి దశలో దేశ జనాభాలో 20-30 శాతం మందికి టీకాలు వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తోందన్నారు.  20 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత ప్రజల్లో విశ్వాసం పుంజు కుంటుందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ  టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాననీ, దీంతో సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా అభిప్రాయపడ్డారు. (వ్యా‍క్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్‌ సంచలనం)

జూలై 2021నాటికి 300-400 మిలియన్ మోతాదులను సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మార్కెట్లకు కూడా టీకాల తయారీకి  తాము సన్నద్ధమవుతున్నా మని తెలిపారు. మరోవైపు అక్టోబర్ నాటికి సాధారణ జీవితం తిరిగి వస్తుందని పూనావాలా నమ్ముతుండగా, రోజుకు 100 కరోనా వైరస్ షాట్లను మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను కల్పించనున్నాయి. అలాగే షాట్ పొందిన ప్రతి వ్యక్తిని 30 నిమిషాల పాటు పర్యవేక్షిస్తారు. కాగా కరోనావైరస్ వ్యాక్సిన్ల తయారీకి సీరం నోవావాక్స్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. నోవావాక్స్ కోసం ఫేజ్ 3 క్లినికల్‌ పరీక్షలను 2021 మొదటి త్రైమాసికం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement