సాక్షి, న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాటుగా భారత్ బయోటెక్ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్ డోసులను 30 కోట్ల మేర ఆర్డర్ చేసింది. బయోలాజికల్-ఈ టీకాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి.
వ్యాక్సిన్ల కోసం కంపెనీలకు భారీ ఆర్డర్ ఇచ్చిన కేంద్రం..!
Published Tue, Jun 8 2021 7:57 PM | Last Updated on Tue, Jun 8 2021 8:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment