న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్‌లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి.
కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment