మళ్లీ కోవిషీల్డ్‌ ఉత్పత్తి | India Serum Institute resumes Covishield production as Covid cases surge | Sakshi
Sakshi News home page

మళ్లీ కోవిషీల్డ్‌ ఉత్పత్తి

Published Thu, Apr 13 2023 6:19 AM | Last Updated on Thu, Apr 13 2023 6:19 AM

India Serum Institute resumes Covishield production as Covid cases surge - Sakshi

న్యూఢిల్లీ: తగిన డిమాండ్‌ లేకపోవడం, కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో గతంలో ఆగిన కోవిషీల్డ్‌ కోవిడ్‌ టీకా ఉత్పత్తిని తాజాగా పునఃప్రారంభించామని దాని తయారీసంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా బుధవారం ప్రకటించారు. కొత్తగా కోవిడ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తి మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ‘ ఇప్పటికే 60 లక్షల కోవోవ్యాక్స్‌ బూస్టర్‌ డోసులు అందుబాటులో ఉన్నాయి.

వయోజనులు కచ్చితంగా బూస్టర్‌ డోసులు తీసుకోవాలి. ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ ఐచ్ఛికంగా కోవిషీల్డ్‌నూ తీసుకోవచ్చు. వచ్చే 90 రోజుల్లో 60–70 లక్షల డోసుల కోవిషీల్డ్‌ అందుబాటులో ఉండేలా చూస్తాం. డిమాండ్‌కు తగ్గట్లు స్టాక్‌ను పెంచేందుకు తొమ్మిది నెలల సమయం పట్టొచ్చు’ అని పూనావాలా చెప్పారు. చివరిసారిగా కోవిషీల్డ్‌ ఉత్పత్తిని సీరమ్‌ సంస్థ 2021 డిసెంబర్‌లో నిలిపేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement