న్యూఢిల్లీ: కోవిడ్ టీకా కోవోవ్యాక్స్‌ను బూస్టర్ డోస్‌గా వాడేందుకు వీలుగా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతివ్వాలని సీరం ఇన్‌స్టిట్యూట్ డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)ని కోరింది. కోవోవ్యాక్స్ టీకాను అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి వాడొచ్చంటూ డిసెంబర్ 28వ తేదీన డీసీజీఐ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా పూర్తి డోసులు తీసుకుని కనీసం మూడు నెలలు పూర్తయిన వారికి బూస్టర్ డోసుగా కోవోవ్యాక్స్‌ను ఇచ్చేందుకు ఫేజ్–3 ట్రయల్స్ జరుపుతామంటూ ఎస్‌ఐఐ దరఖాస్తు చేసుకుందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)లో ప్రభుత్వ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఆదివారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment