సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ అదర్ పూనావాలా భార్య 'నటాషా పూనావాలా' (Natasha Poonawalla) గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషించడం మాత్రమే కాకుండా.. అనేక సామాజిక, దాతృత్వ కార్యక్రమాలు చేసే ముఖ్యమైన వ్యక్తులలో ఒకరుగా ప్రసిద్ధి పొందారు.
నటాషా పూనావాలా.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ.. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారిస్తూనే, విల్లో పూనావల్లా ఫౌండేషన్‌కు అధ్యక్షత వహిస్తున్నారు.
పూణేలో జననం
1981 నవంబర్ 26న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన నటాషా.. పాఠశాల విద్యను పూణేలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయంలో పూర్తి చేసింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందింది.
750 కోట్ల భవనం
నటాషా 2006లో అదర్ పూనావాలాను వివాహం చేసుకుంది. ఈ జంటకు సైరస్, డారియస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు సుమారు 750 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం లింకన్ హౌస్‌లో నివాసం ఉంటున్నారు. ఈ భవనం యూరోపియన్ స్టైల్‌లో ఉంది. దీనిని అదర్ పూనావాలా తండ్రి 2015లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది సుమారు 247 ఎకరాలలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
నటాషా వ్యాపారం.. దాతృత్వం రెండింటిలోనూ కీలక వ్యక్తిగా స్థిరపడింది. ఆమె నాయకత్వంలో, SII ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారులలో ఒకటిగా మారింది. ఇక ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ.. నిరుపేద వర్గాల కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ మొదలైనవాటిని అందిస్తోంది. నటాషా భర్త నికర విలువ రూ. 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment