సీరం సీఈఓ అదార్ పూనావాలా(ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలా తెలిపారు. కరోనా కట్టడి కోసం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినప్పటికి టీకాల కొరత వల్ల అది అనుకున్న మేర ముందుకు సాగడం లేదు. 45 ఏళ్ల పైబడిన వారికి రెండో డోస్ టీకా ఇవ్వడం పూర్తవ్వలేదు. ఇక పలు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తాము విదేశాలకు టీకాలు ఎగుమతి చేయలేదని తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించింది. భారత్ వంటి దేశంలో 2,3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమన్నది. భారత్‌లో వ్యాక్సినేషన్‌లో అనేక సవాళ్లు ఉన్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు 2 నుంచి 3 ఏళ్లు పడుతుందని సీఎం తెలిపింది. అమెరికా కంపెనీల కంటే తమకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయన్నది. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే తమది మూడో స్థానమని.. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామని సీరం తెలిపింది. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment