సాక్షి, న్యూఢిల్లీ: కరోనా అంతానికి వరుసగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా భారీ ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేకు చెందిన సీరంతో కేంద్రం త్వరలోనే ఒక ఒప్పందాన్ని చేసుకోనుంది. భారత్ బయోటెక్, సీరం సంస్థలతో వేర్వేరుగా ఒప్పందాలను ఈ వారంలోనే కుదుర్చుకోనున్నామని ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది. టీకా డోసు ధర ప్రభుత్వానికి రూ.200, ప్రైవేటుగా రూ.1000 చొప్పున డీల్ కుదుర్చుకోనుంది. మరోవైపు ఐసీఎంఆర్ భారత్ బయోటోక్ కోవాగ్జిన్ టీకా సమర్థవంతమైందని ఐసీఎంఆర్ సలహాదారు సునీల్‌గార్గ్ వెల్లడించారు.
భారతదేశంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్న సీరంతో వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మూడు కోట్ల ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ కేర్ వర్కర్లకు ఒక్కో మోతాదుకు 200 రూపాయల చొప్పున 6.6 కోట్ల మోతాదులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment