
సాక్షి, ముంబై: అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. అగ్రి ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సీరం ఇన్‌స్టిట్యూట్ బృందం విచారణ జరుపుతోంది. కాగా ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్‌ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్ టీకాలు తయారీకి ఎలాంటి ఆటంకంలేదని సీరం సిబ్బంది తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment