న్యూఢిల్లీ: సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా కంపెనీకి భారీ షాక్ తగిలిదింది. యురోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డు (డీపీసీ) రికార్డు స్థాయిలో పెనాల్టీ విధించింది. యురోపియన్ యూనియన్ యూజర్లకు చెందిన ఫేస్‌బుక్ డేటాను,అమెరికాలోని సర్వర్లకు అక్రమంగా బదిలీ జరిగిందని ఆరోపణలపై ఈ చర్య తీసుకుంది.
మే 25, 2018 నుండి అమల్లోకి వచ్చిన జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR)ని మెటా ఉల్లంఘించిందని ఐరిష్ వాచ్‌డాగ్ తెలిపింది. ఇందుకు గాను 1.2 బిలియన్ యూరోలు లేదా 130 కోట్ల డాలర్లు అంటే 10వేల కోట్ల రూపాయలు చెల్లించాలని డీపీసీ ఆదేశించింది.(అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..!)
మెటా స్పందన
అయితే ఈయూ నిర్ణయంపై మెటా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్యాయమైన , అనవసరమైన జరిమానా సహా, డీపీసీ తీర్పుపై అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇతర కంపెనీలకు ఇది తప్పుడు సందేశమిస్తోందని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment