ప్రపంచ దేశాలను రష్యా-ఉక్రెయిన్ యుద్దం కలవరపెడుతోంది. ఎన్నడూ లేనంతగా క్రూడ్ ఆయిల్ ధరలు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడుతుంది. యూరప్ దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేయడంలో రష్యా ముందుస్థానంలో ఉంది. యూరప్ దేశాల్లో రష్యా సుమారు 27 శాతం దిగుమతి వాటాలను కల్గి ఉంది. ఇప్పుడదే యూరప్ దేశాలకు పీడకలలాగా తయారైంది. ఐతే యూరప్‌దేశాలు ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కలిసి రానుంది.
యూరప్‌కు సరఫరా..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉక్రెయిన్ సంక్షోభం మధ్య డీజిల్ కొరతతో సతమతమవుతున్న యూరప్‌కు సరఫరా చేయడానికి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. యూరప్‌లో డీజిల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి...రిలయన్స్ తన పాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కాగా ఈ విషయంపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు. ఇప్పటికే యూరప్‌కు రిలయన్స్ ఇంధనాన్ని పంపుతుండగా..రాబోయే నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని రిలయన్స్‌కు చెందిన రెండు రిఫైనరీల నుంచి రోజుకు 1.36 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌ను ప్రాసెస్ చేయగలదు. ఇప్పడు యూరప్ దేశాల్లో డీజిల్‌ను సరఫరా చేసేందుకు రిలయన్స్ సమయాత్తమయ్యింది.
భారీ లాభం..!
రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యూరప్ దేశాలకు డీజిల్ కొరతను తీర్చనుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు భారీ లాభం చేకూరనున్నట్లు తెలుస్తోంది. క్రూడ్ ఫీడ్‌స్టాక్ నిష్పత్తి , దిగుబడి మార్పుల పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ సౌలభ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ రిఫైనింగ్ ఉత్పత్తిలో 80 శాతం ఎగుమతి చేస్తుందని దక్షిణాసియా చమురు అధిపతి సెంథిల్ కుమరన్ అన్నారు. అంతేకాకుండా బలమైన మార్జిన్ సమయాల్లో రిలయన్స్‌కు గరిష్ట ప్రయోజనాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇంధన కొరత..!
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత యూరప్‌లో ఇంధనం విపరీతంగా పెరగడంతో కొన్ని ఆసియా రిఫైనర్లు డీజిల్‌ను ఆయా యూరప్‌దేశాలకు సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇది కాస్త రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి రానుంది. జామ్‌నగర్‌లోని క్రూడ్ రిఫైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్‌లలో ఒకదానిని ఈ నెల నుంచి మూడు వారాల పాటు మూసివేయాలని రిలయన్స్ ప్లాన్ చేయగా..ఈ నిర్ణయాన్ని రిలయన్స్ వెనక్కితీసుకుంది. ఇప్పుడు అది సెప్టెంబర్‌కు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
చదవండి: అప్పుడెమో 900 మంది..ఇప్పుడు ఏకంగా 3వేల ఉద్యోగులకు ఉస్టింగ్..!
Comments
Please login to add a commentAdd a comment