EU Countries Include Swiss Allowed Covishield in Green Pass - Sakshi
Sakshi News home page

దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!

Published Thu, Jul 1 2021 2:00 PM | Last Updated on Thu, Jul 1 2021 7:53 PM

EU Countries Include Swiss Allowed Covishield in Green Pass - Sakshi

న్యూఢిల్లీ: యూరప్‌ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. గ్రీన్‌ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్‌ పేరును అప్రూవ్డ్‌ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి.

స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్‌, ఐల్యాండ్‌,, ఐర్లాండ్‌, స్పెయిన్‌, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్‌ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్‌ల(కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌) డిజిటల్‌ సర్టిఫికేట్‌ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్‌లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్‌ నిబంధనలను అమలు చేస్తామని భారత్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది.

ఏమిటి గ్రీన్‌పాస్‌
ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్‌ పాస్‌ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్‌ కొవిడ్‌ సర్టిఫికేట్‌ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తారు. 

చదవండి: గ్రీన్‌ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్‌ ఫైర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement