సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. పాజిటివ్ కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, కరోనా కట్టడి కోసం దేశంలో ప్రజలు కోవిషీల్డ్, కోవాగ్జిన్ వాక్సిన్లను తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ల రెండు డోసులను తీసుకునేందుకు కేంద్రం.. కొన్ని వారాల గ్యాప్‌ను విధించింది.
ఈ క్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌పై ఆదివారం కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీఏజీఐ(NTAGI) కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఇకపై 8-16 వారాల గ్యాప్‌తో రెండో డోసును తీసుకోవచ్చని పేర్కొంది. కాగా, ఎన్టీఏజీఐ సూచనల మేరకు మే 13, 2021 నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గడువును 12-16 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, డోసుల మధ్య గ్యాప్ తగ్గించడంతో వ్యాక్సిన్ తీసుకునే వారికి వెసులుబాటు కలిగింది. మరోవైపు కోవాగ్జిన్ వ్యాక్సిన్ షెడ్యూల్‌లో మాత్రం మార్పులేదని కేంద్రం తెలిపింది. కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజుల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. ఇక దేశంలో వ్యాక్సిన్ తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పటికే కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్, రష్యన్ స్పుత్నిక్ వంటి వ్యాక్సిన్లను బహిరంగ మార్కెట్లోనూ విక్రయించేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్లను కేంద్రం విధించిన నిబంధనల మేరకే తీసుకోవాలని హెచ‍్చరించింది.
ఇది చదవండి: దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment