New Coronavirus Vaccine Variants Might Come To Indian Market Soon- Sakshi
Sakshi News home page

మార్కెట్​లోకి రాబోయే కొత్త వ్యాక్సిన్​లు ఇవే!

Published Mon, May 31 2021 12:58 PM | Last Updated on Mon, May 31 2021 4:26 PM

Second Wave New Vaccine Variants Come to India Market Soon - Sakshi

కోవాగ్జిన్​, కోవిషీల్డ్​, ఈమధ్యే స్పుత్నిక్​.. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్​ల పేర్లే ఎక్కువగా వింటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్​ కొరత కొనసాగుతున్నా.. రాబోయే రోజుల్లో మరికొన్ని కంపెనీల రాకతో ఆ సమస్య తీరబోతోంది. రకరకాల వ్యాక్సిన్​లు మన మార్కెట్​లోకి అడుగుపెట్టనున్నాయి. 

వెబ్​డెస్క్​: అవును.. వ్యాక్సినేషన్​ కోసం కంగారుపడాల్సిన​ అవసరం లేదని కంపెనీలు భరోసా ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో కొత్త వ్యాక్సిన్ రకాలు రాబోతున్నాయి. ఇప్పటికే అధికారిక ఆమోదంతో కొన్ని మార్కెట్​లోకి అడుగుపెట్టగా, ఇంకొన్ని ట్రయల్​ ఫేజ్​లో.. ఉత్పత్తి దిశగా, మరికొన్ని అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయి. ధరల విషయంలో స్పష్టత లేనప్పటికీ.. ఇప్పటికే వ్యాక్సిన్​ డోసులు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై భారం తగ్గించడంతో పాటు ఎక్కువ మందికి వ్యాక్సిన్​ డోసుల్ని త్వరగా అందించేందుకు వీలు పడనుంది. 

బయోలాజికల్​ ఈ
టెక్సాస్​కు చెందిన బేలర్ కాలేజ్​ ఆఫ్​ మెడిసిన్​ దీనిని అభివృద్ధి చేసింది. రీకాంబినెంట్ ప్రొటీన్ వ్యాక్సిన్​ ఇది.  28 రోజుల గ్యాప్​తో రెండో డోసులుగా ఈ వ్యాక్సిన్​ను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది హ్యూమన్​ ట్రయల్స్​ ఫేజ్​ 3లో ఉంది. జులై ఆగష్టు మధ్యలో ఇది మార్కెట్​లోకి రావొచ్చని అంచనా. నెలకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా భావిస్తున్నారు.
 
ఇండియన్​ ఇమ్యూనోలాజికల్స్
ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్​ యూనివర్సిటీ దీనిని డెవలప్​ చేస్తోంది. ఇది లైవ్​ అటెన్యుయేటెడ్​ వ్యాక్సిన్​(వైరస్​..రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపేది). ఒకే డోసుతో రానున్న ఈ వ్యాక్సిన్​ ప్రస్తుతం జంతువులపై అధ్యయనంలోనే ఉంది. దీంతో కమర్షియల్ మార్కెట్​లోకి ఇది రావడానికి ఏడాదిపైనే టైం పట్టొచ్చు.

బీఎన్​టీ162 ఫైజర్​
జర్మనీకి చెందిన బయో ఎన్​ టెక్​ ఎస్​ఈ రూపొందించిన వ్యాక్సిన్​. రెండో డోసుల ఎంఆర్ఎన్​ఎ బేస్డ్ వ్యాక్సిన్​ ఇది. ఇది ఇప్పటికే 85 దేశాలు ఈ వ్యాక్సిన్​ను ఆమోదించాయి.  అమెరికాలోనూ 12 నుంచి 15 ఏళ్ల పిల్లలకు ఈమధ్యే అనుమతి దొరికింది. ప్రస్తుతం మనదేశంతో ఈ వ్యాక్సిన్​కు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నాయి. జులై నాటికి ఇది మన మార్కెట్​లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. 

జైకోవ్​ డీ
అహ్మదాబాద్​కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్​ కాడిల్లా రూపొందిస్తున్న వ్యాక్సిన్. ఇది మూడు డోసుల(మొదటిరోజు, 28 రోజుల తర్వాత రెండో డోస్​, 45 రోజుల తర్వాత మూడో డోస్​) వ్యాక్సిన్​. ఇంట్రాడెర్మల్​ ప్లాస్మిడ్​ డీఎన్​ఎ వ్యాక్సిన్​.  ఫేస్​ 3 హ్యూమన్​ ట్రయల్స్​లో ఉంది. జూన్​ జులై మధ్య వినియోగానికి అప్రూవల్​ దొరికే అవకాశం ఉంది. నెలకు కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని ప్రకటించుకుంది జైడస్ కాడిల్లా. అంతేకాదు ఐదు నుంచి 12 ఏళ్ల పిల్లల మీద టెస్ట్​ కోసం ప్రణాళిక వేసుకుంటోంది. రెండు డోసుల వ్యాక్సిన్​నూ డెవలప్​ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎడీ26.కోవ్​2.ఎస్
యూఎస్​ జాన్సన్​ అండ్ జాన్సన్​ వారి వ్యాక్సిన్​. జులైలో మనదగ్గరికి వచ్చే అవకాశం. ఒకేడోస్. సింగిల్​ షాట్​ ఇంజెక్షన్​ వ్యాక్సిన్​. ఏడాదికి యాభై నుంచి 60 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని బయో ఈ వారి లోకల్​ మ్యానుఫ్యాక్చరింగ్ క్యూ4 ప్రకటించుకుంది.

స్పుత్నిక్​ వీ
రష్యన్​ డెవలప్​మెంట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​ (ఆర్​డీఐఎఫ్)​, డాక్టర్ రెడ్డీస్​ ల్యాబ్​ సహకారంతో పంపిణీ అవుతున్న వ్యాక్సిన్​. ఆర్​ఎడీ26, ఆర్​ఎడీ5 వెక్టర్స్​ ఉపయోగించే తయారు చేసిన అడినోవైరస్​ వ్యాక్సిన్​. కిందటి నెలలోనే ఈయూఎ కింద అనుమతి. మే 14న తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్​ ద్వారా ప్రారంభించిన రెడ్డీస్​ ల్యాబ్స్​. లక్షన్నర డోసుల ఆర్​ఎడీ26,  ఆర్​ఎడీ5 యాభై వేల డోసులు ఇదివరకే దిగుమతి. జూన్ రెండో వారం నుంచి వేగంగా ఉత్పత్తి. సింగిల్​ డోస్​ వ్యాక్సిన్​గా ఆర్​ఎడీ26ను స్పుత్నిక్ లైట్​ పేరుతో ఇండియాలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
 
కొవిషీల్డ్​
ఇండియాలో కొవిడ్​ కట్టడికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న మరో వ్యాక్సిన్​. ఆక్స్​ఫర్ట్​, ఆస్ట్రాజెనెకాలతో కలిసి సీరం ఇండియా ఈ వ్యాక్సిన్​ను తయారీ చేస్తోంది. పన్నెండు వారాల వ్యవధిలో రెండు డోసుల టీకాగా తీసుకోవాలి. చింపాజీ అడినోవైరస్​ కారం నుంచి ఈ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేశారు. దీనికి కూడా జనవరిలోనే అనుమతి దొరికింది. ఇది కూడా పదికోట్ల డోసుల టార్గెట్​నే పెట్టుకుంది.

కోవాగ్జిన్
కొవిడ్​-19 జబ్బు కట్టడికి తయారు చేసిన మొట్టమొదటి దేశీయ వాగ్జిన్​. ఇన్​ భారత్​ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ రెండు డోసుల వ్యాక్సిన్.. ఈ జనవరిలో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్(ఈయూఏ)​ కింద వాడకంలోకి వచ్చింది. ఇన్​యాక్టివేటెడ్​ వైరస్​ నుంచి దీనిని డెవలప్​ చేశారు. ఈ ఏడాది చివరివరకు నెలకు పదికోట్ల డోసుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది భారత్​ బయోటెక్​. ఇక అనుమతులతో రెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న పిల్లలపై జూన్​ మొదటి వారం నుంచి ఫేజ్​ 2,3 ట్రయల్స్​ నిర్వహించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement