SII
-
కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా
పొరుగు దేశం చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయమేన్నారు వ్యాక్సిన్ మేకర సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా. అయితే, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతంగా చేపట్టడం, కేసుల కట్టడి వంటి ట్రాక్ రికార్డు గొప్పగా ఉందని పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు. ‘కరోనా కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వస్తున్న వార్తలు ఆందోళనకరమే. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. కేంద్రం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలపై నమ్మకం ఉంచి తప్పకుండా పాటించాలి.’అని ట్విట్టర్లో పేర్కొన్నారు సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా. The news of rising COVID cases coming out of China is concerning, we need not panic given our excellent vaccination coverage and track record. We must continue to trust and follow the guidelines set by the Government of India and @MoHFW_INDIA. — Adar Poonawalla (@adarpoonawalla) December 21, 2022 కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ‘కోవిషీల్డ్’ అనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసింది. దేశంలో ఎక్కువ శాతం ఈ కోవిషీల్డ్‌నే ప్రజలకు అందించింది కేంద్రం. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేశారు. చైనాతో పాటు అమెరికా, బ్రెజిల్ కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతూ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే.. రద్ది ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరింది. ఇదీ చదవండి: కోవిడ్ కథ ముగియలేదు.. అప్రమత్తంగా ఉందాం: కేంద్రం -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
వ్యాక్సిన్-వ్యాక్సినేషన్.. లెక్కల్లో తేడా!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా? సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్‌లు కలిపి నెలకు ఎనిమిది కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ, మే చివరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అందే డోసుల లెక్క 5 కోట్లకే తేలుతోంది. మరి మిగతా మూడు కోట్ల డోసుల సంగతేంటి? ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు రోజూ సగటున 27 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అదీ రష్యన్ స్పుత్నిక్ను పరిగణనలోకి తీసుకోకుండానే. అయితే మే మొదటి మూడు వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రోజు సగటున 16.2 లక్షల డోసులు మాత్రమే డెలివరీ చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సుమారు 3.4 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించారు. లెక్కల్లో.. నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేయగలమని సీరమ్ ఇండియా పదే పదే ప్రకటించుకుంటోంది. ఇక భారత్ బయోటెక్ ఏప్రిల్‌లో 2 కోట్ల కోవాగ్జిన్ డోసుల్ని ఉత్పత్తి చేశామని, మే చివరికల్లా మూడు కోట్ల డోసుల్ని అందిస్తామని చెప్పింది. అంటే ఎలా చూసుకున్నా ఎనిమిదిన్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి కావాలి. కోవిన్ పోర్టల్ ప్రకారం చూసుకుంటే మే 22 రోజులకుగానూ రోజుకి 16.2 లక్షల చొప్పున వ్యాక్సిన్లను డెలివరీ చేశాయి. మే 16 నుంచి 22 మధ్య ఆ డెలివరీ ఏకంగా 13 లక్షల డోసులకు పడిపోయింది. అంటే రోజుకి 9.7 లక్షల డోసులు లెక్క తేడా వస్తోంది. అలాగే కంపెనీలు చెప్తున్న నెల వ్యాక్సిన్ డోసుల అవుట్‌పుట్‌కు, వ్యాక్సినేషన్‌కు తేడా వస్తోంది. ఇప్పుడున్న డెలివరీ ఇలాగే కొనసాగినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదు కోట్ల డోసులతో ముగియొచ్చు. మరి మిగతా మూడుకోట్ల డోసుల మాటేంటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గప్పాలేనా? ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టుకు కేంద్రం వ్యాక్సినేషన్ మీద ఒక అఫిడవిట్ సమర్పించింది. నెలకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆరున్నర కోట్ల కోవిషీల్డ్ డోసులను, భారత్ బయోటెక్ రెండు కోట్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయగలవని అందులో పేర్కొంది. జులై నాటికి కోవాగ్జిన్ సామర్థ్యం ఐదున్నర కోట్లకు పెరుగుతుందని, అలాగే స్ఫుత్నిక్ కోటిన్నర డోసులకు(ఇప్పుడు నెలకు ముప్ఫై లక్షలు ఉంది) పెరుగుతుందని రిపోర్ట్ సమర్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అది జరగకపోవచ్చనే మేధావులు అంచనా వేస్తున్నారు. ఎనిమిదిన్నర కోట్లు ఉత్పత్తి చేసేప్పుడు.. కేవలం ఐదు కోట్లను డెలివరీ చేయడం, ప్రైవేట్ కోటా లాంటి విషయాల్లో క్లారిటీ వస్తేనే డోసుల లెక్క తేలేది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి టైంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 (గురువారం) నుంచే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ బుధవారం రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్ పోర్టల్‌లో తప్పుడు, డూప్లికేట్ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ స్టాక్ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వృథాను తగ్గించండి పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్ భూషణ్, డాక్టర్ ఆర్.ఎస్.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ స్టాక్‌ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కో–విన్, ఈవిన్ పోర్టళ్లలో అప్లోడ్ చేయాలన్నారు. రెండో డోసు ఇచ్చే వరకూ టీకాలను దాడి పెట్టాలన్న ఆలోచన సరైంది కాదని చెప్పారు. కోవిషీల్డ్ షెల్ఫ్‌లైఫ్ ఇక 9 నెలలు ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్ అంటారు. ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రస్తుత షెల్ఫ్‌లైఫ్ 6 నెలలు. తాజాగా డీసీజీఐ దీన్ని 9 నెలలకు పెంచింది. అంటే కోవిషీల్డ్ టీకాను తయారు చేసిన తర్వాత 9 నెలల్లోగా ఉపయోగించవచ్చు. 9% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే కేవలం మహారాష్ట్రలోనే 61 శాతం యాక్టివ్ కేసులు దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 79.30 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. ఇందులో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త కరోనా కేసుల్లో 84.73 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది. 6.30 కోట్ల మందికి కరోనా టీకా భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ వేగం పంజుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది. -
జూన్ కల్లా మరో వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19ను నిలువరించే కోవోవ్యాక్స్ అనే మరో టీకాను వచ్చే జూన్‌కల్లా అందుబాటులోకి తెస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)ప్రకటించింది. ట్రయల్స్ ప్రారంభించేందుకు అనుమతులు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు చేశామని ఎస్ఐఐ సీఈవో అధర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. నోవావ్యాక్స్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న ఈ టీకా పనితీరు అద్భుతంగా ఉందన్నారు. 2021 జూన్ కల్లా ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ– ఆస్ట్రా జెనెకా ఉమ్మడిగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్‌తోపాటు కోవాగ్జిన్ టీకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కేంద్రం 1.1 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాను ఎస్ఐఐ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ నాటికి నాలుగైదు కోట్ల నోవావ్యాక్స్ టీకా డోసులను ఉత్పత్తి చేస్తామని ఇటీవలే పూనావాలా ప్రకటించారు. 35 లక్షల మందికి కోవిడ్ టీకా ఆరోగ్య సిబ్బంది కోసం ప్రారంభించిన దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్లో ఇప్పటి వరకు 35 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 5.70 లక్షల మందికి టీకా వేసినట్లు తెలిపింది. వీరిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 4,63,793 మంది, రాజస్తాన్‌లో 3,24,973 మంది, కర్ణాటకలో 3,07,891 మంది, మహారాష్ట్రలో 2,61,320 మంది లబ్ధిదారులు ఉన్నారంది. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ కోసం 63,687 సెషన్లు నిర్వహించినట్లు వెల్లడించింది. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు తగ్గిపోయాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 1.58% మాత్రమేనని వెల్లడించింది. -
కరోనా: సీరమ్ సీఈవోకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనవల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సీరం చేస్తున్న కృషికి గాను ఆయనకు ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదు ప్రకటించినట్లు సింగాపూర్‌కు ది స్ట్రయిట్ టైమ్స్ మీడియా శనివారం ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనా, ఉత్తర కొరియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ప్రకటించినట్లు కూడా తెలిపింది. మహమ్మారిని ఆరికట్టేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్.. ఆక్సఫర్డ్ యూరివర్శిటీ, బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాలు కలిసి కోవిడ్-19 నివారణకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ అభివృద్ద చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. (చదవండి: కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్) అయితే ఈ జాబితాలో పూనవల్లాతో పాటు చైనా, జపాన్, ఉత్తర కొరియాకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ఆసియా ప్రకటించింది. వీరిలో.. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ ‘సార్స్-కోవ్-2’ జన్యూ రూపాన్ని మ్యాప్ చేసి కంటికి కనిపించని కరోనా వైరస్ ఇదేనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆన్లైన్ బృందానికి నాయకత్వం వహించిన చైనా పరిశోధకుడు జాంగ్ యోంగ్-జేన్, చైనా మేజర్ జనరల్ చెన్-వెయ్, జపాన్‌లో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ముందంజలో ఉన్న మొరిసితా, సింగపూర్ ప్రొఫెసర్ వూయ్-ఇంగ్-యోంగ్‌లతో పాటు దక్షిణ కోరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జీన్లు ఉన్నారు. జంగ్-జీన్ తన సంస్థ ద్వారా కోవిడ్-19 చికిత్సలకు ఇతర వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ టికాలను పంపిణీ చేస్తూ తనవంతు కృషి చేశారు. అయితే ఈ ఆవార్డుకు ఎన్నికైనా ఈ ఆరుగురిని కరోనా వీరులుగా ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తూ ఈ బిరుదును ప్రకటించింది. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్) అంతేగాక కరోనా నివారణకు మహమ్మరిపై పోరాటంలో ముందంజలో నిలిచిన వీరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలచారంటూ సదరు ఆసియా ప్రశంస పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మరణాలు, ఆర్థిక కష్టాలను తెచ్చిన పెట్టిన సార్స్-కోవి-2 వైరస్‌పై వీరి పోరాటం ప్రశంసనీయమని, అందుకే వీరిని ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తున్నట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఇక వీరి ధైర్యం, సంరక్షణ, నిబద్ధత, సృజనాత్మకతకు వందనాలు అంటూ ఆసియా ప్రశంస పత్రంలో పేర్కొంది. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి ఈ ఆరుగురు ఆసియా ఆశ చిహ్నంగా పిలిచింది. అయితే అదార్ పూనవల్లా తండ్రి సైరస్ పూనవల్లా 1966లో సీరం ఇన్స్టిట్యూట్ను స్థాపించారు. 2011లో ఆయన మరణం తర్వాత అదార్ సంస్థ మొక్క పూర్తి బాధ్యతల చేపట్టి సీరం ఇన్స్టిట్యూట్కు సీఈవో అయ్యారు. -
కరోనా వ్యాక్సిన్: అంత సొమ్ము కేంద్రం వద్ద ఉందా?
పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా ప్రశ్నించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్ఐఐ ఇటీవలే ప్రకటించింది. -
టీకా పంపిణీకి 80 వేల కోట్లు ఉన్నాయా?
పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా ప్రశ్నించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్ఐఐ ఇటీవలే ప్రకటించింది. -
‘2021 మే నాటికి కరోనా అంతం’
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మన దగ్గర ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ కరోనా అంతానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుంది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్ తుడిచిపెట్టుకుపోతుంది. కరోనా వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. కాకపోతే ఈ వైరస్ వైద్యరంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి రావడానికి సాయం చేసింది. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్ పరిశోధనల్లో పురోగతి జరిగింది’ అన్నారు బిల్ గేట్స్. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225) కరోనా వ్యాక్సిన్ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చతున్నది. ఈ క్రమంలో గతవారం పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్.. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల నిధులు.. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గేవ్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులు అందాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసే కొన్ని వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ రెండింటికి గాను ఒక డోస్‌కి 3 డాలర్ల ధర నిర్ణయించబడింది. ఇది 90 కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో పాటు దీని మద్దతు ఉన్న గవి కూడా ప్రపంచ దేశాలన్నింటికి వేగంగా.. సమానంగా కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
‘ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పంపిణీ’
న్యూఢిల్లీ: ప్రభుత్వం ద్వారానే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందుతుందని.. ఎవరూ ప్రైవేట్‌లో కొనాల్సిన అవసరం లేదంటుంది సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ). కరోనా వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ద్వారానే దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించింది. అంతేకాక దేశ జనాభా కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సామార్థ్యం తమ సొంతం అన్నది సీరమ్. ఆదివారం సీరమ్ సీఈఓ అదార్ పూనవాలాకి, మరో పార్సీకి మధ్య జరిగిన ట్విటర్ సంభాషణ తర్వాత ఈ ప్రకటన వెలువడింది. రోని స్క్రూవాలా అనే పార్సీ.. అదార్‌ను ఉద్దేశిస్తూ.. ‘పార్సీ సమాజంలో జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే ఇప్పటికే ప్రపంచంలో అంతరించిపోతున్న జాతులను కాపాడటానికి ఒక లాబీ పనిచేస్తోంది. కాబట్టి పార్సీల కోసం కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై అదార్ స్పందిస్తూ.. ‘సమాజానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగానే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాం. ఈ గ్రహం మీద ఉన్న పార్సీలను కవర్ చేయడానికి మా ఒక్క రోజు ఉత్పత్తి సరిపోతుంది’ అంటూ సరదాగా స్పందించారు. (అక్టోబర్–నవంబర్‌లో టీకా) ఈ క్రమంలో సోమవారం అదార్ మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతమైన తర్వాత దేశ ప్రజలు ఎవరూ దీన్ని బహిరంగ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నెట్వర్క్ ద్వారా ప్రతి ఒక్కరికి పంపిణీ చేస్తాం అని తెలిపారు. అంతేకాక నిన్న జరిగిన ట్విటర్ సంభాషణ కేవలం ఇద్దరు పార్సీ మిత్రుల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ మాత్రమే’ అన్నారు. ఆక్స్ఫర్డ్ దాని భాగస్వామి ఆస్ట్రాజెనికా తమ వ్యాక్సిన్ విజయవంతమైన తర్వాత.. దాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం కోసం ఎస్ఐఐతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆక్సఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మూడవ దశ ప్రయోగాలను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు అదార్ తెలిపారు. మూడవ దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతి కోరుతూ ఎస్ఐఐ ఇప్పటికే దరఖాస్తు చేసింది. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఎస్ఐఐ కరోనా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పూణే, ముంబైలలో ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తోంది. (దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు) రెండు నెలల పాటు కొనసాగబోయే ట్రయల్స్‌లో భాగంగా ఆగస్టు చివరి నాటికి పూణే, ముంబైలలో 4,000 నుంచి 5,000 మందికి టీకా ఇంజెక్ట్ చేయనున్నట్లు ఎస్ఐఐ గత ప్రకటనలో తెలిపింది. గత వారం వ్యాక్సిన్ పరీక్ష ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సంతృప్తికరమైన పురోగతిని సాధించడంతో.. తరువాతి ట్రయల్స్ కోసం ఎస్ఐఐ డీసీజీఏ అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ.2,025 కోట్లు
♦ భారీగా పెరిగిన నికర ఎన్పీఏలు ♦ ప్రతి పది షేర్లకు ఒక బోనస్ షేర్ ♦ ఒక్కో షేర్‌కు రూ.2.50 డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(క్యూ4)లో రూ.2,025 కోట్ల నికర లాభం(స్టాండెలోన్) ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2015–16) క్యూ4లో రూ.702 కోట్ల నికర లాభం సాధించామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, కేటాయింపులు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం మూడు రెట్లు (188 శాతం) పెరిగిందని వివరించింది. ఇతర ఆదాయాలు బాగా తగ్గడంతో వృద్ధి తగ్గిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.18,591 కోట్ల నుంచి రూ.16,586 కోట్లకు తగ్గిందని పేర్కొంది. వడ్డీయేతర(ఇతర) ఆదాయం 41 శాతం క్షీణించి రూ.3,017 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభం 28 శాతం క్షీణించి రూ.5,112 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇతర ఆదాయం భారీగా వచ్చిందని, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో వాటా విక్రయం వల్ల ఆ క్వార్టర్లో భారీగా ఇతర ఆదాయం సమకూరిందని వివరించింది. కాగా, క్యూ4లో కన్సాలిటేడెడ్ నికర లాభం ఐదు రెట్లు పెరిగి రూ.2,083 కోట్లకు చేరిందని బ్యాంక్ పేర్కొంది. ఎన్ఐఐ 10% అప్.. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10% వృద్ధితో రూ.5,962 కోట్లకు, రుణ వృద్ధి 7% పెరుగుదలతో రూ.4.64 లక్షల కోట్లకు పెరిగినట్లు ఐసీఐసీఐ తెలిపింది. నికర వడ్డీ మార్జిన్ 3.12% నుంచి 3.57 శాతానికి పెరిగింది. దేశీయ రుణాలు 14%, మొత్తం రుణాల్లో 52%గా ఉన్న రిటైల్ రుణాలు 19% చొప్పున వృద్ది సాధించాయి. డిపాజిట్లు 16 శాతం వృద్ధితో రూ.4.9 లక్షల కోట్లకు పెరిగాయి. ఫీజు ఆదాయం 11% వృద్ధితో రూ.2,446 కోట్లకు పెరిగిందని బ్యాంక్ పేర్కొంది. తగ్గిన కేటాయింపులు... స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏ) 12 శాతం వృద్ధితో రూ.42,552 కోట్లకు, నికర ఎన్పీఏలు 26 శాతం వృద్ధితో రూ.25,451 కోట్లకు పెరిగాయి. అంటే మొత్తం రుణాల్లో స్థూల స్థూల ఎన్పీఏలు 5.21 శాతం నుంచి 7.89 శాతానికి, నికర ఎన్పీఏలు 2.67% నుంచి 4.89%కి ఎగబాకాయి. సిమెంట్ రంగానికి చెందిన ఒక కంపెనీ రూ.5,378 కోట్ల రుణం కారణంగా మొండి బకాయిలు బాగా పెరిగాయని సమాచారం. ఎన్పీఏలకు కేటాయింపులు క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 7% వృద్ధితో రూ.2,898 కోట్లకు పెరిగాయని, అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 13%ట క్షీణించాయని బ్యాంక్ పేర్కొంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో కేటాయింపులు రూ.3,600 కోట్లుగా ఉన్నాయని వివరించింది. పూర్తి ఏడాది ఇలా... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.9,726 కోట్లుగా ఉన్న నికర లాభం 2016–17లో రూ.9,801 కోట్లకు పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంక్ వివరించింది. ఆదాయం రూ. 68,062 కోట్ల నుంచి రూ.73,661 కోట్లకు ఎగసిందని పేర్కొంది. 1:10 బోనస్ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, అలాగే ప్రతి పది ఈక్విటీ షేర్లకు ఒక బోనస్ షేర్(1:10)ను ఇవ్వడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 1.1 శాతం తగ్గి రూ.273 వద్ద ముగిసింది. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్ తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ 3 శాతానికి పైగానే సాధించగలమని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు చెప్పుకోదగిన స్థాయిలో తక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. గతంలోని కొన్ని మొండిబకాయిలు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. –చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్