న్యూఢిల్లీ: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనవల్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు సీరం చేస్తున్న కృషికి గాను ఆయనకు ‘ఆసియన్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదు ప్రకటించినట్లు సింగాపూర్‌కు ది స్ట్రయిట్ టైమ్స్ మీడియా శనివారం ప్రకటన విడుదల చేసింది. అంతేగాక చైనా, ఉత్తర కొరియా, జపాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ప్రకటించినట్లు కూడా తెలిపింది. మహమ్మారిని ఆరికట్టేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. ఆక్సఫర్డ్ యూరివర్శిటీ, బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకాలు కలిసి కోవిడ్-19 నివారణకు ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ అభివృద్ద చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)కు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ముంబై, పుణెలో క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే నిర్వహించనున్నారు. (చదవండి: కరోనా టీకాపై ఓ గుడ్‌న్యూస్)
అయితే ఈ జాబితాలో పూనవల్లాతో పాటు చైనా, జపాన్, ఉత్తర కొరియాకు చెందిన మరో అయిదుగురికి ఈ బిరుదును ఆసియా ప్రకటించింది. వీరిలో.. మొట్టమొదటి సారిగా కరోనా వైరస్ ‘సార్స్-కోవ్-2’ జన్యూ రూపాన్ని మ్యాప్ చేసి కంటికి కనిపించని కరోనా వైరస్ ఇదేనని ప్రపంచానికి పరిచయం చేసిన ఆన్‌లైన్ బృందానికి నాయకత్వం వహించిన చైనా పరిశోధకుడు జాంగ్ యోంగ్-జేన్, చైనా మేజర్ జనరల్ చెన్-వెయ్, జపాన్‌లో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడటంలో ముందంజలో ఉన్న మొరిసితా, సింగపూర్ ప్రొఫెసర్ వూయ్-ఇంగ్-యోంగ్‌లతో పాటు దక్షిణ కోరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జీన్‌లు ఉన్నారు. జంగ్-జీన్ తన సంస్థ ద్వారా కోవిడ్-19 చికిత్సలకు ఇతర వ్యాక్సిన్‌లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ టికాలను పంపిణీ చేస్తూ తనవంతు కృషి చేశారు. అయితే ఈ ఆవార్డుకు ఎన్నికైనా ఈ ఆరుగురిని కరోనా వీరులుగా ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తూ ఈ బిరుదును ప్రకటించింది. (చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్)
అంతేగాక కరోనా నివారణకు మహమ్మరిపై పోరాటంలో ముందంజలో నిలిచిన వీరూ ప్రపంచానికి ఆదర్శంగా నిలచారంటూ సదరు ఆసియా ప్రశంస పత్రాన్ని విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో మరణాలు, ఆర్థిక కష్టాలను తెచ్చిన పెట్టిన సార్స్-కోవి-2 వైరస్‌పై వీరి పోరాటం ప్రశంసనీయమని, అందుకే వీరిని ‘వైరస్ బస్టర్స్’గా పిలుస్తున్నట్లు ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు. ఇక వీరి ధైర్యం, సంరక్షణ, నిబద్ధత, సృజనాత్మకతకు వందనాలు అంటూ ఆసియా ప్రశంస పత్రంలో పేర్కొంది. ఇక కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచానికి ఈ ఆరుగురు ఆసియా ఆశ చిహ్నంగా పిలిచింది. అయితే అదార్ పూనవల్లా తండ్రి సైరస్ పూనవల్లా 1966లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. 2011లో ఆయన మరణం తర్వాత అదార్ సంస్థ మొక్క పూర్తి బాధ్యతల చేపట్టి సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సీఈవో అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment