Russia Ukraine War: EU Approves New Sanctions Against Belarus - Sakshi
Sakshi News home page

Russia-Ukraine War: రష్యాకు సపోర్ట్‌.. బెలారస్‌కు బిగ్‌ షాక్‌

Published Wed, Mar 2 2022 4:43 PM | Last Updated on Wed, Mar 2 2022 8:25 PM

EU Approves New Sanctions Against Belarus - Sakshi

EU Sanctions On Belarus: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, రష్యా దాడులకు ప్రత్యక్షంగా బెలారస్‌ సపోర్టు అందించిన విషయం తెలిసిందే. బెలారస్‌ నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోకి చోరబడ్డాయి. ఈ నేపథ్యంలో బెలారస్‌ ఊహించని షాక్‌​ తలిగింది. 

(ఇది చదవండి: భారత్‌ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రష్యా..)

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధేంచేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్‌ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, బెలారస్‌పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్‌లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్‌ చేసింది.

(ఇది చదవండి: ఆగని మారణహోమం: ‘రష్యాను చావుదెబ్బకొట్టాం.. ఏకంగా 6వేల మందిని..’)

మరోవైపు ఉక్రెయిన్‌-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మొదటిసారిగా బెలరాస్‌ వేదికగా శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో రెండు దేశాలు వారి డిమాండ్స్‌పైనే దృష్టి సారించడంతో చర్చలు ఫలితం లేకుండానే ముగిశాయి. ఈ క్రమంలో రెండు దేశాలు ప‍్రతినిధులు బుధవారం మరోసారి చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదోనని ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement