ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది.
కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది.
చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం..
Comments
Please login to add a commentAdd a comment