Nadal
-
ఫేర్ వెల్ మ్యాచ్ లో ఎమోషనల్ అయిన టెన్నిస్ దిగ్గజం ఫెదరర్
-
రష్యా, బెలారస్ ప్లేయర్లపై నిషేధం అన్యాయం.. నదాల్, జకో, ముర్రే
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై స్టార్ టెన్నిస్ ప్లేయర్లు రఫెల్ నదాల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రే స్పందించారు. రష్యా, బెలారస్ ఆటగాళ్లను వింబుల్డన్‌లో పాల్గొనకుండా నిషేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఈ నిషేధం అన్యాయమని, ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వల్ల చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని ఏటీపీ (అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్), డబ్ల్యూటీఏ (వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్) కూడా ఖండించింది. కాగా, రష్యా.. బెలారస్ సరిహద్దుల నుంచి ఉక్రెయిన్‌పై దాడుల చేస్తున్నందుకు గాను ఆ రెండు దేశాల ప్లేయర్లపై ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. వింబుల్డన్ నిర్వాహకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ డేనిల్ మెద్వెదెవ్, గతేడాది వుమెన్స్ సెమీ ఫైనలిస్ట్ (వింబుల్డన్ ), బెలారస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా వంటి చాలామంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వింబుల్డన్‌కు దూరం కానున్నారు. వింబుల్డన్ టోర్నీ ఈ ఏడాది జూన్ 27నుండి జూలై 10 వరకు జరగనుంది. చదవండి: Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం.. -
నాదల్‌ను నిలువరించేనా?
పారిస్: ఎర్రమట్టి కోర్టులపై మకుటంలేని మహరాజు రాఫెల్ నాదల్ ఈసారీ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సాధిస్తే రెండు ఘనతలు సాధిస్తాడు. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (20 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేయడంతోపాటు... ఫ్రెంచ్ ఓపెన్‌లో 100 విజయాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. నేటి నుంచి మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రెండు లక్ష్యాలు అధిగమించాలంటే నాదల్ ఎప్పటిలాగే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. తన పార్శ్వంలో ఉన్న గత ఏడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను... మాజీ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించాల్సి ఉంటుంది. ‘డ్రా’ ప్రకారమైతే నాదల్ ఇటీవల యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన థీమ్‌ను సెమీస్‌లో... ఈ ఏడాది ఓటమెరుగని జొకోవిచ్ ను ఫైనల్లో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 2005 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న నాదల్కు అద్వితీయ రికార్డు ఉంది. 93 మ్యాచ్‌ల్లో నెగ్గిన అతను రెండు సార్లు (2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో సోడెర్లింగ్చేతిలో; 2015 క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో) మాత్రమే ఓటమి చవిచూశాడు. గాయం కారణంగా 2016లో మూడో రౌండ్లో బరిలోకి దిగకుండానే ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. ఈసారి తొలి రౌండ్లో ఇగోర్ జెరాసిమోవ్ (బెలారస్)తో నాదల్ తలపడనున్నాడు. టైటిల్ సాధించే క్రమంలో ఏడు మ్యాచ్‌లు నెగ్గితే నాదల్కు ఫ్రెంచ్ ఓపెన్‌లో సరిగ్గా 100 విజయాలు పూర్తవుతాయి. ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో 100 విజయాలు నమోదు చేసుకున్న ప్లేయర్‌గా నాదల్ నిలుస్తాడు. అంతేకాకుండా పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ రికార్డును నాదల్ సమం చేస్తాడు. నాదల్‌తోపాటు రెండుసార్లు రన్నరప్ డొమినిక్ థీమ్, మాజీ విజేత జొకోవిచ్ కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఇటాలియన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచి జొకోవిచ్... యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి థీమ్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా జ్వెరెవ్ (జర్మనీ), సిట్సిపాస్ (గ్రీస్), మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా మెరిపించే అవకాశముంది. సెరెనా సత్తా చాటేనా... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్స్ హలెప్ (రొమేనియా), సెరెనా విలియమ్స్ (అమెరికా), ముగురుజా (స్పెయిన్) టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆల్‌టైమ్ ప్లేయర్‌గా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు సెరెనాకు మరో ‘గ్రాండ్’ టైటిల్ కావాలి. యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన సెరెనా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తిస్థాయి మ్యాచ్ ఫిట్నెస్తో బరిలోకి దిగడంలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. 2015లో ఈ టైటిల్ నెగ్గి, 2016లో రన్నరప్ గా నిలిచిన సెరెనా ఆ తర్వాత రెండుసార్లు పాల్గొని నాలుగో రౌండ్‌ను దాటలేదు. డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), యూఎస్ ఓపెన్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరంగా ఉన్నారు. -
51,954 మంది ప్రేక్షకులు...
కేప్‌టౌన్: ఆఫ్రికా దేశాల్లోని చిన్నారుల విద్యా, క్రీడాభివృద్ధి కోసం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫౌండేషన్ ‘మ్యాచ్ ఇన్ ఆఫ్రికా’ పేరిట ఫెడరర్, స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ మధ్య దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. 2010 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ వేదిక కేప్‌టౌన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ఏకంగా 51,954 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఓ టెన్నిస్ మ్యాచ్‌ను ఇంతమంది వీక్షించడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ 6–4, 3–6, 6–3తో నాదల్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ ద్వారా ఫెడరర్ ఫౌండేషన్ 35 లక్షల డాలర్లను (రూ. 25 కోట్లు) సేకరించడం విశేషం. దక్షిణాఫ్రికాకు చెందిన ఫెడరర్ తల్లి లినెట్టి కూడా ఈ మ్యాచ్‌ను వీక్షించారు. తన 22 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఏనాడూ ఫెడరర్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ ఆడలేదు. గత నవంబర్‌లో మెక్సికోలో ఫెడరర్, జ్వెరెవ్ (జర్మనీ) మ్యాచ్‌కు 42,517 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
క్విటోవా హవా
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ స్టార్ క్రీడాకారులు... ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుత ఆటతీరుతో దూసుకొస్తున్న అనామక క్రీడాకారులు... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తమ హవా చలాయిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా ఏడేళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ చేరుకోగా... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఏనాడూ తొలి రౌండ్ దాటని అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ తన విజయపరంపర కొనసాగిస్తూ తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ ఆరోసారి సెమీఫైనల్ చేరగా... గ్రీస్ యువతార సిట్సిపాస్ మరో అద్భుత విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. మెల్బోర్న్: రెండేళ్ల క్రితం ఆగంతకుడి కత్తి దాడిలో గాయపడి ఆరు నెలలపాటు ఆటకు దూరమైన పెట్రా క్విటోవాకు పునరాగమనంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆమె ఆడిన గత ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశనూ దాటలేదు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం క్విటోవా కదం తొక్కుతోంది. తన ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ టైటిల్ దిశగా సాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–4తో 15వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై నెగ్గి 2012 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2014లో వింబుల్డన్ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్ చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ షరపోవాను బోల్తా కొట్టించిన యాష్లే బార్టీ ఈ మ్యాచ్‌లో మాత్రం క్విటోవా ముందు నిలువలేకపోయింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్విటోవా మూడు ఏస్‌లు సంధించి, మూడుసార్లు బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో క్విటోవా ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గురువారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)తో క్విటోవా తలపడుతుంది. ‘కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా. కత్తి దాడిలో గాయపడ్డాక మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ దశకు రావడానికి నేను తీవ్రంగా శ్రమించాను. నాకైతే ఇది రెండో కెరీర్లాంటిదే. పునరాగమనం చేశాక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. ఈ క్షణాలను నేనెంతో ఆస్వాదిస్తున్నాను’ అని విజయానంతరం సెంటర్‌కోర్టులో క్విటోవా వ్యాఖ్యానించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ డానియెలా కొలిన్స్ 2–6, 7–5, 6–1తో మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్స్ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అగుట్ పోరు ముగిసె... పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నాదల్, 14వ సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందగా... సిట్సిపాస్ 7–5, 4–6, 6–4, 7–6 (7/2)తో 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్‌కు చేరాడు. కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అగుట్ కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై... మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచిన అగుట్ ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌పై సంచలన విజయం సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సిట్సిపాస్... ఈ ఏడాది తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నీ లక్ష్యమేంటి అని అడిగితే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం అని చెప్పాను. అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు’ అని 20 ఏళ్ల సిట్సిపాస్ అన్నాడు. పేస్ జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన లియాండర్ పేస్ (భారత్)–సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. పేస్–స్టోసుర్ ద్వయం 6–4, 4–6, 8–10తో ఐదో సీడ్ రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. పేస్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. నేటి క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ విభాగం నయోమి ఒసాకా (vs) ఎలీనా స్వితోలినా సెరెనా విలియమ్స్(vs) కరోలినా ప్లిస్కోవా పురుషుల సింగిల్స్ విభాగం మిలోస్ రావ్‌నిచ్(vs) లుకాస్ పుయి జొకోవిచ్(vs) నిషికోరి ఉదయం గం. 5.30 నుంచి; మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గట్టెక్కిన నాదల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో నాదల్ 5–7, 7–5, 7–6 (9/7), 7–6 (7/3)తో ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. 4 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకమైన టైబ్రేక్‌లలో నాదల్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. నాదల్‌తోపాటు మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), తొమ్మిదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాజీ విజేత సెరెనా 6–1, 6–2తో సోదరి వీనస్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6–4, 6–4తో ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–విత్రో (అమెరికా) ద్వయంపై నెగ్గింది. -
గట్టెక్కిన నాదల్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో నాదల్ 5–7, 7–5, 7–6 (9/7), 7–6 (7/3)తో ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. 4 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీలకమైన టైబ్రేక్‌లలో నాదల్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి పైచేయి సాధించాడు. నాదల్‌తోపాటు మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), తొమ్మిదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాజీ విజేత సెరెనా 6–1, 6–2తో సోదరి వీనస్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 6–4, 6–4తో ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–విత్రో (అమెరికా) ద్వయంపై నెగ్గింది. -
సై అంటే సై అంటున్న ‘బిగ్ ఫోర్’
న్యూయార్క్: ఈ ఏడాది ‘బిగ్ ఫోర్’తో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ రసవత్తరం కానుంది. గాయంతో చాన్నాళ్లుగా ఆటకు దూరమైన మాజీ చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) పునరాగమనంతో పాటు ఈ ఏడాది ‘గ్రాండ్’ చాంపియన్లు ఫెడరర్ (ఆస్ట్రేలియన్ ఓపెన్), నాదల్ (ఫ్రెంచ్), జొకోవిచ్ (వింబుల్డన్) బరిలోకి దిగనుండటంతో యూఎస్ ఓపెన్‌లో హోరాహోరీకి రంగం సిద్ధమైంది. టాప్ స్టార్లంతా ఆడుతున్న సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీకి నేడు తెరలేవనుంది. భారత్ నుంచి యూకీ బాంబ్రీ పురుషుల సింగిల్స్‌లో... రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ డబుల్స్‌లో దిగుతున్నారు. ‘24’ కోసం సెరెనా... మహిళల సింగిల్స్ బరిలో ‘అమెరికా నల్లకలువ’ సెరెనా విలియమ్స్‌ను మరో రికార్డు ఊరిస్తోంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీల చాంపియన్ సెరెనా ఈసారి విజేతగా నిలిస్తే అత్యధిక సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జోరుమీదున్న ‘జోకర్’... వింబుల్డన్ చాంపియన్, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) న్యూయార్క్‌లోనూ టైటిల్‌పై కన్నేశాడు. గతేడాది భుజం గాయంతో యూఎస్‌కు దూరమైన ‘జోకర్’ ఇక్కడ మూడో టైటిల్ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. 2011, 2015లలో విజేతగా నిలిచిన జొకో ఐదుసార్లు రన్నరప్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల సిన్సినాటి ఓపెన్ ఫైనల్లో ఫెడరర్‌పై టైటిల్ గెలిచిన జొకోవిచ్ మొత్తం తొమ్మిది వేర్వేరు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. జోరు మీదున్న ఈ సెర్బియన్ స్టార్ తన ఫామ్ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్), రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేశారు. -
నాదల్ నిలిచాడు
ఎర్రమట్టిపై ఎదురు లేని రారాజు రాఫెల్ నాదల్ 2015 క్వార్టర్ ఫైనల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక్క సెట్ కూడా ఓడిపోలేదు. వరుసగా 37 సెట్ల పాటు ప్రత్యర్థికి తలవంచకుండా వరుస విజయాలు సాధించాడు. అలాంటిది అర్జెంటీనా కుర్రాడు డీగో ష్వార్ట్‌జ్‌మన్ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై తొలి సెట్ గెలిచి షాక్‌కు గురి చేశాడు. రెండో సెట్లో కూడా ఒక దశలో 3–2తో ముందంజ వేసి సంచలనం సృష్టిస్తాడా అనిపించాడు. కానీ స్పెయిన్ బుల్ తన అసలు సత్తాను ప్రదర్శించి ఆ తర్వాత చెలరేగిపోయాడు. 11వ టైటిల్ వేటలో సెమీస్‌లోకి అడుగు పెట్టాడు. పారిస్: వర్షం కారణంగా ఆగిపోయి గురువారం కొనసాగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ విజయం సాధించి ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో నాదల్ 4–6, 6–3, 6–2, 6–2తో ష్వార్ట్‌జ్‌మన్‌ను చిత్తు చేశాడు. బుధవారం రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్న నాదల్ చకచకా రెండు గేమ్‌లు గెలుచుకొని సెట్ సాధించాడు. ఆ తర్వాత మూడో సెట్నుంచి అతనికి తిరుగు లేకుండా పోయింది. చక్కటి డ్రాప్ షాట్లతో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 4–1తో దూసుకుపోయాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్ తన సర్వీస్ నిలబెట్టుకున్నా... మరుసటి గేమ్ నాదల్ ఖాతాలో చేరింది. రెండో సెట్లో నాలుగు సార్లు బ్రేక్ పాయింట్ కాపాడుకున్న వరల్డ్ నంబర్‌వన్‌ను సుదీర్ఘంగా సాగిన ఎనిమిదో గేమ్‌లో అర్జెంటీనా కుర్రాడు నిలువరించలేకపోయాడు. చివరి సెట్లో కూడా ఒక దశలో ష్వార్ట్‌జ్‌మన్ తీవ్రంగా పోరాడినా నాదల్ దూకుడు ముందు అది సరిపోలేదు. పురుషుల విభాగంలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కనీసం 11 సార్లు సెమీస్ చేరిన మూడో ఆటగాడు నాదల్. గతంలో ఫెడరర్, కానర్స్ ఈ ఘనత సాధించారు. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ జువాన్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 7–6, 5–7, 6–3, 7–5తో మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)ను ఓడించాడు. 2009 తర్వాత డెల్‌పొట్రో ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. ‘వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోవడం నాకు కొంత వరకు కలిసొచ్చింది. నేను నా వ్యూహాలు మార్చుకునేందుకు అవకాశం కలిగింది. అయితే వర్షమో, సూర్యుడు రావడమో నా విజయానికి కారణం కాదు. నా ఆటను మార్చుకోవడం వల్లే ఈ మ్యాచ్ గెలవగలిగాననేది వాస్తవం. మీరు ఒత్తిడిని జయించలేకపోయారంటే ఆటను ఇష్టపడట్లేదనే అర్థం’ – నాదల్ నంబర్‌వన్ నిలబెట్టుకున్న హలెప్... మహిళల సింగిల్స్‌లో సిమోనా హలెప్ (రుమేనియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) తుది పోరుకు సిద్ధమయ్యారు. వీరిద్దరు తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో సునాయాస విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టారు. హలెప్ 6–1, 6–4 స్కోరుతో 2016 చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను చిత్తు చేసింది. ఫలితంగా తన నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా నిలబెట్టుకుంది. హలెప్ జోరు ముందు ఏమాత్రం నిలవలేకపోయిన ముగురుజా, ఈ పరాజయంతో వరల్డ్ నంబర్‌వన్ అయ్యే అవకాశం కూడా చేజార్చుకుంది. హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గత ఏడాది కూడా ఆమె ఫైనల్లో ఓడింది. మరో సెమీస్‌లో స్టోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–4, 6–4తో సహచర అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్పై గెలుపొందింది. 77 నిమిషాల్లో సాగిన ఈ పోరులో స్టీఫెన్స్ చక్కటి షాట్లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. -
ఒస్టాపెంకో ఇంటిముఖం
మెల్బోర్న్: మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ చాం పియన్, ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. 32వ సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) 6–3, 1–6, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొంటావీట్ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో వొజ్నియాకి 6–4, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించగా... స్వితోలినా 6–2, 6–2తో తన దేశానికే చెందిన 15 ఏళ్ల యువ సంచలనం, క్వాలిఫయర్ మార్టా కోస్ట్యుక్‌పై విజయం సాధించింది. నాదల్ హవా... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తన జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్లో నాదల్ 6–1, 6–3, 6–1తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)ను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), పదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. దిమిత్రోవ్ 6–3, 4–6, 6–4, 6–4తో 30వ సీడ్ రుబ్లేవ్ (రష్యా)పై, సిలిచ్ 7–6 (7/4), 6–4, 7–6 (7/4)తో హారిసన్ (అమెరికా)పై, కరెనో బుస్టా 7–6 (7/4), 4–6, 7–5, 7–5తో 23వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–6 (7/5), 4–6, 7–6 (8/6), 7–6 (7/5)తో 15వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆండ్రియా సెప్పి (ఇటలీ) 6–3, 7–6 (7/4), 6–7 (3/7), 6–7 (5/7), 9–7తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, దివిజ్ జోడీలు పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్)... దివిజ్ శరణ్ (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జంటలు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరాయి. రెండో రౌండ్లో బోపన్న–వాసెలిన్ 6–2, 7–6 (7/3)తో మాయెర్ (అర్జెంటీనా)–సుసా (పోర్చుగల్)లపై... దివిజ్–రాజీవ్ 4–6, 7–6 (7/4), 6–2తో ఫాగ్నిని (ఇటలీ)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలుపొందారు. -
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి నాదల్ అవుట్
అనుకున్నదే అయింది. మోకాలి గాయం కారణంగా టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ వైదొలిగాడు. లండన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నాదల్ 6–7 (5/7), 7–6 (7/4), 4–6తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం) చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు నాదల్ ప్రకటించాడు. -
నాదల్ ఖాతాలో 75వ టైటిల్
బీజింగ్: ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తన కెరీర్లో 75వ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన చైనా ఓపెన్ ఫైనల్లో తను 6–2, 6–1 తేడాతో నిక్ కిర్గియోస్‌ను చిత్తుగా ఓడించాడు. అలాగే ఈ సీజన్లో 31 ఏళ్ల నాదల్కు ఆరో టైటిల్ కావడం విశేషం. ఇప్పటిదాకా ఏ ఫైనల్లోనూ నాదల్‌తో తలపడని ప్రపంచ 19వ ర్యాంకర్ కిర్గియోస్ ఈ మ్యాచ్‌లో ఎలాంటి పోటీనివ్వలేకపోయాడు. -
ఈసారైనా తలపడతారా?
ఒకే పార్శ్వంలో నాదల్, ఫెడరర్ ∙యూఎస్ ఓపెన్ ‘డ్రా’ విడుదల న్యూయార్క్: యూఎస్ ఓపెన్ చరిత్రలో స్పానిష్ స్టార్ రాఫెల్ నాదల్, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఒకరికొకరు ఎప్పుడూ ఎదురుపడలేదు. అయితే ఈసారి మాత్రం ఈ టెన్నిస్ లెజెండ్స్ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉన్నారు. దీంతో టాప్ సీడ్ నాదల్, మూడో సీడ్ ఫెడరర్ తమ ప్రత్యర్థులను ఓడించుకుంటూ సెమీస్ వెళితే మాత్రం... దిగ్గజాల పోరుతో ఈ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ హోరెత్తనుంది. అది సెమీస్ అయినా ‘ఫైనల్’ను తలపిస్తుంది. సోమవారం మొదలయ్యే ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ‘డ్రా’ను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. తొలిరౌండ్లో నాదల్... లెజొవిచ్ (సెర్బియా)తో తలపడనుండగా, ఫెడరర్... ఫ్రాన్సెస్ టియాఫె (అమెరికా)తో ఆడతాడు. మహిళల సింగిల్స్‌లో మరియా షరపోవాకు తొలిరౌండ్లో రెండో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) ఎదురైంది. డోపింగ్ సస్పెన్షన్ తర్వాత రష్యా స్టార్ బరిలోకి దిగుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఇదే. ఆమెకు నిర్వాహకులు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. -
మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ నమ్మశక్యంగా లేదు: నాదల్
మూడేళ్ల తర్వాత ప్రపంచ పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్ స్థానాన్ని అందుకోవడం నమ్మశక్యంగా లేదని స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అన్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో నాదల్ 7,645 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. 2014 జూన్‌లో చివరిసారి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచిన నాదల్ ఆ తర్వాత గాయాల కారణంగా ఒకదశలో 13వ ర్యాంక్‌కు పడిపోయాడు. నాదల్ తర్వాత ఆండీ ముర్రే (7,150 పాయింట్లు) రెండో స్థానంలో, ఫెడరర్ (7,145 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. వచ్చే వారం మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో నాదల్, ముర్రే, ఫెడరర్ ప్రదర్శన ఆధారంగా టాప్ ర్యాంక్ తారుమారు అయ్యే అవకాశముంది. -
అంత సులువు కాదు
వింబుల్డన్‌లో విజయంపై నాదల్ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచినా... గ్రాస్‌కోర్ట్ ఈవెంట్లో తాను ఫేవరెట్‌ను కాదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ స్పష్టం చేశాడు. 2008, 2010లలో ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచిన ఈ స్టార్ ప్లేయర్‌ను మళ్లీ ఈ ఏడాది ఆ ఫీట్ ఊరిస్తోంది. సోమవారం విడుదల చేసిన ర్యాం కుల్లో అతను రెండో ర్యాంకుకు ఎగబాకాడు. 2014 తర్వాత నాదల్కిదే మెరుగైన ర్యాంకు. ఎప్పటిలాగే పదో టైటిల్‌నూ సుప్రసిద్ధ ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడిన 31 ఏళ్ల రాఫెల్ ఫొటో సెషన్లో సందడి చేశాడు. ఇబ్బంది అంతా గాయంతోనే... ‘2012 నుంచి మోకాలి గాయం పదేపదే ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి గ్రాస్‌కోర్టులపై ఆడుతుంటే అది మరింత ప్రభావం చూపెడుతోంది. ఈసారి ఏమవుతుందో చూడాలి. ఇక్కడ క్లేకోర్టులో ఆడినట్లు గ్రాస్‌కోర్టులో ఆడలేం. రెండు మ్యాచ్‌లైతే గెలవొచ్చు... కానీ ఆ తర్వాతే పరిస్థితులు మారతాయి’ అని పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ సాధించిన నాదల్ అన్నాడు. వింబుల్డన్‌లో ఐదుసార్లు ఫైనల్ చేరినప్పటికీ కేవలం రెండుసార్లే టైటిల్ గెలుచుకున్నాడు. ‘ఇపుడైతే నేను రెండో ర్యాంకర్‌ను. మిగతా ఏడాదంతా ఏం జరుగుతుందో చూడాలి. అది నా ఆటతీరుమీదే ఆధారపడి ఉంటుంది’ అని అన్నాడు. విమర్శకులకు ఇదే నా జవాబు... గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఇక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేడనే వారికి తన పదో టైటిలే జవాబిచ్చిందని స్పెయిన్ స్టార్ అన్నాడు. ‘మూడేళ్ల నుంచి నిన్నమొన్నటి వరకు నా సామర్థ్యంపై ఎన్నో సందేహాలు రేకెత్తించినవారికి నా సత్తాతో సమాధానమిచ్చా. అయినా జీవితమెప్పుడూ సాఫీగా ఉండదు. అలా ఉంటే అహంభావమూ ఉంటుంది. నేను అహంభావిని కాదు’ అని నాదల్ చెప్పుకొచ్చాడు. గాయాలు, వైఫల్యాలతో 2015లో పదో ర్యాంకుకు పడిపోయిన నాదల్ గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో మణికట్టు గాయం వల్ల మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే ఈ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. -
నాదల్ & వావ్రింకా
-
నాదల్ & వావ్రింకా
►పదో సారి ఫైనల్లోకి నాదల్ ►వావ్రింకాతో అమీతుమీ రేపు ►ఫ్రెంచ్ ఓపెన్ ఇటు వావ్రింకా, అటు నాదల్ తమ ప్రత్యర్థులను దెబ్బకు దెబ్బ తీశారు. తమ ప్రతీకారానికి ఫ్రెంచ్ ఓపెన్‌ను వేదికగా చేసుకున్నారు. గతేడాది ఇదే వేదికపై బ్రిటన్ స్టార్ ముర్రే చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాభవానికి ఈ ఏడాది వావ్రింకా బదులు తీసుకుంటే... మూడువారాల క్రితం రోమ్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్లో థీమ్ చేతిలో చవిచూసిన పరాజయానికి నాదల్ ప్రతీకారం తీర్చుకున్నాడు. పారిస్: స్పానిష్ సంచలనం రాఫెల్ నాదల్... మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించాడు. ఈ క్లేకోర్టు సూపర్ చాంపియన్ పదో టైటిల్ కోసం స్విట్జర్లాండ్ స్టార్ వావ్రింకాతో తలపడనున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4, 6–0తో డొమినిక్ థీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించాడు. కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే థీమ్ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. ఇద్దరు తమ తమ ప్రత్యుర్థులపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఫైనల్ పరంగా చూస్తే కూడా ఇద్దరి గణాంకాలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇప్పటి దాకా ఫైనల్ చేరిన ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ వావ్రింకా ఓడిపోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2014) ఫైనల్లో నాదల్‌ను కంగుతినిపించిన వావ్రింకా... ఫ్రెంచ్ ఓపెన్ (2015), యూఎస్ ఓపెన్ (2016) ఫైనల్స్‌లో జొకోవిచ్‌ను ఓడించాడు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ది ఎదురులేని రికార్డు. ఫైనల్ చేరిన 9 సార్లు టైటిల్ చేజిక్కించుకున్నాడు. వారెవ్వా వావ్రింకా గతేడాది... ఇదే టోర్నీ... డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి వావ్రింకా... క్వార్టర్స్ దాకా ఎదురేలేని పయనం. కానీ సెమీస్‌లో చుక్కెదురు. బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చేతిలో ఓటమి. వరుసగా రెండో టైటిల్ గెలుద్దామనుకున్న ఆశలకు తెర! అందుకేనేమో పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనుకున్నాడు. ఏడాది తిరిగేలోపే లెక్క సరిచేశాడు. ముర్రే కథను అదే టోర్నీ సెమీస్‌లో ముగించాడు. వారెవ్వా వావ్రింకా అనిపించుకున్నాడు. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 2015 చాంపియన్ స్విస్ స్టార్ 3–2 సెట్లతో గతేడాది రన్నరప్ ముర్రేను కంగుతినిపించాడు. జోరు మీదున్న వావ్రింకాకు ఇది వరుసగా పదో విజయం కావడం గమనార్హం. ఇద్దరి పోరాటంతో నాలుగున్నర గంటలపాటు ఈ మ్యాచ్ సాగింది. మొదటి సెట్ నుంచే ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో రెండు సెట్లు టైబ్రేక్ దారి తీశాయి. చివరకు వావ్రింకా 6–7 (6/8), 6–3, 5–7, 7–6 (7/3), 6–1తో ముర్రేను కంగుతినిపించాడు. బ్రిటన్ స్టార్ ఆరంభం నుంచే మ్యాచ్‌పై పట్టుబిగించే ప్రయత్నం చేశాడు. అయితే వావ్రింకా కూడా దీటుగా బదులివ్వడంతో ప్రతీపాయింట్కు చెమటోడ్చాల్సివచ్చింది. అయితే ఈ సెట్లో స్విస్ స్టార్ పదే పదే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. టైబ్రేక్‌లోనూ సరిదిద్దుకోలేని తప్పులతో తొలిసెట్‌ను కోల్పోయాడు. తర్వాత రెండో సెట్‌ను మాత్రం దూకుడుగా ప్రారంభించిన వావ్రింకా ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో మళ్లీ ముర్రేదే పైచేయి అయ్యింది. ముర్రే మూడు బ్రేక్ పాయింట్లను సాధించగా... వావ్రింకా మళ్లీ నియంత్రణే లేని అనవసర తప్పిదాలతో సెట్‌ను కోల్పోవాల్సివచ్చింది. ఇక నాలుగో సెట్లో మళ్లీ ఇద్దరు అసాధారణ ప్రదర్శన కనబరచడంతో ఇది సుదీర్ఘంగా సాగింది. దీంతో ఈ సెట్ కూడా టైబ్రేక్‌కు దారితీసినప్పటికీ వావ్రింకా దూకుడుగా ఆడి సెట్‌ను ముగించాడు. ఇద్దరూ వీరోచిత పోరాటంతో 2–2తో సమంగా నిలిచారు. నిర్ణాయక ఐదో సెట్లో వావ్రింకా జోరు ముందు ముర్రే తేలిపోయాడు. వరుసగా ఐదు గేమ్‌లు గెలుచుకొని వావ్రింకా 5–0తో ఆధిక్యంలో నిలిచాడు. తర్వాతి గేమ్‌ను ముర్రే బ్రేక్ చేసినా... ఏడో గేమ్‌ను బ్రేక్ చేసిన స్విస్ ఆటగాడు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. -
గట్టెక్కిన జొకోవిచ్
ఐదు సెట్ల పోరులో విజయం ► ఎదురులేని నాదల్ ► ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: కొత్త కోచ్ అగస్సీ పర్యవేక్షణలో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆడుతోన్న డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు శుక్రవారం కఠిన పరీక్ష ఎదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ జొకోవిచ్ 5–7, 6–3, 3–6, 6–1, 6–1తో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)పై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 55 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా), ఆరో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో నాదల్ 6–0, 6–1, 6–0తో బాసిలాష్విలి (జార్జియా)ను చిత్తుగా ఓడించగా... థీమ్ 6–1, 7–6 (7/4), 6–3తో జాన్సన్ (అమెరికా)పై గెలుపొందాడు. రావ్‌నిచ్ 6–1, 1–0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి లోపెజ్ (స్పెయిన్) గాయంతో వైదొలిగాడు. అయితే 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) మూడో రౌండ్లో ఇంటిదారి పట్టారు. దిమిత్రోవ్ 5–7, 3–6, 4–6తో కరెనో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. జెబలాస్ (అర్జెంటీనా)తో జరిగిన మ్యాచ్‌లో గాఫిన్ 5–4తో ఆధిక్యంలో ఉన్నపుడు కోర్టులో జారిపడ్డాడు. కాలికి గాయం కావడంతో గాఫిన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. ముగురుజా ముందుకు... మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్) మూడో రౌండ్లో 7–5, 6–2తో పుతింత్సెవా (కజకిస్తాన్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 7–5, 4–6, 8–6తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై, 23వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6–2, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై గెలిచారు. బోపన్న జంట గెలుపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–క్యువాస్ (ఉరుగ్వే) 5–7, 7–6 (7/4), 6–4తో ట్రీట్ హుయె (ఫిలిప్పీన్స్)–ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)లపై... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) 6–4, 3–6, 6–4తో మరాచ్ (ఆస్ట్రియా)–పావిక్ (క్రొయేషియా)లపై గెలుపొందగా... లియాండర్ పేస్ (భారత్)–స్కాట్ లిప్స్కీ (అమెరికా) 6–7 (3/7), 2–6తో మరెరో–రొబ్రెడో (స్పెయిన్)ల చేతిలో ఓడిపోయారు. పేస్–హింగిస్ జోడీకి షాక్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్స్ లియాండర్ పేస్–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 4–6, 6–1, 2–10తో సూపర్ టైబ్రేక్‌లో క్లాసెన్ (దక్షిణాఫ్రికా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 7–5, 6–3తో దరియా జురాక్–పావిక్ (క్రొయేషియా) జోడీపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
‘ఫ్రెంచ్’ కిరీటమెవరిదో?
♦ నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ ♦ ఫేవరెట్స్‌గా నాదల్, జొకోవిచ్ పారిస్: తనకెంతో కలిసొచ్చిన చోట పదోసారి పాగా వేయాలని రాఫెల్ నాదల్... ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలబాట పట్టాలని నొవాక్ జొకోవిచ్... అందరి అంచనాలను తలకిందులు చేసి విజేతగా అవతరించాలని యువ తారలు అలెగ్జాండర్ జ్వెరెవ్, డొమినిక్ థీమ్... క్లే కోర్టులపై కూడా గొప్పగా రాణించే సత్తా ఉందని నిరూపించుకోవాలని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే... అవకాశం వస్తే రెండోసారి టైటిల్ సొంతం చేసుకోవాలని స్విస్ నంబర్‌వన్ వావ్రింకా... ఇలా ఒకరికంటే ఎక్కువ ఫేవరెట్స్‌తో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. నేడు (ఆదివారం) మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 11న జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్‌తో ముగుస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్కు అద్వితీయమైన రికార్డు ఉంది. ఈ టోర్నీలో 12 సార్లు పాల్గొన్న నాదల్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచాడు. 2009లో ప్రిక్వార్టర్ ఫైనల్లో, 2015లో క్వార్టర్ ఫైనల్లో, 2016లో మూడో రౌండ్లో అతను నిష్క్రమించాడు. ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో మూడు టైటిల్స్ సాధించి జోరుమీదున్న నాదల్కు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు యువ తారలు జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ‘డ్రా’ ప్రకారం నాదల్కు సెమీఫైనల్లో జొకోవిచ్ ఎదురుకావొచ్చు. ఈ సీజన్లో రోమ్ ఓపెన్‌లో జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ టైటిల్ సాధించగా... ఇదే టోర్నీ క్వార్టర్ ఫైనల్లో నాదల్‌పై థీమ్ సంచలన విజయం సాధించి తమను తక్కువ అంచనా వేయొద్దని సంకేతాలు పంపించారు. శనివారం ముగిసిన జెనీవా ఓపెన్‌లో వావ్రింకా (స్విట్జర్లాండ్) తన టైటిల్‌ను నిలబెట్టుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే ఫామ్‌లో లేకపోయినా అతడిని తక్కువ అంచనా వేసే ప్రసక్తి లేదు. సెరెనా విలియమ్స్, షరపోవా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్ కనిపించడంలేదు. నంబర్‌వన్ కెర్బర్ (జర్మనీ), డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్)లతోపాటు మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), 13వ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) టైటిల్ రేసులో ఉన్నారు. అభిమన్యుకు వైల్డ్ కార్డు: భారత యువ ఆటగాడు వన్నెంరెడ్డి అభిమన్యు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ బాలుర సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో పాల్గొనేందుకు ‘వైల్డ్ కార్డు’ సంపాదించాడు. శనివారం జరిగిన రాండీవూ ఈవెంట్ ఫైనల్లో బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అభిమన్యు 6–1, 4–6, 6–1తో హికారు షిరైషి (జపాన్)పై గెలిచి ఈ ఘనత సాధించాడు. -
నాదల్‌తో డబుల్స్ ఆడాలనుంది: ఫెడరర్
ప్రేగ్: ఫెడరర్... నాదల్... ప్రపంచ టెన్నిస్‌లో వీరిద్దరి మధ్య పోరు జరిగితే ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఇద్దరు కలిసి డబుల్స్ బరిలోకి దిగితే అభిమానులకు పండగే. టెన్నిస్ గ్రేట్ రాడ్ లేవర్ పేరిట ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ప్రారంభ లేవర్ కప్‌లో ఈ దృశ్యం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే నాదల్‌తో కలిసి డబుల్స్ ఆడాలని ఉందని ఫెడరర్ తన మనసులో మాట బయటపెట్టాడు. గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్‌పై ఫెడరర్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ లేవర్ కప్‌లో టెన్నిస్ దిగ్గజాలు బోర్గ్ నాయకత్వంలోని యూరోపియన్ టీమ్, మెకన్రో కెప్టెన్సీలోని రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ జట్లు తలపడతాయి. ‘నాదల్‌తో ఆడేందుకు ఎప్పుడూ ఇష్టపడతాను. ఎందుకంటే మా మధ్య ఆటపరంగా ఉన్న శతృత్వం అలాంటిది. అతడి ఫోర్‌హ్యాండ్ షాట్స్ అంటే నాకిష్టం. మేం కలిసి ఆడాలని లేవర్ కూడా కోరుకున్నారు’ అని 35 ఏళ్ల ఫెడరర్ తెలిపాడు. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు జరిగే లేవర్ కప్‌లోని రెండు జట్లలో ఆరేసి ఆటగాళ్లుంటారు. -
ఫెడరర్‌పై నాదల్ పైచేయి
సింగిల్స్, డబుల్స్‌లో విజయం ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ ‘సిక్సర్’ న్యూఢిల్లీ: వేదిక మారినా, ఫార్మాట్ మారినా... తన చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్-యూఏఈ రాయల్స్)పై రాఫెల్ నాదల్ (స్పెయిన్-ఇండియన్ ఏసెస్) మరోసారి పైచేయి సాధించాడు. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో భాగంగా వీరిద్దరూ శనివారం పురుషుల సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డారు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న-రాఫెల్ నాదల్ (ఏసెస్) ద్వయం 6-4తో ఫెడరర్-మారిన్ సిలిచ్ (యూఈఏ రాయల్స్) జంటను ఓడించగా... పురుషుల సింగిల్స్‌లో నాదల్ 6-5 (7/4)తో ఫెడరర్‌ను ఓడించాడు. ఏటీపీ సర్క్యూట్ ముఖాముఖి రికార్డులో నాదల్ 23-11తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. నాదల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా ఐపీటీఎల్‌లో ఇండియన్ ఏసెస్ జట్టు జైత్రయాత్రను కొనసాగిస్తూ తమ ఖాతాలో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. యూఏఈ రాయల్స్ జట్టుపై ఏసెస్ జట్టు 30-19 గేమ్‌ల తేడాతో విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా-బోపన్న జోడీ (ఏసెస్) 6-4తో నెస్టర్-మ్లాడెనోవిచ్ (రాయల్స్) జంటపై; మహిళల సింగిల్స్‌లో రద్వాన్‌స్కా (ఏసెస్) 6-1తో మ్లాడెనోవిచ్ (రాయల్స్)పై; లెజెండ్ సింగిల్స్‌లో ఫాబ్రిస్ సాంతోరో (ఏసెస్) 6-5 (7/4)తో గొరాన్ ఇవానిసెవిచ్ (రాయల్స్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో సింగపూర్ స్లామర్స్ 24-22తో జపాన్ వారియర్స్‌పై నెగ్గింది. -
‘అందరివాడు’ కాకున్నా...
క్రీడావిభాగం: గత దశాబ్దకాలంలో టెన్నిస్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరు ఫెడరర్ వీరాభిమానులైతే... రెండో వర్గం నాదల్ కోసం ప్రాణమిచ్చేవాళ్లు. ఈ ఇద్దరి మధ్యలో ఐదేళ్ల కాలంగా అనేక విజయాలు సాధిస్తున్నా జొకోవిచ్ మాత్రం అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. దీనికి కారణం లేకపోలేదు. ఫెడరర్, నాదల్ ఇద్దరి ఆటశైలి పూర్తిగా భిన్నం. ఫెడరర్ కోర్టులో ఈ చివరి నుంచి ఆ చివరికి సీతాకోక చిలుకలా వెళతాడు. చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. నాదల్ బేస్‌లైన్ దగ్గర గెరిల్లా తరహాలో దూకుడుగా ఆడతాడు. ఒకరు పచ్చిక కోర్టుల్లో పరుగులు పెట్టించే ఆటగాడైతే... మరొకరు మట్టి కోర్టులో మహరాజు. ఈ ఇద్దరి స్థాయిలో అభిమానులు జొకోవిచ్‌ను ఆదరించలేదు. అయితే ఈ ఫ్యాన్స్ అందరూ అభిమానించే రెండో వ్యక్తి జొకోవిచ్. అటు ఫెడరర్ అభిమానులు, ఇటు నాదల్ అభిమానులు కూడా తమ రెండో ఓటును జొకోవిచ్‌కే వేశారు. నిజానికి ఇది జొకోవిచ్ తప్పుకాదు. అతను గొప్ప హాస్య చతురత ఉన్న వ్యక్తి. కోర్టులో ప్రత్యర్థుల శైలిని అనుకరిస్తూ తాను చేసే విన్యాసాలకు నవ్వుకోని టెన్నిస్ అభిమాని లేడు. అలాగే ప్రత్యర్థిని గౌరవించడంలోనూ అతను ముందుంటాడు. యూఎస్ ఫైనల్ గెలిచాక మాట్లాడుతూ ‘బహుశా టెన్నిస్ చరిత్రలోనే అతి గొప్ప ఆటగాడు ఫెడరర్’ అంటూ కితాబివ్వడం తన స్ఫూర్తికి నిదర్శనం. అయినా మిగిలిన ఇద్దరి స్థాయిలో అభిమానులను సంపాదించుకోలేకపోయాడు. ఇది జొకోవిచ్ కూడా గమనించాడు. ‘ఫెడరర్‌లాంటి గొప్ప ఆటగాడికి ప్రపంచంలో ఎక్కడ ఆడినా మద్దతు లభిస్తుంది. ఏదో ఒక రోజు ఆ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవాలనేది నా కోరిక’ అని యూఎస్ టైటిల్ గెలిచాక వ్యాఖ్యానించాడు. ఆట పరంగా జొకోవిచ్ కాస్త ఫెడరర్‌కు దగ్గరగా ఉంటాడు. ఫెడరర్ 7 వింబుల్డన్ టైటిల్స్ సాధిస్తే... నాదల్ 9 ఫ్రెంచ్ టైటిల్స్ కొల్లగొట్టాడు. జొకోవిచ్ సాధించిన 10 గ్రాండ్‌స్లామ్‌లలో 5 ఆస్ట్రేలియన్ ఓపెన్ ద్వారా వచ్చినవే. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ మీద జొకోవిచ్ ముద్ర లేకపోవడం కాస్త ఆశ్చర్యకరమే. అటు ఫెడరర్, నాదల్ ఇద్దరూ అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌నూ సాధిస్తే... జొకోవిచ్‌కు మాత్రం ఫ్రెంచ్ ఇంకా అందలేదు. అతని కెరీర్లో ఉన్న లోటు ఇదే. ఆ ఒక్క టైటిల్ కూడా అందితే అతను పరిపూర్ణ ఆటగాడవుతాడు. ఒత్తిడిలోనూ సులభంగా... ఆదివారం రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్‌కు ఫెడరర్ నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా గట్టిపోటీ ఎదురయింది. ఒక దశలో ఫెడరర్ సాధించిన ప్రతి పాయింట్‌కూ స్టేడియం హోరెత్తింది. మొత్తం న్యూయార్క్ నగరంతో జొకోవిచ్ పోరాడాడా? అనిపించింది. అంత ఒత్తిడిని కూడా అతను జయించాడు. గత మూడేళ్లుగా ఫెడరర్ టైటిల్స్, జోరు తగ్గాయి. కానీ ఈ ఏడాది వింబుల్డన్ నుంచి అతను అద్భుతంగా ఆడుతున్నాడు. తన కెరీర్లో పీక్ దశలో ఆడిన టెన్నిస్‌ను మళ్లీ అభిమానులకు ఫెడరర్ రుచి చూపిస్తున్నాడు. అయితే జొకోవిచ్ దీనికి సన్నద్ధమై వచ్చాడు. ఫెడరర్ తీసుకొచ్చిన కొత్త టెక్నిక్‌ను, వైవిధ్యాన్ని జొకో పసిగట్టి సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఈసారి కూడా జొకోవిచ్ గెలుస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉన్నా... టోర్నీలో ఫెడరర్ చూపించిన అసమాన ఆటతీరు పోరులో ఉత్కంఠను పెంచింది. అయినా చివరకు జొకో జోరును ఫెడెక్స్ ఆపలేకపోయాడు. దిగ్గజాల సరసన కెరీర్లో పది గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడం చాలా గొప్ప ఘనత. అతనికంటే ముందు ఈ మార్కును కేవలం ఏడుగురు మాత్రమే చేరుకున్నారు. జొకోవిచ్ ఇదే జోరును కొనసాగిస్తే ఫెడరర్ (17) టైటిల్స్ రికార్డును చేరడం కూడా కష్టమేమీ కాదు. ఇప్పటికే ‘ఆల్‌టైమ్ గ్రేట్’ జాబితాలో జొకోవిచ్ చేరిపోయాడు. ఫెడరర్, నాదల్ ఒకరకంగా కెరీర్లో పీక్ స్టేజ్‌ను దాటి వచ్చేశారనే అనుకోవాలి. ఇక ముర్రే, వావ్రింకా అడపాదడపా మెరుస్తారే తప్ప జొకో స్థాయి లేదు. ప్రస్తుతం ఉన్న ఫామ్, తన ప్రణాళిక చూస్తే రాబోయే మూడు నాలుగేళ్లు జొకోవిచ్ హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 2011తో పోలిస్తే ఇప్పుడు జొకోవిచ్‌లో పరిణతి బాగా పెరిగింది. భర్తగా, తండ్రిగా తన బాధ్యత పెరగడం వల్ల టెన్నిస్‌ను చూసే దృక్పథంలోనూ తేడా వచ్చిందని అంటున్నాడు. శారీరకంగా, మానసికంగా కూడా జొకోవిచ్ దృఢంగా తయారయ్యాడు. శరీరం, మనసు రెండింటి మీదా నియంత్రణతో ఉన్న ఆటగాడు కచ్చితంగా ఎప్పుడూ చాంపియన్‌గానే ఉంటాడు. జొకోవిచ్ ఇదే కోవలోకి వస్తాడు. -
సెరెన 'సేఫ్'... నాదల్ కు షాక్
♦ చెమటోడ్చి నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ♦ స్పెయిన్ స్టార్‌కు ఊహించని ఓటమి ♦ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ కాస్త అటు ఇటు అయితే అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ కల చెదిరేది. కానీ మంచి ప్లేయర్‌కు, గొప్ప ప్లేయర్‌కు మధ్య ఉండే తేడాను చూపిస్తూ కీలక దశలో చెలరేగిన ఈ డిఫెండింగ్ చాంపియన్ ఓటమి నుంచి గట్టెక్కి విజయతీరాలకు చేరింది. మరోవైపు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తన ఖాతాలో ఎలాంటి ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్‌ను చేర్చుకోకుండానే ముగించాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లో నాదల్ తొలి రెండు సెట్లు నెగ్గిన తర్వాత వరుసగా మూడు సెట్లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. న్యూయార్క్ : గొప్ప పోరాటపటిమను కనబరిచిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో సెరెనా 3-6, 7-5, 6-0తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తొలి సెట్‌ను కోల్పోయిన ఈ డిఫెండింగ్ చాంపియన్ రెండో సెట్లో 3-5తో వెనుకబడింది. తొమ్మిదో గేమ్‌లో గనుక బెథానీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెరెనా ఓటమి పాలయ్యేది. కానీ సెరెనా ఏమాత్రం బెదరకుండా, తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. తొమ్మిదో గేమ్‌లో బెథానీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి బెథానీ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో సెరెనా తన విశ్వరూపాన్ని చూపించడంతో బెథానీ చేతులెత్తేసింది. తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెరెనా మూడో సెట్‌ను 6-0తో సొంతం చేసుకొని మ్యాచ్‌కు అద్వితీయ ముగింపునిచ్చింది. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన రైజింగ్ స్టార్ మాడిసన్ కీస్‌తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. మూడో రౌండ్లో 19వ సీడ్ మాడిసన్ కీస్ 6-3, 6-2తో 15వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)ను బోల్తా కొట్టించింది. మహిళల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ 6-3, 6-4తో 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందగా... 13వ సీడ్ మకరోవా (రష్యా) 6-3, 7-5తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, 25వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (11/9), 4-6, 6-3తో సిబుల్కోవా (స్లొవేకియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఫాగ్నిని సంచలనం పురుషుల సింగిల్స్ విభాగంలో పెను సంచలనాలు నమోదయ్యాయి. స్పెయిన్‌కు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు రాఫెల్ నాదల్, డేవిడ్ ఫెరర్తోపాటు పదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. 32వ సీడ్ ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) అద్భుత పోరాటంతో తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. 3 గంటల 46 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ పోరులో ఫాగ్నిని 3-6, 4-6, 6-4, 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ నాదల్‌ను కంగుతినిపించాడు. ఫాగ్నిని 57 అనవసర తప్పిదాలు చేసినా, ఏకంగా 70 విన్నర్స్ కొట్టి నాదల్ ఆశలను వమ్ము చేశాడు. ఇప్పటివరకు కెరీర్లో 151 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన నాదల్ తొలి రెండు సెట్లు గెలిచాక, ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు చేజార్చుకొని ఓడిపోవడం ఇదే ప్రథమం. ఈ ఏడాది నాదల్‌పై ఫాగ్నినికిది మూడో విజయం కావడం విశేషం. బార్సిలోనా, రియో ఓపెన్ టోర్నీల్లో కూడా ఫాగ్నిని చేతిలో నాదల్ ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) 7-6 (8/6), 4-6, 6-3, 6-1తో ఏడో సీడ్ ఫెరర్‌ను బోల్తా కొట్టించగా... 18వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) 6-2, 7-6 (7/4), 6-3తో రావ్నిక్ను ఓడించాడు. 14వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-2, 7-5, 3-6, 1-3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలగడంతో అతని ప్రత్యర్థి, 23వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, సిలిచ్ మరోవైపు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-5, 7-5తో ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ)పై గెలుపొందగా... డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-7 (5/7), 7-6 (7/1), 6-3, 6-7 (3/7), 6-1తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై చెమటోడ్చి విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), అన్‌సీడెడ్ బెనోయిట్ పెయిర్ (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సానియాకు మిశ్రమ ఫలితాలు మహిళల డబుల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-1, 6-1తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)-చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జంట సానియా మీర్జా (భారత్) -బ్రూనో సోరెస్ (బ్రెజిల్) తొలి రౌండ్లోనే చేతులెత్తేసింది. సానియా-సోరెస్ ద్వయం 3-6, 3-6తో హలవకోవా-లుకాజ్ కుబోట్ (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట 6-4, 6-4తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)-వెర్దాస్కో (స్పెయిన్) జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. -
చెమటోడ్చిన సెరెనా
♦ యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోకి ప్రవేశం ♦ నాదల్, జొకోవిచ్ కూడా... న్యూయార్క్ : ‘క్యాలెండర్ స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్‌లో చెమటోడ్చి నెగ్గింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-3తో ప్రపంచ 110వ ర్యాంకర్ క్వాలిఫయర్ కికి బెర్టెన్స్ (డచ్)పై గెలిచి మూడోరౌండ్లోకి అడుగుపెట్టింది. గంటా 32 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 34 అనవసర తప్పిదాలు, 10సార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. బెర్టెన్స్ ధాటికి అమెరికా ప్లేయర్ ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించింది. తొలిసెట్లో 5-5తో స్కోరును సమం చేసిన సెరెనా 11వ గేమ్‌లో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసినా సర్వీస్ నిలబెట్టుకుంది. బెర్టెన్స్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో సెట్ టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లోనూ బెర్టెన్స్ దూకుడుకు సెరెనా 0-4తో వెనుకబడింది. అయితే తన అనుభవంతో... డచ్ ప్లేయర్ చేసిన అనవసర తప్పిదాలను తనకు అనుకూలంగా మల్చుకుని సెట్‌ను దక్కించుకుంది. రెండోసెట్లో కాస్త ఇబ్బందిపడినా.. కీలక సమయంలో అద్భుతమైన షాట్లతో చెలరేగింది. రెండు, ఆరు, తొమ్మిదో గేమ్‌ల్లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన టాప్‌సీడ్... మూడు, ఐదు, ఎనిమిదో గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.ఇతర మ్యాచ్‌ల్లో వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-3, 6-7 (2), 6-2తో ఇన్నా ఫాల్కోని (అమెరికా)పై; రద్వాన్‌స్కా (పోలెండ్) 6-3, 6-2తో లిన్నెటి (పోలెండ్)పై; మకరోవా (రష్యా) 6-1, 6-2తో లౌరెన్ డేవిస్ (అమెరికా)పై నెగ్గి మూడోరౌండ్లోకి దూసుకెళ్లారు. నాదల్ అలవోకగా... పురుషుల రెండోరౌండ్లో 8వ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 7-6 (7/5), 6-3, 7-5తో డిగో స్వార్జ్మెన్ (అర్జెంటీనా)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. తొలిసెట్ టైబ్రేక్‌లో 4-5తో వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుని మూడు సెట్లలోనే మ్యాచ్‌ను ముగించాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-4, 6-1, 6-2తో ఆండ్రియా హైదర్ మౌరెర్ (ఆస్ట్రియా)పై; సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-3, 7-5తో డాన్స్కో (రొమేనియా)పై; రావోనిక్ (కెనడా) 6-2, 6-4, 6-7 (7/5), 7-6 (1)తో వెర్డాస్కో (స్పెయిన్)పై; 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-4, 6-3తో గ్రానోలర్స్ (స్పెయిన్)పై; గోఫిన్ (బెల్జియం) 5-7, 6-4, 3-6, 6-2, 6-1తో బెర్నాకిస్ (లిథువేనియా)పై; లోపెజ్ (స్పెయిన్) 2-6, 6-3, 1-6, 7-5, 6-3తో మార్డి ఫిష్ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. రెండోరౌండ్లో పేస్, బోపన్న వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి మిక్స్డ్ డబుల్స్‌లో రెండోరౌండ్లోకి ప్రవేశించింది. తొలిరౌండ్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-2, 6-2తో టేలర్ హారీ ఫ్రిట్జ్-సీ లూయి (అమెరికా)లపై నెగ్గారు. భారత్-స్విస్ ద్వయం 46 నిమిషాల్లో ప్రత్యర్థుల ఆట కట్టించింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో ఆరోసీడ్ రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జీ (రొమేనియా) 6-3, 6-4తో ఆస్టిన్ క్రాజిసెక్-నికోలస్ మున్రో (అమెరికా)పై గెలిచి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట సత్తా మేరకు రాణించింది. -
సఫరోవాకు షాక్
♦ సెరెనా, నాదల్ శుభారంభం ♦ యూఎస్ ఓపెన్ టెన్నిస్ న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో రోజూ సంచలనం నమోదైంది. తొలి రోజున మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)... పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ కీ నిషికోరి (జపాన్) ఇంటిముఖం పట్టగా... వీరి సరసన తాజాగా ఆరో సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో లెసియా సురెంకో (ఉక్రెయిన్) 6-4, 6-1తో సఫరోవాను ఓడించింది. మరోవైపు ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ లక్ష్యంతో బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ (అమెరికా)... ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టైటిల్ లోటును తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో టాప్ సీడ్ సెరెనా 6-0, 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి వితాలియా దియత్‌చెంకో (రష్యా) గాయం కారణంగా వైదొలిగింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ నాదల్ 6-3, 6-2, 4-6, 6-4తో బోర్నా కోరిక్ (క్రొయేషియా)ను ఓడించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 6-1, 6-1తో జోవో సుజా (బ్రెజిల్)పై, డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-3, 7-6 (7/3), 7-6 (7/3)తో పెల్లా (అర్జెంటీనా)పై గెలిచారు. ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్), పదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో అనా తాతిష్విలి (అమెరికా) 6-2, 6-1తో 8వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై, డెనిసా అలెర్టోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 7-6 (7/5)తో 10వ సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై, ఓసిన్ డోడిన్ (ఫ్రాన్స్) 2-6, 7-5, 6-3తో 21వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా)పై, మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) 6-3, 7-5తో 30వ సీడ్ కుజ్నెత్సోవా (రష్యా)పై, కోకో వాండెవెగె (అమెరికా) 6-4, 6-3తో 29వ సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు.