జొకోవిచ్‌తో నాదల్ క్వార్టర్ ‘ఫైనల్’
గతేడాది టైటిల్ పోరులో తలపడిన ఆ ఇద్దరు ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నారు. డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ బుధవారం కీలకమైన క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాడు. నాదల్ ర్యాంక్ పడిపోయిన కారణంగా ‘డ్రా’ ప్రకారం క్వార్టర్స్‌లోనే జొకోవిచ్‌కు ఈ స్పెయిన్ స్టార్ ఎదురుకానున్నాడు. ముఖాముఖి రికార్డులో నాదల్ 23-20తో ఆధిక్యంలో ఉన్నాడు. గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌లో జొకోవిచ్‌తో ఆడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. గత పదేళ్లలో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓడిన నాదల్‌కు క్వార్టర్స్ మ్యాచే ఫైనల్‌లా కాబోతుంది. ఈ మ్యాచ్‌లో గనుక నాదల్ గెలిస్తే అతని ఖాతాలో పదోసారి ఫ్రెంచ్ టైటిల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఈ సీజన్‌లో ఫామ్‌పరంగా చూస్తే జొకోవిచ్ జోరుమీదున్నాడు. ‘ఫ్రెంచ్ ఓపెన్‌లో నేను ఏనాడూ నాదల్‌ను ఓడించలేకపోయాను. అయితే రెండుసార్లు విజయానికి సమీపంలో వచ్చాను. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాను కాబట్టి ఈసారి గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాను’ అని జొకోవిచ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్లోనే ఆడాలని అనుకోలేదు. అతను కూడా నేను క్వార్టర్స్‌లోనే ఎదురవ్వాలని ఆశించలేదనుకుంటాను. అయితే విజయం సాధించేందుకు నేను శాయశక్తులా కృషి చేస్తాను’ అని బుధవారం తన 29వ పుట్టిన రోజు జరుపుకోనున్న నాదల్ వ్యాఖ్యానించాడు.
నేడే మెగా ఫైట్
Published Wed, Jun 3 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement