జొకోవిచ్ శుభారంభం
రెండో రౌండ్‌లోకి డిఫెండింగ్ చాంపియన్
పారిస్: కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌ను దాటాడు. ప్రపంచ 142వ ర్యాంకర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో జొకోవిచ్ 2 గంటల 31 నిమిషాల్లో 6–4, 7–6 (7/3), 6–4తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ నెట్ వద్ద 19 పాయింట్లు గెలిచాడు.
మరోవైపు మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అల్‌కరాజ్, సిట్సిపాస్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకాగా... రుబ్లెవ్ వరుస సెట్‌లలో విజయాన్ని అందుకున్నాడు. అల్‌కరాజ్ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై, సిట్సిపాస్ 2 గంటల 43 నిమిషాల్లో 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో అల్టమెయిర్ (జర్మనీ)పై, రుబ్లెవ్ 2 గంటల 1 నిమిషంలో 6–3, 6–4, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు.
జాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్‌కరాజ్ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి స ర్వి స్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మహిళల సింగిల్స్‌లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీ షియా) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సోఫియా 6–3, 6–3తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 1–6, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై గెలుపొందారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఏకంగా 23 సింగిల్స్ మ్యాచ్‌లను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment