మెల్‌బోర్న్: మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ చాం పియన్, ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) మూడో రౌండ్‌లోనే వెనుదిరిగింది. 32వ సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) 6–3, 1–6, 6–3తో ఒస్టాపెంకోను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొంటావీట్ ఆరు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను తొమ్మిదిసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు రెండో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో వొజ్నియాకి 6–4, 6–3తో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించగా... స్వితోలినా 6–2, 6–2తో తన దేశానికే చెందిన 15 ఏళ్ల యువ సంచలనం, క్వాలిఫయర్ మార్టా కోస్ట్‌యుక్‌పై విజయం సాధించింది.
నాదల్ హవా...
పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తన జోరు కొనసాగిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో రౌండ్‌లో నాదల్ 6–1, 6–3, 6–1తో దామిర్ జుమ్‌హుర్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)ను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), పదో సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. దిమిత్రోవ్ 6–3, 4–6, 6–4, 6–4తో 30వ సీడ్ రుబ్లేవ్ (రష్యా)పై, సిలిచ్ 7–6 (7/4), 6–4, 7–6 (7/4)తో హారిసన్ (అమెరికా)పై, కరెనో బుస్టా 7–6 (7/4), 4–6, 7–5, 7–5తో 23వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–6 (7/5), 4–6, 7–6 (8/6), 7–6 (7/5)తో 15వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. 3 గంటల 51 నిమిషాలపాటు జరిగిన మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆండ్రియా సెప్పి (ఇటలీ) 6–3, 7–6 (7/4), 6–7 (3/7), 6–7 (5/7), 9–7తో ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు.
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, దివిజ్ జోడీలు
పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్)... దివిజ్ శరణ్ (భారత్)–రాజీవ్ రామ్ (అమెరికా) జంటలు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరాయి. రెండో రౌండ్‌లో బోపన్న–వాసెలిన్ 6–2, 7–6 (7/3)తో మాయెర్ (అర్జెంటీనా)–సుసా (పోర్చుగల్)లపై... దివిజ్–రాజీవ్ 4–6, 7–6 (7/4), 6–2తో ఫాగ్‌నిని (ఇటలీ)–గ్రానోలెర్స్ (స్పెయిన్)లపై గెలుపొందారు.
ఒస్టాపెంకో ఇంటిముఖం
Published Sat, Jan 20 2018 1:03 AM | Last Updated on Sat, Jan 20 2018 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment